పరుగాపక పయనించవె తలపుల నావ.... కెరటాలకు తలవంచితె తరగదు త్రోవ

June 11, 2012

అమెరికాలో వైద్యం..ఎంత కష్టం..ఎంత కష్టం

అమెరికాలో వైద్యం చాలా ఖరీదైనది..మామూలు జ్వరానికి  కూడా ఇన్స్యూరెన్సు లేందే అక్కడి వైద్య ఖర్చులు భరించలేము..ఇది మాములుగా ప్రవాస భారతీయుల నుండి మనం వినేది.

అమెరికాలో ఏదైనా ఆరోగ్య సమస్య వచ్చి అత్యవసరంగా డాక్టరు దగ్గరికి వెళ్ళాలంటే వెళ్ళలేని పరిస్థితి.  ముందుగా అపాయింటుమెంటు లేందే డాక్టరుని కలవలేం. ఇప్పుడిప్పుడే advanced or open-access scheduling, direct-pay practices, telehealth services లాంటివి అందుబాటులోకి వస్తున్నాయి కానీ ఇవి అన్నిటికీ పనికి రావు.

ప్రతిదీ ప్రొసీజర్ ప్రకారం అంటూ నెలలు నెలలు చేస్తారు.  కాన్సరు లాంటి ప్రాణాంతక వ్యాధుల్లో కూడా వ్యాధి నిర్థారణ అవటానికి ఆరు నెలలు..ఆ తర్వాత అసలు ట్రీట్‍మెంటు మొదలవటానికి మరో రెండు మూడు నెలలు...ఈ లోపు ఇవతల పేషెంట్సు..వాళ్లతో పాటు వాళ్ళ కుటుంబసభ్యులకి ఎంత నరకయాతనో!

అంతే కాదు ఎవరైనా సెషలిస్టు డాక్టరు దగ్గరికి వెళ్ళాలంటే ఇక్కడ లాగా డైరెక్టుగా వెళ్ళలేం..ముందుగా ఫామిలీ ఫిజిషియన్ దగ్గరకి వెళ్ళాలి..వాళ్ళు రిఫర్ చేస్తేనే స్పెషలిస్టుల దగ్గరకి వెళ్ళాలి.. మరీ అవసరం అయితే ఎమర్జన్సీ రూమ్సుకి వెళ్ళాలి..ఇవి చాలా కాస్ట్లీ కాబట్టి మరీ అత్యవసరం అయితే తప్ప అంత తొందరగా ఎవరూ వెళ్ళరు.

ఫామిలీ ఫిజిషియన్సు దగ్గర అయినా ఓ మూడు నాలుగు వారాల ముందే అపాయింట్‍మెంటు తీసుకోవాలి..ఆ తీసుకున్న రోజుకి ఎందుకైనా వెళ్ళలేకపోతే మళ్ళీ అపాయింట్‍మెంటు తీసుకోవాల్సిందే! అది మళ్ళీ ఎప్పుడు దొరుకుతుందో తెలియదు.

ఏవైనా డయాగ్నోస్టిక్ టెస్టులు చేయించుకోవాలంటే ఇక్కడ లాగా అదే హాస్పిటల్ లో ఉండవు..బయట సెంటర్సుకి వెళ్ళాలి..వాటికి కూడా అపాయింటుమెంటే! ఆ టైములో ఏదైనా సమస్య వచ్చి ఆ టెస్టు ఆ రోజు జరక్కపోతే మళ్ళీ అపాయింటుమెంటు దొరికేదాకా ఆగాల్సిందే!

నా స్నేహితురాలు ఒకామెకి ఆరు నెలల బట్టి ఆహారం మింగేటప్పుడు గొంతులో ఇబ్బంది గా ఉంటుంటే డాక్టరు దగ్గరికి వెళ్తే అసిడిటీ అయి ఉంటుంది అని మందులు ఇచ్చి పంపించారు..తనకి రోజు రోజుకి సమస్య ఎక్కువై అసలు ఘన పదార్థాలు తినలేని స్థితికి వచ్చింది.  దాదాపు నాలుగు నెలల నుండి ద్రవపదార్థాల మీదే బ్రతుకుతుంది..అవి కూడా ఒక్కోసారి లోపలకి వెళ్ళకుండా బయటికి వచ్చేసేవి. బాగా బరువు తగ్గిపోయింది..మరి డైటు సరిగ్గా పోవటం లేదు కదా! ప్రతి నెలా డాక్టరు దగ్గరికి వెళ్తూనే ఉంది..చివరికి తనే ఒకసారి ఎండోస్కోపీ చేయించుకుంటానంటే అప్పుడు వ్రాసారట!

