నా రాష్ట్రం రెండు ముక్కలవుతున్న వేళ!
ఈ రోజు నా సమైక్యాంధ్రప్రదేశ్ కి చివరి రోజు! 58 సంవత్సరాల కాపురానికి ఈ రోజుతో చెల్లు చీటీ వ్రాసేస్తున్నారు! రేపటినుండి ఎవరి ఇల్లు వారిది..ఎవరి కాపురం వారిది!
అసలు విభజనే జరగదు...ఇప్పట్లో జరగదు...లాస్టు బాల్ ఇంకా ఆడలేదు..ఇన్ని జరగదుల మధ్య విభజన జరిగిపోయింది. ఎందుకు?..ఏమిటి?..ఎలా?..ఎప్పుడు?.. ఎక్కడ? అన్న వాటికి సరైన సమాధానాలు లేకుండానే హడావిడిగా విభజన జరిగిపోయింది. విభజన వల్ల ఏ ప్రాంతానికి ఎంత లాభమో ప్రశ్నార్థకమే అయినా విభజనని స్వీకరించక తప్పదు కాబట్టి విభజనకి ఆహ్వానం పలుకుదామంటే మనస్సు రావటం లేదు...ఏదో దిగులు!
విభజనతో పాటు మా స్థానికత గురించి కూడా నాకు ఎక్కువ బాధగా ఉంది! మేమెక్కడకి చెందుతాము? గత పాతికేళ్ళుగా మేము తెలంగాణా లోనే ఉంటున్నాము..మా పిల్లలు ఇక్కడే పుట్టి పెరిగారు..మరి మేము ఇప్పుడు తెలంగాణా వాళ్ళమా? ఆంధ్రా వాళ్ళమా? తెరాస వాళ్ళ ఎక్కడ పుట్టిన వాళ్ళు అక్కడకే చెందుతారన్న సిద్దాంతం ప్రకారం మేము ఆంధ్రా..మా పిల్లలేమో తెలంగాణా అన్నమాట! మా ఇంట్లోనే మరో విభజన! పైగా సెటిలర్సు అంటూ మాకో దరిద్రగొట్టు పేరు! నేను సెటిలర్ అయితే పక్కనున్న చేవెళ్ళ నుండి హైదరాబాదు వచ్చి స్థిరపడ్డ వాడు కూడా సెటిలరే!
ఇప్పుడు తెలంగాణా రాష్ట్రం ఏర్పడుతుంది కాబట్టి మాకిష్టమున్నా లేకపోయినా మేము తెలంగాణాలో ఉండాలనుకుంటే మా చిరునామాలు..వీలునామాలూ అన్నిటిల్లో రాష్ట్రం పేరు మార్చుకోవాలి. AP అల్లా TS అయిపోతుంది! మార్చుకోవటం ఇష్టం లేకపోతే మీ ఆంధ్రా మీరు పోండి అంటారు అంతేగా! ఇది కూడా మా ఆంధ్రా అనుకునే వచ్చాం....ఇలా విభజిస్తారనుకుంటే వచ్చి ఉండేవాళ్ళం కాదేమో!
తెరాసా వాళ్ళు కోరుకున్న తెలంగాణా వచ్చింది కాబట్టి ఇకనైనా ఆ పార్టీ వాళ్ళు రెచ్చగొట్టే మాటలు ఆపి ఇక్కడ నివసించే ప్రజలందరికీ భద్రతాభావం కలిగించాలి. సొరకాయ అన్నోడు ఆంద్రోడు..ఆనపకాయ అన్నోడు తెలంగాణా వాడు అన్న పనికిమాలిన సిద్దాంతాలు వదిలేయ్యాలి!
అసలు తెరాసా వాళ్ళ మాటలు చూస్తుంటే వాళ్ళకి తెలంగాణా అభివృద్ది కన్నా ఆంధ్రా వాళ్ళ నాశనమే ముఖ్యమైన అజండాగా ఉన్నట్టుంది!
ఆస్తులు..అప్పులేమో జనాభా ప్రాతిపదికన పంపకాలేసారు. విద్యుత్తేమో వినియోగం ప్రకారం పంపకాలేసారు! హైదరాబాదు ఆదాయంలో ఆంధ్రా వాళ్ళకి చిల్లిగవ్వ కూడా భాగం లేదు..కానీ అప్పుల్లో మాత్రం ధారాళంగా వాటా ఇచ్చారు! సరే అయిందేదో అయింది..ఇక మా బ్రతుకులేవో మేము బ్రతుకుతామన్నా అన్నిటికీ మోకాలడ్డే!
