పరుగాపక పయనించవె తలపుల నావ.... కెరటాలకు తలవంచితె తరగదు త్రోవ

May 23, 2011

దీర్ఘాయుష్మాన్‍భవా! ట్రిపుల్ థమాకా!



ఈ రోజు మా అబ్బాయి పుట్టినరోజు....నిన్నటితో EAMCET.......etc.... CET లన్నీ అయిపోయి పుట్టినరోజు నాటికి పరీక్షల జంజాటం నుండి విముక్తి  అయ్యాడు.  అన్నీ బాగానే వ్రాసాడు.  IIT....BITS ల్లో మంచి మార్కులు వచ్చాయి.  ఆ రెండిటిల్లో ఏదో ఒక దాంట్లో చేరతాడు.

మా అన్నయ్యగారబ్బాయిలు ఇద్దరు (కవలలు)..వాళ్లూ నిన్న EAMCET Medical వ్రాసారు..వాళ్ళిద్దరికి కూడా మంచి మార్కులు వస్తున్నాయి..గవర్నమెంటు కాలేజిలోనే మెడికల్ సీటు రావచ్చు..అందుకని మాకు ఈ రోజు ట్రిపుల్ థమాకా అన్నమాట!

పుట్టినరోజు అంటే మా ఇంట్లో కొత్త బట్టలు..గారెలు..పులిహోర....పాయసం.. అంతే.....కేకు కటింగులు...కొవ్వొత్తులు ఊదటాలూ....పార్టీలూ  ఉండవు.  మొదటి రెండు పుట్టినరోజులకే కేకు కటింగు..బాగా చిన్నప్పుడు స్కూల్లులో పిల్లలకి చాక్లెట్టులు ఇవ్వటం.... మా అబ్బాయి పుట్టింది మేలో కాబట్టి అది కూడా ఉండేది కాదు.  చిన్నప్పుడు బాగా గొడవ చేసేవాడు..నా పుట్టినరోజు ఎప్పుడూ సెలవలలోనే ఎందుకొస్తుందని:). ఇలా సెలవుల్లో..అందులోనూ ఎండాకాలం సెలవుల్లో  పుట్టినరోజు వస్తే పిల్లలకి ఎంత నిరుత్సాహంగా ఉంటుందో!

















రాత్రి మాత్రం మా అమ్మాయి చెప్పపెట్టకుండా కేకు తెచ్చి కోయించింది..ఈ పుట్టినరోజు కాస్త స్పెషల్ అని..అవును మరి ఇక పెద్దయిపోయాడు కదా! ఇప్పటివరకు అమ్మా ఏం డ్రస్సు వేసుకోను....అమ్మా ఆదేది..అమ్మా ఇదేది..అని అన్నిటికి  వెనకెనక తిరిగే పిల్లాడు ఇక నుండి తనకు తానుగా ఉండాలి...తన నిర్ణయాలు..చిన్నవైనా పెద్దవైనా.. తనే తీసుకోవాలి..పిల్లల జీవితంలో ఈ వయస్సు ఓ పెద్ద మలుపు...పిల్లల వ్యక్తిత్వం ఓ రూపు దిద్దుకునేది  ఈ వయస్సునుండే!  ఇప్పటి వరకు అమ్మా నాన్న చెయ్యి పట్టుకుని నడిచిన పిల్లలు..ఆ చేతులు వదిలేసే తమంత తాముగా అడుగులేసే సమయం..అడుగు తడబడితే చేయూతనివ్వటానికి ఇప్పటిలాగా అమ్మానాన్న పక్కనే ఉండరు..తమంత తామే నిలదొక్కుకోవాలి..ఆచితూచి విశ్వాసంతో అడుగులెయ్యాలి...అడుగులు తడబడినా ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్ళాలి.

జీవితాంతం ఆ విశ్వాసం...ఆత్మస్థైర్యం..మా అబ్బాయికి ఉండాలని ఆశిస్తూ.....

7 వ్యాఖ్యలు:

మురళి May 23, 2011 at 1:30 PM  

Plz convey my greetings to the birthday boys

లత May 23, 2011 at 1:59 PM  

మీ బాబుకి పుట్టినరోజు శుభాకాంక్షలు
అన్నింటిలోనూ మంచి మార్క్స్ తెచ్చుకున్నందుకు అభినందనలు అండీ .
మా బాబు బిట్స్ లోనే చదివాడు.దూరం వెళ్తున్నందుకు బాధగా ఉన్నా,కంగారుపడకండి
అన్నీ వాళ్ళే నేర్చుకుంటారు. మీ పోస్ట్ చదవగానే అయిదేళ్ళ వెనక్కి వెళ్ళిపోయాను

sunita May 23, 2011 at 5:55 PM  

Congrats meeku, many many happy returns of the day. idi mee abbaayiki.

lalithag May 23, 2011 at 7:35 PM  

Congratulations and Best wishes!

మాలతి May 24, 2011 at 3:56 AM  

అభినందనలండీ మీ అబ్బాయికి. ఇంక మీపిల్లల హైస్కూలు చదువులు కూడా అయిపోయాయన్నమాట. సంతోషం.

సిరిసిరిమువ్వ May 24, 2011 at 11:09 AM  

అందరికి ధన్యవాదాలు.

Ennela May 29, 2011 at 4:00 AM  

కంగ్రాజులేషన్స్ అండీ..బాబుకి పుట్టిన రోజు శుభాకాంక్షలు...

Post a Comment

statcounter

  © Blogger template Coozie by Ourblogtemplates.com 2008

Back to TOP