పరుగాపక పయనించవె తలపుల నావ.... కెరటాలకు తలవంచితె తరగదు త్రోవ

September 10, 2012

ఇల్లాలి పనికి ఖరీదు కట్టే షరాబు లేడండోయ్! రాడండోయ్!


"ఇంటెడు చాకిరీని ఓపిగ్గా చేసుకుంటూ, ఇంటిని చక్కబెట్టే గృహిణుల శ్రమకు తగిన ప్రతిఫలం కల్పించాలని కేంద్రం యోచిస్తోంది. భార్యలకు భర్తలు తమ ఆదాయంలో కొంత భాగాన్ని చెల్లించడం తప్పనిసరి చేసే ప్రతిపాదనను పరిశీలిస్తోంది..."

"ఇంట్లో వారి పని విలువను లెక్కగట్టేందుకు ఓ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. దీనివల్ల వారికి మరింత సామాజిక సాధికారతా గుర్తింపు లభిస్తుంది. భర్త ఆదాయంలోంచి భార్యకు కొంత కేటాయిస్తే... ఆ సొమ్మును పిల్లల పౌష్టికాహారానికి, చదువుకు, మొత్తంగా ఆ ఇంటి బాగోగులకు వినియోగించవచ్చు".

ఇల్లాలి పనికి ఖరీదు....ఇది ఈ మధ్య భారత ప్రభుత్వం చేస్తున్న ఆలోచన!

అసలు ఈ ఆలోచనే హాస్యాస్పదంగా లేదూ! ఇల్లాలి పనికి ఎలా ఖరీదు కడతారు?  గంటల లెక్కనా..రోజుకి ఇంతనా..పనికి ఇంతనా! మరి పనివాళ్ళతో చేయించుకునే వాళ్ళకో! వాళ్ళకి ఎలా లెక్క కడతారు!

ఆడవాళ్ళు చేసే ఇంటిపని విలువని గుర్తించాలి..కానీ దాన్ని డబ్బుతో విలువకట్టడం అన్నది నాకయితే మింగుడుపడని విషయం!  ఆడదానికి ఆర్థిక స్వావలంభన ఉండాలి..కానీ ఇలా ఖరీదులు కట్టటాలు కాదు!

నెల జీతం మొత్తం తెచ్చి భార్య చేతుల్లోనే పోసే పతి దేవుళ్ళు ఉన్నారు...భార్య చేతిలో చిల్లి గవ్వ కూడా పెట్టని ప్రబుద్దులూ ఉన్నారు! మారాల్సింది మనిషి నైజం..ఉండాల్సింది భార్య మీద గౌరవం.

మరి మగవాళ్ళ పనికి కూడా లెక్కలు కట్టాలిగా!

ఇలా ఇంట్లో నీ పనికి ఇంత..నా పనికి ఇంత అని లెక్కలు కట్టుకుంటూ ..కూడికలు..తీసివేతలు వేసుకుంటూ కాపురాలు చేస్తే ఆ సంసారంలో చివరికి మిగిలేది శూన్యమే!

నెల నెలా జీతం తెచ్చుకునే కొంతమంది  స్త్రీలకి కూడా ఆర్థిక స్వేచ్చ ఉండదు..అంతా తెచ్చి భర్త చేతిలోనే పోయాలి.

పోనీ ఆడదాని ఆర్దిక భద్రత కోసమే ఈ ఆలోచన అనుకుందాం..అసలు భర్త నుండి ఏమాత్రం భద్రత లేని ఆడదానికి బ్యాంకులో డబ్బులు వేసినా ఆ డబ్బులు ఖర్చుపెట్టుకునే స్వేచ్చమాత్రం ఉంటుందా!  ప్రభుత్వానికి భయపడో..తప్పదు కాబట్టొ డబ్బులు వేసినా..అవి చివరికి మళ్ళీ చేరేది భర్త చేతిలోకే!

మరి అలాంటప్పుడు ఇలా ఇల్లాలి పనికి ఖరీదు కట్టటం ఉపయోగమేనా!