1956 కి ముందున్నమా తెలంగాణా మాక్కావాలంటారు..మళ్ళీ భద్రాచలం డివిజన్ మాదే అంటారు. సరే దాన్నీ వదిలేశారు..ఇప్పుడు పోలవరం ముంపు ప్రాంతాలు ఆంధ్రాలో కలపటానికి వీల్లేదంటారు! వాళ్ళా మాట అంటుంది గిరిజనులు..ఆదివాసీల మీద ప్రేమతో కాదు...ముంపు గ్రామాలు తమ వైపు ఉంటే రేపు అడుగడుగునా ఉద్యమాలతో పోలవరానికి ఆటంకం కలిగించవచ్చన్న దు(దూ)రాలోచనతో! సీలేరు పవర్ ప్లాంట్ ఆంధ్రాకి దక్కుతుందన్న ఆక్రోశంతో!
ఇల్లు అలకగానే పండగ కాదు..విభజన జరగగానే అభివృద్ది కాదు. రెండు రాష్ట్రాలు సంయమనం తో వ్యవహరించినప్పుడే రెండు ప్రాంతాల్లో అభివృద్ది సాధ్యం! ఇచ్చి పుచ్చుకునే ధోరణి ఉండాలి కాని ఇలా అభిజాత్యం తో వ్యవహరించే వాళ్ళతో కష్టమే!
ఇంతకీ ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం ఎప్పుడు! మద్రాసు నుండి విడిపోయిన అక్టోబరు 1 నా! ...తెలంగాణా ప్రాంతంతో కలిసిన నవంబరు 1 నా!!..లేక తెలంగాణాతో బంధం వీడిపోతున్న జూన్ 2 నా!!!
ఆంధ్రాకి రాజధాని లేదు...ఆదాయం లేదు...నిధులు లేవు..ఉన్నదల్లా ప్రజల్లో ఓ ధృఢ సంకల్పం. తమ మీద తమకు నమ్మకం..కష్టపడే తత్వం. ఇవన్నీ ఉన్నప్పుడు ఇంకేమీ లేకపోయినా ఏదైనా సాధించగలమన్న ఓ ఆత్మ విశ్వాసం. ఆ ఆత్మ విశ్వాసమే పెట్టుబడిగా ఆంధ్రప్రదేశ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధిచెందాలని..ఆంధ్రాతో పాటు తెలంగాణా కూడా బంగారు తెలంగాణా కావాలని కోరుకుందాం.
రాష్ట్రాలుగా విడిపోయినా తెలుగువారిగా కలిసుందాం అన్న రాజకీయనాయకులు దానికి అనుగుణంగా వ్యవహరిస్తారని..వ్యవహరించాలని కోరుకుందాం.
సర్వే జనా సుఖినోభవంతు! సర్వే రాష్ట్రా సుఖినోభవంతు!
27 వ్యాఖ్యలు:
Well said muvva gaaru..
మీరన్నట్టే
ఆంధ్రాకి రాజధాని లేదు...ఆదాయం లేదు...నిధులు లేవు..ఉన్నదల్లా ప్రజల్లో ఓ ధృఢ సంకల్పం. తమ మీద తమకు నమ్మకం..కష్టపడే తత్వం. ఇవన్నీ ఉన్నప్పుడు ఇంకేమీ లేకపోయినా ఏదైనా సాధించగలమన్న ఓ ఆత్మ విశ్వాసం.
చూస్తూ ఉండండి కష్టపడి కాదు ఇష్టపడి పనిచేస్తాం .... హార్డ్ వర్క్ కాదు స్మార్ట్ వర్క్ చేస్తాం . ఆదాయాన్ని పెంచుతాం.
ఉన్ననాడు బిపిటి లు తింటాం లేని నాడు గంజితాగుతాం అంతే గాని ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మగౌరవాన్ని కోల్పోయే ప్రసక్తే లేదు.
చాలా బాగా రాశారండీ..
@తృష్ణ గారూ thank you.
@శ్రీనివాస్ గారూ...well said. All the best.
Let us hope and strive for the best.
ఒక వైపు సంబరాలు
మరో వైపు భవిష్యత్తు ఏమిటో తెలీని దిగులు... మన భారతం, అందులోనూ మన ప్రజాస్వామ్యం!
మనలాంటి సామాన్యుల బాధను చాలా బాగా రాసారండి.
"తెరాసా వాళ్ళు కోరుకున్న తెలంగాణా వచ్చింది"
తెరాస వారు మాత్రమె తెలంగాణా కోరుకున్నారా? ఇంకా ఎందుకండీ ఈ బుకాయింపు?
