ఇదా పరిష్కారం!!
"వరంగల్‌లో ఇద్దరు కాలేజి విద్యార్ధినుల మీద యాసిడ్ దాడికి పాల్పడ్డ వాళ్లని పోలీసులు ఎన్‌కౌంటర్‌లో చంపేసారు".
సమస్యకి ఇదే పరిష్కారమా? ఇదే అంతిమ తీర్పా?.
సమస్యకి ఇదే పరిష్కారమా? ఇదే అంతిమ తీర్పా?.
"నిందితులు నేరప్రవృత్తి కలిగినవారని, పథకం ప్రకారమే వారు అమ్మాయిలపై అమానుషంగా యాసిడ్ దాడి చేశారని వరంగల్ ఎస్పీ సజ్జనార్ అన్నారు". వారు నేరప్రవృత్తి కలిగినవారని ముందే తెలిసినప్పుడు మరియు స్వప్నిక తండ్రి నిందితుడి మీద రిపోర్టు ఇచ్చినప్పుడు ఎందుకు చర్య తీసుకోలేదు, అరెస్టు చేసినవాడిని ఎందుకు వదిలేసినట్లు, తను నేరప్రవృత్తి కలిగినవాడని తెలిసి కూడా వదిలేసాక తన మీద నిఘా ఎందుకు ఏర్పాటు చేయలేదు. ఎన్‌కౌంటరే ఇలాంటివాటికి పరిష్కారమా? నేరం జరిగాక చట్టం తన పని తాను చేయటం కాదు, ముందుగా ఆ నేరం జరగకుండా చేయటం చట్టం విధి. స్వప్నిక పరిస్థితి విషమంగా ఉంది మరి ఆ అమ్మాయికి ఏమైనా అయితే దానికి ఎవరు బాధ్యులు?
యాసిడ్‌తో దాడి అమానుషమే, ఇలాంటి వాటికి కఠిన శిక్షలు పడాల్సిందే. కాని తప్పంతా నిందితుడిదే లాగా కూడా కనిపించటం లేదు. నిందితుడు ఆ అమ్మాయి మీద 25,000 రూపాయల వరకు ఖర్చు చేసాడట, మరి ముందుగా ఆ అమ్మాయి ఇలాంటివి వద్దని ఎందుకు వారించలేదు, తనని ఎందుకు ప్రోత్సహించినట్లు? ఎవరో ముక్కు మొహం తెలియని వ్యక్తి నా మీద ఇంత డబ్బులు ఎందుకు ఖర్చు పెడుతున్నాడా అని అమ్మాయిలు ఆలోచించాలి, తల్లిదండ్రులూ ఆలోచించాలి, ఆదిలోనే ఇలాంటి స్నేహాల్ని తెంపివేయాలి.
ఎవరూ పుట్టుకతో నేరస్థులుగా పుట్టరు. పెంపకం, పరిసరాలు, అనుభవాలు వారిని నేరస్థులుగా మారుస్తాయి. అలాంటి వారిని ఎన్‌కౌంటర్‌లో చంపటం మాత్రం సరైన పరిష్కారం కాదు. నేరం చేయటానికి ముందే భయపడేట్టు శిక్షలు ఉండాలి. ఎవరైనా అమ్మాయిల వెంట పడటం, వేధించటం లాంటివి చేస్తున్నప్పుడు హెచ్చరికలతో వదిలివేయకుండా కఠిన శిక్షలు పడేలా చూడాలి. వాళ్లు ఎలాంటి వారైనా, ఎంతటి వారైనా మొదటిసారే గదా అని హెచ్చరికలతో వదిలివేయకుండా ప్రారంభంలోనే ఇలాంటి వాటికి అడ్డుకట్ట వేయాలి, వారికి సరైన కౌన్సిలింగు ఇప్పించి వారి ప్రవర్తన మార్చుకునేట్లు చేయాలి. అమ్మాయిల వంక కన్నెత్తి చూడటానికి కూడా భయపడే విధంగా చట్టాలు కఠినంగా అమలు చేయాలి, అవసరమైతే అందుకు అనుగుణంగా చట్టాల్ని మార్చాలి.
ఆడపిల్లలు కూడా తమ పరిధుల్లో తాము ఉండాలి. ఎవరితో పడితే వారితో సినిమాలు షికార్లు తిరగటం, కాలేజిలు ఎగ్గొట్టి తిరగటం లాంటివి ఎప్పటికైనా వారికే ప్రమాదం. స్నేహానికి, వ్యామోహానికి తేడా తెలుసుకుని మెలగాలి. ఇది ఇప్పటి సమస్య కాదు. ఇలాంటివి జరిగినప్పుడే మహిళా సంఘాలు, విద్యార్థి సంఘాలు మేలుకుంటాయి తప్ప ఇలాంటివి జరగకుండా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టరు ఎందుకని?. కాలేజిలలో ఇలాంటి వాటిపై చక్కటి సెమినార్లు, ఇతర కార్యక్రమాలు చేపట్టి పిల్లలలో అవగాహన, పరివర్తన తీసుకురావాలి. ప్రవర్తనా సమస్యలు ఉన్న పిల్లలకి వర్క్‌షాపులు పెట్టి వాళ్లలో మార్పు తిసుకురావటానికి ప్రయత్నించాలి అంతే కాని ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు రోడ్లెక్కి అరవటం కాదు మనకి కావల్సింది.
