పరుగాపక పయనించవె తలపుల నావ.... కెరటాలకు తలవంచితె తరగదు త్రోవ

January 27, 2010

అసలు ఆత్మ లేని ఫిర్ మిలే సుర్ మేరా తుమ్హారా!

 మిలే సుర్ మేరా తుమ్హారా ..........తలుచుకోగానే  గుండెలు ఉప్పొంగే గీతం!

రెండు దశాబ్దాల క్రితం 1988 ఆగస్టు 15 న దూరదర్శన్‌లో  వచ్చిన మిలే సుర్ మేరా తుమ్హారా..ఈ గీతం వినని భారతీయుడు.......పరవశించని భారతీయుడు ఉండి ఉండడు.  దేశం మొత్తాన్ని ప్రాంతాలకతీతంగా ఓ ఊపు ఊపిన గీతం.  అప్పట్లో ఆ గీతం వచ్చిన 6 నిమిషాలు అలా కళ్ళప్పగించి చూసేదాన్ని.  భీంసేన్ జోషి స్వరంతో మొదలయ్యి..అలా అలా గాలిలో తేలిపోయి ..చివరిగా పిల్లలు జాతీయ జండా ఆకారంలో నిలబడటంతో పాట అయిపోతుంది...అప్పుడే అయిపోయిందా అన్న ఓ అసంతృప్తితో కిందకి దిగివచ్చేదాన్ని.

దశాబ్దాలు గడిచినా ఇప్పటికీ ఎప్పటికీ బారతీయుల గుండెల్లో చిరంజీవి ఆ గీతం!  ప్రసిద్ధ సినీ వ్యక్తులు, క్రీడారంగ ప్రముఖులు, నాట్య ప్రముఖులు, సంగీత ప్రముఖులే కాదు..సామాన్య మానవులకు కూడా పెద్ద పీట వేసి తీసిన గీతం అది.  పీయూష్ పాండే వ్రాసిన ఈ గీతం గురించి ఎంత చెప్పినా తక్కువే!  నాకు ఆ పాటలో ఓ కుర్రవాడు ఏనుగు మీద ఎక్కి లయబద్ధంగా ఊగుతూ పాడే బిట్టు చాలా చాలా ఇష్టం. 14 భాషలల్లో భారతదేశం ఆ మూల నుండి ఈ మూల దాకా ప్రాంతీయత ఉట్టిపడేట్టు చక్కని ప్రదేశాలల్లో తీసిన గీతం అది. 

అందులో తెలుగులో వచ్చే వ్యాక్యాలు
"నా స్వరమూ నీ స్వరమూ సంగమమై
 మన స్వరంగా అవతరించే"

ఈ తెలుగు వాక్యాలకు అప్పటి గీతంలో నటించింది పేరున్న వ్యక్తులు కాదు..కానీ చాలా సహజంగా అందంగా ఉంటారు ఆ జంట!

ఇప్పుడు మరలా గణతంత్ర వజ్రోత్సవ వేడుకల సందర్భంగా ఆ గీతాన్ని చేతికొచ్చినట్లు మార్చి వ్రాసి....నోటికొచ్చినట్టు పాడి..దాన్ని ఏ కీలుకా కీలు విరిచేసారు. సినీప్రముఖులతో, జులపాల జుట్టులతో.... ర్యాప్, పాప్‌లతో నింపేసారు..వ్యాక్యాలని ముక్కలుముక్కలుగా విరిచి ఆ పాటని ఎన్ని హింసలు చిత్రవధలు పెట్టొచ్చో అన్నీ పెట్టేసారు. చిత్రీకరణలో నాకెక్కడా సహజత్వం కనిపించలేదు.  దీపికా పడుకొనే వేసుకున్న గౌను చూస్తే.......పాత దాంట్లో వాళ్ల నాన్న ప్రకాష్ పడుకొనే గుర్తొచ్చి తలవంచుకున్నా! లత మువ్వొన్నెల కొంగు ఉన్న చీర భుజాల చుట్టూ కప్పుకుని ఎంత హుందాగా పాడింది!  అలాంటి లతకి దీనిలో చోటు లేదు.  ఉందల్లా చొక్కా విప్పి కండలు చూపించే  సల్మాన్ ఖానుకు, షారుక్, అమీర్, బచ్చన్ కుటుంబ సభ్యులకు.....

ఆరంభం రెహమానుతో బాగానే ఉన్నా ఉన్నకొద్దీ అసహజత్వ పాళ్ళు ఎక్కువయి పోయాయి. అమితాబ్ మాటలు అస్సలు నప్పలేదు.  కొత్తదాంట్లో తెలుగు వ్యాక్యాలను మహేష్ బాబు మీద చిత్రీకరించారు..ఇంకో రెండు లైనులు కూడా కలిపారు..ఏం కలిపినా పాత దాని చార్మ్ దీనిలో లేదు.  దక్షిణాది నుండి మహేషు బాబు, విక్రం, మమ్ముట్టి, శోభన, జేసుదాస్, సూర్యలకి స్థానం కల్పించారు.  మొత్తం మీద వీళ్ల దృష్టిలో మన దేశంలో ప్రముఖ వ్యక్తులంటే సినీ నటులే అన్నట్టుగా ఉంది.  మిగతా రంగాలల్లో ప్రముఖులు పెద్దగా వీళ్ల కళ్లకి ఆనినట్లు లేరు.  ఓ కలాం, ఓ టాటా, ఓ లత, ఆశా, విప్రో ప్రేంజీ, నారాయణమూర్తి, మన బాలసుబ్రమణ్యం....ఇలాంటి వారు ఎవ్వరూ లేరు. 

