పరుగాపక పయనించవె తలపుల నావ.... కెరటాలకు తలవంచితె తరగదు త్రోవ

December 18, 2009

రండోయ్......రారండోయ్

హైదరాబాదు అనగానే అందరికి గుర్తుకొచ్చేది..జనవరిలో జరిగే ఎగ్జిబిషను ..దాంతోపాటు గత నాలుగయిదు సంవత్సరాలుగా అంతే ప్రాచుర్యాన్ని పొందుతున్న మరో ప్రదర్శన హైదరాబాదు పుస్తక ప్రదర్శన.  మరి ఈ సారి పుస్తక ప్రదర్శనకి ఎంతమంది బ్లాగర్లు వస్తున్నారు?  అక్కడ e-తెలుగు స్టాలు కూడా ఏర్పాటు చేసారు.  ఆసక్తి... ఉత్సాహం ఉన్న బ్లాగర్లు, బ్లాగేతరులు e-తెలుగు స్టాలుకి వచ్చి అంతర్జాలంలో తెలుగు గురించి, వికీపిడియా గురించి, బ్లాగుల గురించి, అంతర్జాల పత్రికల గురించి తెలుసుకోవచ్చు.......వీటి గురించి తెలిసినవాళ్లు అక్కడకి వచ్చే సందర్శకులకి వీటి గురించి వివరించవచ్చు. వలంటీర్లుగా రాదలుచుకున్న వాళ్లు కశ్యప్ (9396533666) (9030365266) గారిని కాని, దూర్వాసుల పద్మనాభం గారిని కాని సంప్రదించవచ్చు.

శనివారం (19/12/09) సాయంత్రం ఐదు గంటలకి వాక్ ఫర్ బుక్సు కార్యక్రమం కూడా ఉంది.  ఉత్సాహవంతులు ఇందులో పాల్గొనవచ్చు.  దీన్ని కేంద్ర మానవవనరుల శాఖ సహాయ మంత్రి  దగ్గుపాటి పురందరేశ్వరి గారు ప్రారంభిస్తారు.  


శనివారం (19 వ తేది),  ఆదివారం (20 వ తేది),  మరియు సోమవారం (21 వ తేది) మహిళా బ్లాగర్లు ఎవరయినా రాదలుచుకుంటే రావచ్చు.

తెలుగు పుస్తకాలు చదవండి, చదివించండి


5 వ్యాఖ్యలు:

Lakshmi Naresh December 19, 2009 at 4:05 AM  

dhanyavadalu...mee viluvainaa samacharaniki

One Stop resource for Bahki December 19, 2009 at 9:24 AM  

Thank you very much for thePost !

Please consider
9396533666 -
9030365266

Kasyap

సిరిసిరిమువ్వ December 19, 2009 at 10:12 AM  

కశ్యప్ గారు, మీరు అది గుంపులో ఇచ్చిన నంబరు నాకూ అనుమానం వచ్చింది 11 అంకెలు ఉన్నాయేంటా అని:). సరిచేసాను.

Anonymous,  December 19, 2009 at 10:33 AM  

వెళ్ళండమ్మా వెళ్ళండి.హా....హేవిటో......

భావన December 21, 2009 at 7:59 AM  

అవును లలితా వెళ్ళండమ్మా వెళ్ళండి. బాగా పుస్తకాలు కొనుక్కుని మాకు ఏమి లేకుండా మీరే చదివి మళ్ళీ చివరాకరు చెప్పకుండా రివ్యూ లు రాయండి. మేంఉ ఇక్కడ పుస్తకాలు కొన్నారని కుళ్ళూకుని చస్తూ మళ్ళీ మీ రివ్యూ లు చదివి ఏమిటో కథ అని ఆలోచించి చస్తాము. వెళ్ళండమ్మా బాగా వెళ్ళిరండీ. :-(

Post a Comment

statcounter

  © Blogger template Coozie by Ourblogtemplates.com 2008

Back to TOP