పరుగాపక పయనించవె తలపుల నావ.... కెరటాలకు తలవంచితె తరగదు త్రోవ

June 15, 2007

ఆర్ట్ ఆఫ్ లివింగ్ కోర్స్--సుదర్శన క్రియ


ఆర్ట్ ఆఫ్ లివింగ్ పౌండేషన్ మరియు ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఫర్ హూమన్ వాల్యూస్ (జెనీవా) వ్యవస్థాపకుడు శ్రీ శ్రీ రవిశంకర్ అభివృద్దిపరచిన శ్వాసప్రక్రియ సుదర్శన క్రియ. ఇది ఓ అసమాన శ్వాసక్రియానైపుణ్యం. ఈ క్రియ వల్ల ఆనందం, నిర్విచారం, ప్రశాంత చిత్తం, శారీరక ఆరోగ్యం లభిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా 106 దేశాలలో రెండు కోట్లకి పైగా వ్యక్తులు ఈ ప్రక్రియ ద్వారా తమ జీవితాలలో నూతనోత్సాహంతో ఉన్నత పరిణామస్థాయిని సాధించారు. శ్వాసక్రియ లోని రహస్యం సాధన ద్వారానే తెలుస్తుంది.

సుదర్శన క్రియా ఫలితాలు:--

* ఒత్తిడిని పెంచే హార్మోనుల తగ్గుదల.
* రక్తంలో లాక్టేట్ స్థాయి తగ్గుదల.
* చెడు కొలస్త్రాల్ (L.D.L) తగ్గుదల, మంచి కొలెస్ట్రాల్ (H.D.L) పెరుగుదల.
* యాంటీ ఆక్సిడెంట్ ఎంజైము స్థాయి పెరుగుదల.
* రోగ నిరోధక శక్తి బలపడుట.
* మానసిక బలహీనత, ఒత్తిడుల నుంచి విముక్తి.

ఆర్ట్ ఆఫ్ లివింగ్ గురించి జూన్ 10, ఈనాడు ఆదివారం పుస్తకం లో వచ్చిన వ్యాసం ఒక్కసారి ఇక్కడ చూడండి.

2 వ్యాఖ్యలు:

కొత్త పాళీ April 1, 2008 at 8:07 AM  

సిసిము గారూ , ఈ టపా చూసినప్పణ్ణించీ అడుగుదామని మరిచి పోతున్నాను. మీరు ఈ కోర్సులో పాల్గొన్నారా? క్రియ నేర్చుకున్నారా? సాధన చేశారా? మీ వ్యక్తిగత అనుభవాలు, అనుభూతులు పంచుకోగలరు. నేను కూడా ఇటువంటి విషయమై త్వరలో రాద్దామనుకుంటున్నాను.

సిరిసిరిమువ్వ April 1, 2008 at 11:44 AM  

కొత్తపాళీ గారూ, నేను కోర్సులో పాల్గొన్నాను, క్రియ నేర్చుకున్నాను, సాధన చేస్తున్నాను. ఇక అనుభవాలు, అనుభూతులు అంటారా అవి ఎవరికి వారికి వ్యక్తిగతం కదా!! అందరితో పంచుకోవటానికి కాస్త టైము పడుతుంది. మీ టపా కోసం ఎదురు చూస్తుంటాను.

Post a Comment

statcounter

  © Blogger template Coozie by Ourblogtemplates.com 2008

Back to TOP