తెలంగాణా ప్రజల ఆకాంక్షను పాతికేళ్ళు కలిసి ఉన్న మీరు గుర్తించలేకపోయారు. చుట్టూ ఉన్న వారితో మమేకం కాకపోవడమే దీనికి కారణం.
"ఆంధ్రాకి రాజధాని లేదు...ఆదాయం లేదు...నిధులు లేవు"
1956లొ కూడా అంతే. అప్పుడు ఆనాటి నాయకులు తమ పబ్బం గడుపుకుందామని ఆదాయం + అన్ని వసతులు ఉన్న తెలంగాణాపై కన్నేసారు. ఇకనైనా ఆంద్ర నాయకులకు కనువిప్పు కలిగితే ఆ ప్రాంత ప్రజలకు మంచిది.
baagaa cheppaaru radhika (nani)
@వేణూ, శర్మ గారూ, ప్రవీణ గారూ, రాధిక గారూ ధన్యవాదాలు.
@ Jai Gottimukkala గారూ..తెరాసా వాళ్ళు కోరుకున్న తెలంగాణా అంటే హైదరాబాదుతో కూడిన..భద్రాచలం తో కూడిన తెలంగాణా అని నా భావన..అంతే కానీ ఇంకా ఎవరూ తెలంగాణా కోరుకోలేదని కాదు!
"తెలంగాణా ప్రజల ఆకాంక్ష"...తెలంగాణా ప్రజలంతా తెలంగాణా కోరుకోలేదండీ..ఇది జగమెరిగిన..మీరు ఒప్పుకోని సత్యం!
మేము ఎప్పుడైనా ఆంధ్రా..తెలంగాణా ఒక్కటే అన్నట్లు ఉన్నాం కానీ వాళ్ళు వేరు..మేము వేరు అని మేమేనాడూ అనుకోలేదు...ఎవరినీ చులకన చేయలేదు. "మా ఆకాంక్షల్ని గుర్తించలేదు..చుట్టూ ఉన్నవారితో మమైకం కాలేదు"..ఈ పడికట్టు పదాలు ఇకనైనా ఆపండి సార్!
ఏడుపుగొట్టు వెధవలు విడిపొయినందుకు చాలా, చాలా ఆనందంగా వుంది. ఇన్నాళ్ళు అబద్దాలు, విషం, విద్వెషాలా మధ్య మనం సాధించిందంత అప్పనంగా సాని దాని అండ చూసుకొని దోచుకున్నారు తెలబాన్లు. కాని ఆంద్రులకున్న ఏకైక ఆస్తి వాళ్ళ శ్రమ, కష్ట పడే తత్త్వం, సాహసం, ఇప్పుడు ఎవరూ భయపడడం లేదు. విద్యుత్, నీళ్ళు, ఆంధ్రుల శ్రమతొ నిర్మించిన హైదరబాద్ దోచుకున్నా తెలబాన్లలొ ఇంకా అభద్రతా భావం ఎందుకు? వాళ్ళకు భయం, అందుకే వాళ్ళకు అలవాటైయిన ఏడుపు ఇంకా ఏడుస్తూనే ఉన్నారు. అసూయ, ద్వెషాలతొ రగిలిపోతున్నారు. ఒకటి మాత్రం నిజం, తెలబాన్లు పాకిస్తాన్లా తయరవుతారు, వాళ్ళకి ఆంధ్రుల మీద ద్వెషం లేకపోతే మన లేరు.
@సిరిసిరిమువ్వ:
"హైదరాబాదుతో కూడిన..భద్రాచలం తో కూడిన తెలంగాణా"
హైదరాబాదు & భద్రాచలం ప్రజలు ఆంధ్రలో ఉండాలని కోరుకున్నారా?
"తెలంగాణా ప్రజలంతా తెలంగాణా కోరుకోలేదండీ"
ఎంత శాతం? ఎవరెవరు తెలంగాణా కోరుకోలేదో మీకే తెలియాలి :)
"వాళ్ళు వేరు..మేము వేరు అని మేమేనాడూ అనుకోలేదు
దీన్ని ఏకపక్ష ప్రేమ (one side love) అంటారు. చప్పట్లు ఒక చేతితో కొట్టలేరు.
ఇకపోతే తెలంగాణా వారికి ఇష్టం ఉన్నా లేకపోయినా కలిసే ఉండాలా? ఇదెక్కడి న్యాయమండీ?
If you (ఆంటే వ్యక్తిగతంగా మీరు కాదు) are keen on staying together, you should have tried convincing instead of threatening & abusing.
