పరుగాపక పయనించవె తలపుల నావ.... కెరటాలకు తలవంచితె తరగదు త్రోవ

March 28, 2007

ఆణి ముత్యాలు-మాయాబజార్

మాయాబజార్ విడుదలయ్యి నిన్నటికి 50 సంవత్సరాలు. ఇప్పటికి చాలా సార్లు చూసినా, నిన్న మరలా చూసాము పిల్లలతొ కలిసి. నిజంగా ఓ మరుపురాని ఇంద్రజాల మహేంద్రజాల ప్రదర్శన అని చెప్పవచ్చు ఈ సినిమాని.

ప్రతి సన్నివేశం ఒక మాయాజాలమే, ఒక మహాద్భుతమే. పిల్లలు కూడా బాగా ఆనందించారు. అది ఎలా తీసారు, ఇది ఎలా తీసారు అని అడగటమే. ఇప్పటి గ్రాఫిక్స్ ఎందుకు పనికి రావేమో వాటి ముందు. తల్పం లాంటి గిల్పం మీదకు చెప్పులు క్రమశిక్షణ కలిగిన సైనికులలా నడిచివెళ్ళటం నాకు బాగా నచ్చిన సన్నివేశం. ఇది అది అని లేదు, ప్రతి సన్నివేశం ఒక మహాద్భుతమే..

సావిత్రి నటన గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదమో. అహ నా పెళ్లంట పాటలో ఆమె నటన simply superb. ఘటోత్కచుడుగా ఆమె హావభావాలు అమె తప్ప ఎవరు చేయలేరేమో అన్నట్లుగా వుంటాయి. ఇక ఘటోత్కచుడుగా రంగారావు నటన గురించి ఎంత చెప్పినా తక్కువే. నటీనటులందరు ఒకళ్ళని మించి ఒకళ్ళు పోటాపోటీగా నటించిన సినిమా ఇది.అందరూ హేమాహేమీలే. ఈ సినిమా గురించి ఎంత రాసినా తక్కువే. తెలుగు సినిమాలకే మకుటం లాంటిది. సంగీతపరంగా, సాహిత్యపరంగా గానే కాదు technical గా కూడా ఒక అపురూప కళాఖండం. ప్రతి తెలుగు వాడు చూడవలిసిన సినిమా.

6 వ్యాఖ్యలు:

Rajiv Puttagunta April 1, 2008 at 3:04 AM  

ee cinemalo photography gurinchi oka maata cheppali.

Deeniki photographer Marcus Bartley ani hollywood aayana.

Lahiri Lahiri Lahirilo song lo gaddi vendi laaga merusthoo kanipisthundhi.

Aa feel raavatam kosam...gaddiki vendi rangu veddam annadanta director.

Marcus gaaru avasaram ledhu ani cheppi...thana photography talent tho vennello nijamgaaney merisey tattugaa gaddini choopinchaadu.

Rajendra Devarapalli April 1, 2008 at 10:48 AM  

రాజీవు గారు,మీ పరిశీలన బాగుంది కానీ,మార్కస్ బార్ట్ లే హాలీవుడ్ ఆయన కాదు,ఆంగ్లో-ఇండియన్,ఇప్పటికీ ఆయన కుమారులు చెన్నై లోనేఉన్నారు.

మాయాబజారు చూస్తునప్పుడు మా ఊరు మూర్తిమహల్ లో జరిగిన ఒక హాస్యసంఘటన వీలున్నప్పుడు నాబ్లాగులో...

lalithag April 1, 2008 at 7:29 PM  

నిజంగానే ఇది పిల్లలు చూడ దగ్గ సినిమా.
మా పిల్లలతో కలిసి చూసాము. చిన్న వాడు మధ్యలో పడుకుని లేచే సరికి ఇంకా సినిమా చాలా మిగిలి ఉంది:-) పెద్ద వాడు మొత్తం చూశాడు. ఇద్దరూ బాగా enjoy చేశారు.

krishna rao jallipalli April 1, 2008 at 8:07 PM  

ఇప్పుడు GRAPHICS, GRAPHICS అని ఒ తెగ చంకలు కొట్టుకుంటున్నారు కోడి రామ కృష్ణ లాంటి వాళ్లు. పాత జానపదం, పౌరాణికం, చారిత్రాత్మకం సినిమాల్లో ఉన్నా కెమేరా TRICKS .. ఎ మాత్రం అనుమానం రాకుండా.. ఒరిజినల్ గా ఉండేవి. మరి ఇప్పటి గ్రాఫిక్స్ ... చాల వీజీ గా తెలిసిపోతుంది. పిచ్చి ముండకోడుకులు.

Unknown April 1, 2008 at 10:33 PM  

ఆహ్... ఎంత ఎక్సలెంటు సినిమానో. ఎన్ని సార్లు చూసినా తనివితీరదు.

ఎస్వీ రంగారావు గారి నటన, సావిత్రి, ఎంటీఆర్, అబ్బో. ఆ లెవెలే వేరు :)

సుజాత వేల్పూరి April 2, 2008 at 7:27 AM  

మాయా బజార్ సినిమాని, చందమామ పత్రికని ఇష్టపడని వాళ్ళూ (పిల్లా, పెద్దా అందరూ) ఉంటారా! ముఖ్యంగా తల్పం, గిల్పం వంటి మాటలూ! 'ఎవరూ పుట్టించకుండా మాటలెలా పుడతాయి " అనే ఘటొత్కచుడి డైలాగు హైలైట్.

Post a Comment

statcounter

  © Blogger template Coozie by Ourblogtemplates.com 2008

Back to TOP