ఈ సమస్య ఏ ఒక్కరిదో కాదు. దీనికి పరిష్కారం కూడా ఏ ఒక్కరి చేతుల్లోనో లేదు. ప్రభుత్వంతో పాటు ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకోవాలి. ఎక్కడైనా ఎవరైనా ఏ ఆడపిల్లనైనా వేధిస్తున్నట్లు మీ దృష్టికి వస్తే చాతనైన సహాయం చేయండి, నాకెందుకులే అని పక్కకు తప్పుకు వెళ్లకండి, రేపు మన పిల్లలే ఆ పరిస్థితిలో వుండవచ్చు.
23 వ్యాఖ్యలు:
మాడమ్,
నేను ఇది చాలా కోపాన్ని అణచుకొని రాస్తున్నాను.
నిజమే. వాళ్ళని చంపడం ఆటవిక న్యాయం. అందులో విభేధించేదేమీ లేదు. మీరు చెప్పిన మిగతా వ్యాక్యాలు కూడా ఆమోద యోగ్యమయినవే, మన పిల్లలకు మనం చెప్పేవే.
కాని, నేను ఇందాకే ఇంకెక్కడో కూడా చదివా, మీరు పైన రాసిన వ్యాక్యాలు.
"కాని తప్పంతా నిందితుడిదే లాగా కూడా కనిపించటం లేదు. నిందితుడు ఆ అమ్మాయి మీద 25,000 రూపాయల వరకు ఖర్చు చేసాడట, మరి ముందుగా ఆ అమ్మాయి ఇలాంటివి వద్దని ఎందుకు వారించలేదు, తనని ఎందుకు ప్రోత్సహించినట్లు?"
అసలు ఏంటండీ ఆ లాజిక్? నాకు తల తిరిగి పోయింది. మీరేం రాసారో, ఏం సజెస్ట్ చేస్తున్నరో మరొక్కసారి దయచేసి సమీక్షించుకోండి. అసలు ఇలా ఎలా రాయగలరు, ఎలా ఆలోచించగలరు అస్సలు. ఇలాంటి ఆలోచనలే ఆడపిల్లలకి శాపం.
అయితే ఏంటండీ, ఇద్దరు వ్యక్తులు కలసి తిరిగితే యేంటి, అందులో ఒకరు బాగా ఖర్చు పెడితే యేంటి? ఇష్టమో కాదో, మనుషుల బేసిక్ లిబర్టీ అది, ఒక రిలేషన్షిప్ లోకి ఎంటర్ అవ్వడం, దాంట్లొంచి బయటకు రావడం అనేది ఆ అమ్మాయికి మాత్రమే సంబధించిన పూర్తి వ్యక్తిగత విషయం. ఒకవేళ నిజంగా ఆ అమ్మాయే అతణ్ణి డంప్ చేసిందే అనుకొండి, అయినంత మాత్రాన అతను ఆసిడ్ పోస్తే, పూర్తి తప్పు అతనిది కాదా? అందులో కొంచెం ఆ అమ్మాయికి కూడా చెందుతుందా? అసలు ఇది ఏం లాజిక్కో, మీరు ఏం మాట్లాడుతున్నారో, నాకయితే తల గోడకు కొట్టుకోవాలనుంది. మీలాంటి ఎడ్యుకేటెడ్ వ్యక్తులు కూడా ఇలా ఆలోచించడం అన్ బిలీవబుల్. Subtle గా ఆడపిల్లల్ని ఇంత defensive state లోకి తోయడం అనేది not only defeating philosphy, but also suicidal.
I am speachless, to say the least.
Disclaimer: నేను ఇది చాలా కోపంలో రాసాను. ఇది వ్యక్తిగత దాడి ఏ మాత్రం కాదు, అలాంటి self-defeating ఆలోచనల మీద మాత్రమే.