ఇల్లాలి పనికి ఖరీదు కట్టే షరాబు లేడండోయ్! రాడండోయ్!

38 వ్యాఖ్యలు:

హరే కృష్ణ September 10, 2012 at 10:37 AM  

ఈ మధ్య భారత ప్రభుత్వం చేస్తున్న ఆలోచన!
ఇదే అమలు అయితే మరో రెండేళ్ళల్లో ఎన్ని కోట్ల స్కాం బయటపడుతుందో :P

aditya September 10, 2012 at 11:26 AM  

In future, Govt. may impose service tax on that amount also, Because service of Housewife is not in negative list.

Anonymous,  September 10, 2012 at 12:28 PM  

ఇది ఆచరణలో ఆడవాళ్ళని Devalue చేస్తుంది. మగవాళ్ళల్లో వారి పట్ల కృతజ్ఞత తగ్గుతుంది. ఉదాహరణకి - "మీ ఆవిడ సంగతి కూడా కాస్త ఆలోచించు" అని ఎవఱైనా అంటే, "ఏమిటి ఆలోచించేది ? అప్పటిది అప్పుడే ఇచ్చేశానుగా" అంటాడు. అమూల్యాల్ని అమూల్యాలుగానే ఉంచేయాలి. అనుభూతికి విలువకట్టలేం. ఇల్లాలు ఇల్లాలే, వెలయాలు కాదు. అయినా ఆరివీర భయంకర ఫెమినిస్టు దేశాల్లోనే లేని విషయాల్ని ఇక్కడెందుకు ప్రవేశపెట్టడం ? అయినా మగవాడు ఎంతమందికి వ్యక్తిగతంగా డబ్బులిస్తూ పోగలడు ? అతని మీద మోయలేని భారం పెడితే భవిష్యత్తులో వివాహాల గుఱించి మర్చిపోవాల్సిందే.

Anonymous,  September 10, 2012 at 1:07 PM  

దీన్తో పాటు Short term లో భర్తలు ఇతర స్త్రీల వెంట పడితే ఆపే శక్తిని ఆడవాళ్ళు కోల్పోతారు. "నీది నీకిస్తున్నాగా ప్రతినెలా ? ఎందుకేడుస్తావ్ ?" అనే వాదన కూడా మొదలవుతుంది.

Anonymous,  September 10, 2012 at 1:24 PM  

వరూధిని గారు, నేనూ ఈ విషయమే బుర్ర బద్దలు కొట్టుకున్నాను. ఖరీదు ఎలా కడతారు?
ఈ పద్ధతి నాకేం నచ్చలేదు. తాడేపల్లివారు చెప్పినట్టూ అమూల్యమయినవి అలానే ఉండాలి. అన్నిటికీ వెల, మూల్యం అంటూ పోతే అమ్మో ఊహించడానికే భయంగావుంది.

Anonymous,  September 10, 2012 at 1:52 PM  

నాగరికత వెఱ్ఱితల వెయ్యడం చూశారా ఎక్కడేనా? లేదా? ఐతే ఇక్కడే చూడండి. ఘనతవహించిన భారత ప్రభుత్వం వారి ఆలోచన.

Anonymous,  September 10, 2012 at 3:02 PM  

ఈ వెసులుబాటు ఉండాలని ఒకప్పుడు వాదించినవాళ్ళల్లో నేనూ ఒకణ్ణి. కానీ లోకానుభవమూ, పరిశీలనా పెఱిగాక వద్దనిపించింది. ఎందుకంటే ఈ సౌకర్యాలు ఇచ్చినా ఇవ్వకపోయినా ఆచరణలో పెద్ద తేడా ఏమీ ఉండదు. ఉదాహరణకి - నా జీతం నేనెప్పుడూ కళ్ళ జూడలేదు. ఈనాటికీ నా ఖాతాల్లో ఎంతుందో నాకు తెలీదు.

