పరుగాపక పయనించవె తలపుల నావ.... కెరటాలకు తలవంచితె తరగదు త్రోవ

December 10, 2009

ఇక మేమూ ప్రవాసాంధ్రులమే!!

ఏంటో ఇన్నాళ్లు తెలంగాణా వచ్చేది కాదులే అని గుండెల మీద చెయ్యేసుకుని కూర్చున్నాం.  తెలంగాణా వచ్చేసినట్టే అని ఓ పక్క తెలంగాణా ప్రజలు ఉత్సవాలు చేసేసుకుంటున్నారు..ఇంకొక పక్కేమో కోస్తా, రాయలసీమ వాళ్లు సమైక్యాంధ్ర అంటూ రోడ్లెక్కుతున్నారు. ఎప్పటికి తేలేనో ఈ విభజనలు....పునర్విభజనలు. అదేంటో నాకయితే ఈ విభజన గొడవలో ఎవరి వాదన విన్నా సమంజసంగానే అనిపిస్తుంది..ఇంతకీ నేనెటు వైపు!! అదే తేల్చుకోలేకుండా ఉన్నాను.

ఇంకొన్నేళ్లల్లో మేము కూడా ప్రవాసాంధ్రులం అయిపోతామన్నమాట.  ఇకపై అన్ని ప్రవాసాంధ్ర సంఘాలలో మేము కూడా సభ్యులమన్నమాట!  మున్ముందు హైదరాబాదు ప్రవాసాంధ్రుల సంఘం అనో, TAH (Telugu Association of Hyderabad) అనో , TAT (Telugu Association of Telangana) అనో ....AAH (Andhra Association of Hyderabad) అనో ..మరోటనో.......సంఘాలు పెడితే అందులో మేము కూడా సభ్యులమే!!.

ఇప్పుడు నా సమస్య ఏంటంటే..ఒకవేళ తెలంగాణా వస్తే గిస్తే....మేము....  అంటే గత 20-30 సంవత్సరాలుగా తెలంగాణాలో ఉన్నవాళ్లం....ఏ రాష్ట్రానికి చెందుతాం......పుట్టి పెరిగిన ఆంధ్రాకా?.....లేక స్థిరపడ్ద తెలంగాణాకా? సరే మేము ఆంధ్రాకే చెందుతామనుకుంటే మరి ఇక్కడే పుట్టి పెరిగిన మా పిల్లలో.....వాళ్ళు తెలంగాణా బిడ్డలా?  హత్తెరికి అయితే మా ఇంట్లో సగం మందిమి ఆంధ్రా.... సగం మందిమి తెలంగాణా అన్నమాట..భలే..భలే...సరే పుట్టిన గడ్డ మీద మమకారంతో అక్కడికే వెళ్లిపోదామా అంటే అక్కడ మా పిల్లలు నాన్ లోకల్ అయిపోతారు..మరి కింకర్తవ్యం??

తెలంగాణా ఇస్తే అటువైపు ప్రత్యేక రాయలసీమ ఇవ్వాలంట...ఇటు వైపు ఉత్తర కోస్తా ఇవ్వాలంట...మరి నట్టనడుమనున్న ఆంధ్రప్రదేశ్‌కి గుండెకాయలాంటి కృష్ణ, గుంటూరు ఏమయిపోవాలంటారు? ఒక్కో జిల్లాని ఒక్కో రాష్ట్రంగా చేస్తే సరి..మళ్లీ మళ్లీ దీక్షలు లేకుండా.....ప్రాణాలు పోకుండా!......ఓ పనయిపోతుంది!!

ఏంటో ఓ కుటుంబంలో అన్నదమ్ములు విడిపోయేటప్పుడు అందరి అభిప్రాయాలు అడిగి అందరికి అమోదయోగ్యంగా ఆస్తుల విభజన చేసుకుని విడిపోతారు.....మరి  ఇప్పటివరకు ఈ విషయంలో మనలాంటి సామాన్య ప్రజల అభిప్రాయాన్ని ఎవ్వరయినా అడిగారా?

అసలు ప్రత్యేక రాష్ట్రం వస్తే ఎవరికి లాభం.  సామాన్యులకి ఒరిగేదేమన్నా ఉందా?  పెరిగిన ఉప్పులు పప్పుల రేట్లు ఏమయినా తగ్గుతాయా?