ఒకందుకు మాత్రం నాకు చాలా సంతోషంగా ఉంది..ఈ రకంగా అన్నా పాత దాన్ని మరలా మనకు స్ఫురణకి తెచ్చి దాని గొప్పతనాన్ని మరోమారు మన కళ్లముందు నిలిపారు.

18 వ్యాఖ్యలు:

bharath January 27, 2010 at 10:37 PM  

ఔనండి పాత వెర్షన్ చూసినప్పుడు కలిగే తృప్తే వేరు

గీతాచార్య January 27, 2010 at 11:04 PM  

What about Aiswarya Rai. A scar on the face of a beauty. అంతా కృత్రిమంగా ఉంది.

మహేష్? హహహ LOL

పరిమళం January 28, 2010 at 1:01 AM  

కొత్త బంగారు లోకం వారికే కదా సొంతం అందుకే మరి అలా :) :)

antaryagam January 28, 2010 at 3:27 AM  

అన్ని సందర్భాలలొనూ పాత రోత కానక్కర లేదు.ఇప్పుడు కొత్తే రోత అని అప్పుడప్పుడు అనిపిస్తోంది అంటే కొందరు హర్షించరేమో.

మార్పు ఆహ్వానించదగినదే.

కానీ ఎంతో ఆదరం పొందిన పాత పాటలని, రీమిక్స్ చేసి పాడటం మొదలు పెట్టినప్ప్పుడు, లత ఆ పాటలు పాడాలని ఉత్సుకత చూపినప్పుడు, వారిని ప్రోత్సహించినప్పుడు, (ఒక పదిహేను- ఇరవై సంవత్సరాల క్రిందట అని గుర్తు) నిజమైన కళా హ్రుదయాలు, ఈ పనికి చాల బాధ పడతాయి, మాధుర్యం మీద అంత కోరిక ఉంటే అలాంటి సంగీతాన్ని స్రుష్టించ వచ్చు, కానీ ఎంతో స్రమ కోర్చి ఆ బాణీలని కూర్చిన వారి ఆత్మలు (అవి మరణించిన వారివి అయితే) ఘోషిస్తాయి. ఆ పని చేసే హక్కు వీరికి ఎవరు ఇచారు, లతా మంగేష్కర్ లాంటి సీనియర్ కళాకారులు ఇల చెయ్యటం తగునా అని పత్రికా ముఖం గా ప్రశ్నించారు.
(నెను అప్పుడు ఆంధ్ర ప్రభ వీక్లీ లొ చదివాను).

మీరు వ్యక్త పరిచిన అభిప్రాయం చదివినప్పుడు, నాకు అది గుర్తుకు వచ్చి ప్రస్తావిస్తున్నాను.

సుజాత వేల్పూరి January 28, 2010 at 9:03 AM  

ఆ పాట చూసినపుడు మనసంతా ఆర్దృంగా అయిపోయి ఒక గొప్ప ఫీలింగ్ కలిగేది. దేశభక్తి అంటే అదేనేమో!

అసలు కొన్ని పాటలు రీ మిక్స్ లు చేయకూండా ఏదైనా చేయాలండీ!
ఈ కొత్త పాట లో చాలామంది దీపిక డ్రెస్ చూసి మీరు చేసిన పనే చేశారు.:-)

కాకపోతే చిన్న గీత వీళ్ళు ఇప్పుడు గీశారు కాబట్టి పెద్ద గీత ఔన్నత్యం అందరికీ తెలుస్తుంది.

దూరదర్శన్ చూసేవారికి మాత్రం ఇప్పటికీ పాత పాట దర్శనం ఇస్తూనే ఉంటుంది.

మేధ January 28, 2010 at 9:10 AM  

>>ఒకందుకు మాత్రం నాకు చాలా సంతోషంగా ఉంది..ఈ రకంగా అన్నా పాత దాన్ని మరలా మనకు స్ఫురణకి తెచ్చి దాని గొప్పతనాన్ని మరోమారు మన కళ్లముందు నిలిపారు.
నిజం!! నేను కూడా క్రొత్త పాట విని ఆ చిరాకు నుండి బయటపడడానికి, పాత పాటని డౌన్లోడ్ చేసుకుని విన్నా... పాత దానితో కనీసం 1% కూడా పోటీ పడలేదు... కేవలం భారతదేశం అంటే బాలీవుడ్, మిగిలిన క్రొద్దిమంది సినిమా నటులు తప్ప ఎవరూ కాదనుకుంటా..!!!