నేననుకోవడం - భారతప్రభుత్వం ఇలాంటివన్నీ ఉత్తరాది కుటుంబాల క్రూరత్వాన్ని దృష్టిలో పెట్టుకుని చేస్తున్న పనులు. అక్కడ ఇంకా భారీ స్థాయిలో ఉమ్మడి కుటుంబాలున్నాయి. అత్తమామల క్రూరత్వం (కొడుకుల సంపాదనని గుంజుకోవడం) యథాపూర్వంగా కొనసాగుతోంది. కానీ దక్షిణాదిలో మఱీ అంత ఘోరంగా లేవు పరిస్థితులు. Nor even the abortions of female foetuses, with the possible exception of a few TN districts. నిజానికి ఇక్కడ ఉమ్మడి కుటుంబాలు 9 శాతమే.

Anonymous,  September 10, 2012 at 5:20 PM  

/అమూల్యాల్ని అమూల్యాలుగానే ఉంచేయాలి. అనుభూతికి విలువకట్టలేం. ఇల్లాలు ఇల్లాలే, వెలయాలు కాదు. /
తియ తీయని తేనెల మాటలతో
తీస్తారు సుమా గోతులు... నమ్మవద్దు. :))

వెల కట్టడమంటే పని-గంటలు లెక్కన కాదులేండి. భర్త సంపాదనలో కొంత శాతం స్వంత ఖర్చుకు ఇస్తారేమో. వెలయాలా? వెలకాడా? అంటూ విపరీతార్థాలు తీయకండి.

అసలే పథకాలు అన్నీ అయిపోయి వచ్చే ఎన్నికల్లో ఎలా గెలవాలా అని బంగారమ్మ, రాహువు పరేషాన్లో వున్నారు. ఆడవాళ్ళ ఓట్లకు ఈ సోణెమ్మ పథకం ప్రవేశపెట్టమని ఏ రేణూకా చౌదరో ఓ బేవార్సు అయిడియా ఇచ్చేసుంటుంది. :))

మధురవాణి September 10, 2012 at 7:09 PM  

హ్మ్మ్.. ఏం చట్టాలో ఏంటో.. ఇలాంటి చట్టాలన్నీ ఎవరికైతే కాస్తో కూస్తో ఉపయోగపడాల్సి ఉందో వాళ్ళదాకా అసలు వెళ్ళనే వెళ్ళవు. దుర్వినియోగం అయ్యే చోట్ల మాత్రమే అమలులోకి వస్తుంటాయి. :-/

Mauli September 10, 2012 at 8:41 PM  

అంతా బాగున్న చోట ఇది కాస్త ఎబ్బెట్టు అయినా , మంచి చట్టమే . భార్య అమాయకురాలు అని అన్ని తానై ఖర్చు పెట్టె భర్త నుండి , ఉదారంగా ప్రేమగా పర్సులో ఉంచుకో అని వెయ్యి రూపాయల నోట్లు రెండు ఇచ్చే భర్తల వద్దనుండి తమ హక్కుగా తీసికొనే ఆత్మవిశ్వాసం భార్యకు మేలు చేస్తుంది. ఇచ్చిన ప్రతి పైసా కు లెక్క అడిగే అబ్బాయిలకి గొంతులో పచ్చి వెలక్కాయ కూడాను.

భర్త యెంత సంపాదానా పరుడైనా కూతురు కు జాబ్ వచ్చే దాక, చేతిలో ఇరవై రూపాయలు కుడా అందని మహా ఇల్లాలు గుర్తుకు వచ్చింది. యెంత మంది ఉన్నారో !

Unknown September 10, 2012 at 10:07 PM  

బహుశా ఆడవాళ్ళ పనికి ఖరీదు వారికి కల్పించే స్వేచ్చ అందించే ప్రేమానురాగాలేనేమో అలా కాక డబ్బుతో ముడిపెడితే ఇల్లూ ఓ కార్యాలయమైపోతుందేమో

Mauli September 11, 2012 at 7:45 PM  

@ఇల్లాలు ఇల్లాలే, వెలయాలు కాదు.