 ఈ గొడవలేమో కాని మా పిల్లలు ఊళ్లో చిక్కుకు పోయారు.  నిన్నటి దాక ఇక్కడ గొడవలు, కాలేజీలకి సెలవలని అక్కడున్నారు..సరే ఈ రోజుతో గొడవలు అయి పోయాయి, రేపటినుండి కాలేజిలు మొదలు కదా అని బయలుదేరి రమ్మంటే ఇప్పుడు అక్కడ గొడవలు.

30 వ్యాఖ్యలు:

తేనెపట్టు December 10, 2009 at 9:58 PM  
This comment has been removed by the author.
శరత్ కాలమ్ December 10, 2009 at 9:59 PM  

:) పనిలో పనిగా మీరు వుంటున్న పేట/కాలనీ/నగర్/వాడ గురించి ఓ ఉద్యమం మొదలెట్టకూడదూ. అది రాష్ట్రం అయితే అప్పుడు మీరు, మీ ఇంట్లో వారూ ఎక్కడికీ వెళ్ళక్కర్లా. ఎంచక్కా మీ స్వంత రాష్ట్రంలో మీరు వుండొచ్చు. ఆలోచించండి. ఏమయినా సహాయ సహకారాలు కావాలంటే నన్ను అడగండి.

Anonymous,  December 10, 2009 at 10:01 PM  

ప్రత్యేక ప్రాంతం కావాలనేది కొందరేనండి, మిగిలిన అందరి మాట, పాట సమైక్యవాదమే. మీ భావ వ్యక్తీకరణ చాలా బావుంది.

రాజన్
http://naagola.wordpress.com/

బ్లాగులో కాయ December 10, 2009 at 10:11 PM  

ఏం మాట్లాడుతున్నారు మీరు.... తెలుగు అసోసియెషన్ ఆఫ్ తెలంగాణ ఏంటి... తెలుగు మీ ఆంధ్ర వాళ్ళ సొత్తా ??.... ఆంధ్ర అసొసియెషన్ ఆఫ్ తెలంగాణ అని పెట్టుకోండి.. ఒప్పుకుంటాం.... తెలుగు అంటే ఆంధ్రా..ఆంధ్రా అంటే తెలుగు అనుకున్నారు కాబట్టే... తెలంగాణ.. ఉధ్యమం వచ్చింది... మా భాష తెలుగు కాదా. ?

జిజ్ఞాసి December 10, 2009 at 10:21 PM  

మరి అంధ్ర మహాభాగవతం అంటే తెలుగు లో వున్న మహా భాగవతం అనుకోవాలా ? లేక అంధ్ర ప్రాంతపు మహాభాగవతమా?

Unknown December 11, 2009 at 12:11 AM  

ఇలా identity crisis ఉన్న తెలుగువాళ్ళందర్నీ ANR (Andhra Non-Residents) అని NTR (Non-Telangana Residents) అని రెండు గ్రూపులుగా విడదీస్తే పోలా?

సిరిసిరిమువ్వ December 11, 2009 at 5:45 AM  

@శరత్ గారు, వాడ వాడలా ఉద్యమాలా?..ఇప్పుడున్న హింస చాలదంటారా!! మీ సహాయసహకారాలకి ముందస్తు ధన్యవాదాలు.
@నా గోల, ధన్యవాదాలు.
@రాజా గారు, శాంతించండి..నేనేదో మాటవరసకు అంటే మీరు ఆ సంఘమేదో నేనే పెట్టేసినట్టు అంత ఉలిక్కిపడ్డారేమిటండి? అయినా తెలుగుతల్లి విగ్రహాలని పడగొట్టినప్పుడు, "మా తెలుగు తల్లికి" పాట మేము పాడమన్నప్పుడు, తెలుగు విశ్వవిద్యాలయం పేరు మార్చినప్పుడు ఈ విషయం మీకు గుర్తుకు రాలేదా? అప్పుడు ఏమయిందండి ఈ ఆవేశం?
@జిగ్నాసి గారు, మంచి ప్రశ్నే!
@KK గారు..ఇక్కడ identity crisis ఎవరికీ లేదండి.

Krishna K December 11, 2009 at 7:53 AM  

"అప్పుడు ఏమయిందండి ఈ ఆవేశం?"
మంచి ప్రశ్న అడిగారు, సమాధానం మాత్రం ఆశించకండి.