కుమార్ గారు,
అయితే నాకూ మీ చేతిలో అక్షింతలు తప్పవు. ఇప్పుడే దాదాపు ఇదే అభిప్రాయాల్తో ఒక పొస్ట్ పెట్టి వస్తున్నా! కలిసి తిరిగితే తప్పు లేదు. సరే!మరి కొన్నాళ్ళు ఒకరితో, బహుమతులు అందగానే అతడిని అవాయిడ్ చేసి, మరొకరితో! ఇదేమి పని? ఇవాళ్తి పరిస్థిల్లో మగపిల్లల మానసిన ప్రవృత్తి ఎన్ని పెడదారులు తొక్కుతుందో, ఎంత హింసాత్మక చర్యలకు దిగుతున్నారో చూస్తూ కూడా 'ఈజీ మనీ" కోసం అర్రులు చాచడం ఆడపిల్లలకు తగినపనేనా? శ్రీనివాస్ తల్లి దండ్రులు అతడిని సరిగా పెంచలేదని ఆరోపణలు చేయడం సరే..మరి 'నువ్వు అతడి నుంచి బహుమతులు ఎందుకు తీసుకున్నావు" అని కూతుర్ని ఎందుకు నిలదీయలేదు స్వప్నిక తండ్రి. బహుమతులు తీసుకోవడం సరైనదని అతడు భావిస్తే కేవలం శ్రీనివాస్కి ఎందుకు వార్నింగ్ ఇచ్చాడు? (కూతురు జోలికి వస్తే ఊరుకోనని) స్వప్నిక కు ఇలా జరిగినందుకు బాధగానే ఉంది. బహుమతులతో అమ్మాయిలను పడేయాలని చూసే పురుష పుంగవులు "ఊరికే", ఏమీ ఆశించకుండా డబ్బు ఖర్చు చేస్తారనుకోవడం మూర్ఖత్వం కాదా?
కలిసి తిరగడం తప్పా కాదా ..అనే విషయాన్ని చర్చించి లాభం లేదు. తిరగటానికి "రైట్ పర్సన్" ని ఎంచుకోవాలని గ్రహించాలి! ప్రాక్టికల్ గా ఆలోచించగలగాలి!
కుమార్ గారు సుజాత గారు, సిరి సిరి మువ్వగారు అన్నదానిలో తప్పేం లేదు.సమాన హక్కులు అన్యాయాలు పక్కన పెడితే ఆడపిల్లలు కూడా తక్కువ గా ఏమీ ఉండటం లేదు.ముక్కు మొహం తెలియని వాడు ఇచ్చినపుడు బాగానే అన్నీ తీసుకుని అతన్ని రెచ్చగొట్టడానికి ఒక కారణం తనే అయింది .నాకయితే ఆ అమ్మయిని చూస్తే అలా తీసుకూనే అమ్మాయి లా అనిపించలేదు కాని.. నిజా నిజాలు ఎమైనప్పటికిని అతను యాసిడ్ పోయడం అనేది అమానుషం .. పిల్లల మీదా ఎన్నో ఆశలు పెట్టుకుని వాళ్ళకోసం తమ ఆరోగ్యాలు కూడ లెక్క చేయకుండా రాత్రి పగళ్ళు పని చేసి ,వారు కోరిందల్లా చేతికి ఇచ్చే తల్లిదండ్రులు తమ పిల్లలను సరి అయిన వాతావరణం లో పెంచుతున్నామా లేదా అనేది ఆలోచించుకోవాలి ఆడ అయినా మగ అయినా పిల్లలండి వాళ్ళు.. చనిపోయిన తన బిడ్డ ను నలుగురూ బాగా చనిపోయాడు అని తిడుతుంటే ఆ తల్లిదండ్రుల పరిస్తితి నరకం..అలాంటి బాధ యే తల్లిథండ్రులకు రాకూడదు..యువత కూడ మితిమీరిన స్వేచ్చ మంచిదికాదని తెలుసుకోవాలి సిరి సిరి మువ్వ గారన్నట్లు కాలేజ్ లో వీరికి ప్రత్యెకమైన పాఠ్యాంసాలు ఉంటే బాగుంటుంది..యువత బలహీనతలను పెట్టుబడిగా పెట్టి ప్రేమల పేరుతో సినిమాలు, అవసరం ఉన్నా లేకపోయినా అర్ధనగ్న ద్రుశ్యాల పాటలు ఉన్న వాటిని ప్రభుత్వం సెన్సారు చేయాలి.కాలేజీలకు వచ్చెది చదవడం కోసం కాని అడ్డ మైన ఆకర్షలను ప్రేమలుగా బావించడానికి కాదు అనే విషయాన్ని పిల్లలకు తల్లితండ్రులు మెల్లిగా నచ్చ చెప్పుకోవాలి .