నాకయితే సంతోషం గా ఉంది. ఎక్కడికో వెళ్ళిన వాళ్ళు కాక , ఇక్కడే ఉన్న వాళ్ళు కూడా బాగు పడే రోజులు వచ్చాయి. ఇక ఎవరు ఎక్కడికి చెందుతారు అంటే కాచ్మెంట్ ఏరియా అంటూ ఒకటుంటుంది కదా. మన రాష్ట్రం , పక్కరాష్ట్రం అనుకుని వెళ్తామా అవకాసం వస్తే మద్రాసు, బెంగుళూరు ,ముంబాయి అన్ని చోట్లకీ వెల్తాము. అక్కడ పుట్టిన పిల్లలు స్థానికులు అవుతారు.
అల్లాగని మీ బాధ అర్ధం కాకపోదు , ఎక్కడో పుట్టి ఇంకెక్కడో ఉంటున్న మాకు తెలియనిది కాదు కదా :) స్థానికులు అవగానే మీ పిల్లలు మాత్రం అక్కడే ఉంటారా?మన మూలాలు ఆంద్ర లో ఉంటె వారి మూలాలు ఇంకో సిటీ లో ఉన్నాయి . విభజనకి సంబంధం లేని పరిస్థితి అది అనుకుంటున్నాను . మీ టపా కి మద్దతుగానే వచ్చిన అన్ని వ్యాఖ్యలతో సరిపోలదని తెలిసినా నా అభిప్రాయం ఇక్కడ ఉంచుతున్నాను.
'జూన్ 2' నా ఆంద్ర అభివృద్ధి లోకి పయనం మొదలుపెడుతున్న రోజు. హైటెక్ బాబు గుంటూరు కి వస్తున్న రోజు . మా గుంటూరు లో సాఫ్ట్వేర్ జాబులు రావాలని ఆరేళ్ళు గా ఎదురు చూస్తున్నాం . నిజమవుతుందేమో. ఆంద్ర లో మిగిలిన జిల్లాలన్నీ ఇంకో విభజనను దృష్టిలో ఉంచుకొని తమజిల్లాల అభివృద్దికి నేటి నుండే జాగ్రత్త మొదలు పెట్టె రోజు .
*రెండు ప్రాంతాల్లో అభివృద్ది సాధ్యం*... ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి సాధ్యం కాదని నా అనుమానం. పునాదుల దగ్గర నుంచీ మొదలుపెట్టాలి. బేసిక్ స్ట్రక్చర్ తయారవడానికైనా కనీసం ఐదేళ్ళు పడుతుంది. ఈలోగా హైదరాబాద్ ఇంకో యాభై కిలోమీటర్లు ముందుకు పోతుంది. ఇష్టాల సంగతి ఎలా ఉన్నా.. హైదరాబాద్ లో ఉన్న ఆంధ్ర, సీమ ప్రాంతాల ప్రజలు తమ వ్యాపారాలో, ఉద్యోగాలో (ప్రైవేటు) మానుకుని వెనక్కు వెళ్ళలేరు. ఇప్పటికే ఏర్పడిన వ్యవస్థను తరలించుకుని కొత్తగా మొదలుపెట్టడం అంత ఈజీ కాదు. సాఫ్ట్ వేర్ హబ్ గా ఉన్న హైదరాబాద్ కు ఇప్పటికే కొన్ని సాఫ్ట్ వేర్ కంపెనీలున్న విశాఖపట్నమే పోటీ కాలేదు.. ఇంక విజయవాడ, గుంటూరులో సాఫ్ట్ వేర్ కంపెనీలు రావడం... అవి మనుగడ సాధించడం... ఎప్పటికి సాధ్యమయ్యేను. ఇంక విద్యుత్తు విషయంలో పెద్ద పెద్ద సమస్యలే తలెత్తుతాయి. రోజుల తరబడి విద్యుత్ కోతలతో వ్యవసాయ రంగం సర్వనాశనం కానుంది. పారిశ్రామిక రంగం కుదేలవుతుంది. సో... ఆంధ్రప్రదేశ్ కొద్దిరోజుల్లోనే అభివృద్ధి అన్న మాట మరిచిపోయే పరిస్థితి వస్తుందని నా అనుమానం. ఆ విషయంలో మోడీ కూడా ఏమీ చేయలేడు.
ఇదంతా తప్పయితే... నా అంచనాలు దారుణంగా తలకిందులయితే... ఎంత బాగుణ్ణో.
పక్కరాష్ట్రం అనుకుని వెళ్తామా అవకాసం వస్తే మద్రాసు, బెంగుళూరు ,ముంబాయి అన్ని చోట్లకీ వెల్తాము.