తాడేపల్లి గారు,

ఇంటిని చక్కబెట్టే గృహిణుల శ్రమకు తగిన ప్రతిఫలం కల్పించాలని అన్న అంశం లో, వెలయాలు అనే ప్రసక్తి అసలు ఎందుకు వస్తుంది????
భార్యకు డబ్బులు ఇవ్వడాన్ని మీరు అలా పోల్చిన క్రమం లో, చట్టానికి ముందు కుడా భార్యలకి డబ్బులు ఇచ్చే భర్తలు ఉన్నారు. మీరొక్కరే కాదు ఇలా చాలామంది పొరపాటు గా అనుకొంటున్నారు

Anonymous,  September 11, 2012 at 11:27 PM  

Wife-hood is a relationship, but not a professional job. Husband is no boss of hers, and wife is no employee of his. They are friends for life chosen mutually. One friend paying another sounds absurd.

Mauli September 12, 2012 at 12:29 AM  

చాల చక్కగా ఉంది కాని, వెలయాలు అనే ప్రస్తావన ఎందుకు వచ్చింది అన్నది చెప్పనే లేదు. డబ్బులు తీసుకోకుండా ఉన్నంత మాత్రాన వెలయాలు ఇల్లాలు అవ్వదు అనుకుంటానండి.

ఇప్పటికే ఒక యాభై శాతం మంది భార్యలకు డబ్బులు ఇస్తున్నారు, మిగిలిన యాభై శాతం కుడా ఇవ్వాలని చట్టం చెయ్యడం మీరు చెప్పే అభ్యంతరాలు, ఇప్పటికే ఇచ్చే యాభై శాతం మంది కి కుడా చెపితే బాగుంటుంది మరి.

అలాగే మనం డబ్బులిచ్చావరందరూ మన దగ్గర పని చేసే ప్రొఫెషనల్స్ కాదు. మన అమ్మా ,నాన్న తో సహా.

రూపాయి పచ్చిమిరపకాయలు, అర్ధ రోపాయి పువ్వులు కొనుక్కోడానికి మరి ఫ్రెండు కి డబ్బులు ఇవ్వక్కరలేదు. అలాగే .. రాత్రింబవళ్ళు కష్ట పడి మరీ 'ఫ్రెండు' కోసం చాకిరీ చెయ్యరు.

@One friend paying another sounds absurd.

True, One friend working for another also should be equally absurd.

(మిమ్మల్ని విమర్శిస్తున్నాను అనుకోకుంటే, వెలయాలు అని మీరు చెప్పడం లో పురుషాధిక్యతను దాటి పురుషాహంకారం కనిపించింది. మన్నించాలి )

Anonymous,  September 12, 2012 at 11:48 AM  
This comment has been removed by the author.
Anonymous,  September 12, 2012 at 12:14 PM  
This comment has been removed by the author.
Mauli September 12, 2012 at 12:42 PM  

పర్లేదు తాడేపల్లి గారు కూడా సమాధానం చెబుతారు, డిఫెన్స్ లాంటి ఆఫెన్స్ పనులు ఆయన చేయరు. జాజిమల్లి గారి బ్లాగు అంటే దడుచుకు చస్తారు ఎందుకు?
వెలయాలు అంటే అదేమిటి అని అడగడం పెడర్దామా..దానికి ఉన్నతమైన అర్ధం ఏదన్నా ఉంటె తాడేపల్లి గారు సెలవిస్తారు గాని , తమరు కాస్త ...

ఈ పదం స్త్రీలు కూడా అని ఉంటారు నాయనా/తల్లి , వారు కడు దుర్భరమైన జీవనం సాగిస్తున్నారని అర్ధం.