కుమార్ గారు,
మీరొక్క విషయాన్ని గమనించండి, ఎవరు ఎన్ని చెప్పినా, ఎన్ని అన్నా, ఆ ముగ్గురు చేసిన నేరాన్ని సమర్ధించే పిచ్చి పని ఎవరూ చేయరు. ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య యొక్క మూల కారణాలు కూడా పరిగణలోకి తీసుకోవాలన్న ఆలోచన తప్ప, నేరాన్ని సమర్ధించాలన్న ఆలోచన రాదు, ప్రత్యేకించి ఇలాంటి విషయాలలొ. మీరన్నట్లు, ఆ అమ్మాయికి తన జీవిటాన్ని నిర్ణయించుకునే హక్కు వుంది. కాకపోతే నేరం జరిగేటప్పుడు హక్కుల గురించి మాట్లాడడం కన్నా, జరగకుండా వుండడానికి తీసుకోవాల్సిన చర్యల గురించి మాట్లాడడం ఉత్తమం. ఎందుకంటే, నేరం చేసేవాడు హక్కుల గురించి అలోచించే ఇంగిత ఙ్ఞానాన్ని కొల్పోయే ఆపని చేస్తాడు. ఒకవేల అలా ఆలోచించగలిగితే ఆపని అతను చేయడు.
అలాంటప్పుడు, నేరం జరగకుండా ఆపే మార్గం ఏది? ఏది తప్పో ఏది ఒప్పో చెప్పడమా, లేక నేరం జరిగేందుకు అవకాశం కలగకుండా చూసుకోవడమా? ఖచ్చితంగా రెండవదే ఉత్తమమని నాకనిపిస్తోంది. తప్పుచేసేది మగవాడైతే ఆంక్షలు ఆడవాల్లకెందుకని కొంతమంది అడుగుతున్నారు, మీ వ్యాఖ్యలో కూడా ఆ కోణం వుందనిపిస్తోంది. కానీ పైన వున్న టపాలో, ఆంక్షలు ఆడా మగా ఇద్దరికీ విధించమనే చెప్పారు. ప్రస్తుతం ఆ ముగ్గురు, ఆ అమ్మాయిల మీద ఆసిడ్ పోసి ఘోరమైన తప్పు చేసారు కాబట్టి మీ వ్యాక్య ప్రస్తుతానికి సబబుగానే వుంది. కానీ, వారు ఆపని చేయక పూర్వం పరిస్థితి ఏమిటి? నిజంగానే అతను ఆ అమ్మాయికి డబ్బు ఇచ్చివుంటే (ఇచ్చింది నిజమని నేను చెప్పడం లేదు, ఒకవేల ఐతే అని మాత్రమే అంటున్నాను) అన్నిరోజులు ఆ అమ్మాయితో తిరిగి, ఆ అమ్మాయి కోసం అన్ని పాట్లు పడిన అబ్బాయిని బాదపెట్టడం తప్పు కదా (ఒకవేల అమ్మాయిలు ముందునుండి ఒప్పుకోకపోతే అది వేరే విషయం). అలా చేయడం మంచిదేనా? (గమనిక: ప్రస్తుతం ఈ అమ్మాయిలు అలా చేసారని నేను చెప్పడం లేదు.) It is a generalization of whole topic. ఇలా ప్రవర్తించే అమ్మాయిలు లేకపోలేదు.
ఐనా సరే, అలా అమ్మాయిలు ప్రవర్తించినా సరే, ఆసిడ్ పోయడం తప్పే. కానీ నేను ఇదివరకే చెప్పాను, నేరాలు చేసేటప్పుడు నేరస్తులు తప్పొప్పుల గురించి ఆలోచించరు. ఆసిడ్ పోసిన తరువాత అది అన్యాయమని తేలితే ఆ అమ్మాయికి తిరిగి యదారూపు వచ్చేట్టుంటే, ఏది తప్పు ఏది ఒప్పు అన్నది ఆలోచించడం వలన లాభం వుంటుంది. లేకపోతే, అది జరగకుండా ఆపడమెలా అన్నది ఆలొచిస్తేనే మంచిది, కాదంటారా? ఇక నేరం జరిగిన తరువాతంటారా, ఇప్పుడు వారిని నక్షలైట్లను, తీవ్రవాదులను కాల్చినట్లు కాల్చినా వారింట్లొ వాల్లు తప్ప మరెవ్వరూ బాదపడట్లేదు. కానీ, ఆ అమ్మాయిల పరిస్థితి బాగుపడలేదు.
రచయిత గారికి, మీ బ్లాగులో కామెంట్లు ఓపెన్ ఐ.డి తో కూడా రాయగలిగే సౌలభ్యం కల్పించండి.
hello....chmpadam thappu ..
kakapothe
rendu chethulu oka kalu narikesi jeevithantham badhapadela chesthe badundu.....
ee pani police lu cheyyakoodadu..anni kesullo lagane kesu petti tharuvatha bail theesukuni vidipinchali tharuvatha kidnap chesi ee pani cheyyali ....kaani champakoodadu...
idhi prajasamya desam...jai hind
కుమార్ గారు, మీ వ్యాఖ్య నేను వ్యక్తిగతంగా ఏం తీసుకోలేదు. మీ అభిప్రాయం మీరు చెప్పారు and I always welcome thoughtful comments.