ఎంతో మంది ఇతర రాష్ట్రాలలో పనిచేసే సీమాందృలు స్వoత రాష్ట్రమనే భావన ఉండబట్టి హైదరాబాద్ కి మార్పించుకోవటానికి ప్రయత్నాలు చేసుకొనేవారు ఉన్నారు.రాయల సీమ,నెల్లురు జిల్లాల వారికి చెన్నయ్, బెంగుళూరు దగ్గర అయినా వారు హైదరాబాద్ లో పనిచేయటానికి ఆసక్తి చూపటానికి కారణం, హైదరబాద్ తెలుగు వారి రాజధాని గనుక. మన అనే భావన గనుక. ఒకప్పుడు ఆంధ్రావారికి గుర్తింపు,గౌరవం ఇతర రాష్ట్రాలలో ఉండేది. గత పది సంవత్సరాలుగా ఈ తెలంగాణ గొడవ వలన ఏ ప్రత్యేకత లేని వారయ్యారు. కూలోడు సంపాదన కొరకు ఏ రాష్ట్రానికి పోయి పనిచేసి పొట్టపోసుకోవచ్చు. అది కూలోడి దృష్టిలో గొప్ప కావొచ్చు, అభివృద్ది లాగా అనిపించవచ్చు. కాని వాడిని గౌరవించే వాడే ఉండడు. ఇది తెలుగు వారైన ఆంధ్రా ,తెలంగాణా వారికి ఇక వర్తిస్తుంది. ఇతర రాష్ట్రాలలో ఎన్ని సంవత్సరాలు ఉన్నా,ఎంత ప్రగతి సాధించినా గుర్తించేవాడు ఎవరు ఉండరు. పక్క రాష్ట్రాలలో తమిళనాడు లో ఎన్నో తరాలనుంచి నాయుడు,వైశ్య కులస్తులు అనేక పెద్ద,పెద్ద వ్యాపారాలు చేస్తూ ఉన్నారు. వారికి ఆరాష్ట్రాలలో ఉన్న గుర్తింపు ఏపాటిది? వారి షాప్ ముందు పెద్ద అక్షరాలతో తెలుగులో బోర్డ్ కూడా పెట్టుకోవటానికి ధైర్యం ఉన్నట్లు కనపడదు.
విడిపోవటం కొంత బాధగా ఉంది. గోటితో పోయేదానిని గొడ్డలి ఉపయోగించవలసి వచ్చింది. ఒక జాతి అబ్భివృద్ది చెందాలంటే విభిన్నత అనేది ఎంతో ముఖ్యం. హైదరాబాద్ లో ఆంధ్రప్రదేశ్ లోని అన్ని జిల్లాల వారు ఉండబట్టి అది ఒక ప్రత్యేకతను సంతరించుకొని త్వరగా అభివృద్ది చెందింది. ఇక ఎవరి జిల్లాకి వారు మరలిపోతే విభిన్నత లేదు. అభివృద్ది మందగిస్తుంది. పాత చెత్త,రాజకీయ హత్యలు, కులాల గొడవలు మొదలైనా ఆశ్చర్యపోనక్కరలేదు. గత పది సంవత్సరాలుగా ఇవి తగ్గు ముఖం పట్టాయి .
@ జై
"హైదరాబాదు & భద్రాచలం ప్రజలు ఆంధ్రలో ఉండాలని కోరుకున్నారా?"
ప్రజా కోరిక మేరకే అన్నీ జరుగుతున్నాయా. హైదరాబాద్ లో తెరాస కి ఎన్ని సీట్లు వచ్చాయి? అక్కడ ప్రజలు ప్రత్యెక తెలంగాణా కి వ్యతిరేకం కాబట్టి తెలంగాణా లో కలపడం ఆపేస్తారా లేక హైదరాబాద్ ని సెపరేట్ స్టేట్ చేస్తారా?
"ఎంత శాతం? ఎవరెవరు తెలంగాణా కోరుకోలేదో మీకే తెలియాలి :)".
ఒక్క కెసిఆర్ లాంటి వాడు రచ్చగొట్టి, అర చేతిలో స్వర్గం చూపే వరకు ఎంత మంది తెలంగాణా కోరుకోన్నారో నీకు తెలియదా? ఆ తరువాతైనా ఎవరి నైనా నోరు ఎత్తనిచ్చారా?
"దీన్ని ఏకపక్ష ప్రేమ (one side love) అంటారు. చప్పట్లు ఒక చేతితో కొట్టలేరు.ఇకపోతే తెలంగాణా వారికి ఇష్టం ఉన్నా లేకపోయినా కలిసే ఉండాలా? ఇదెక్కడి న్యాయమండీ?"
