పరుగాపక పయనించవె తలపుల నావ.... కెరటాలకు తలవంచితె తరగదు త్రోవ

June 8, 2012

ఈ ప్రపంచం చాలా చిన్నది! అమెరికా టు ఆంధ్రప్రదేశ్ వయా ఫేస్ బుక్

యార్లగడ్డ కిమీర..1970-80 ల్లో ఓ తెలుగు రచయిత్రి..
తుమ్మల కిమీర--మా అమ్మాయి..
ఈ ఇద్దరి మధ్య సంబంధం ఏంటీ అంటారా....

ఆ యార్లగడ్డ కిమీర అన్న ఆవిడ పేరే నేను మా అమ్మాయికి పెట్టుకున్నాను.

చిన్నప్పుడు ఆవిడ పేరు ఎప్పుడు విన్నానో నాకు గుర్తులేదు కానీ ఆ పేరు మాత్రం నాకు బాగా గుర్తుండిపోయింది. ఆ పేరంటే ఓ రకమైన ఇష్టం ఏర్పడింది. ఆవిడ రచనలు కూడా కొన్ని చదివాను కానీ నాకు వాటి పేర్లు కానీ కథాంశం కానీ ఏమీ గుర్తు లేవు.  నాకు గుర్తుందల్లా ఆవిడ పేరే! ఆ పేరంటే నాకు నాకే తెలియని ఓ పాషన్.

నాకు అమ్మాయి పుట్టగానే వెంటనే ఆ పేరే పెట్టుకున్నా. మా అమ్మాయి పేరు చెప్పగానే చాలా మంది ఆ పేరుకి అర్థం అడిగేవాళ్ళు.

కిమీర అన్న పదానికి ఎక్కడా అర్థం దొరకలేదు.

కిమ్మీరం  అంటే చిత్రవర్ణం, నారింజ.

మా అమ్మాయికి కొంచం ఊహ వచ్చాక నా పేరుకి అర్థం ఏంటమ్మా అంటే ఇదే చెప్పేదాన్ని..కానీ తనకి అంత తృప్తిగా ఉండేది కాదు. ఇప్పటికీ వెతుకుతూ ఉంటుంది తన పేరుకి సరైన అర్థం కోసం:)

అయినా పేరు పిలుచుకోవటానికి బాగుంటే చాలు కదా ఈ అర్థాలూ అవీ ఎందుకట!

మన తెలుగు పేర్లలో చాలా ఎక్కువగా వినపడే అప్పారావు..సుబ్బారావు..లాంటి పేర్లకి అర్థం ఏంటి!

సరే ఇక అసలు విషయంలోకి వస్తే నేను ఎవరి పేరు అయితే నచ్చి మా అమ్మాయికి పెట్టుకున్నానో ఆ యార్లగడ్డ కిమీర గారు ఈ మధ్య ఫేసు బుక్ లో మా అమ్మాయికి ఓ మెసేజ్ పెట్టారు (ఫేసు బుక్కు లో ఆవిడ పేరు కిమీర రావు).

దాని సారాంశం..

కిమీర రావు: హాయ్..నా పేరు కూడా కిమీర నే, ఇది అరుదుగా వినపడే పేరు--నా పేరుతో మరొకరు ఉండటం నాకు చాలా ఆనందంగా ఉంది.

తుమ్మల కిమీర: నాకు కూడా చాలా సంతోషంగా ఉంది ఇలా నా పేరు ఉన్నవాళ్లని కలుసుకోవటం..ఇంతకీ మీకు ఆ పేరుకి అర్థం తెలుసా?

కిమీర రావు: తెలీదు ...మా నాన్న యూరప్ లో ఉండగా నేను పుట్టాను..అక్కడే ఆ పేరు పెట్టారు. ఆ పేరుకి అర్థం అడగాలన్న ఆలోచన నాకు వచ్చేటప్పటికి మా నాన్న గారు లేరు.

తుమ్మల కిమీర: నాకు ఈ పేరు మా అమ్మ పెట్టింది.  యార్లగడ్డ కిమీర అని ఓ రచయిత్రి ఉండేవారట..ఆ పేరు నచ్చి మా అమ్మ నాకీ పేరు పెట్టింది.

కిమీర రావు: అవునా..నా పేరు యార్లగడ్డ కిమీర..నేనూ రచయిత్రినే!

తుమ్మల కిమీర: నిజమా..భలే ఉంది మిమ్ముల్ని ఇలా కలుసుకోవటం.

చూసారా ప్రపంచం ఎంత చిన్నదో.  ఎప్పుడో చిన్నప్పుడు విన్న ఓ రచయిత్రి పేరు నేను మా అమ్మాయికి పెట్టుకోవటం..ఆమే స్వయంగా  మా అమ్మాయితో మాట్లాడటం..ఎంత విచిత్రం...నాకయితే మహా ఆనందం కలిగింది ఆవిడ్ని ఇలా కలవగలగటం...మహేష్ బాబు స్టైలు లో చెప్పాలంటే ఫంటాస్టిక్, మైండ్ బ్లోయింగ్, అన్ బిలీవబుల్, అమేజింగ్!