Mauli September 12, 2012 at 12:57 PM  

బై దవే జాజిమల్లి గారి బ్లాగు లో నువ్వెప్పుడు వ్యాఖ్యానించలేదు, 'సోదిపూలు' బ్లాగు సంఘం సభ్యుడు/సభ్యు రాలివి అయ్యుండాలి ఖచ్చ్సితం గా :)

Anonymous,  September 12, 2012 at 1:14 PM  
This comment has been removed by the author.
Anonymous,  September 14, 2012 at 11:53 PM  

Dear Mouli ! I don't get your sarcasm. I am direct. I expect others too to be direct. You mentioned about some obscure blog which I don't remember. You say I don't answer. Please care to understand one thing. I am not here on the Internet to argue with people for days and weeks. I generally express myself to the extent possible. If others are not wiling to budge, I am not going to force them to accept my opinions by prolonging needless debates.

Not sure what is wrong in saying that a housewife is no whore. Friends work for each other. There is nothing absurd about it. But one friend paying another is absolutely absurd. When money makes a serious entry into a relationship, the spirit of the relations is killed. All professions in history, just like wifehood, once upon a time, started as voluntary and mutual helps only. But when the factor of money, payment and legal testimonials entered those helpful relations, they became professions and in a later stage, degenarated into heartless, impersonal interactions and frauds. If you want the same thing to happen to wifehood, OK, welcome. If this is taken seriously by all wives, there will not be left a single wife worth the name in the society in due course.

Anonymous,  September 15, 2012 at 12:26 AM  

Motherhood is already a commodity on sale and the next turn appears to be that of wifehood. I have no choice but to condemn this legalised commodification of all female relationships and feminine functions.

Anonymous,  September 15, 2012 at 9:55 AM  
This comment has been removed by the author.
Anonymous,  September 15, 2012 at 9:58 AM  

The proposed legislation will drastically cut down women's access to their husbands' earnings to a bare minimum level of 10 - 15 per cent in certain areas, say for example South India, where the access is now almost up to 100%. It may not affect the attitude of liberal husbands in the foreseeable future,. But a generation down the line, future husbands will not hesitate to use this provision to severely restrict their wives' access to their earnings, because, by then, the spirit of this legislation will completely be forgotten.

Anonymous,  September 16, 2012 at 9:27 PM  
This comment has been removed by the author.
Mauli September 17, 2012 at 3:23 AM  

తాడేపల్లి గారు, మీ వ్యాఖ్య పూర్తిగా చూసే ముందు చిన్న మాట,

నేను మిమ్మలిని ఉద్దేశించి వ్రాసిన వ్యాఖ్య (@September 12, 2012 12:29 అం ) మాత్రమె . మిగిలినవి మీకు ఏమాత్రం సంబంధం లేనివి, మీతో సూటిగా మాట్లాడడం తప్ప , వేరే ఉద్దేశ్యం కాని sarcasm కాని మీకు కనిపిస్తే పొరబడ్డారని కాని, లేక మధ్య లో వున్నా అజ్ఞాత వ్యూహం ఫలించింది అని కాని అనుకోవాలి. అంతే నండీ.

ఇటువంటి సున్నితమైన అంశాలు మాట్లాడేప్పుడు ఉండే న్యూసెన్సు మీకు తెలియంది కాదు. అదే సమయం లో మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఉంటే మన్నింపు కూడా అడిగి ఉన్నాను.

మీరు మగవారు ఈ చట్టం అమలుపరిచే క్రమం లో ఎలాంటి వ్యాఖ్యానాలు చేస్తారో వివరించి వున్నారు, వాటన్నింటినీ ఇలాగే చర్చలో పెట్టాలని ఉన్నా నా బ్లాగు కాదు, మీ బ్లాగు కాదు కాబట్టి వద్దు. ఒక్క చిన్న పదం ఇబ్బంది కలిగించడం సాధారణం కాబట్టి, మిమ్మల్ని ప్రశ్నించాల్సి వచ్చింది. ఓపికగా సమాధానాలు ఇచ్చినందులకు ధన్యవాదములు.