చదువరి December 11, 2009 at 8:35 AM  
This comment has been removed by the author.
చదువరి December 11, 2009 at 8:38 AM  

నిజానికి జిగ్నచి చెప్పింది సరిపోతుంది. అయినా, నేనూ ఓ రెండు ముక్కలు చెబుతాను.

ఆంధ్రం, తెలుగు సమానార్ధకాలు. ఆంధ్రావాళ్ళంటే తెలుగువాళ్ళే. తెలంగాణ వాళ్ళు కూడా తెలుగువాళ్ళే, అంటే ఆంధ్రులే! ఆ ముక్కే ఆంధ్రులంటున్నారు. కానీ తెలంగాణవాళ్ళే.. ఆంద్రోళ్ళు ఆంద్రోళ్ళంటూ పిలిచి వాళ్ళని వాళ్ళు వేరు చేసుకోని తెలుగువారు కాకుండా పోయారు. మేం తెలుగువాళ్ళం కాదని స్వయానా వాళ్ళే చెప్పుకున్నారు.

తెలంగాణా వాళ్ళు నోరున్నవాళ్ళు -ఆంధ్రుల నోరు మూయించారు, మూయిస్తున్నారు. అంచేత వాళ్ళు చెప్పినదాన్నే -మీరు మాత్రమే తెలుగువాళ్ళు అనే మాటను - ఆంధ్రులు ఒప్పేసుకున్నారు.

వేణూశ్రీకాంత్ December 11, 2009 at 10:52 AM  

ఇప్పుడుకూడా వచ్చేది కాదులే అని నిశ్చింతగా ఉండచ్చు అనుకుంటున్నానండీ.. ఉత్తుత్తి దీక్షకు ఉత్తుత్తి ప్రకటన మాత్రమే చేశారు అని నా అభిప్రాయం.

Well said చదువరి గారు.

సిరిసిరిమువ్వ December 11, 2009 at 5:37 PM  

కృష్ణ గారు, :))

వేణూ, అంతేనంటారా?

పరిమళం December 11, 2009 at 6:05 PM  

ప్చ్ ....మేం కూడా ....:(

Unknown December 11, 2009 at 7:19 PM  

endukandi telangana bill anagane ila raastaru..em T state vaste HYD lo unna vallandarini pampichestara...20 years unnamu antaru..ante you are legally resident there..are we not free buy properties in Chennai/Bangalore for that matter...T state is required for Telangana poeple to get majority share of job/control over resources. Most of these politicians agitating bcoz of their properties in HYD...see the first person to resign is Lagadapati..20 years unna tarvata kooda telangana bada ardam chesukoledu ante you may not have vistied other districts in Telangana..for example take Nalgonda...even though there is Nagarjunasagar no water for Nalgonda district until recently...people waited to see whether KCR can bring state in these 9 years...now they have taken it into their hands..if other regions also have problems why can't they also question.

బ్లాగులో కాయ December 12, 2009 at 2:39 AM  

తెలుగు విశ్వవిద్యాలయం పేరు మార్చింది... తెలుగు అనే పదాన్ని తెలంగాణ అని చేశారా లేక.. పొట్టీ శ్రీరాములు అనే పదాన్ని తీసేశారా ?? మీరు తెలుగు తల్లి అని పేరు పెట్టినా అది పేరుకే ఉన్నది... ... ఆంధ్ర తల్లి లా వ్యవహరిస్తూ.. నేను మాత్రం తెలుగుతల్లినే అని చెప్పుకుంటే నే తెలంగాణ తల్లి పుట్టుకొచ్చింది... మా తెలుగు తల్లికి పాట పాడటం అన్నారు కదా... మా తెలుగు భాష కి మేము చెయ్యెత్తి జై కొడతాము.. కానీ... ఇలా తెలుగు అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ అని మాట్లాడితే ఆవేశం రాదా... కలిపేది తెలంగాణా లొ పేరు మాత్రం ఆంధ్ర ప్రడేశ్ ఇదెక్కడి న్యాయం..

బాబూ క్రిష్నా సమాధానం మాత్రం ఆశించొద్దా... నువ్వు ఇది మాల్లీ చూస్తావో లేదొ కానీ... ఎదుటి వాళ్ళ గురించి అంత చులకన భావం తగ్గించు కుంటే మంచిది...

