పుస్తకాల విందుకి వేళాయెరా!
ప్రదర్శన ప్రారంభ తేది: డిసెంబరు 18, 2008.
వేదిక: పీపుల్సు ప్లాజా, నెక్లెసు రోడ్డు.
ప్రదర్శన వేళలు: మధ్యాహ్నం రెండు గంటల నుండి రాత్రి ఎనిమిదన్నర గంటల వరకు, శని ఆదివారాలు మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు.
ప్రవేశ రుసుము: ఐదు రూపాయలు మాత్రమే. పిల్లలకి, విద్యార్థులకి, ఉపాధ్యాయులకి, పత్రికా విలేకరులకి ప్రవేశం ఉచితం.
- ఈ ప్రదర్శన పది రోజుల పాటు జరుగుతుంది.
- అన్ని పుస్తకాల మీద 10 శాతం రాయితీ ఉంటుంది.
- ప్రతి రోజు సాయంత్రం పూట చర్చా కార్యక్రమాలు, పరిచయ కార్యక్రమాల లాంటివి జరుగుతాయి.
- బుక్ హంట్, ఎక్కడా ఆంగ్ల పదం రాకుండా తెలుగులో మూడు నిమిషాల పాటు ఆపకుండా మాట్లాడటం, లాంటి పోటీలు జరుగుతాయి.
- నిర్వాహకులు ఇచ్చిన చిట్టాలో నుండి అభిమాన రచయిత(త్రి) ని ఎన్నుకునే కార్యక్రమం కూడా జరుగుతుంది.
- తెలుగు భాషకి, సాహిత్యానికి విశిష్ఠ సేవ చేసిన ఓ 25 మంది తెలుగు వారికి సన్మానం చేస్తారు.
అంతే కాక మొదటి రచన చేస్తున్న లేక ఇప్పటికి ఒక్క రచన మాత్రమే చేసిన రచయిత(త్రి)లకు ఈ ప్రదర్శనలో ప్రత్యేక అంగడి ఒకటి ఉంటుంది. వందరూపాయల నామమాత్రపు రుసుము కట్టి ఇలాంటి రచయత(త్రి)లు ఎవరైనా తమ పుస్తకాలని అక్కడ పెట్టుకోవచ్చు. మన బ్లాగర్లలో మంచి మంచి రచయిత(త్రి)లు ఉన్నారు, వారు ఇక్కడ తమ ప్రదర్శన పెట్టవచ్చేమో....
పుస్తకాలు కొందామని వెళ్లేవారికి ఓ చిన్న సూచన, ముందు మీకు కావలసిన పుస్తకాల చిట్టా వ్రాసుకోండి. వెళ్లిన మొదటిసారే పుస్తకాలు కొనెయ్యకండి, ఓపికగా ఒకటికి రెండు మూడు సార్లు అన్ని అంగళ్లు తిరగండి, తరువాతే కొనండి, అలా ఎందుకు చేయాలో ఒకసారి నెటిజన్ గారి నడగండి చెపుతారు.
ఈ సారి ఇంకొక విశేషమేమంటే విజేత కాంపిటీషన్సు (కంప్యూటర్ ఎరా) వారి అంగడిలో కంప్యూటరులో తెలుగు స్థాపించుకోవడం ఎలా అనే అంశంతో పాటు తెలుగు బ్లాగుల గురించి కరపత్రాలను తయారుచేసి పంచటం మరియు వీలైతే ఓ సాయంత్రం తెలుగు బ్లాగుల గురించి ఓ పరిచయ ఉపన్యాసం లాంటిది ఏర్పాటు చేయటానికి మన బ్లాగర్లు ప్రయత్నిస్తున్నారు. అక్కడ మీ వంతు ఏమైనా సాయం చేయాలని ఉంటే కంప్యూటర్ ఎరా శ్రీధర్ గారిని కాని, చదువరి గారిని కాని, అరుణ గారిని కాని సంప్రదించండి.
తెలుగు పుస్తకాలని కొని, చదివి, చదివించి మీ వంతు సాహిత్య సేవ చేయండి. చదివాక మీ మీ బ్లాగుల్లో వాటి గురించి సమీక్షలో, పరిచయాలో వ్రాయటం మరవకండి.
తెలుగు బ్లాగర్లందరూ కలిసి కట్టుగా ఓ రోజు వెళితే ఎలా ఉంటుందో కూడా ఆలోచించండి.
తెలుగు పుస్తకాలు చదవండి, చదివించండి.
19 వ్యాఖ్యలు:
ప్రారంభోత్సవం రొజు తెలుగు బ్లాగరలందరూ ఇక్కడికి దండెత్తితే బాగుంటుందేమో!
నా దగ్గర బోలెడు ఫ్రీ పాసులు కూడా ఉన్నాయోచ్! అందరూ కలిసెళ్ళే ప్లానుంటే నేనొచ్చే దాకా ఆగండి, ఇవాళ ఊరెళ్తున్నా, 3 రోజులకి!
సిరిసిరిమువ్వ గారు అందరూ ఓ సాయంత్రం అక్కడ కలవడం మంచి ఆలోచన. బాగుంటుంది.
దయచేసి దీనికి అందరూ తెలుగు బ్లాగు టీ షర్ట్లతో వెళ్ళాల్సిందిగా మనవి... ఒక గుంపు(లేకపోతే చిన్న చిన్న గుంపులుగా వేరు వేరు సమయాల్లో) ఒకేసారి వెళ్ళి ఒక ఘంటో రెండు ఘంటలో ప్రదర్శనశాలంతా తిరిగితే చాలా మంది చదివే ఆసక్తి ఉన్నవాళ్ళని బ్లాగుల వైపు తిప్పుకోవచ్చు....