మీరిచ్చిన సమాధానం ఏదైనా , ఈ చర్చకు స్వస్తి చెప్పాలని అనుకొంటున్నాను

Mauli September 17, 2012 at 3:41 AM  

@@@@@Not sure what is wrong in saying that a housewife is no whore. Friends work for each other. There is nothing absurd about it. But one friend paying another is absolutely absurd. When money makes a serious entry into a relationship, the spirit of the relations is killed. All professions in history, just like wifehood, once upon a time, started as voluntary and mutual helps only. But when the factor of money, payment and legal testimonials entered those helpful relations, they became professions and in a later stage, degenarated into heartless, impersonal interactions and frauds. If you want the same thing to happen to wifehood, OK, welcome. If this is taken seriously by all wives, there will not be left a single wife worth the name in the society in due course.
@@@@@@@@@@

వందసార్లు చెప్పగలను అండీ, housewife ని whore పోల్చవలసిన సందర్భం కాదు ఈ చట్టం యొక్క ఆలోచన. ఫ్రెండ్స్ కాన్సెప్ట్ గురించి మీరు నిర్వచిన్చినా, ఇద్దరు పని చేస్తున్నప్పుడు ఒక్కరి అకవుంట్ లోనే డబ్బులు వచ్చి చేరడం గురించి మీకు ఎందుకు ఆలోచన రాదు? ప్రేమ, అభిమానం, అనుభూతులు ఇవ్వన్ని కడుపు నిండిన మనకు చాలా బాగుంటాయి.

ఇక మీ మిగిలిన అభిప్రాయం, భార్య స్థానంకు, భర్త స్థానం సమాజం లో ఏ స్థితి లో అయినా ఒకే విలువ ఉంటాయి అని నమ్ముతాను నేను. కాని మీ అభిప్రాయం మీది.

చివరిగా ఈ చట్టాన్ని ఆహ్వానించడం పై నా అభిప్రాయం ముందే చెప్పివున్నాను, ఈ చర్చ తో సంబంధం లేకుండా.

Anonymous,  September 17, 2012 at 2:38 PM  

ఫెమినిస్టుల వాదనల్ని ఖండిస్తూ నా దగ్గఱ చాలా మేటర్ ఉంది. అనేక అంశాల మీద నేను ప్రిపేర్ అయి ఉన్నాను. కానీ ఎన్నో ఇతర వ్యవహారాలలో పడి సతమతమవుతూ ఉండడం వల్ల నాకు వాటిని టపాలుగా వ్రాయడానికి తీఱిక చిక్కడం లేదు. నా గొడవ ఫెమినిస్టులనబడే పూర్వజన్మపురుషుల మీదా, హరించబడుతున్న పురుష హక్కుల గుఱించి తప్ప ఆడవాళ్ళ మీద కాదు. I love, like and sympathize with ordinary women who don't have gender fundamentalism.

ఇహ మౌళిగారి వాదన విషయానికొస్తే వాదన పెంచడం నాకూ అభిమతం కాదు. మానవసంబంధాలు స్వచ్ఛందతా ప్రాతిపదిక మీదనే నడవాలని నేను కోరతాను. బాంధవ్యం ఉన్నంతమాత్రాన బలవంతం పనికిరాదు. ఈ మాట మగవాళ్ళకెంత వర్తిస్తుందో ఆడవాళ్లకీ అంతే వర్తిస్తుంది. ముఖ్యంగా ఆడవాళ్ళకున్న సహజ బాధ్యతలన్నింటినీ బానిసత్వమని ప్రచారం చేస్తూ, వాటిని రద్దుచేసి, వాళ్ళకి (ఇతరుల మీద) హక్కుల్ని మాత్రమే ప్రసాదిస్తూ, వాళ్ళని కౌటుంబిక జులాయిలుగా ఆకతాయిలుగా, పోకిరీలుగా మారుస్తున్న ఈ కాలపు వేలంవెఱ్ఱి సిద్ధాంతాల నుంచీ, చట్టాల నుంచీ విభేదించక తప్పదు. అదలా ఉంచండి గానీ ఒక ఫ్రెండ్ ఖాతాలో ఇంకో ఫ్రెండు తప్పనిసరిగా డబ్బు వేయాలనే చట్టం ఎక్కడైనా ఉందా ?

