ఒబామాదే గెలుపు
ఎప్పుడా ఎప్పుడా అని ప్రపంచం అంతా ఆసక్తిగా ఎదురు చూసిన సుదీర్ఘమైన అమెరికా ఎన్నికల ప్రక్రియ దాదాపు ముగిసింది. అందరి ఊహలు నిజం చేస్తూ నిన్న జరిగిన అమెరికా సార్వత్రిక ఎన్నికలలో విజయకేతనం ఎగరవేసి 44వ అమెరికన్ ప్రెసిడెంటుగా మరియు మొదటి ఆఫ్రికన్-అమెరికన్ (నల్లజాతి) ప్రెసిడెంటుగా 47 సంవత్సరాల బరాక్ హుస్సేన్ ఒబామా పదవి చేపట్టబోతున్నాడు. తన ముందు ఎన్ని సవాళ్ళో. ఇక ప్రపంచం చూపంతా అమెరికా మీదా, ఒబామా మీదే. ఈ యువ ప్రెసిడెంటు అమెరికాని ఎటు నడిపిస్తాడో, ఆపై మనల్ని ఎటు నడిపిస్తాడో వేచి చూద్దాం.
అన్నట్లు ఈ విషయం గురించి మన ఇస్మాయిలు గారు ఎప్పుడోనే జోస్యం చెప్పారు. ఆయన జోస్యం నిజమైనందుకు రాయలవారికి అభినందనలు.
అన్నట్లు ఈ విషయం గురించి మన ఇస్మాయిలు గారు ఎప్పుడోనే జోస్యం చెప్పారు. ఆయన జోస్యం నిజమైనందుకు రాయలవారికి అభినందనలు.
2 వ్యాఖ్యలు:
ఇప్పటి ఆర్థిక పరిస్థితుల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓడినవాడు బహిరంగంగా ఏడుస్తాడు. గెల్చినవాడు ఇంటికి పోయి ఏడుస్తాడు. అంతే తేడా ! ఇప్పుడది ఒక ముళ్ళ కిరీటం.
ప్రాతినిద్యం వహించడానికి ఏ జాతి, ఏ కులం, ఏ భషా అనే భేదాలు అడ్డుకావని మరొకసారి ఋజువయ్యింది.మంచి టపా.....
మీ శ్రీసత్య...
Post a Comment