తెలుగుకి ప్రాచీన హోదా
నవంబరు ఒకటి రాష్ట్రావతరణ సందర్భంగా తెలుగు మరియు కన్నడ ప్రజలకి కేంద్రం ఓ బహుమతి ప్రకటించింది. ఎట్టకేలకి తెలుగు మరియు కన్నడ భాషలకి ప్రాచీన హోదా ఇచ్చారు. ఓ భాషకి ప్రాచీన హోదా కలిగించటం మూలాన ఒనగూరే ప్రయోజనం ఏమిటొ నాకయితే తెలియదు, మరి ఈ ప్రాచీన హోదా తెలుగు భాషాభివృద్ధికి ఎంతవరకు ఉపయోగపడుతుందో వేచి చూద్దాం.
5 వ్యాఖ్యలు:
అవునండీ నాక్కడా అర్థం కాలేదు ప్రాచీన హోదా ఎందుకో. ఏదో రకంగా తెలుగు అనబడే భాష వుందని గుర్తించేరని సంతోషించాలేమో.
అందరూ గుర్తిస్తూనే ఉన్నారు..ఒక్క తెలుగోళ్లు తప్ప..ఎందుకంటే తెలుగు ప్రచీనమైనా మనం మోడరన్ కదా (సిగ్గుతో తలదించుకుంటూ)
ఓహో! నిధులు వస్తున్నాయన్నమాట. :-)
కనీసం ఇప్పటి నుంచైనా మన తెలుగు వాళ్లు వాళ్ల పిల్లలని అమ్మా నాన్నలున్న పిల్లలుగా పెంచుతారని ఆశిద్దాం (ఇప్పటి పిల్లల్లో చాలా మందికి మమ్మీ డాడీలేగా ఉన్నారు).
పిల్లల పాఠ్యపుస్తాకలల్లో "తెలుగు ఒక ప్రాచీన భాష" అని చదువుకొని మురిసిపోడానికే. తెలుగు జాతి మనది,నిండుగ వెలుగు జాతి మనది. తెలుగు మాట్లాడడానికి నామోషీగా అనుకొంటూ వేరే భాష గొప్పగా మాట్లాడే వారిని చూసి నేను బాధగా రాస్తున్న వ్యాఖ్య ఇది.
Post a Comment