చదువరీ....నీ బొంద... ఏం చదువరివి నువ్వు... ఇదే మాటలని నేను తిప్పి చెప్పనా... తెలుగు మాట్లాడే వాల్లు అంతా తెలంగాణ వాళ్ళు... అంటే ఇప్పుడు ఆంధ్రోళ్ళు ఆంధ్రొళ్ళు అని పిలవబడేవాళ్ళు కూడా తెలంగాణా వాళ్ళే.. కానీ...ఆంధ్ర అని..ఆంధ్ర ప్రదేశ్ అనీ తెలుగు వాళ్ళు కాకుండా పోయారు... మా పేరు లోనే తెలంగాణ అని ఉంది కదా... మాది తెలుగు అని...

సోది లాజిక్ లు చెప్పకండి... మీ మాటలు మీ మీదనే పడుతయ్.. మా ఆవేశం బాగానే పని చేస్తుంది అని నా అబిప్రాయం.. ఏమంటవ్ సిరిసిరిమువ్వ...

Krishna K December 12, 2009 at 8:10 AM  

@Raja, "ఎదుటి వాళ్ళ గురించి అంత చులకన భావం తగ్గించు కుంటే మంచిది... " అబ్బే ఆ అవకాశం మీరెక్కడ ఇస్తారండి, మీమీద మీకంటే చులకన (inferiority) భావన ఉన్నవాళ్లు ఉండరు లేండి, అందులో అనుమానం లేదు.

మాట్లాడెది తెలుగు, పగలగొట్టేది తెలుగుతల్లి విగ్రహాలు. సప్పోర్ట్ చేసేదేమో సలైన్ దొరలకు, ఆంధ్ర అనేది ఓ జాతి పేరు, ప్రాంతం పేరుకాదు అని తెలిసినా బ్యాంక్ లపేర్లు , హోటల్ల పేర్లు మార్చటం, నిజాం మంచి రాజు , రజాకార్లేమో దేశ సేవకులు, అబ్బే సారూ మిమ్మలను (తెలబాన్)లను చులకన చేద్దామనుకొన్నా మాకెక్కడ అవకాశం ఇస్తున్నారు :)

బ్లాగులో కాయ December 12, 2009 at 10:13 AM  

డియర్ ఆంధ్రబాన్ క్రిష్ణా : మీ కళ్ళలు కనపడ లేదా.. వాన్ని దీక్ష చేయనిచారా అసలు... బలవంతం గా సెలైన్ ఎక్కిస్తే ..ఇంక ఎన్ని సార్లైనా ఇల్లగే ఎక్కిస్తారు.. ఇదేం దీక్ష అనుకున్నాడు.. అందుకే విరమించాడు... కానీ లేని దీక్ష ని కొనసాగించినట్లు నటించాడు...కాదు.. నటించాల్సి వచింది.. ఆఖరి అవకాశం.. ఇంకేం చేయలేరు..కదా అని.. లేని దీక్ష నడుస్తున్నట్టు గా.... వాళ్ళు ఎక్కిస్తే అది వీడి తప్పా.. నువ్వు ఆ పరిస్తితుల్లో ఉంటే ఏం చెస్తవ్... ముందే చెప్పినం హింస ఎవరికీ ఆమోద యొగ్యం కాదు... ఆరాధించే వ్యక్తుల బొమ్మలు కూల గొట్ట మని కే సీ ఆర్ చెప్పాడా.. తెలుగు తల్లి విగ్రహం పగల గొట్టటం తప్పు..బాంక్ పేరు మార్చినోడీ వ్యవహారం..ఏదొ కామెడీ మనిషి చేసినట్ట్లు కనిపిస్తలేదా.. తెలివి ఉన్నొడు ఎవదైనా అలా చేస్తాడా... ... దానికి తెలంగాణ వాదులందరినీ జత కడుతావా>>??? ...తెలంగాణ ల ఎక్కడా లేనన్ని చెరువు లు ఎవరు కట్టించారు.. ఇపుడూ ఆంధ్ర ప్రదేశ్ శాసన సభ,మిగతా భవంతులు ఎవడు కట్టించారు.. కొందరు మత మూడులు రాజు నెదిరించి చేసిన దుష్కార్యాలకు అతను భాద్యుడా/? రజాకార్లు మంచి వాళ్ళని మేము అన్నమా... నీకు బుర్ర పని చేస్తుందా.. రెచ్చ గొట్టడానికి రాస్తే ... దయ చేసి రాయకు...

