ఆదివారం ఆడవాళ్ళకు సెలవు
ఇంతకు ముందు ఆదివారం వస్తే మా వారు వంట పనిలో ఎంచక్కగా సాయం చేసేవాళ్ళు, ఇప్పుడు ఈ వికీపిడీయాలు,బ్లాగులు వచ్చాక ఆదివారం కూడా లేవగానే కంప్యూటర్ ముందు సెటిల్ అయిపోతున్నారు. ఇక లాభం లేదని నిన్న ఆదివారం నాకు నేనే సెలవు ప్రకటించేసుకున్నాను. (ఈ మధ్య ఆదివారము ఆడవాళ్ళకు సెలవు అని ఒక సినిమా వచ్చిందిలేండి, ఆ స్ఫూర్తితో) . శుభ్రంగా పొద్దున్నే లేచి పేపరు చదువుకుంటూ కూర్చున్నా (ఏం మగవాళ్ళకేనా పొద్దున్నే పేపరు చదువుకునే హక్కు అనుకుంటూ). ఈయన లేచివచ్చి ఈ రోజేంటి టిఫిన్ అనగానే మీ ఇష్టం మీరు ఏం చేస్తే అదే అన్నా, ఆయనికి అర్థం అయిపొయింది ఇక ఈ రోజుకి వంటింటి డ్యూటీ తనదేనని. నేను మాత్రం చక్కగా పేపరు చదివేసి, తలకి హెన్నా పెట్టుకుని స్నానం చేసి వచ్చా. వచ్చేటప్పటికి పిల్లలు ఆయన కలిసి డైనింగ్ టేబుల్ అంతా నానా కంగాళీ చేసి ఏదో శ్రమ పడి బ్రెడ్ సాండ్విచ్ చేసేసారు (మరి అదే కదా తేలికైన టిఫిన్-అదే నేనైతే ఆదివారం స్పెషల్ అంటూ పూరి చేయించేవాళ్ళు).
సరే భోజనానికి ఏం చేస్తున్నారు అని అడిగా. అలోచిద్దాము అని అప్పటికి తప్పించుకుని వెళ్ళి మరలా కంప్యూటర్ మీద కూర్చున్నారు. నేను కూడ ఈనాడు ఆదివారం పుస్తకం పట్టుకుని మంచం ఎక్కా అహా ఏమి నా భాగ్యము అనుకుంటూ.
11 గంటలయ్యక అనుకుంటా మా పాప వెళ్ళి నాన్నా ఈ రోజు మనదే వంట పని అని గుర్తుచేసింది. లేదురా నాన్నా ఈ రోజు నాకు కంప్యూటర్ మీద చాలా పని వుంది (ఇంకేం పని, వికీ పని లేకపొతే బ్లాగుల పని) అందుకని బయటినుండి కూరలు తెచ్చేసుకుందాము,నువ్వు బియ్యం కడిగి పెట్టేయి అని ఒక అల్టిమేటం పడేసారు తనకి. లేచి వంట చేద్ద్దామా అనిపించింది ఒక నిమిషం,అమ్మో చేస్తే అసలకే లోకువవుతాము అని ఆ ప్రయత్నం విరమించా.
భోజనాల టైంకి వెళ్ళి కూరలు తెచ్చేసారు, అది కూడా నాలుగు రకాలు,(ఏం నువ్వు చేయకపొతే మాకేం అన్నట్లు ఒక చూపు విసిరి).
ఒక్క కూర కూడా నోట్లో పెట్టుకోను పనికి రాలా. మా వాడు అయితే పాపం వట్టి పెరుగన్నమే తిని సరిపెట్టుకున్నాడు. ఒకటేమో యమా కారం,ఒక దానిలో ఉప్పు లేదు,గుత్తొంకాయ అంట ఏదో పలచగా రసం లాంటి దానిలో నాలుగు వంకాయలు పడేసినట్లుంది. కొద్దిగా సాంబారే నయం అనిపించింది. పిల్లలిని చూస్తే అయ్యొ అనిపించింది. శుభ్రంగా పప్పు పచ్చడితో తిన్నా బాగుండేది, ఈయనని నమ్ముకుంటే ఇంతే అని మనసులోనే అనుకుని ఏదో తిన్నామనిపించాము. సాయంత్రం మన ముగ్గురం కలిసి ఎంచక్కగా వండేద్దాము అని ముగ్గురు కలిసి ఒక భయంకర తీర్మానం కూడా చేసేసుకున్నారు.