ఇన్ని నెలలు తను బాధపడుతుంటే అసలు లోపల సమస్య ఏమైనా ఉందేమో ..టెస్టులు చేయిద్దాం అన్న ఆలోచనే రాలా వాళ్లకి. డాక్టర్లు ఎక్కడైనా ఇంతేనా అనిపించింది!

ఎండోస్కోపీలో esophageal cancer అని వచ్చింది. కాన్సరు అని తెలిసాక అది ఏ స్టేజులో ఉందో తెలుసుకోవటానికి మరో రెండు వారాలు పట్టింది. సెకండు స్టేజ్ అని తెలిసింది..తెలిసి కూడా దాదాపు రెండు నెలలవుతుంది కానీ ఇంకా ట్రీట్మెంటు మొదలవ్వలేదు! ఏదో ఒక టెస్టులు..వాటికి అపాయింటుమెంటులు..ఇలానే రోజులు గడిచిపోతున్నాయి.

మొన్నటికి మొన్న ఏదో టెస్టు చెయ్యటానికి లోపలకి తీసుకెళ్ళాక పొటాషియం లెవల్సు చాలా తక్కువ ఉన్నాయని ఆ టెస్టు చెయ్యటం కుదరక ఆపేసారు..పొటాషియం ఎక్కిస్తున్నారు..మళ్ళీ అపాయింటుమెంటు ఎప్పుడు దొరికితే అప్పుడే ఆ టెస్టు!

అక్కడ ఇన్స్యూరెన్సు ఫార్మాలిటీసు ఎక్కువ కాబట్టి ఇంత ప్రొసీజరల్ డిలే అంటుంటారు..ఎంత ఇన్స్యూరెన్సు ప్రొసీజర్ అయినా అది వేగంగా జరగటానికి ఏదో ఒకటి చెయ్యాలి కాని.. ఓ వ్యాధి నిర్థారణకి..దానికి తగిన చికిత్స ఇవ్వటానికి ఇలా రోజుల తరబడి చేస్తుంటే ఇవతల పేషెంట్సు పరిస్థితి ఏమిటి! అందులోనూ కాన్సరు లాంటి ప్రాణాంతక వ్యాధుల్లో కొంత వెసులుబాటు ఉండాలి కదా!

ఇప్పుడు తన పరిస్థితి ఎలా ఆయిందంటే పూర్తిగా మంచం మీదే..లిక్విడ్ డైటు..అదీ ట్యూబుల ద్వారా! మొన్నటి వరకు ఎవరైనా పట్టుకుంటే నాలుగు అడుగులు వెయ్యగలిగేది..ప్రస్తుతం అంతా మంచం మీదే!  మాట్లాడలేని పరిస్థితి!

ఇక్కడి నుండి వాళ్ల అమ్మా నాన్న వెళ్లారు..వాళ్ళకి విషయం అంతా చెప్పకుండా..చిన్న సర్జరీ చెయ్యాలి అని చెప్పారు.  అక్కడికి వెళ్ళాక తన పరిస్థితి చూసి వాళ్ళు కన్నీరు మున్నీరు అవుతున్నారు. అక్కడి పద్దతులు చూసి వాళ్ళింకా బెంబేలెత్తుతున్నారు..ఇండియా తీసుకెళ్ళిపోదాం అక్కడే సర్జరీ చేయిద్దాం అని వాళ్ళ గొడవ. ఇక్కడయితే ఈ పాటికి సగం ట్రీట్మెంటు కూడా అయిపోయేది.

అమెరికా వాసులారా..తనకి త్వరగా ట్రీట్మెంటు మొదలవ్వాలంటే ఏం చెయ్యాలో ఎవరైనా చెప్పగలరా!

12 వ్యాఖ్యలు:

సృజన June 11, 2012 at 8:34 PM  

అవునంటండి...నేను ఇలాంటిదేవిన్నాను! పాపంకదా.

teresa June 11, 2012 at 9:03 PM  

very sad! I don't know exactly what kind of variables are involved in this case but it's not usually this bad :(
Was she seen by an Oncologist yet?
I hope the treatment plan falls in place soon.

హరే కృష్ణ June 11, 2012 at 9:07 PM  

చాలా బాధాకరమండీ
వివిధ దేశాల నుండి ట్రీట్ మెంట్ కోసం భారతదేశం వస్తున్నారు.
సరైన డాక్టర్ దొరకాలని ఆశిద్దాం.

KumarN June 11, 2012 at 9:57 PM  

I agree with Ms Teresa above.