అవునా. ఏక పక్ష ప్రేమతోనే 58 ఏళ్ళు కాపురం చేసారా? ఆపండి మీ అరాచక మాటలు. నిజమేంటంటే కెసిఆర్ వచ్చేవరకు , వాడికి నీలాంటి విద్వేష వాదులు తాళం వేసే వరకు అందరూ కలిసే ఉన్నారు. తెలంగాణా వాళ్ళు ఆంధ్రలో చదువు కున్నారు, పెళ్ళిళ్ళు చేసుకున్నారు (ఎల్లి మీ కేటు గాడిని అడుగు), అలాగే ఆంధ్రా వాళ్ళు కూడా. మీ లాంటి వాళ్ళ కుత్సిత బుద్ధికి జాతి మొత్తం రక్తమోడుతోంది..
"If you (ఆంటే వ్యక్తిగతంగా మీరు కాదు) are keen on staying together, you should have tried convincing instead of threatening & abusing."
Seriously? stop crying. You telabans are the ones who filled your brains with venom and spewed venom with KCR's courtesy and polluted brains of telangana people one by one. Who threatened you and abused you/telangana people? show me incidences. I can show you thousands of incidences where KCR inspired telaban batch threatening and abusing people from other parts of the state. Seemandhra people extended their friendship till last minute and some people even now. but you guys always took advantage of it and spewed more venom. Lastly, we can wake up a sleeping person but we can never wake up who is acting asleep. Even if all seemandhra guys had nature of Gandhi, you would still have hated because its in telabans nature.
పురాణపండఫణి గారు,
మీరు బాగా చెప్పారు. ఆంధ్రా వారి గుణగణాలలో ఇప్పటికి ఏ మాత్రం మార్పులు రాలేదు. ఎన్నికల తదనంతరం ఇరుపార్టిల మధ్య జరిగిన గొడవలు, ముఖ్యమంత్రి గా గెలిచిన బాబు గారిని కొడలి నాని అతను ఏ మాత్రం లెక్క చేయకుండా మాట్లాడటం చూస్తే, మన భవిషత్ అర్థమౌతుంది. రానున్న రోజులలో కాంట్రాక్ట్ ల కొరకు, మరోకదాని కొరకు కులాల వారిగా కొట్టుకోంటరాని అనిపిస్తుది. ఇవి మరచి పోయిన కొందరు ఆశావహులు గుంటూరు గ్రించి, ఆంధ్రా భవిషత్ గురించి ఎక్కువగా ఊహిస్తున్నారు. గుంటూరు ఒక ఊరా? ఆ మహా పట్టణానికి సాఫ్ట్ వేర్ కంపెనిలు వస్తాయా? పనిలేక బ్లాగు రమణ గారు రాసుకోవలసిందే ఈ భూలోకంలో గుంటూరు పురంబుకు సాటి అయినది వేరొకటి లేదని. తెలంగాణా వారి పరిస్థితి కూడా ఎమి పెద్ద భిన్నంగా ఉండదు. తెలంగాణా వంటలు, ఉద్యమ గీతాలు, ఉద్యమ నృత్యాలు, కవులు కళాకారులు ,సంస్కరణ సభలు, ప్రజా చైతన్యం పేరుతో మీటింగ్ లు, తెలంగాణ సంస్కృతి సాంప్రాదాయం అంట్టు కాలం వెల్లి బుచ్చుతారు. మిగిలిన సమయంలో ఆంధ్రావారి మీద తెలంగాణా ప్రజలు సాధించిన విజయాలను కళారుపాలుగా ఊరూరా ప్రదర్శిస్తారేమో!
జయహో గారూ...
ప్రజల, రాజకీయ నాయకుల పద్ధతుల్లో మార్పనేది ఉంటుందని నేను అనుకోను. ఇద్దరూ కూడా తమదైన తరహాలో గాలివాటంగానే కొట్టుకుపోతూ ఉంటారు. దానికి ప్రాంతాల తేడాలు ఉండవేమో. తెలంగాణ వారు ఏం చేస్తారన్న దాని గురించి మాట్లాడే సాహసం నేను చేయదలచుకోలేదు.
Kani mecchukovaali kcr ni.cm avvalani kala kannadu. Aipoyadu. Poorna kbhanni baddalu kotti ainaa sare. Eanugu kumbhadthalaanni kottadu.