బ్లాగులో కాయ December 12, 2009 at 10:13 AM  
This comment has been removed by the author.
బ్లాగులో కాయ December 12, 2009 at 10:20 AM  

ఆంధ్ర అనేది జాతి పేరు అని నేనెక్కడా చదివి నట్ట్లు గుర్తు లేదు మరి.. మా ఊళ్ళలో మాది తెలంగాణ అని చెప్తుండే.. ఒక అబద్దం పది సార్లు పది మందితో చెప్పిస్తే అదే నిజం ఐతది... మరి... ఇప్పుడు వ్యావహారికం గా మూడు ప్రాంతాలున్నయ్ కదా... తెలంగాణ, ఆంధ్ర , రాయల సీమ... అది ఒక జాతి పేరు అని నెనైతే ఎక్కడా చదవలేదు,, నేను తెలుగు మీడియం వాన్ని..

Kathi Mahesh Kumar December 12, 2009 at 11:45 AM  

నిజానికి "తెలంగాణ" అంటేనే ‘తెలుగు ప్రజల భూమి’ అని అర్థం.

మహారాష్ట్ర నుంచీ ప్రవహించే "ఆంద్రీ" "హాంద్రీ" నదుల పేర్లమీద అక్కడి నుంచీ వచ్చిన గిరిజనులు స్థిరపడిన స్థలాన్ని "ఆంధ్రపధము" అనడం జరిగింది.ఆ గిరిజనులు ప్రాకృతము,దేశీయము సంస్కృతాన్ని తెలుగుతో కలగలిపి ఇక్ష్వాకుల కాలం నాటికి దాన్నొక రాజభాషగా తయారు చేశారు. రాజామోదం పొందిననాటి నుంచీ "అదే అసలైన తెలుగు" అనే ఆభిజాత్యం ఆంధ్రులలో పొడచూపింది.

అంటే, తెలుగు మాట్లాడే అందరూ ఆంధ్రులు కాదు.తెలంగాణా ప్రజల భాషమాత్రం తెలుగే. కాబట్టి మా తెలుగు ఎక్కువ అనే ఆంధ్రాఆభిజాత్యాన్ని వదులుకుని గౌరవించడం నేర్చుకోండి. అప్పుడుగానీ తెలంగాణా ప్రజలు క్షమించరు.

Krishna K December 12, 2009 at 11:58 AM  

@Raja,
అదే వెటకారం అంటే, సరె నిజం గా ఆంధ్ర అంటే జాతి పెరు అని తెలియదు అని reference అడగొచ్చుకదా? దానికి "ఒక అబద్దం పది సార్లు పది మందితో చెప్పిస్తే అదే నిజం ఐతది" లాంటి సొల్లు మాటలు ఎందుకు??????
ఇదిగొండి reference: http://www.teluguworld.org/Telugu/telugu_lang_history_2.html.

సరే నిజాం అంత మంచి రాజు అయితె, మీరు చెప్పుకొనే తెలంగాణా అంత ఎన్ని హైస్కూల్స్ 1956 లో ఉన్నయ్యో చెబ్తారా? తెలుగోళ్లు తెలుగు భాష నేర్చుకోవటాన్ని పాఠశాలలో ఎందుకు నిషేధించాడో చెబ్తారా? (అంత నిషెధం ఉన్న తెలుగు ని బతికించుకొన్న ఆ ప్రాంత సొదరులు అంటే నా గుండెలలో అభిమానమే). వాడికున్న వందల పెళ్లాలకోసం కట్టిన భవనాలు ఎన్ని, స్కూల్స్, ఆసుపత్రుల కోసం కట్టిన భవనాలు ఎన్నో చెబ్తారా? చివరాఖరకు పాకిస్తాంతో కుమ్మక్కయినవాడు మీకు మంచి రాజు.
అందుకే నేను అనేది మిమ్మలను చులకన చేయటానికి మాకెక్కడ పొరపాటునకూడా అవకాశం ఇస్తున్నారు అని :)

Krishna K December 12, 2009 at 12:06 PM  

"కాబట్టి మా తెలుగు ఎక్కువ అనే ఆంధ్రాఆభిజాత్యాన్ని వదులుకుని గౌరవించడం నేర్చుకోండి " చ్చా అలగా!!!! ఈ టపాలో కాని, కామెంట్లలో కాని, ఒకరి తెలుగు ఎక్కువ ఇంకొకరి తెలుగు తక్కువ అని ఎవరయినా అన్నారా?