I was almost screaming loud out of my lungs at every sentence NOOOOOOO

Ledu Varudhini gaaru, as a person who is getting the benefit out of the medical system in US and also as a person who has two close friends with Colon Cancer and Lukemia, I can tell with utmost confidence that whatever the message that this post is carrying Is far far far far from true!!!!!

Healthcare costs are very high, keeping that point aside for a minute, this is the best country to get medical treatment and that too for personalized care.

What happens is actually opposite to what is said above. Yes insurance industry monitors everything , but doctors main fear is not to get sued.

You will have no idea , how far these docs go to eliminate any suspicions, because they dont want to get caugh the wrong end.

Anyway my point is not to debate, i just want to tell you that , what is written above is not the accurate reflection of the system here.

My good friend Lakshmi is an Oncologist, do you want me to ask her any questions about this case?

సన్నాయి June 11, 2012 at 9:58 PM  
This comment has been removed by the author.
సిరిసిరిమువ్వ June 11, 2012 at 11:22 PM  

తెరెసా గారూ..అంకాలజిస్టుని కలిసారండి..కలిసాకే బయాప్సీలని..IHC లనీ చేస్తున్నారు...we are also hoping the treatment starts soon.

కుమార్ గారూ..మీతో నేను విభేదించను కానీ..నా స్నేహితురాలి విషయంలో మాత్రం నూటికి నూరుపాళ్లూ అక్కడి సిస్టం తప్పిదమే..అందరికీ ఇలా జరక్కపోవచ్చు..may be it's her bad luck.

ఆరు నెలలపాటు ఓ మనిషి తన సమస్య రోజు రోజుకి ఎక్కువవుతుందని చెప్తుంటే కనీస మాత్రపు టెస్టులు చెయ్యకుండా ఏవో ఉపశమనపు మందులు ఇవ్వటం నిర్లక్ష్యం కాదంటారా!

నాకు అక్కడి Healthcare system గురించి మీ అంతగా తెలియకపోయినా కొద్దో గొప్పో తెలుసండి..నా స్నేహితురాలిని ముందు చూసిన ఫామిలీ ఫిజిషియన్ ని స్యూ చెయ్యమని చాలామంది చెప్పారు..కానీ ఇప్పుడు ఉన్న మెంటల్ టెన్షన్సుకి తోడు అది కూడా ఎందుకని వీళ్ళు చెయ్యలేదు!

Anyway thank you for your concern and I will let you know if they want any help.

సీత June 11, 2012 at 11:31 PM  

ayyo........:( dont know how to respond.narrating is soo nice

కమనీయం June 12, 2012 at 12:04 AM  

అమెరికాలో అధునాతనమైన మంచి వైద్యమే లభిస్తుంది.కాని చాలా ఖర్చుతో కూడినది.ఇన్సూరెన్సు లేకపోతే మరీ కష్టం.డాక్టర్లకి కోర్టు కేసులు,డామేజీలు అంటే చాలా భయం.అందువలన రిస్కు తీసుకోరు.ఏమైనా మీరు చెప్పిన కేసులో diagnosis ఆలస్యమైపోయింది.వెంటనే హైద్రాబాద్ తీసుకొని వచ్చి సర్జరీ చేయిస్తే మంచిది.తర్వాత radiation అవసరం ఉండవచ్చును.ఐనా అడ్వాన్సుడు కేసుకాబ ట్టీఫలితం చెప్పలేము.ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా వెంటనే హైద్రాబాద్ లేక బాంబే కేన్సర్ హాస్పిటల్లో చికిత్స చేయించమని
మీ మిత్రులకు చెప్పండి .
Dr.M.V.Ramanarao

KumarN June 12, 2012 at 5:57 AM  

వరూధిని గారు,
యెస్, నేనూ జనరల్ గా అంత ఘోరంగా ఉండదు అని చెప్పే ప్రయత్నంలో ఎక్కువ రాసాను :) బట్, మీరు చెప్పింది నిజమే, కొన్ని ఇండివిడ్యువల్ కేసెస్ లో చాలా అన్యాయాలు జరుగుతుంటాయి. ఇంతకన్నా బాధాకరమైనవి జరిగాయి ఇక్కడ, సిస్టం ఆర్ డాక్టర్ ఫెయిల్యూర్స్ కి అవి బెస్ట్ ఎక్జాంపుల్స్.