@puranapandaphani:
ప్రతి రాష్ట్రానికి ఒకే అభివృద్ధి నమూనా పని చేయదు. ఉ. దేశంలోనే అత్యుత్తమ స్థానంలో ఉన్న పంజాబ్, హర్యానా గుజరాత్ రాష్ట్రాలలో హైదరాబాదు లాంటి మహానగరం లేదు. ఆంద్ర రాయలసీమ ప్రాంతాల సహజ బలాబలాల దృష్టా కాక big city based model వేరే మార్గాన్ని ఎన్నుకుంటే మంచిది.
Why ape someone else? Why hanker after software when marine industry (example only) offers better opportunities?
@jai
చుట్టూ ఉన్న వారితో మమేకం కాకపోవడమే దీనికి కారణం.
>>
'ఈ చుట్టూ ఉన్నవారితో కలిసిపోలేకపోవటం' అనేది తెలంగాణాలో ఉన్న సెటిలర్లకు వర్తిస్తుంది కానీ కృష్ణా జిల్లాలో ఉన్నవాళ్లకి కాదు గదా?మళ్ళీ తమరే సెటిలర్లు అలా విడిగా ఉన్నందుకు గర్విస్తారు, మా ఆమ్మ కూడా సెటిలరే అని సుభాషితాలు చెప్తారు - రెండు నాల్కల విషం.
హరిబాబు గారూ, మమేకం కావడం అంటే తమ సంస్కృతిని పూర్తిగా వదిలేసుకోవడం కాదు. మనం ఎవరి మధ్యలో ఉన్నామో వారితో కలిగి ఉండడం అవసరం. ఇది సెటిలర్లకు బాగా అబ్బిన విద్య కానీ ఇటీవల వచ్చిన వారు ఎందుకో (I have my theories on the reasons but not the right place/time to discuss) ఇది చేయలేకపోయారు.
@jai gaaroo,
కృష్ణా జిల్లా నుంచి గోదావరి జిల్లా వెళ్ళిన వాళ్ళు సెటిలర్లు కారు, కానీ అదే కృష్ణా జిల్లా వాళ్ళు తెలంగాణా లోని యే జిల్లాకి వెళ్ళినా సెటిలర్లుగా ఉంటారు.తెలంగాణా లో ఈ సెటిలర్ల స్టాటస్ గురించి తెలుసుకోవాలని చాలా కాలం నుంచి అనుకుంటున్నాను.యెలాగూ ప్రస్తావన వొచ్చింది కాబట్టి అడుగుతున్నాను,క్లుప్తంగా చెప్పినా సరిపోతుంది - చెప్తారా?
తెలంగాణా జిల్లాల నుంచి ఆంధ్రా వొచ్చిన వాళ్ళకి లేదు ఈ సెటిలర్ అనే హోదా! పైగా మేము అక్కున జేర్చుకున్నాం, కడుపులో పెట్టి చూసుకుంటున్నాం అని మీరు అంటున్నారు కానీ తెరాసాకు, తెలంగాణా వాదానికీ సెటిలర్లు యెక్కువగా ఉన్న జిల్లాల నుంచే వ్యతిరేకత ఉంది, గమనించారా?అసలు విలీనం అనే లత్తుకోరు ఒప్పందాన్ని తెర మీదకి తీసుకు రావటానికి ముందు కచరా గారి వ్యూహమేమిటి?యెప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఉప యెన్నికల్ని రప్పించి(గొర్రెల మంద ప్రజా పరతినిధుల చేత రాజీనామాలు చేయించి) విపరీతమయిన బలాన్ని తెచ్చేసుకుని ఇదిగో తెలంగాణా ప్రజలంతా తెలంగాణాని కోరుకుంటున్నారు అని చూపించి తెచ్చుకోవాలని కదా!మరి యెన్నికల ఫలితాల రిపోర్టులు యెలాంటి ప్రోత్సాహాన్ని ఇచ్చాయి అనేది చార్టుల్ని చూస్తే మీకూ తెలుస్తుంది, అవునా?అప్పటి యెన్నికల ఫలితాల నించీ ఇప్పటి యెన్నికల ఫలితాల వరకూ సెటిలర్లు యెక్కువగా ఉన్న జిల్లాల్లో తెరాసాని వ్యతిరేకించటం అనేది కాకతాళియమా?ఆ వ్యతిరేకత ని చూశే గదా ఇక ఈ సజావయిన పధ్ధతి లో తెలంగాణా రాదని తేల్చుకుని ఈ తొక్కలో విలీనం అనే వక్రమార్గం అనుసరించింది!
