పరుగాపక పయనించవె తలపుల నావ.... కెరటాలకు తలవంచితె తరగదు త్రోవ

March 13, 2007

మళ్ళీ మారిన తేదీలు

ప్రభుత్వం పుణ్యమా అని ముచ్చటగా రెండోసారి ఇంటర్ పరీక్షల తేదీలు మారాయి. ఇంతకు ముందు శాసన మండలి ఎన్నికల సందర్భంగా, ఇప్పుడేమో మన ఉగాది సందర్భంగా.ఉగాది మార్చి 20న కాదు,19నని ప్రభుత్వం ప్రకటించింది.దానికి తగ్గట్లుగా ఇంటర్ రెండో సంవత్సరం రసాయనశాస్త్రం పరీక్ష 20కి మార్చారు.ఉగాది 20న కాదు 19నే అని మన ఆస్థాన పండితులకి ఆపై మన ప్రభుత్వానికి తెలిసింది ఇప్పుడే. మద్యలో పిల్లలు వాళ్ళ పరీక్షలు ఎలా పోతే ఎవరికి పట్టింది.

ఇలా పండగల తేదీల మీద రచ్చ జరగటం ఇదే మొదటిసారి కాదు. మరి మన పండితులంతా ముందు ఏం చేస్తారో తెలియదు.

1 వ్యాఖ్యలు:

Valluri Sudhakar March 13, 2007 at 11:19 PM  

గ్రేసు మార్కులిచ్చి పాస్‌చేసిన ఘనకీర్తికల కాంగ్రేస్ ప్రభుత్వమండి ఇది. వారి స్వార్ద రాజకీయాలముందు మిగతావన్ని దిగదుడుపే.

Post a Comment

statcounter

  © Blogger template Coozie by Ourblogtemplates.com 2008

Back to TOP