ప్రస్తుతం ఆవిడ వయస్సు 63 సంవత్సరాలు.. అమెరికాలో ఉంటున్నారు. ఇంకా రచనలు చేస్తున్నారో లేదో తెలియదు.

18 వ్యాఖ్యలు:

Sravya V June 8, 2012 at 7:56 PM  

Wow ! Interesting !
World is so small :))

KumarN June 8, 2012 at 8:01 PM  

Lovely experience Varudhini gaaru. Wonderful.
Nenu maa ammaayiki peru pettinappudu tana peru meeda email id open cheddaamani yahoo lo open chesi , ade peruto vetukutunte 8 different people kanipinchaaaru..vallandariki email raasaanu .. Meeku ee peru mee parents endukuettaaro ..aa story konchem teliyachestara if that is not a problem for you ani..
Konta mandi respond ayyaaru.
Adi gurtochindi..

Kimeera peru bhale bagundandi. Teliste nene pettesukune vaannemo maa papaki

మధురవాణి June 8, 2012 at 8:02 PM  

Wow.. Super!
Truly amazing, mind blowing,fantastic! :))
నేనూ ఈ పేరు ఎప్పుడూ వినలేదు మీ దగ్గర తప్ప. :)

KumarN June 8, 2012 at 8:02 PM  

Sorry for tenglish varudhini garu

శ్రీలలిత June 9, 2012 at 2:36 AM  

అద్భుత, ఆనంద, ఆశ్చర్యాలు కలగలిసిన అనుభూతి..:)

satya June 9, 2012 at 4:08 PM  

Kimira is a queen of beauty and elegance. A marvel of wanders and an enchantress of enchantresses. Intelligent, wise, brutally honest under a cold exterior, but what else would one expect from one deemed the Queen of Ice and Snow? She picks only the side she agrees with the most and has very few loyalties, being those of to herself and her lover. With magics at her aid and a charm that next to none can resist, she is a more than formidable and respectable woman.

బులుసు సుబ్రహ్మణ్యం June 9, 2012 at 6:30 PM  

కిమీర పేరు బాగుంది. ఈ కధ కొంత ఆశ్చర్యం గా బాగుంది.

Ruth June 11, 2012 at 1:06 PM  

మన తెలుగు పేర్లలో చాలా ఎక్కువగా వినపడే అప్పారావు..సుబ్బారావు..లాంటి పేర్లకి అర్థం ఏంటి!
..... these names are derived from Hindu gods like simhachalam appanna and subrahmanyeshwara etc... most names are like that either direct gods/godesses names or some sort of derivations...
in recent past, ppl turned to more secular names like, vijay/vijaya etc... but even them are mostly from sanskrit influence. very few names are there which are pure telugu secular names like.. vennela etc..
some time back, i heard that in tamilnadu, govt gave some gift to encourage ppl to name their kids in pure tamil names (gold ring) not sure how true it is. eg: karunanidhi's kids' names... azhagiri/ kanimozhi etc..
i am very much interested in names :) so, this long comment.

good to read about your daughter's experience !

సిరిసిరిమువ్వ June 11, 2012 at 7:47 PM  

శ్రావ్యా..యెస్సూ!
కుమార్ గారూ..:)
మధురా..చాలా రోజులకి దర్శనం:)
హరే కృష్ణ..థాంక్యూ!
కొత్తపాళీ గారూ..మిమ్ముల్ని నారాయణ స్వామి అనాలంటే రావటం లేదు..ఏదో పరాయి వాళ్లని పిలిచినట్టు ఉంటుంది!

సిరిసిరిమువ్వ June 11, 2012 at 7:49 PM  

జ్యోతిర్మయి, శరత్ కాలం, శ్రీ లలిత గారూ..ధన్యవాదాలు.

సత్య గారూ..అది కిమిర కదా..నేనూ చూసాను ఆ అర్థం..ధన్యవాదాలండి!

బులుసు గారూ..ఇది కథ కాదండి బాబూ..నిజంగా జరిగిందే..ద.హా!

సిరిసిరిమువ్వ June 11, 2012 at 7:55 PM  

రూత్ గారూ అంత వివరంగా వ్రాసినందుకు థాంక్సండి.
తమిళ పేర్ల గురించు..ఇది సినిమాల విషయంలో విన్నాను నేను...పిల్లల పేర్ల విషయంలో అయితే తెలియదు:)

Ennela July 8, 2012 at 6:26 AM  

bhale undi kadaa...!!!

మేధ February 19, 2015 at 10:08 AM  

భూమి గుండ్రంగా ఉండడం అంటే ఇదేనేమో... :)
కిమీర పేరు బావుంది.. :)

Post a Comment

statcounter

  © Blogger template Coozie by Ourblogtemplates.com 2008

Back to TOP