మీరు ఇటీవల వచ్చిన వాళ్ళు కలవలేక పోయారని అంటున్నారు. కర్నూలులో గుడారాల్లో ఉండటం గురించిన హేళనలు మీ రాతల్లోనే చాలాసార్లు చూశాను.నిజాము చేసిన భీబత్సాలకి భయపడి బెజవాడలో మీ పెద్దలు తల దాచుకున్న గుడారాలు మీకు గుర్తు వస్తే అలా వెక్కిరింత రాతలు రాయగలిగేవారా మీరు?1969లో కేంద్రం నుంచి మిలిటరీ వస్తే గానీ ఆగనంతటి భీబత్సాల్లో మీ వాళ్ళు చేసిన లూటీలకీ గృహదహనాలకీ మానభంగాలకి బలి అయింది యెవరు?ఇటీవల వచ్చిన ఆంధ్రా వాళ్ళా, అప్పటి సెటిలర్లా, లేక మరే సంకర జాతి తెలుగు వాళ్ళా?
కాబట్టి సెటిలర్ల గురించి మీరు గర్వంగా సర్దుకుపోయారని చెప్పడం, వాళ్ళు కూడా తెలంగాణాని కోరుకున్నా రనేది అబధ్ధం, అవునా కాదా? చెప్పండి, తెలంగాణా లోని సెటిలర్ల నిజమయిన స్టాటస్ యేమిటో యేదీ దాచకుండా చెప్పండి.ఈ తొక్కలో తెలంగాణా వాళ్ళతో మనం కలిసేదేమిటి? అనే సెటిలర్ల లోని అహంభావమా లేక ఈ బోడి ఆంధ్రా వాళ్ళని మనలో కలుపుకోవడమా అనే తెలంగాణా వాళ్ళలోని అహంభావమా, యేది వాళ్ళని అలా సెటిలర్లు అనే ప్రత్యేక హోదాలో ఉంచింది?
అసలు సెటిలర్లు అనే మాటకి వ్యావహారికంగానూ నిఘంటు పరంగానూ ఉన్న అర్ధం యేమిటి?అది తెలంగాణాలో ఉంటున్న మిగతా అన్ని రాష్ట్రాల వాళ్ళకీ అప్లయ్ చేశారా కేవలం ఆంధ్రా నుంచి వచ్చిన వాళ్లకేనా?
హరిబాబు గారూ, మీ ప్రశ్నలకు ప్రస్తుత టపాకు సంబంధం అంతగా లేదని నాకు అనిపిస్తుంది. అంచేత సమాధానం ఇక్కడ ఇవ్వడం బ్లాగు యజమానికి & వీక్షకులకు నచ్చుతుందే లేదో.
మీ అనుమతి ఉందనే నమ్మకంతో నా జవాబు మీ సొంత బ్లాగులో రాస్తున్నాను.
http://harikaalam.blogspot.in/2014/05/blog-post_19.html
@jai
యెదురు చూస్తాను, చాలా చాలా కుతూహలంగా ఉంది నాకు.
జై గారూ...
అన్ని రాష్ట్రాలకూ ఒకటే అభివృద్ధి నమూనా పనిచేస్తుందని నేను అనడంలేదు. ఆంధ్రప్రదేశ్‌లో కొత్త అవకాశాలు రాకుండా హైదరాబాద్ అడ్డుగా ఉంటుందని అంటున్నా. కొత్తగా ఒక వ్యాపారమో, పరిశ్రమో ప్రారంభించాలంటే ఇప్పటికే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సహా అన్ని సౌకర్యాలూ అందుబాటులో ఉన్న హైదరాబాద్‌నే ఎంచుకుంటారు తప్ప మరే చిన్న ఊరినో ఎంచుకోరు కదా. ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా కట్టబోయే రాజధానో... కొత్తగా డెవలప్ చేయబోయే ఇండస్ట్రియల్ క్యాపిటలో... ఆ నగరం ఇప్పుడు పోటీ పడవలసినది హైదరాబాద్‌తోనే కదా. అందుకే హైదరాబాద్ ప్రస్తావన చేశాను.
ఆంధ్రప్రదేశ్‌కు గుజరాత్, పంజాబ్, హర్యానాలతో ఎందుకులెండి పోలిక...
సహజ బలాబలాల దృష్ట్యా కాక big city based model వేరే మార్గాన్ని ఎన్నుకుంటే మంచిది... ఇప్పటికి ఉన్న అసహజ, కృత్రిమ నమూనాలు చాలవా ఏంటి?
Aping and Hankering. Great words. Any way.. what I am assessing is... not any single industry will gain momentum in a single decade in AP. Marine Industry will not flourish. Not for the fault of that industry, but for the reason of politics and policies. Same is the case for any product based industry. A service based industry will catch up in a comparitively lesser time. And even it fails it wont be much big loss.
Post a Comment