Anonymous,  September 17, 2012 at 2:59 PM  
This comment has been removed by the author.
Anonymous,  September 17, 2012 at 3:00 PM  
This comment has been removed by the author.
Anonymous,  September 17, 2012 at 3:17 PM  
This comment has been removed by the author.
Anonymous,  September 17, 2012 at 3:20 PM  
This comment has been removed by the author.
Anonymous,  September 17, 2012 at 7:23 PM  

"మీరు నిర్వచిన్చినా, ఇద్దరు పని చేస్తున్నప్పుడు ఒక్కరి అకవుంట్ లోనే డబ్బులు వచ్చి చేరడం గురించి మీకు ఎందుకు ఆలోచన రాదు? "

ఇదొక అర్థం లేని ప్రశ్న. వ్యవస్థలో లేనిది ఊహాజనితంగా కల్పించి మఱీ అడుగుతున్నారు. ఇద్దఱూ పనిచేస్తున్నప్పుడు ఇద్దఱికీ ఒకే ఖాతా ఉంటే కంపెనీలు ఒప్పుకోవు. ఎవఱి ఖాతాలోకి వారి జీతం వెళ్ళాల్సిందే. ఆ తరువాత వాళ్ళు దాన్ని ఎక్కడెక్కడికి మళ్ళించుకుంటారో అది వాళ్ళ ఇష్టం. ఇందులో రకరకాలున్నాయి. వీటితో పాటు జాయింట్ అకౌంట్లున్నాయి.

కుటుంబవ్యవస్థని పనిగట్టుకొని రక్షించే ఉద్దేశం నాకు లేదు. అది ఎలాగూ కూలేదే ముందో వెనకో ! కూలడమంటే పూర్తిగా పోతుందని కాదు. దాని స్వరూపం, విస్తృతీ చాలావఱకూ డ్యామేజ్ అవుతుంది, అవ్వబోతోంది. అందుకు మొదటిఱాళ్ళు వేస్తున్నది ఫెమినిస్టులే, ఫెమినిస్టు మీడియాయే, ఫెమినిస్టు ప్రభుత్వాలే ! అమాయక మగజాతిని నిందించి ప్రయోజనం లేదు కదా. చెప్పిన మాట విని విశ్వాసంతో నడుచుకునే భార్యల పట్ల మగవాళ్ళెప్పుడూ ప్రేమగానే ఉన్నారు. అలా ప్రేమగా ఉండే ప్రైవేట్/ పర్సనల్ అవకాశాన్ని తీసేసి, కుటుంబ వ్యవహారాల్ని పబ్లిక్ అఫైర్లుగా, నవలా ఇతివృత్తాలుగా, ప్రభుత్వ వ్యవహారాలుగా, రాజకీయ నినాదాలుగా మార్చి, ఆ ప్రేమని చట్టాలకి సబార్డినేట్ చేశాక ఇహ మగవాళ్ళ పాత్ర ఏముంది ? ఏ పాత్రా లేనివాళ్ళని దూషించడం దేనికి ?

Mauli September 20, 2012 at 1:17 PM  

తాడే పల్లి గారు

@@@చెప్పిన మాట విని విశ్వాసంతో నడుచుకునే భార్యల పట్ల మగవాళ్ళెప్పుడూ ప్రేమగానే ఉన్నారు.

మగవారు అందరు మీరు చెప్పిన విధం గా నడచుకొంటే, ఈ చట్టం అవసరమే ప్రభుత్వానికి వచ్చేది కాదు. కాబట్టి మీ వాదనలో అర్ధం లేదు.

భార్య ఇంటిపని చెయ్యడం మానెయ్యాలి, తన సంపాదన తను తెచ్చుకోవాలి, అన్న మీ అభిప్రాయం బానే ఉంది. కాని అది కుటుంబ వ్యవస్థను మరింత విచ్చిన్నం చేయకుండా ఆపగలదా?

