e-పుస్తకాలు-ఒక్కోసారి తప్పని అవసరం!
మామూలుగా నాకు కంప్యూటర్ లో చదవటం అంత ఇష్టం ఉండదు...వెబ్ మాగజైనులు కూడా నేను అంతగా చదవను. చాలా బాగున్నాయి చదివి తీరాల్సిందే అనుకుంటేనే చదువుతాను. కానీ ఒక్కోసారి మనకు ఎంత ఇష్టం లేని పనులైనా పరిస్థితుల ప్రభావం వల్ల చెయ్యక తప్పదు. అలాంటి పరిస్థితుల ప్రభావం వల్లే నాకు e-పుస్తకాలు చదవటం తప్పనిసరి అయి ఇప్పుడు అవే ముద్దయిపోయాయి.
దాదాపు సంవత్సరంన్నర క్రితం మొదటగా కిండిల్ లో (కిండిల్ టచ్ మా పిల్లలకని తెప్పిస్తే వాళ్ళు పుస్తకమే మాకూ ఇష్టం అని దాన్ని పక్కన పడేసారు..అది అలా ఊరికే పడి ఉండటం చూసి బాధేసి నేను వాడదామని ప్రయత్నించాను) కొన్ని తెలుగు పుస్తకాలు చదువుదామని ప్రయత్నిస్తే అసలు చదవటానికి వీలుగా లేదు. చీమతలకాయలంత అక్షరాలు చదవటం చాలా కష్టమయ్యేది. ఫాంట్ సైజు పెంచామంటే తర్వాతి పేజీకి వెళ్ళాలంటే మళ్లీ ఫాంట్ సైజు తగ్గించుకుని కాని వెళ్ళలేకపోయేవాళ్ళం.
నెట్ లో వెతికాను కానీ ఈ సమస్యకి సరైన పరిష్కారం కనిపించలేదు. ఏదో mobi format అన్నారు..అలా చేసినా చదవటానికి తల ప్రాణం తోకకొచ్చేది. ఇక నా వల్ల కాదని పక్కన పడేసాను.
అప్పుడే మాలతి గారు కూడా ఇదే విషయం పై ఓ టపా వ్రాసారు. అమ్మయ్య నాకు ఇంకా తోడున్నారన్నమాట అని ఊపిరి పీల్చుకున్నాను!
అసలు విషయం ఏంటంటే e-రీడర్సు లో చదవటానికి వీలయ్యేటట్టు మన తెలుగు పుస్తకాలు రావటం లేదు. మనకి నెట్టులో దొరికే తెలుగు పుస్తకాలు..వ్యాసాలు ఎక్కువగా PDF రూపంలో ఉంటాయి. ఇవి కిండిల్ లో చదవటం (మిగతా e-రీడర్సు గురించి నాకు తెలియదు) చాలా ఇబ్బందికరం.
అలా కిండిల్ ని మూలన పడేసాను. హైదరాబాదులో ఉన్నంత కాలం మళ్ళీ e-పుస్తకాల మీదకి దృష్టి పోలేదు..అంత అవసరమూ రాలేదు.
తర్వాత డిసెంబరు-2012 లో గూగుల్ నెక్సస్-7 వచ్చింది. దాంట్లో కూడా మొన్నమొన్నటి వరకు మెయిలు చూసుకోవటం..నెట్ సర్ఫింగ్..ఆటలకి తప్పితే పుస్తకాలు చదువుదామని ప్రయత్నించలేదు. పది నెలలబట్టి ఆంధ్రదేశానికి దూరంగా ఉన్నా హైదరాబాదు వెళ్ళినప్పుడల్లా పుస్తకాలు తెచ్చుకుంటూ చదువుకుంటూ గడిపేస్తున్నాను. ఎన్ని పుస్తకాలని తెచ్చుకోగలను! తెచ్చుకున్న పుస్తకాలు అయిపోయాయి.
ఆ మధ్య ఒక రోజు నెక్సస్ లో తెలుగు e-పుస్తకాలు చదవగలమేమో చూద్దాం అని పురుగు కుట్టింది. సరే మన కినిగె వాళ్ళున్నారుగా వాళ్లని సంప్రదించాను..మీ e-పుస్తకాలు నెక్సస్ లో చదవగలమా అని? వచ్చు..వచ్చు Bluefire లేదా Aldiko రీడర్ల ద్వారా ఎంచక్కా చదువుకోవచ్చు అని చెప్పారు.