సాయంత్రం అయింది. ఇక వంట మొదలుపెడతారు కాబోలు అని చూస్తున్నాను, ఏమైనా సలహాలు అడిగితే పడేద్దాము అని. ఎబ్బే! ఏం కదలిక లేదు. కంప్యూటర్ మీద కొట్టుకుంటూనే వున్నారు. నాకెందుకని నేను కూడా మెదలకుండా టి.వి లో వచ్చిన ప్రతి సినిమా చూస్తూ పడుకున్నాను. తీరిగ్గా రాత్రి 8 అయ్యాక పదండి బయటికి వెళ్ళి భోంచేసి వద్దాము అని బయలుదేరదీసారు. ఆ హోటలు భోజనం అంతకన్నా దరిద్రంగా వుంది. అన్ని మంట, పైగా ఎ.సి సరిగ్గా లేదు, బిల్లు మాత్రం వాయించాడు. పిల్లలు సూపూ ఐస్క్రీమూ తప్పితే ఏదీ సరిగ్గా తినలేదు. ఇక ఈ హోటలుకి రాకూడదు అనుకుంటూ బయటపడ్డాము. ఇంటికి వచ్చాక నేను మా వాడు కాస్తంత మజ్జిగ తాగి అమ్మయ్యా అనుకున్నాము. మొత్తానికి నిన్న ఆదివారం అంతా మా వారి పుణ్యమా అని సండే స్పెషల్సు సంగతి దేవుడెరుగు అందరం అర్థాకలితోనే పడుకోవాల్సి వచ్చింది. అప్పుడు అర్థమయ్యింది మన పెద్దవాళ్ళు ఆడవాళ్ళకి సెలవు ఎందుకు పెట్టలేదో!!!!! మీక్కూడా అర్థం అయ్యిందనుకుంటాను.

12 వ్యాఖ్యలు:
ఆ అక్కడే ఆ జాలితోనే మగువలు ముచ్చటేస్తారు.
ఏమాత్రం జాలి పడకుండా ఇంకో రెండు ఆదివారాలు అలాగే సెలవు పుచ్చుకోండి. మీ ఆయనకు చక్కగా వంట చేయడం వస్తుంది.
--ప్రసాద్
http://blog.charasala.com
మా ఆవిడదీ ఇదే బాధండీ.
బ్లాగులేమి ఉద్దరిస్తారు గానీ మా సంగతి కూడా కొంచెం పట్టించుకోండి అని రోజూ గొడవ.
మేమే మారాలండీ.
చాలా మంచి పని చేసారు సెలవు తీసుకుని.ఇంకో రెండు వారాలు ఇలాగే సెలవు తీసుకుంటే మూడోవారం నుండి ఆయనే వంట చేయడం మొదలు పెడతారు.ఆ తరువాత నుండి ఇద్దరూ కలిసి వంట చేసుకోవచ్చు.
మజ్జిగ స్పెషల్ ఆదివారం అన్నమాట :-)
అన్నింటి కన్నా ప్రపంచంలో అతి సులభం అయినవి రెండు...
౦౧. వంట చెయ్యటం
౦౨. ఏదైనా చాలా సులభం అని చెప్పటం
:-)
నాయనా సుధాకర్! మీకింకా పెళ్ళయినట్టు లేదు. వంట చెయ్యటం అతి తేలికే కాని భార్యామణి మెచ్చేట్టు వంట చెయ్యటం మాత్రం అతి కష్టం :-)
సి.సి.ము. గారూ .. ఒక ఆధునిక కాంతం కథలా ముచ్చటగా ఉందండీ మీ టపా.
వచ్చే ఆదివారం మీరు చేసిపెడితే అందరూ తింటారు, అంతేనా?
ప్రసాదు గారూ, ఆయనికి వంట రాక కాదండీ వంట కన్నా ఇంటి కన్నా బాకులు పిడులు ఎక్కువయ్యాయి, అది కదా నా బాథ.
చందూ గారు, మారాలి మారాలి అనుకోవటం కాదండీ మారి చూపించండి, సంతోషిస్తాము.
రాధిక గారూ, ఇంకో రెండు వారాలు ఇలాగే సెలవు తీసుకుంటే మూడోవారం అందరం ఆసుపత్రి పాల్పడతామేమో!!!!
శోధన గారు, భలే చమత్కారంగా చెప్పారండీ. మీరు ఇలా చెణుకులు కూడా విసురుతారా?.
కొత్తపాళీ గారూ
మరీ మునిమాణిక్యం గారి కాంతంతో పోలిస్తే ఎలాగండీ, నక్కకు నాగలోకానికి వున్నంత తేడా వుంది.
రానారే గారూ, అంతే కదండి మరి. చేసుకున్నవాళ్ళకి చేసుకున్నంత.
లాభం లేదండీ. ఈ మగవాళ్ళు మనకు సెలవు ఇవ్వరు. వాళ్ళ అవస్థలు తెలిసి మనం సెలవు తీసుకోలేం. అవన్నీ సినిమాలు కథలలోనే. కాని కొన్ని పనులు అవీ వాళ్ళ పనులు వాళ్ళనే చేసుకునేలా చేయగలం. ఎవరి బట్టలు ఉతుక్కోడం. పుస్తకాలు సర్దుకోవడం ఇస్త్రీ చేసుకోడం లాంటివి చేయనని మొండికేయడమే. ఐనా మీరు ఒక్క వంటలోనే సెలవు తీసుకుంటే వచ్చే సమస్యలు చెప్పారు.. మరి ఆడవాళ్ళు రోజు చేసే మిగతా పనులు గురించి చెప్పలేదు. ఒక వేళ సెలవు తీసుకున్నా ఒకటి, రెండు, మూడు వారాలు అంతే. అందరి కోపాలు నషాలానికెక్కుతాయి. అనవసర గొడవలు తప్పితే ఒరిగేదేమి లేదు ..
Where is next post?
:)
Happy New Year అండి.
అలాగే కంటిన్యూఐపోండి :) ఏమైనా పని చేస్తే నాకూ చెప్పండి , నేనూ ఫాలోఐపోతను :)
happy new year
Post a Comment