అలా వీలు చూసుకుని గుంపులు పది రోజులూ వెళ్ళొచ్చు....
WOW.. thanks for sharing this! Was waiting for it!
ఆ ప్రదేశం వైర్లెస్స్ నెట్వర్క్ ఎనేబుల్డ్ అయితే ఎవరో ఒకళ్ళు లాప్టాప్తో ఈతెలుగు,కూడలి, జల్లేడ, తెలుగుబ్లాగులు గురించి ప్రదర్శన కూడా ఇవ్వొచ్చు... అంతర్జాలంలో తెలుగు వెలుగుని చూపించొచ్చు....
ప్రారంభోత్సవం రొజు కన్నా ఇంకొక రోజు వెళితే బాగుంటుందేమో, ఎందుకంటే ప్రారంభోత్సవం రోజున అంగళ్లు సర్దటమే సరిగ్గా అవదు. దిలీపు గారు చెప్పిన ఐడియా "కొంతమంది కలిసి ఓ గుంపుగా ప్రతి రోజూ వెళ్లటం" కూడా బాగుంది.
@దిలీపు గారు, మీ టి.షర్టుల ఐడియా కూడా బాగుంది, మరి మీరు సప్లై చేస్తారా?
వావ్! దీని గురించి రెండు మూడు బ్లాగుల్లో చదివాను.
పుస్తక ప్రదర్శన కి మాత్రమే పరిమితం కాకుండా పోటీలు, చర్చా కార్యక్రమాలు కూడా నిర్వహించడం బాగుంది.
ట్రావెలాగ్ తరహాలో, దీనిపై కూడా బ్లాగర్లు తాము చూసిన విశేషాలను పంచుకుంటే సంతోషిస్తాం.
@ సిరిసిరిమువ్వ గారు
ఎవరి టీ షర్టులు వాళ్ళే కొనుక్కోవాలండి... :-) ఒక్కో టీ షర్టు 100 నుండి 150 రూపాయలు ఖర్చు అవుతుంది...
ఇంకా వారి వారి టీ షర్టుల మీద వారి వారి బ్లాగుల పేర్లు ఒకవైపు, ఇంకోవైపు కూడలి, ఈతెలుగు, లేఖిని ముద్రించుకుని వెళ్ళొచ్చు... ఇంకా సరదాగా "నాకు ఒక తెలుగు బ్లాగు ఉంది, మీకుందా? :-)" అని కూడా ముద్రించుకోవచ్చు... జ్యోతి గారు ఇప్పటికే కొన్ని డిజైన్ చేసేసారు...
ఎంటబ్బా ఈ రాత్రి నా బుర్ర ఇంతలా వెలిగిపోతుంది???!!!
పుస్తక ప్రదర్శనశాలలో నిర్వాహుకుల అనుమతితో కొన్ని తెలుగు బ్లాగు, కూడలి, ఈతెలుగు, లేఖిని పోస్టర్లు పెట్టవచ్చు...
ఎవరి టీ షర్టులు వాళ్ళదగ్గరే ఉంటాయి కాబట్టి, ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడికి పడితే అక్కడ ఎంట్రీ ఇచ్చుకోవచ్చు... :-D వీడు తెలుగు బ్లాగోడు అని మన మన ప్రదేశాల్లో మనమీద ముద్రపడిపోయే వరకూ తిరగొచ్చు.... ఇంక మనల్ని చూస్తే మన పేరు కాకుండా, తెలుగు బ్లాగు గుర్తొస్తుంది అప్పుడు... :-)
వరూధిని గారు, మంచి సమాచారం ఇచ్చారండి.. గుంపుగా వెళ్తే ఆ ఫన్నే వేరు :-)
దీపూ నీ ఐడియాలన్నీ భలే ఉన్నాయి..
@దిలీపు గారు, టి.షర్టులు మీరు సప్లై చేస్తారా అంటే ఫ్రీగా అని కాదండి, డబ్బులకే:)అంటే మీరు ఏమైనా డిజైన్ చేసి సప్లై చేస్తారా అని. నాగప్రసాద్ గారు (http://nagaprasadv.blogspot.com/) కూడా కొన్ని టి.షర్టులు డిజైన్ చేసి పెట్టారు చూసారా?
మంచి సమాచారం సిరిసిరిమువ్వ గారు, పుస్తక ప్రదర్శనతో పాటు ఏర్పాటు చేసిన కార్యక్రమాలు అభినందించ తగినవి. బ్లాగుల ప్రచారం గురించి చేస్తున్న ఆలోచనలు కూడా బాగున్నాయి.
హాయ్..
ప్రసాద్ మల్టిప్లెక్స్ ఆవరణలో గిఫ్ట్ మాక్స్ అనే దుకాణం ఉంది. అక్కద మనం డిజైన్ చేసిన టీ షర్టు బొమ్మలు చూపిస్తే, వాళ్ళు ప్రింట్ చేసిస్తారు. ఖర్చు 100, 150లొ అయిపొతుందెమో! తెలుగు బ్లాగర్లు మాట్లడటానికి ఓ గంట సమయం సంపాదించగలిగాం. 20 శనివారం సాయంత్రం 6 - 7 మనకు వేదిక లభించింది. అందరు అక్కడికి ఒస్తె బాగుంటుంది.
అరుణ గారు, సంతోషం, మంచి విషయం చెప్పారు.
గిఫ్ట్ మాక్స్ గురించి ఓ చిన్న సందేహం-టి.షర్ట్సు, డిజైను మనం ఇస్తే వాళ్లు ప్రింటు చేసి ఇస్తారా?
:) muvva gaaru andaru vachcharantagaa.. vaalla abhipraayaalu chadivaaka chaala haayi anipinchindi
Post a Comment