అహా ఏమి హాయిలే హలా అనుకుంటూ అప్పటికే మా నెక్సస్ లో Aldiko ఉంది, Bluefire కూడా దింపుకుని టపటపా ఓ ఎనిమిది పుస్తకాలు దింపేసుకున్నాను కినిగె నుండి.
హాయిగా ఉంది చదువుకోవటానికి. Bluefire..Aldiko..ఈ రెండిటిల్లో నాకు Bluefire వీలుగా బాగుంది. Aldiko కూడా బాగుంది కానీ అందులో ముందు Aldiko కి వెళ్ళి దాని ద్వారా కినిగె కి వెళ్ళి పుస్తకాలు దించుకోవాలి. Bluefire అయితే డైరెక్టుగా కినిగె నుండే దింపుకోవచ్చు.
నా ఓటు ఎప్పుడైనా అచ్చు పుస్తకానికే కానీ e-పుస్తకంతో కూడా కొన్ని అనుకూలతలు ఉన్నాయి.
ఆంధ్ర వెలుపల ఉన్నవాళ్లకి చాలా ఉపయోగం. కొరియరో..పోస్టో..షిప్మెంటో ఇలాంటి వాటి కోసం వెతుక్కోనక్కరలేదు. మరీ ముఖ్యంగా మాలాగా ఇంటర్ నెట్ తప్ప ఎలాంటి సమాచార సదుపాయాలు లేని అడవుల్లో ఉండేవాళ్ళకి ఎడారిలో ఒయాసిస్సు లాంటివి ఈ e-పుస్తకాలు.
చదువుకోవటానికి బాగానే ఉన్నాయి కానీ వీటి పట్ల నాకు ఇంకా కొంత అసంతృప్తి ఉంది.
1. తెలుగు e-పుస్తకాలంటే స్కాన్ చేసి పెట్టేస్తున్నారు. అలా కాకుండా e-రీడర్సుకి..టాబ్లెట్స్ కి అనువైన ఫార్మాట్ లో తేగలిగితే బాగుంటుంది.
2. అక్షరాల సైజు పెంచుకోవాలంటే మనం ప్రతి పేజీకి పెంచుకోవాలి..అలా కాకుండా ఇంగ్లీషు పుస్తకాలకి పెంచుకున్నట్టు పుస్తకం మొత్తానికి ఒకేసారి పెంచుకునేట్లు ఉండాలి.
3. పేజీకి రెండు కాలమ్సు ఉండే కొన్ని పుస్తకాలు చదవటం చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఉదాహరణకి జమీల్యా...ఈ పుస్తకం ఫాంట్ చాలా చిన్నదిగా ఉంది..పేజీకి రెండు కాలమ్సు ఉంటాయి. ప్రతి పేజీ ఫాంట్ పెద్దది చేసుకు చదవాలి..ఇలా ఫాంట్ పెద్దది చేసినప్పుడు రెండో కాలం కనపడదు..మొదటి కాలం చదివాక రెండో కాలం కి స్క్రీన్ జరుపుకోవాలి..దాంతో పుస్తకం చదివే వేగం కుంటుపడుతుంది...చదవాలన్న ఇష్టమూ పోతుంది.
ఈ సమస్య మళ్ళీ కథాకేళి లాంటి మాసపత్రికల్లో లేదు.
తెలుగులో e-పుస్తకాలు రావటం ఇప్పుడిప్పుడే మొదలయింది కాబట్టి త్వరలోనే పై సమస్యలకి పరిష్కారం దొరుకుతుందని ఆశిద్దాం. ఫార్మాట్ సమస్య తీరితే సమస్యలన్నీ దానికి రిలేటడ్ కాబట్టి అన్నిటికీ పరిష్కారం దొరుకుతుంది.
కినిగె వాళ్ళు ఆ దిశగా ప్రయత్నాలు చేస్తారని ఆశిద్దాం.
అలాగే తెలుగులో విడుదలైన ప్రతి పుస్తకం e-పుస్తకంగా తేవాలని ఈ సందర్భంగా కినిగె వాళ్ళని కోరుతున్నాను.
మిగతా టాబ్లెట్సులో, e-రీడర్సు లో ఎలాంటి సమస్యలున్నాయో నాకు తెలియదు. అవి ఉపయోగించుతున్న వాళ్ళు తెలియచేయాలి.
e-రీడర్ ఉంటే అరచేతిలో ఓ పేద్ద గ్రంధాలయం ఉన్నట్టే కానీ పుస్తకం చేతిలో పట్టుకుని చదివితే ఆ అనుభూతే వేరు.