"ఇద్దరు వ్యక్తులు కలసి తిరిగితే యేంటి, అందులో ఒకరు బాగా ఖర్చు పెడితే యేంటి? ఇష్టమో కాదో, మనుషుల బేసిక్ లిబర్టీ అది, ఒక రిలేషన్షిప్ లోకి ఎంటర్ అవ్వడం, దాంట్లొంచి బయటకు రావడం అనేది ఆ అమ్మాయికి మాత్రమే సంబధించిన పూర్తి వ్యక్తిగత విషయం"
మీరన్నది నిజమే కానీ అది ఎప్పుడు?-మానసికంగా పరిణితి పొందిన ఇద్దరు వ్యక్తుల మధ్యే అది సాధ్యమవుతుంది. ఇక్కడ వీళ్లు చేస్తుంది అవసరానికి చేసే స్నేహాలు, ప్రేమ ముసుగులోని వ్యామోహాలు. ఇంకొకళ్లెవరో ఇతనికంటే బాగా ఖర్చు పెట్టేవాళ్లు పరిచయం అయితే ముందటి స్నేహాన్ని (ప్రేమో, స్నేహమో ఏదొ ఒకటి లేండి) వదులుకోవటానికి ఏమాత్రం వెనుకాడరు. ఇది పద్దతేనంటారా? ఇది స్నేహమేనంటారా? ఇక్కడ అబ్బాయిలది తప్పు లేదని నేనను, తప్పే కాదు పాశవికం, అమానుషం, ఆటవికం కూడా. ఎవరికైనా గుండెలు మండించేదే. సరైన శిక్ష పడాల్సిందే. కానీ ఇలా ఎంతమందికి శిక్షలు పడుతున్నాయి, ఎంతమంది తప్పించుకు తిరుగుతున్నారు. మళ్లీ మళ్లీ ఇలాంటి సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయి?
ఇంకొక విషయం కూడా మనం ఇక్కడ గమనించాలి--అసలు అమ్మాయి తప్పేం లేకుండానే నువ్వంటే ఇష్టం లేదు, నిన్ను ప్రేమించను అన్న పాపానికే చంపే మగపుంగవులున్న మన సమాజంలో ఇలాంటివి జరగటం వింతేం కాదు. అసలు మారాల్సింది ఈ పరిస్థితే.
ఇక్కడ మారాల్సింది అబ్బాయిలు అమ్మాయిలు, పిల్లల తల్లిదండ్రులు అందరూ. ఒక అమ్మాయి తనని తిరస్కరిస్తే ఇక జీవితమే లేదనుకోవటం, ఆ అమ్మాయిని నాశనం చేయాలనుకోవడం--ఇలాంటి amateur భావాలనుండి అబ్బాయిలు బయట పడాలి. అలా బయటపడాలంతే వాళ్లకి సరైన దిశానిర్దేశనం ఉండాలి. ఇక మనం ఆలోచించాల్సింది తప్పు ఎవరిదన్నది కాకుండా ఇలాంటివి జరగకుండా ఏం చేయాలన్నది.
@సుజాత గారు, "తిరగటానికి "రైట్ పర్సన్" ని ఎంచుకోవాలని గ్రహించాలి! ప్రాక్టికల్ గా ఆలోచించగలగాలి!"--అవును నిజం చెప్పారు.
@నేస్తం, నిజమే సినిమాల ప్రభావం మన పిల్లల మీద చాల ఉంటుంది.
@శ్రీకాంత్ గారు, చక్కగా చెప్పారు. మీరడిగినట్లు ఓపెన్ ఐ.డి పెట్టాను.
సుజాత గారు, సిసిము గారు మీరు టపాలను చదివాక నిజం గా చాలా బాధ గా ఉంది. ప్రతి టపా లోను మీడియా విమర్శించే మీరేమి చెస్తున్నారు అలోచించండి. Just assisinating character of those girls. Have you saw those taking gifts from that guy. How do you agree a boy can spend while studying his engineering will spend Rs.25,000/-. @Sujatha gaaru I didnot understand why you are just throwing stones on those girls. If really those guys are good then the students of that college will react.
నిందితుడు ఆ అమ్మాయి మీద 25,000 రూపాయల వరకు ఖర్చు చేసాడట.... ఆ ప్లాట్ ఫాం గాడి దగ్గిర అంత డబ్బెక్కడిది?? ఏదో కట్టు కథలు చెప్పాడు. ఇక బహుమతులంటారా.. వాళ్ల దగ్గిర వీళ్ళూ తీసుకుంటున్నారు.. వీళ్ళ దగ్గిర వాళ్ళూ తీసుకుంటున్నారు. కర్చు కూడా అలానే చేస్తున్నారు. అంత మాత్రాన యాసిడ్ పోయ్యడమేనా??