ఒకవ్యవస్థ ఎంతకాలం మనగలుగుతుంది అన్నది ఆ వ్యవస్థ లోని మంచి చెడులను బట్టి ఉంటుంది, ఒకరిని బాధ్యలు చెయ్యడం సరి కాదు.

Mauli September 20, 2012 at 1:27 PM  

తాడేపల్లి గారు
@అలా ప్రేమగా ఉండే ప్రైవేట్/ పర్సనల్ అవకాశాన్ని తీసేసి, కుటుంబ వ్యవహారాల్ని పబ్లిక్ అఫైర్లుగా, నవలా ఇతివృత్తాలుగా, ప్రభుత్వ వ్యవహారాలుగా, రాజకీయ నినాదాలుగా మార్చి, ఆ ప్రేమని చట్టాలకి సబార్డినేట్ చేశాక ఇహ మగవాళ్ళ పాత్ర ఏముంది ?

ప్రేమ గా ఉండే అవకాశాన్నా ??? అవకాశం అంటే నె , ఖచ్చితం కాదని అర్ధం వస్తుందే. ఎక్కడో కొన్ని చోట్ల ఉండే 'అవకాశాన్ని' ఆధారం గా మిగిలిన వారి జీవితాల్లో అభద్రత ని చూసి వదిలెయ్యడం లేదండీ ప్రభుత్వం. ప్రభుత్వానికి అవకాశం కన్నా కనీస అవసరాలు ముఖ్యం.

ఎవరు ఎవరితో విశ్వాసం తో నడచుకోవాలో మీరు, నేను నిర్ణయించేది కాదు. విశ్వాసం తో నడుచుకోవాలి అని అన్నాక, ఆడవాళ్ళ పాత్ర మాత్రం ఏమి ఉంటుంది.

*********భాగస్వాములని పార్టనర్స్ అంటారు కాని ఫ్రెండ్స్ అనరు*********************

పార్టనర్స్ లో ఒక్కరి అకవుంట్ లోనే డబ్బు ఉండడం వల్ల సమస్యలు పరిష్కారం అవ్వని పక్షం లో, మార్పులు తప్పని సరి.

Mauli September 20, 2012 at 7:09 PM  

>>>>>>>>>>"మీరు నిర్వచిన్చినా, ఇద్దరు పని చేస్తున్నప్పుడు ఒక్కరి అకవుంట్ లోనే డబ్బులు వచ్చి చేరడం గురించి మీకు ఎందుకు ఆలోచన రాదు? "
<<<<<<<ఇదొక అర్థం లేని ప్రశ్న. వ్యవస్థలో లేనిది ఊహాజనితంగా కల్పించి మఱీ అడుగుతున్నారు. ఇద్దఱూ పనిచేస్తున్నప్పుడు ఇద్దఱికీ ఒకే ఖాతా ఉంటే కంపెనీలు ఒప్పుకోవు

లేనిది , ఊహా జనితం అయినది అయితే, ఒక్కసారి ఈ టపా కి శీర్షిక చూడండి తాడే పల్లి గారు :)

ఒకరు ఇంట్లో పని చేస్తే , ఇంకొకరు బయట చేస్తారు. కనీస అవసరాలకు కొంత సొమ్ము రెండవ వారికి కూడా అందుబాటులో ఉండాలి.

కావ్యాంజలి November 5, 2012 at 6:29 PM  

అసలు ఇల్లాలు చేసే పనికి ఖరీదు కట్టటం అనే కాన్సెప్టే చెండాలంగా ఉంది.....నేను మీ అభిప్రాయం తో ఏకీభవిస్తున్నానండి :)

thanooj November 9, 2012 at 8:43 PM  

meeru kharidu kattalanna vaddanna emi cheppina ekhibhavisthanu ...naku sonthaga alochinche sakthi lekhapoinamee meedha nammakamundhi.dhanyvaadamulu manchi chakkani post nuu maa kosam andincharu.kruthagjnathalu.

Post a Comment

statcounter

  © Blogger template Coozie by Ourblogtemplates.com 2008

Back to TOP