కొంతమంది పర్యావణ ప్రేమికులు పుస్తకాల కోసం ఎన్ని చెట్ట్లు కొట్టేయ్యాల్సొస్తుందో ..ఎన్ని అడవులు నాశనం అవుతున్నాయో అని e-పుస్తకాలనే వాడండి అని సందేశాలు ఇస్తున్నారు ఈ మధ్య. అది కూడా నిజమే కానీ అడవుల సంరక్షణకు వేరే పర్యావరణ పరిరక్షణ పద్దతులు పాటిస్తే మేలు కదా అనిపిస్తుంటుంది నాకు. పుస్తకాలు చదవటం మానేసి e-పుస్తకాలు చదివినంత మాత్రాన అడవులు రక్షింపబడతాయి అని నేననుకోను.
రాబోయే రోజుల్లో తెలుగు e-పుస్తకాలకి మరింత ఆదరణ పెరిగే అవకాశం ఉంది.
నవీన్ గారు వ్రాసిన ఈ టపా కూడా కొత్తగా e-రీడర్ కొనుక్కుందాం అనుకునేవాళ్లకి ఉపయోగంగా ఉంటుంది.

19 వ్యాఖ్యలు:
I read e-books on Bluefire reader (Samsung Galaxy Tab 310). I read books even when I stay out of town. Tab is the most convinient device for reading books.
మీతో పూర్తిగా ఏకీభవిస్తాను.
కినిగే లో తెలుగు బుక్స్ చదవటం మంచి అనుభూతి ;)
Hegelian..yes tab is very comfortable for reading e-books. Thank you.
రాజ్ కుమార్..నువ్వు e-బుక్సు చదవటానికి ఏం వాడుతుంది చెప్పలేదు:)
Check the recent photos uploaded on Facebook. One is the capture of a page from Telugu grammar book written by C.P.Brown. (It was downloaded from other source but not from Kinige). Another is the screenshot of dialogue box seen while downloading a book from Kinige.
మార్పు అనేది ఒక చారిత్రక అవసరం. మార్పు కి అనుగుణంగా జీవితాన్ని మలచుకోనివాళ్ళు మనుగడ సాగించలేరు. మనకి తెలుగు ఇష్టం. చేతనయితే టెక్నాలజీ లో మనకు వున్న సమస్యలు సాల్వ్ చేసుకుందాం మరియు అనుగుణంగా మలచుకుందాం కానీ వ్యతిరేకించటం అనవసరం అని నా ఉద్దేశ్యం. మనం భీభత్స్యం గా ప్రవహిస్తున్న ప్రవాహం లో వున్నాం. ఈ ప్రవాహం తనకన్నా తక్కువ వేగం తో వున్న వాళ్ళని వెనక్కి / పక్కకి నెట్టేసి ముందుకి సాగిపోతుంది. అందరమూ కలసి దానిలో పడి అడ్డుపడకుండా కొట్టుకొని పోదాం. అంతకన్నా మనం చేయగలిగింది ఏం లేదు.
నేను ఈ మధ్యనే నా ipad లో Bluefire లో కినిగే నుంచి కొన్ని పుస్తకాలు లోడ్ చేసుకుని చదువుతున్నాను, చాలా హాయి గా ఉంది. పొడుకుని లైట్ తోపని లేకుండ చీకటి లోకూడా చదువుకోవొచ్చు. నాకైతే ఫాంట్ సమస్య అది ఏమి రాలేదు. సూపర్
వరూధిని గారూ
మీ ముందు పోస్టు కూడా ఇపుడే చూసాను. గుడ్. నాకూ చాన్నాళ్ళు అలానే ప్రింట్ పుస్తకాలు తప్ప ఇంకేం చదవాలని ఉండేది కాదు. (ఆన్ లైన్లో దొరికేవి వేరే అనుకోండి.) కానీ మీరన్నట్టు ఇండియా నుంచీ తెచ్చుకున్న పుస్తకాలన్నీ అయిపోతే మళ్ళీ మళ్ళీ అవే చదువుకోవడం తప్ప వేరే గతి లేదు. కినిగే వచ్చినప్పటి నుండీ, పుస్తకాలు ఇండియా నుంచి తెప్పించుకోవడం కన్నా ఈ-పుస్తకాలు కొనుక్కోడమే ఈజీగా ఉంది. లేకపోతే చదవలనుకున్నవి తెప్పించుకునే సరికి ఉన్న ఆస్తులు అమ్ముక్జోడమో, లేదా సంవత్సరాలు గడవటమో జరిగేది. అయితే మరీ దాచుకోవాలసినవి అయితే ప్రింట్ పుస్తకాలు కూడా కొంటున్నాను, ఈసారి వెళ్లినపుడు తెచ్చుకోవచ్చు అని.