"కాలేజిలలో ఇలాంటి వాటిపై చక్కటి సెమినార్లు, ఇతర కార్యక్రమాలు చేపట్టి పిల్లలలో అవగాహన, పరివర్తన తీసుకురావాలి. ప్రవర్తనా సమస్యలు ఉన్న పిల్లలకి వర్క్‌షాపులు పెట్టి వాళ్లలో మార్పు తిసుకురావటానికి ప్రయత్నించాలి అంతే కాని ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు రోడ్లెక్కి అరవటం కాదు మనకి కావల్సింది."
బాగా చెప్పారు సిరిసిరి మువ్వగారు, కానీ మన జనానికి(నాతో కలిపి) సంఘటన కి స్పందించడం మాత్రమే ఉగ్గుపాలతో నేర్పిన విద్య, నివారించడం గురించిన ఆలోచన కూడా రాదు. నాలుగు రోజులు అవగానే మళ్ళీ ఏవరి పనిలో వాళ్ళు మునిగిపోతారు.
శ్రావ్య గారు, సిరిసిరిమువ్వ గారైనా సుజాత గారైనా అమ్మాయిలని విమర్శించడం లేదండీ జరిగిన సంఘటన బాధాకరమైనదే కానీ నేరస్తులని కాల్చి చంపడం సరి కాదు. అమ్మాయిలు ఎటువంటి వారితో స్నేహం చేస్తున్నాం అనే విషయం లో జాగ్రత్త గా మెలగాలి మరియూ ఏ సంబంధం లేని ఓ వ్యక్తి మనకోసం ఖర్చుపెడుతున్నాడంటే దాని వెనుక ఉన్న hidden motives గుర్తించి జాగ్రత్త పడాలి. ఒక ఇంజినీరింగ్ విద్యార్ధి 25,000 ఖర్చుపెట్టగలగడం ఈ రోజులలో పెద్ద అసాధ్యమైన విషయమేం కాదు, అదంతా ఒకే రోజు ఇచ్చినది కాకపోవచ్చు కదా. అలా అని అతను యాసిడ్ పోయడాన్నీ సమర్ధించడం లేదు, అలాగే పేపర్ లో వచ్చిన కధనం ప్రకారం ఈ కేసులో ఇద్దరి పాత్ర ఉన్న విషయాన్ని విస్మరించవద్దు, ఇటువంటివి జరగకుండా నివారణ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఆలోచించాలి.
శ్రావ్య గారు, ఆ అమ్మాయిని ఏదో అనేసాం అని మీరు బాధపడి పోతున్నారు, మీ బాధ అర్థం అయింది, కాని అలాంటి వాళ్లు లేరంటారా? ఇక్కడ్ అకూడా ఆ అమ్మాయిది ఎంతోకొంత తప్పు ఉండే ఉంటుంది అని నాకనిపిస్తుంది. అసలు మనం ఇక్కడ చూడాల్సింది ఇప్పుడు తప్పొప్పులు ఎవరివి అన్నది కాదు--ఇలాంటివి జరగకుండా ఏం చేయాలన్నది. ఆ అబ్బాయి కాని ఆ అమ్మాయి కాని అలా తయారు కావడానికి ఎవరు కారణం, దీని గురించి ఎవరూ అలోచించటం లేదెందుకని?
క్రిష్ణారావు గారు, అదే ఆ బహుమతులు ఇచ్చిపుచ్చుకోవటంలోనే వస్తుంది అసలు సమస్య.
అంత మాత్రాన యాసిడ్ పొయ్యడమేనా??--ఎంతమాత్రం కాదు కాని దానికి ఎన్‌కౌంటరు మాత్రం సరైన శిక్ష కాదు.
వేణూ శ్రీకాంత్, "సంఘటన కి స్పందించడం మాత్రమే ఉగ్గుపాలతో నేర్పిన విద్య, నివారించడం గురించిన ఆలోచన కూడా రాదు. నాలుగు రోజులు అవగానే మళ్ళీ ఏవరి పనిలో వాళ్ళు మునిగిపోతారు"--నిజంగా ఆదే మనం చేస్తుంది. మొన్న ముంబయి పేలుళ్లకి స్పందించాం, ఇవాళ వరంగల్ ఘటనకి స్పందించాం, రేపు ఇంకో ఘటనకి స్పందిస్తాం, ఇలా స్పందించీ స్పందించీ స్పందించాటానికే అలవాటు పడిపోతాం.
బాగా చెప్పారు.
ఈ ఎన్‌కౌంటర్ల సంగతి తెలియగానే ఒకమ్మాయి స్పందన - "డబ్బులూ గిఫ్టులూ కాలేజీల్లో మామూలే కదా, పాపం వీడెవడో కొంచెం సీరియస్‌గా తీసుకున్నట్టున్నాడు" - అదండీ సంగతి! :-)
ఇక కొంతమందికి 25వేల సంగతి వినడానికి కూడా ఇష్టమున్నట్టు లేదు. అది జగరడానికి గల అవకాశాలూ, అందులోని సాధ్యాసాధ్యాలు, నమ్మడం నమ్మకపోవడం ఆ తరువాతి సంగతులు. :-)
"చట్టం తనపని తాను చేసుకుపోతుంది!" ఇది భలే కామెడీ డయలాగ్. యాసిడ్‌దాడి జరగక ముందు అది వేరే ఎవరి పనో చేసుకుంటూ వుండేదేమో!