నేను పైన చెప్పిన Colon Cancer ఫ్రెండ్ విషయంలో దాదాపు మీరు చెప్పిన విధంగానే జరిగింది. అది ఆయన డాక్టర్ తప్పిదమే, సరైన టైమ్ లో ఇంకొక్క ఒకటి, రెండు టెస్టులు చేసి ఉండి ఉంటే, తన ట్యూమర్ చాలా ముందే కనిపెట్టబడి ఉండేది. దానికి మా ఫ్రెండ్ తప్పు కూడా ఉంది. కొన్ని సింప్టమ్స్ వస్తున్నప్పుడు చాలా చాలా లేట్ చేసాడు, ఏదో నార్మల్ ది లే అని. ఇక్కడ కొన్ని సార్లు మనం డాక్టర్ దగ్గిర గట్టిగా insist చేయాల్సి ఉంటుంది, అప్పుడు కానీ వాళ్ళు నెక్స్ట్ టెస్ట్ సజెస్ట్ చేయరు. సాధారణంగా ఇలాంటివి బోర్డర్ లైన్ కేసెస్ లో జరుగుతాయి. టెక్నికల్ గా కనపడుతున్నవన్నీ అబండంట్లీ వారంట్ చేయలేదనుకోండి, ఫర్దర్ టెస్ట్స్ కి, దెన్ it becomes debatable. అక్కడే ఒక డాక్టర్ కీ, ఇంకో డాక్టర్ కీ చాలా తేడా కనపడేది.

ఈ డిఫరెన్స్ అర్ధం చేసుకుంటే, సెకండ్ ఒపీనియన్ కోసం వెళ్ళాలి, ఆ రైట్ మనకి ఎప్పుడూ ఉంటుంది అన్న విషయం తెలుసుకుని మనం ఎక్సర్ సైజ్ చేసుకోగలిగితే , ఎడ్యుకేటెడ్ డయాగ్నసిస్ వచ్చే చాన్సెస్ ఎక్కువయితాయి. రెండు ఉదాహరణలు దీనికి.
౧. మై ఫ్రెండ్ రమేష్..90% block అయ్యాయి. Immediate ga surgery అని ఒక డాక్టర్ చెప్పాడు, before he leaves the hospital premises, but he insisted for second opinion, and the second doctor felt Stents would be enough, and he got away with 4 Stents. He is living happily for 3 years now
2. My own case: నేను నలుగురు ఫిజీషియన్స్ ని మార్చాను, hereditary గా వచ్చే బిపి కి కరక్ట్ మెడిసిన్ సంపాదించటానికి. అప్పుడు కాని i didn't find the right one.

Anyway, as I said, నా ఉద్దేశం వ్యతిరేకించటమో, డిబేటో కాదు. ఏమైనా సెకండ్ ఒపినీయన్ లాంటి దానికి క్వశ్చన్స్ కనక ఉంటే , నా ఫ్రెండ్ ఆంకాలజిస్ట్ కాబట్టి, ఏమైనా హెల్ప్ దొరుకుతుందేమో అని. అంతే.

మీ రెస్పాన్స్ కి ధన్యవాదాలు.
(ps: నేను పైన చెప్పిందంతా కూడా ఓన్లీ ఇన్సూరెన్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే, ఇన్సూరెన్స్ లేకపోతే దేవుడే దిక్కు. అదో పెద్ద సబ్జక్ట్)

teresa June 12, 2012 at 9:26 AM  

varudhini garu,
Just saw your reply. As unsettling as this sounds,your friend's family can get proactive and hasten the process from now on without losing more time. Requesting copies of all medical records and seeking second opinion, preferably from a tertiary care/ teaching hospital is the first step. writing down all questions/ concerns and requesting a sit-down session with primary MD who is supposed to have coordinated care in a timely manner is of utmost importance. This family MD himself may not know all the details but he has legal and ethical obligation to gather info from all the specialists and explain the plan of action/ inaction to patient's satisfaction. The other aggressive move is to contact the Quality control team and Executive committee of the facility.
Majority of MDs are very knowledgeable, hard working and compassionate. very rarely cases do get mismanaged due to involvement of multiple providers and umpteen other random factors. your friend's situation unfortunately seems to be one of those :(
Best of luck.

Kottapali June 12, 2012 at 3:15 PM  

అమెరికాలో ఎలాగైతే కన్సూమరే రాజు అంటారో, అలాగే అంతిమంగా బాధ్యత కూడా కన్సూమర్ దే. ముఖ్యంగా వైద్యంలో. మనమేమో డాక్టరుకే తెలుసులే, అంతా వాళ్ళే చూసుకుంటారులే అన్న ధోరణిలో ఉంటాము.
ఏదేమైనా మీ మిత్రులకి త్వరలో సరైన వైద్యం జరిగి స్వస్థత చేకూరాలని ప్రార్ధిస్తున్నా.

Ennela July 8, 2012 at 6:31 AM  

ippudu yelaa unnaarandee vaaru? treatment jaruguthondaa?

Post a Comment

statcounter

  © Blogger template Coozie by Ourblogtemplates.com 2008

Back to TOP