నేను Samsung Galaxy Tab with Aldiko వాడుతున్నాను. చదవటంలో ఏమీ ఇబ్బంది లేదు నాకు. ఎప్పుడూ కూడా ఒక పుస్తకం మోసుకెళ్లటం అలవాటే అయినా, ఒక్కోసారి అనుకున్నదానికన్నా ఎక్కువ వెయిట్ చెయ్యాల్సి వచ్చినపుడు, లేదా చదువుతున్నది నచ్చనపుడు వెంటనే ఇంకోటి అందుబాటులో ఉంటుంది. అది నచ్చింది నాకు.
నాకూ ప్రింట్ పుస్తకాలన్నీ సర్దుకుని ముట్టుకుని మురిసిపోవడం, చదువుతూ చదువుతూ గుండెలకి హత్తుకుని ఆలోచనల్లోకి పోవటం అలవాటు + ఇష్టం. అది మిస్ అయినపుడల్లా మాత్రం దగ్గర ఉన్నదే తీసి చదువుతూ ఆ మురిపాలు తీర్చేసుకుంటాను. కాకపోతే నాకు కొందరు చెప్పినట్టు పుస్తకంలో అండర్లైన్ చెయ్యటం, హైలైట్ చెయ్యటం,అందులో నోట్స్ రాయటం, నలిపి మడతలు పెట్టడం లాంటివి అసలు ఇష్టం ఉండదు. చాన్నాళ్ళు పేరు కూడా రాసేదాన్ని కాదు, ఎవరికో ఇచ్చి పోగొట్టుకోడం మొదలయ్యినంత వరకు.
మంచి పనికొచ్చే విషయం చర్చకి పెట్టిందుకు థాంక్స్.
Chandra గారూ భలే చెప్పారండి. నేను ఇక్కడ e- పుస్తకాలని విమర్శించ లేదండి..e- పుస్తకాల కన్నా అచ్చు పుస్తకాలు కూసింత ఎక్కువ ఇష్టం అని చెప్పాను. Thank you for your nice comment.
భావనా..ఫాంట్ సమస్య కొన్ని పుస్తకాలకేనండి మీరు జామిల్యా పుస్తకం ఒకసారి చూడండి..తెలుస్తుంది.
పద్మ గారూ మీ వ్యాఖ్యకి ధన్యవాదాలు. నేను ప్రతి పుస్తకం మొదటి పేజిలో కొన్న తేదీ..ప్రదేశం మాత్రం వ్రాస్తాను.
సిరిసిరి మువ్వ గారు,
కొన్ని పాత పుస్తకాలు మాత్రమే ఇలా రెండు కాలములలో ఉన్నాయి, వాటిని కూడా ఒక దాని తరువాత ఒకటి మారుస్తున్నాము. కొత్త పుస్తకాలు వేటిలోనూ ఈ సమస్య ఉండదు.
ఒరెమూనా గారూ Thanks for the update.
నా దగ్గర నూక్ ఈ-రీడర్ ఉంది. కౌముది వారివి, కినిగె పుస్తకాలు ఏ ఇబ్బంది లేకుండా చదవచ్చు.. అయితే, మిగతా తెలుగు పుస్తకాలకు మాత్రం ఫాంట్ల తిప్పలు తప్పడం లేదు..
అక్షరల తెలుగు అంతర్జాల సంపుటిక
http://telugupagez.blogspot.in/2013_03_01_archive.html
ఆంతర్జాలం లోని వివిధ తెలుగు మూధ్రణల సమాహారం.
తెలుగు బ్లోగ్ లను మా బ్లోగ్ లో నిలుపుటకు . బ్లోగ్ చిరునామాను మా ఈమేల్ కి పంపండి ongolebull.com@gmail.com
Hallo Book Lovers,
Nenu Kinige lo register chesukuni 2 books of Malladhi gari vi download chesanu,pdf lo.avi open kavatam ledhu idea emaina chheppagalara
Bhanua33@yahoo.com
Hallo..i downloaded kinige and downloaded 2 books of Malladhi in pdf form,but they are not opening up.Any suggestions please.
bhanua33@yahoo.com
Hallo Book Lovers,
Nenu Kinige lo register chesukuni 2 books of Malladhi gari vi download chesanu,pdf lo.avi open kavatam ledhu idea emaina chheppagalara
Bhanua33@yahoo.com
@Bhavani Bhanu garu you can contact kinige support people at support@kinige.com. They will help you.
Post a Comment