సిసిము గారు,
మీ ఆలోచనలతో ఏకీభవిస్తున్నాను. ఆ అమ్మాయిల మీద జరిగింది క్షమించరాని నేరం. అయితే ఆ నేరానికి ఇలాంటి బూటకపు ఎన్`కౌంటర్లయితే సమాధానం కాదు.ఇక తప్పులన్నిటికీ ఇదే న్యాయాన్ని వర్తింపజేస్తే సరిపోతుంది, భూభారాన్ని కాస్త తగ్గించినవాళ్లవుతాం. అప్పుడు కోర్టులు, న్యాయస్థానాలు ఇవన్నీ అవసరం లేదుగా.
శ్రావ్య గారు, ఆ అమ్మాయిని ఏదో అనేసాం అని మీరు బాధపడి పోతున్నారు, >> ఇదే వంగ్యమయన సమాధానాన్ని నేను expect chese comment రాశాను :( I don't mind.
శ్రావ్య గారు,
అమ్మాయిల మీద రాళ్ళు విసరడం, వారి శీలాల్ని శంకించడం కాదండీ ఇక్కడ జరుగుతున్నది! being girls, you should be more careful అని నచ్చ చెప్పడమే! ప్రత్యేకించి ఏ అమ్మాయినీ వేలెత్తి చూపించడం నా ఉద్దేశం కానీ, వరూధిని గారి ఉద్దేశం కానీ కాదు. అతడంటే ఇష్టం లేనప్పుడు, అతడిచ్చిన బహుమతుల్ని ఎందుకు అంగీకరించాలి? అనే ప్రశ్నించాను గానీ ఎవరి మీదా రాళ్ళు వేయలేదు(రాళ్ళు వేయడమనే మాట ఆశ్చర్యకరంగా ఉంది) ఇహ వాడికి అంత డబ్బెక్కడిదీ అన్న ప్రశ్నకు వాళ్ల నాన్న సమాధానం చెప్పాలి. ధనవంతులైన వారు గారాల కొడుకు కోసం ఆ మాత్రం ఖర్చు చేయలేరూ?
ఒక సారి మీరు నా బ్లాగు లో టపా మీద వ్యక్తమైన వివిధ అభిప్రాయాల్ని కూడా చదివి చూడండి.
సిరిసిరిమువ్వ గారూ.. ఎంతమాత్రం కాదు కాని దానికి ఎన్‌కౌంటరు మాత్రం సరైన శిక్ష కాదు అని అన్నారు. నాకు కూడా తరువాత అనిపించింది.. ఎన్‌కౌంటరు మాత్రం సరైన శిక్ష కాదు అని .. ఆ ముగ్గిరి కళ్ళ మీద ఈ ఇద్దరి అమ్మయలతో యాసిడ్ పోయించల్సింది. అప్పుడు కాని ఆ కొడుకులు ఏదో ఒక మాంచి సెంటర్ లో కూర్చొని అడుక్కుంటుంటే ఈ అమ్మాయిలే వారికి బిక్షం వెయ్యడం. ఇదీ అసలైన శిక్ష అనిపించింది. ఎందుకనో పోలిసులు కొంచం హడావుడి పడ్డారు. శ్రీకాకుళం పోలీసులూ దామోదర్ గాడి విషయం లో హడావుడి పడొద్దు.
ఈ చట్టాలు, న్యాయ వ్యవస్థ, పరిపాలనా వ్యవస్థ - ఇవన్నీ అసలెందుకు? జంతువుల్లా - దాడి చెసిన, చేయబోయే జంతువునల్లా - కరవటమో, కాటేయటమో, రక్కటమో, చంపటమో చేస్తూ పోతే సరిపోలా... ఇదే అసలైన పరిణామక్రమం - అని సరిపెట్టుకుంటే సరిపోలా... ???
if it is not a punishable crime if some one burns down a two wheeler - why is it a crime that the same person does an acid attack??
How can the police openly say that it is an encounter just to save their own lifes??
- Why should the police take the culprits to a remote place in the middle of a night?
- Why are the culprits not cuffed??
- How can three young adults revert on armed police causing a life threatening situation for the police?
- Is it only the option that the police have to kill the three to save their lifes?
And why should police engage in accepting the greetings from public? just a mistery - some one please solve!!!!
శ్రీనివాస్ కి ఆశలు కల్పించటం స్వప్నిక చేసిన తప్పా లేక పొరపాటా? తప్పే అనుకుందాం.