సిరిసిరిమువ్వ January 28, 2010 at 10:18 AM  

@భరత్ గారు, శివ గారు మీ స్పందనకి ధన్యవాదాలు.
@గీతాచార్య :) "A scar on the face of a beauty"...same feeling ఇక్కడ కూడా..హమ్మయ్య ఇన్నాళ్లకి నాలాంటి అభిప్రాయం కలిగిన మరొకరు తోడు దొరికారు. బచ్చన్ కుటుంబసభ్యులని వ్రాసాను కదా ఇక అంతకన్న ఎక్కువ ఆవిడ గురించి వ్రాయాలనిపించల!
@పరిమళం గారు, అలా అంటారా! ఆ కొత్త బంగారులోకం ఆహ్లాదంగా ఉండాలి..పాత దానికన్నా ఉన్నతంగా ఉండాలి కాని ఇలా దిగజారిస్తే అది బంగారు లోకం అవదు కదా..అది నా బాధ!
@అంతర్యాగం గారు, మీరు చెప్పింది కూడా ఆలోచించవలసిందే. సుజాత గారన్నట్లు అసలు ఈ రీమిక్సులు రాకుండా ఏదన్నా చెయ్యాలేమో!
@సుజాత గారు, ఆవేదనని పంచుకున్నందుకు ధన్యవాదాలు. మీరు చెప్పినట్లు రీమిక్సులు రాకుండా ఏదన్నా చెయ్యాలేమో!
@మేధ, నిజం కొత్తదాన్ని చూసి ఏవగింపు కలిగి మళ్లీ మళ్లీ పాత దానిని చూసినవాళ్లు ఎందరో!

Anonymous,  January 28, 2010 at 11:20 AM  

సాక్షి టి.వి స్పెషల్ అంటూ ఈ పాట మొదలవగానే చక్కగా ఎలర్ట్ అయిపోయి నేనూ కోరస్లో మొదలుపెట్టేసాను. ముక్కలు చెక్కలయిపోయిన ఈ పాటకీ పాతపాటకీ ఎక్కడా పొంతన కుదర్లేదు. నాకయితే ఏడుపొచ్చింది నో...నేనొప్పుకోను అని గీపెట్టాను
పాత పాటలో ఏ రాష్ట్రం వాళ్ళు ఆ రాష్ట్ర సాంప్రదాయ వస్త్రధారణలో కనిపించారు చాలావరకూ . దీపిక గౌను , సలమాన్ కండలు, అమీర్ ప్రయోగం ( ఖండాలా పాట) చిరాకుతెప్పించాయి . ఒక్క ముక్కలో చెప్పాలంటే ఆత్మలేదు. న్యూ జెనరేషన్ ని అలరించాలనే ప్రయత్నం వాళ్ళకయినా నచ్చిందంటారా ! మీ పిల్లలేమన్నారు ?

సిరిసిరిమువ్వ January 28, 2010 at 11:41 AM  

@లలిత గారు, మా పిల్లలకి పాతదాన్ని ఈ సందర్భంగానె చూపించాం..వాళ్లకి పాతదే నచ్చింది. TV 9 వాడు అయితే కొత్తది చాలా అద్భుతం అన్నట్టు చెప్పుకొచ్చాడు..ఈడ్చి ఒక్కటి పీకాలనిపించింది.

Anonymous,  January 28, 2010 at 11:55 AM  

old is gold.naaku old version nachhindi

Ruth January 28, 2010 at 2:50 PM  

when i thought who should sing the telugu bit in this new version, the first name came to my mind is SP. but yes, there is no point in even discussing this now as the whole song is tooooooo fake ! I'm glad that SP didn't sing it.

pavan January 28, 2010 at 3:00 PM  

its ok. but need some worth...

వేణూశ్రీకాంత్ January 28, 2010 at 5:37 PM  

నేను ఇంకా కొత్త పాట చూడలేదు ఒకటి రెండు చోట్ల విని అయ్యో అంత మంచి పాటను మళ్ళీ చేశారంటే ఇంకెంత బాగా చేశారో చూడలేదే అని ఫీల్ అవుతున్నాను. అయితే చూడక్కరలేదనమాట. ఎంచక్కా పాత పాటనే కల్తీ లేకుండా మనసులో పదిల పరుచుకుంటాను.

రవి January 29, 2010 at 11:33 AM  

నేను టీవీ అంతగా చూడను. మొన్న ఏదో అలా తిప్పుతుంటే, ఈ పాట కనిపించింది. పాట చూసి, నాకూ తిప్పింది.

కేసీఆర్ ను పెట్టి ఉంటే ఇంకా రంజుగా ఉండేది. (మిలే సుర్ మేరా, తుమ్హారా తో సూర్ "న" బనే హమారా..)

sarath February 13, 2010 at 11:37 PM  

అవును నేనూ కొత్త పాటలో ఆ ఫీల్ ని మిస్ అయ్యాను.

Post a Comment

statcounter

  © Blogger template Coozie by Ourblogtemplates.com 2008

Back to TOP