ఓ దాశరధి, ఓ సుర్వరం, ఓ పోతన, ఓ p.v. లాంటి వారి తెలుగు కు ఎవరయినా వంకలు పెట్టగలరా?

పొద్దున లేచినప్పటినుండి ఆభిజ్యాతం ఆభిజ్యాతం అంటూ దాని జోలికి పోకపొతే కొంత మందికి నిద్ర పట్టదేమో :)

సిరిసిరిమువ్వ December 12, 2009 at 12:32 PM  

@రాజా గారు, ఇక్కడ మీరు టపాకి సంబంధం లేని విషయాలు మాట్లాడుతున్నారు. ఆరోగ్యకరమయిన చర్చలకు బ్లాగులు వేదిక కావాలి కాని..వ్యక్తిగత ధూషణలు, వెక్కిరింతలు అంత హుందాగా ఉండవు. మీ వాదన మీరు వినిపించండి అంతే కాని వ్యక్తిగత ధూషణలు చేస్తే మీ వ్యాఖ్యలు తొలగించబడతాయి.

@మహేష్ గారు, రాక రాక నా బ్లాగుకి వచ్చారు..సంతోషం.
"కాబట్టి మా తెలుగు ఎక్కువ అనే ఆంధ్రాఆభిజాత్యాన్ని వదులుకుని గౌరవించడం నేర్చుకోండి"...ఇక్కడ ఎవరయినా అలా వ్యాఖ్యానించారా? లేదే!
ఆంధ్రప్రదేశ్ లో మాట్లాడే భాష (అది ఏ ప్రాంతం అయినా) తెలుగు అని మాత్రమే నాకు తెలుసు కానీ ఈ ఆంధ్రులు, తెలుగు, తెలంగాణా..ఈ వాదనలు, చరిత్రలు నాకయితే తెలియవు.

Kathi Mahesh Kumar December 12, 2009 at 1:52 PM  

@సిరిసిరిమువ్వ: తెలంగాణా ఉద్యమం పుసుక్కుమంటే మళ్ళీ రగులుకోవడానికి చారిత్రక నేపధ్యం,వనరుల వంచన కొంతకారణమైతే, దినందినం ఆంధ్రాప్రాంతపు ప్రజలు తెలంగాణావాళ్ళపై చూపించే వివక్ష,అపహాస్యం,చులకనభావం మరో ముఖ్యమైన అంశం. అంతర్లీనంగా ఆంధ్రాప్రాంతపు ప్రజల్లో పేరుకుపోయిన సుపీరియారిటీ కాంప్లెక్స్ ఈ సమస్యని నిత్యనూతనంగా ఉంచి, పోరాటాలకు ఆజ్యం పోస్తూనే ఉంటుంది.

బ్లాగులో కాయ December 12, 2009 at 6:59 PM  

@Krishna: నిజాం పై. ఏవొ కొన్ని పనులను ఎత్తి చూపిస్తే చాలా.....ఆ రాజు ఉన్నప్పుడు జీవన విధానం కోసం ఎలాంటి వసతులు కలిపించాడు... ధీర్ఘ కాలిక మంచి చేసిన రాజును మంచి రాజు అంటే ఏం నొప్పి...
జాతి పేరు కావచ్చు.... ఇప్పటి భౌగోళిక పరిస్థితుల్లో తెలంగాణ , ఆంధ్ర , రాయల సీమ అని 3 లేవా... హహ... చులకన..... ఏవొ స్వల్ఫ కాలిక విషయాలను పట్టుకుని వేలాడుతూ మిమ్మల్ని బయటి వాళ్ళు చులకన చేసె అవకాశం ఎక్కడ ఇస్తున్నారు...
@సిరిసిరిమువ్వ : తెలబాన్ అనే పదాన్ని ఈ బ్లాగు లో మీరు ఆమోదిస్తారా...అది మంచి పదం అయితే... బుర్ర పనిచెయటం కూడా మంచిదే...

