పరుగాపక పయనించవె తలపుల నావ.... కెరటాలకు తలవంచితె తరగదు త్రోవ

February 1, 2008

ఏది వరకట్నం!!!!!

సర్వోత్తమ న్యాయస్థానం (సుప్రీం కోర్టు) వారి తాజా తీర్పు ప్రకారం ఇకపై ఆడపిల్లలకి పెళ్ళి అప్పుడు ఇచ్చేదే కట్నం, ఆ తరువాత పిల్లలు పుట్టినప్పుడు కాని, పండగ పబ్బాలప్పుడు కాని, వేరే సందర్భాలలో కాని ఇచ్చే కానుకలు (నగలు, నగదు ఏదైనా) ఏవైనా వరకట్నం క్రిందకి రావు. వాటి గురించి అత్తింటి వారు కోడలిని వేధించినా, హింసించినా, చివరికి చంపినా అది వరకట్న నిషేధ చట్టం క్రింద శిక్షార్హం కాదు.

పెళ్లైన 10, 20 సంవత్సరాల తరువాత కూడా వరకట్న దాహానికి బలవుతున్న వారి కథలు వింటూనే ఉన్నాము, ఇక అవన్నీ ఇప్పుడు వరకట్న వేధింపుల క్రిందకి రావు, మన ఆచారాలు, నియమాలు క్రిందకి వస్తాయి. అయితే గియితే వేరే ఇతర తక్కువ శిక్షార్హమైన నేరాల క్రిందకి వస్తాయి!!!!!

జై భోలో సర్వోత్తమ న్యాయస్థానానికి.....జై

5 వ్యాఖ్యలు:

రాధిక February 1, 2008 at 10:09 PM  

జై భోలో సర్వోత్తమ న్యాయస్థానానికి.....జై

రాధిక February 1, 2008 at 10:19 PM  

నిజానికి వేధింపులన్నీ పండుగలకు,పబ్బాలకు విలువయిన కానుకలు ఇవ్వలేదని,తాము చేసే వ్యాపారాలకు పెట్టుబడులు,తమ విలాస వంత మయిన జీవితానికి సదుపాయాలు కల్పించలేదని జరిగేవే. జై భోలో సర్వోత్తమ న్యాయస్థానానికి.....జై

రానారె February 1, 2008 at 10:42 PM  

వరకట్నవేధింపులుగా పరిగణించకున్నా, బలవంతపు వసూళ్లూ వేధింపులుగానైనా న్యాయస్థానం పరిగణించడం లేదా!?

జ్యోతి February 2, 2008 at 1:46 PM  

పెళ్ళిలో అడక్కుండా తర్వాత అడుక్కోండి. ఎవ్వరూ ఏమీ అనరు అని న్యాయస్థానం చెప్తుంది. భేష్. అసలు ఇలాంటివి పెట్టుకోకుండా.. రాఖీ సినిమాలోలా కాల్చి చంపేసింది మేలు అలాంటి వాళ్ళని. ఈ కోర్టులు ,. కేసులు ఎప్పటికి తేలేను.

Vinay Chakravarthi.Gogineni February 11, 2009 at 4:43 PM  

entandi baabu....nenu naku telisina vallao 5 members daaka chusaanu...they misused this act.......alanti varikosamemo...ila change chesi vundochhemo kada.......entandi anta easy ga champeste sari antaaru......try to change......meeku evarina kanipiste maarchataniki try cheyandi.....

Post a Comment

statcounter

  © Blogger template Coozie by Ourblogtemplates.com 2008

Back to TOP