నలభై వసంతాల చెలిమికి వీడ్కోలు..
తెలుగు వార్తా పత్రికల చరిత్రలో ఒక అధ్యాయం
సృష్టించి....వార్తల ప్రచురణలో కొత్త పుంతలు తొక్కి...ఎప్పుడెప్పుడు
తెల్లవారుతుందా..ఎప్పుడు పేపరు చదువుదామా అనేట్లు చేసి ..గత నలభై
సంవత్సరాలుగా అశేష ప్రజాదరణని సొంతం చేసుకుని తెలుగులో అత్యధిక
సర్క్యులేషన్ కలిగిన పత్రిక గా చరిత్ర సృష్టించిన ఓ ఈనాడు పత్రికా రాజమా
నీకిక వీడ్కోలు.
నాకు ఊహ తెలిసేటప్పటికే నువ్వు ఉన్నావు. నేను పేపరు చదవటం మొదలుపెట్టింది నీతోనే! 1974 లో తెలుగు పాఠకుల లోగిళ్ళల్లోకి ఉషా కిరణాలతో పోటీ పడి నువ్వు రావటం మొదలుపెట్టిన లగాయితూ ప్రవాసంలో ఉన్నప్పుడు తప్ప నిన్ను చూడకుండా ఉన్న రోజు లేదు. e-పేపరు వచ్చినా నిన్ను చేత్తో పట్టుకుని..తడిమి తడిమి చూసుకుంటూ "ఇదీ సంగతి" లో ఈ రోజు శ్రీధర్ ఏ కార్టూన్ వేసాడా అని ముందు చూసి...ఒక్కో పేజీ చదువుకుంటూ ఓ గంట సేపయినా నిన్ను ఆస్వాదించందే రోజు మొదలయ్యేది కాదు.
నీ రాక కోసం..నువ్వు రాగానే నిన్ను చదవటం కోసం ఇంటిల్లిపాదీ పోటీ పడేవాళ్ళం. తెలుగు పత్రికా లోకంలో మొట్టమొదటి సారిగా జిల్లా సంచికలని..ఆదివారం అనుబంధాలని ప్రవేశ పెట్టిన ఘనత నీదే! ప్రతి జిల్లా నుండి పత్రికా ప్రచురణ మొదలుపెట్టిన ఘనతా నీదే! ఇతర రాష్ట్రాలనుండి ఓ తెలుగు పత్రిక ప్రచురించబడటం కూడా నీతోనే మొదలు అనుకుంటాను! మహిళల కోసం వసుంధర అని ప్రత్యేకంగా ఓ పేజీనే ప్రారంభించావు. పేపరు క్వాలిటీ కాని, భాష కానీ, వార్తా శీర్షికలు కానీ, ఆదివారం అనుబంధం, జిల్లా ఎడిషన్సు ప్రారంభించటంలో కానీ అన్నిటిల్లో ఓ ట్రెండ్ సెట్టర్ వి నీవు. జర్నలిజం కొత్త పుంతలు తొక్కిందీ నీతోనే! మాలాంటి భాషా ప్రేమికుల్ని వేరే పేపర్ల వైపు కన్నెత్తి కూడా చూడకుండా చేసిన ఘనతా నీదే!
ఆకట్టుకునే
వార్తా శీర్షికలతో మమ్ముల్ని అలరించావు. కొన్ని శీర్షికలని చూడగానే మాలో
ఆవేశం ఎగసిపడేది..రక్తం సల సలా మరిగేది. మరి కొన్ని శీర్షికలని చూడగానే
విచక్షణ మేలుకునేది. నిష్పక్షపాతంగా సమకాలీన రాజకీయాలను విశ్లేషిస్తూ
నువ్వు వ్రాసిన సంపాదకీయాలతో మా మనుసులని చూరగొన్నావు!
ఏవీ
ఇప్పుడు ఆ సంపాదకీయాలు! ఏవీ ఆ వార్తా శీర్షికలు! బూతద్దం పెట్టి వెతికినా
ఈనాడులో భాషాదోషాలు కనపడవు అనుకునే రోజులు పోయాయి. ముఖ్యంగా జిల్లా
ఎడిషన్సు లో భాషా దోషాలు కోకొల్లలు. ఈ మాత్రం వార్తలకి..ఈ మాత్రం భాషకి
ఈనాడే చదవాలా అని అనుకునేటట్టు చేస్తున్నావు. వార్తల్లో జీవం కనపడటం లేదు.
ఇదివరకటిలా వార్తలని ఆస్వాదించలేకపోతున్నాం
తెలుగు పత్రికా చరిత్రలో ఓ ప్రత్యేక అధ్యామయిన ఈనాడు ఇక గత చరిత్రగా మిగిలిపోతుందేమో అని అనుమానం కలుగుతుంది.
పేపరు కుర్రాడితో వేయించుకుంటే నువ్వు రావటం ఆలస్యం అవుతుందని గత 15 సంవత్సరాలుగా డైరెక్టుగా ఈనాడు సంస్థ ద్వారానే నిన్ను పొందుతున్న మేము ఇక ఈ నెల నుండి నీకు సెలవు ప్రకటించేసాం. ఇది బాధాకరమే కానీ తప్పటం లేదు.