అది ముఖమ్మీద ఆసిడ్ పోయాల్సినంత పెద్ద తప్పా? కాదు.
శ్రీనివాస్ చేసింది నేరమా? అవును.
అది అతనితో పాటు మరో ఇద్దరి ప్రాణాలు తీయాల్సినంత పెద్ద నేరమా? కాదు.
సద్దాం హుస్సేన్‌ని సైతం అమెరికా కాల్చి చంపకుండా (కనీసం తూతూ మంత్రం) విచారణ జరిపి ఉరి తీసింది. శ్రీనివాస్ బృందం చేసింది ఆ మాత్రం విచారణకి నోచుకోనంత నేరమా?
చట్టాలపై నమ్మకం, గౌరవం చచ్చిపోయాయంటున్న జనాలు ఆ చట్టాలు అసలుకే లేకపోతే దేశం ఇంకెలా ఉంటుందో ఊహించలేని అమాయకులనుకోవాలి. కోర్టుల్లో పేరుకుపోయిన కేసులున్నాయి సరే. విచారణ జరిగి శిక్షలు పడ్డ కేసులూ ఉన్నాయి కదా. చట్టాలు సరిగా అమలవనప్పుడు వాటి కోసం ఉద్యమాలు నడపాలి గానీ ఆటవిక న్యాయం కోసం అర్రులు చాస్తే అది అంతిమంగా దారి తీసేది అనార్కీకో, అంతర్యుద్ధానికో. రాజకీయ వ్యవస్థపై అసహనం చూపించే ఈ ప్రజల్లో ఎందరు లోక్‌సత్తా లాంటి (ఉన్నంతలో) శుభ్రమైన రాజకీయాలు నడిపే వారికి మద్దతిస్తారు? బయటెంత యాగీ చేసినా వీళ్లలో ఎక్కువమంది వెళ్లి ఓట్లేసేది కుళ్లిపోయిన పార్టీలకే. కాబట్టి ఆ తాటాకు చప్పుళ్లని వాళ్లలో పేరుకుపోయిన అసహనంగా భ్రమించటం తప్పు, దాని వంకతో కోర్టులు చేయాల్సిన పని పోలీసులు సొంతగా చేసేయటం నేరం.
మన పోలీసులు ఇప్పటికే చట్టాన్ని ఇష్టమొచ్చినట్లు దుర్వినియోగ పరుస్తున్నారు. మొన్నటిదాకా ఎన్ కౌంటర్లు నక్సలైట్లకో, బందిపోట్లకో పరిమితమయ్యాయి. ఇప్పుడు సాధారణ నేరగాళ్లకీ అదే న్యాయం అమలవుతుంటే ప్రజలు, మీడియా వ్యతిరేకించాల్సింది పోయి చప్పట్లు చరిచి మరీ అభినందిస్తున్నారు. ఈ ప్రోత్సాహంతో పోలీసులు రెచ్చిపోయి అందరికీ ఇదే న్యాయం అమలు చేయాలనుకుంటే? స్టార్‌వార్స్ సినిమాలో అమిడాల పాద్మె డైలాగు గుర్తొస్తుంది నాకు: 'So this is how liberty dies .. with thunderous applause'. What a pity!
@రానారె, అవును మనకు ఇప్పుడు అన్నీ మామూలే అయిపోయాయి, ఎన్‌కౌంటరులతో సహా!
@ఇస్మాయిలు గారు, మన దేశంలో న్యాయం, చట్టం ఇలాంటి వాటికి ఓ ప్రామాణికత ఏం లేకుండా అయిపోయింది. పోలీసులు, నాయకులు ఏం చేస్తే అదే చట్టం, అదే న్యాయం.
@శ్రావ్య గారు, నా సమాధానంలో మీకు వ్యంగ్యం ధ్వనిస్తే క్షమించండి. అన్నట్లు మీరు చదువరి గారి బ్లాగులో వ్రాసిన వ్యాఖ్య చూసాను, ఇక్కడ ఎవరి అభిప్రాయాలు వారివేనండి:))
@ఆనంద్ గారు, ఇలాంటి ప్రశ్నలు మనం అడగకూడదు, అడిగినా సమాధానాలు ఉండవు. చట్టం దాని పని అది చేసుకుంటూ పోతుంది, అంతే.
@అబ్రకదబ్ర గారు, "'So this is how liberty dies .. with thunderous applause'. What a pity!". అవును.
ఇంతకీ అ ఎన్‌కౌంటరుతో జనాలలో భయం మొదలయిందా? ఇలాంటి నేరాలు ఆగుతాయా?..ఎంతమాత్రం ఆగవు అని ఇవాళ కూడా అమ్మాయి తనని ప్రేమించకపోతే చంపుతానని బెదిరించిన ఓ అబ్బాయి గురించిన వార్త ఋజువు చేస్తుంది.
Post a Comment