జయ December 14, 2009 at 2:58 PM  

ఏం పర్లేదండి. అందరం కలిసి ఎవరి చోట్లలో వాళ్ళం ఉండిపోతాం.

కార్తీక్ December 15, 2009 at 9:22 PM  

నాకు తెలిసి ఆంద్ర తెలంగాణ రాయలసేమ అని లేవు అన్ని కలిపి ఆంద్రప్రదేశ్ అంతే
www.tholiadugu.blogspot.com

Nrahamthulla December 16, 2009 at 11:49 PM  

కాకినాడ దగ్గర 30చ.కి.మీ.విస్తీర్ణంగల యానాం 1954 దాకాభారత్ లో ఫ్రెంచ్ కాలనీగా ఉంది.నేడు పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతంలో భాగం.1954లో లో విమోచనం చెంది స్వతంత్రభారతావనిలో విలీనంచెందినా 1956 లో భాషా ప్రాతిపదికన తెలుగు రాష్ట్రంలో కలవలేదు.1948లో హైదరాబాద్ ను పోలీసు చర్యజరిపి ఇండియాలో కలిపారు.1949 లో అప్పటికి ఒక ఫ్రెంచి కాలనీ గా ఉన్న చంద్రనాగూర్, సమీపంలోని బెంగాల్ రాష్ట్రంలో విలీనం అయింది. కాకినాడ మునిసిపల్ కౌన్సిల్ కూడా యానాన్ని కలపాలని తీర్మానం చేసింది. 870కి.మీ దూరంలోని తమిళ పుదుచ్చేరి నుండి పాలన కష్టంగా ఉంది.పుదుచ్చేరికి యానాం ప్రజల ప్రయాణం ఆంధ్రలోని కాకినాడ నుండి జరుగుతుంది.దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని యానాంలో ఏర్పాటు చేయాలని యానాం కాంగ్రెస్ తీర్మానించింది.ఇండోర్ స్టేడియం,కళ్యాణమండపం,ధవళేశ్వరం-యానాం మంచినీటి ప్రాజెక్టులకు రాజశేఖరరెడ్డి పేరు పెడతామని పుదుచేరి రెవిన్యూ మంత్రి మల్లాడి కృష్ణారావు చెప్పారు. తెలుగుజాతి సమైఖ్యత,భాషాప్రయుక్తరాష్ట్ర ప్రధాన ఉద్దేశ్యం యానాం ఆంధ్రప్రదేశ్ లో కలిస్తే నెరవేరుతుంది.తెలుగుతల్లి బిడ్డలందరూ ఒకేరాష్ట్రంగా ఉంటారు.సమైక్యాంధ్ర కోసం ఇప్పుడు ఉద్యమాలు జరుగుతున్నాయి గనుక భౌగోళికంగా సామీప్యత, 100% తెలుగు ప్రజలున్న యానాం ను ఇప్పటికైనా తమిళ పుదుచ్చేరి నుండి విడదీసి సమైక్యాంధ్రలో కలపాలి.కలిస్తే బాగుంటుందని ఆశ.

buddhamurali July 27, 2011 at 11:19 AM  

TAH (Telugu Association of Hyderabad) అనో , TAT (Telugu Association of Telangana) అనో ....AAH (Andhra Association of Hyderabad) అనో ..మరోటనో.......సంఘాలు పెడితే అందులో మేము కూడా సభ్యులమే!!.

...........
అమెరికా లోని తెలుగు వారు తెలుగు సంఘం పెట్టుకుంటారు, అలానే కర్ణాటక అక్క్నదా వారి రాష్ట్రం కాబట్టి అక్కడి తెలుగు వారు ప్రవాస లేదా కన్నడ తెలుగు సంఘం ఏర్పాటు చేసుకుంటారు మీరు తెలంగాణా, హైదరాబాద్ తెలుగు సంఘం అని అంటున్నారు అంతే తెలంగాణా లో తెలుగు తెలుగు కాదా

సిరిసిరిమువ్వ July 27, 2011 at 11:44 AM  

బుద్దా మురళి గారూ..ఒక్కసారి పై వ్యాఖ్యలన్నీ చదవండి..ఇది వ్రాసిన నేపధ్యం మీకు అర్థం అవుతుంది:)

Post a Comment

statcounter

  © Blogger template Coozie by Ourblogtemplates.com 2008

Back to TOP