నిన్ను ఇక అసలు చూడను అని చెప్పనులే! ఏదో అప్పుడప్పుడు నెట్టు లో e-పేపరు చూస్తూ ఉంటానులే!
ఇక సెలవు నేస్తం!
Read more...
నాకు ఊహ తెలిసేటప్పటికే నువ్వు ఉన్నావు. నేను పేపరు చదవటం మొదలుపెట్టింది నీతోనే! 1974 లో తెలుగు పాఠకుల లోగిళ్ళల్లోకి ఉషా కిరణాలతో పోటీ పడి నువ్వు రావటం మొదలుపెట్టిన లగాయితూ ప్రవాసంలో ఉన్నప్పుడు తప్ప నిన్ను చూడకుండా ఉన్న రోజు లేదు. e-పేపరు వచ్చినా నిన్ను చేత్తో పట్టుకుని..తడిమి తడిమి చూసుకుంటూ "ఇదీ సంగతి" లో ఈ రోజు శ్రీధర్ ఏ కార్టూన్ వేసాడా అని ముందు చూసి...ఒక్కో పేజీ చదువుకుంటూ ఓ గంట సేపయినా నిన్ను ఆస్వాదించందే రోజు మొదలయ్యేది కాదు.
నీ రాక కోసం..నువ్వు రాగానే నిన్ను చదవటం కోసం ఇంటిల్లిపాదీ పోటీ పడేవాళ్ళం. తెలుగు పత్రికా లోకంలో మొట్టమొదటి సారిగా జిల్లా సంచికలని..ఆదివారం అనుబంధాలని ప్రవేశ పెట్టిన ఘనత నీదే! ప్రతి జిల్లా నుండి పత్రికా ప్రచురణ మొదలుపెట్టిన ఘనతా నీదే! ఇతర రాష్ట్రాలనుండి ఓ తెలుగు పత్రిక ప్రచురించబడటం కూడా నీతోనే మొదలు అనుకుంటాను! మహిళల కోసం వసుంధర అని ప్రత్యేకంగా ఓ పేజీనే ప్రారంభించావు. పేపరు క్వాలిటీ కాని, భాష కానీ, వార్తా శీర్షికలు కానీ, ఆదివారం అనుబంధం, జిల్లా ఎడిషన్సు ప్రారంభించటంలో కానీ అన్నిటిల్లో ఓ ట్రెండ్ సెట్టర్ వి నీవు. జర్నలిజం కొత్త పుంతలు తొక్కిందీ నీతోనే! మాలాంటి భాషా ప్రేమికుల్ని వేరే పేపర్ల వైపు కన్నెత్తి కూడా చూడకుండా చేసిన ఘనతా నీదే!
చదువు, సుఖీభవ, ఛాంపియన్, eనాడు, సిరి, ఈతరం, స్థిరాస్థి..ఇలా వారంలో ఒక్కో రోజు ఒక్కో శీర్షికతో పాఠకులకు విలువైన సమాచారం అందిచటంలో నీకు నీవే సాటి అనిపించుకున్నావు.
"పుణ్యభూమి", "కబుర్లు", "అక్షింతలు", "రాష్ట్రంలో రాజకీయం"...ఇలాంటి
శీర్షికల ద్వారా ఎ.బి.కె ప్రసాదు, చలసాని ప్రసాద రావు, డి.వి. నరసరాజు,
గజ్జెల మల్లారెడ్డి, బూదరాజు రాధాకృష్ణ లాంటి గొప్ప గొప్ప వ్యక్తుల పరిచయ
భాగ్యం కలిగించావు.
తెలుగు భాష విస్తృతి కోసం నువ్వు ప్రచురించిన "తెలుగులో తెలుగెంత", "తెలుగు జాతీయాలు", "మాటల మూటలు", "మాటల వాడుక", "మాటలూ-మార్పులూ"..తెలుగు భాషకి మంచి డిక్షనరీల లాంటివి. ఆదివారం "బాలవినోదిని" కి ముఖ్యంగా "పదవినోదం" కు పిల్లలతో పాటూ పెద్లలమూ అభిమానులం అయ్యాం!
ఓ
ఆంధ్రుడి ఆత్మగౌరవాన్ని యావత్ ప్రపంచానికి ఎలుగెత్తి చెప్పి..తెలుగు జాతి
ఆత్మగౌరవ పునరుద్దణకు పుట్టిన ఓ ప్రాంతీయ పార్టీకి వెన్నుదన్నుగా నిలిచి
పార్టీ పెట్టిన తొమ్మిది నెలలలోనే ప్రభుత్వం ఏర్పాటు చేయటంలో నువ్వు ముఖ్య
పాత్ర పోషించావు!
ఆంధ్ర రాష్ట్రంలోనే తొలి అతి పెద్ద మహిళా ఉద్యమం అయిన సారా ఉద్యమానికి అండదండలుగా నిలిచి ఆ ఉద్యమానికి ఎనలేని ప్రచారం చేసి..మహిళల పక్షాన నిలిచిన నిన్ను ఎన్నటికీ మరువలేము! ఆ ఉద్యమం కోసం ఓ ప్రత్యేక పేజీనే కేటాయించావు.