పరుగాపక పయనించవె తలపుల నావ.... కెరటాలకు తలవంచితె తరగదు త్రోవ

April 9, 2011

ఒకే ఒక్కడు..ఒకే అడుగు



జయహో అన్నా హజారే!

ఎవరో ఒకరు ఎపుడో అపుడు
నడవరా ముందుగా అటో ఇటో ఎటో వైపు
అటో ఇటో ఎటో వైపు అటో ఇటో ఎటో వైపు.....

ఓ నవ వృద్దుడు వేసిన అడుగు
భావి తరాలకు ఆదర్శం అయింది
 మనలాగా నాకెందుకులే అని
 ఆ నవ వృద్దుడు నిర్లిప్తంగా కూర్చోలేదు
తన దీక్షతో కోట్లాదిమందిని కదిలించగలిగాడు
భారత యువకులలో కొత్త ఉత్సాహాన్ని ఉత్తేజాన్ని రగిలించాడు!

మొదటి వాడు ఎప్పుడూ ఒక్కడే మరి
మొదటి అడుగు ఎప్పుడూ ఒంటరే మరి
వెనుక వచ్చు వాళ్ళకు బాట అయినది .....

మొదటి అడుగు వేయాలంటే చాలా గుండె ధైర్యం ఉండాలి.
అలాంటి గుండె ధైర్యాన్ని ప్రదర్శించి
లక్షలాది యువకుల గుండెల్లో అగ్నిని రగిల్చాడు హజారే!!

ఇలా దీక్ష చేయటం ఎమోషనల్ బ్లాక్‍మెయిల్ అన్నారు
ఆయనకి వ్యక్తిగత స్వార్థాన్ని అంటగట్టిన వాళ్లూ  ఉన్నారు
అయినా ఆయన వెనకడుగు వేయలేదు.....

కదలరు ఎవ్వరూ వేకువ వచ్చినా అనుకొని
కోడి కూత నిదరపోదుగా.. జగతికి మేలుకొలుపు మానుకోదుగా..
మొదటి చినుకు సూటిగా దూకి రానిదే.. మబ్బు కొంగు చాటుగా ఒదిగి దాగితే..
వాన ధార రాదుగా నేల దారికి... ప్రాణమంటు లేదుగా బ్రతకటానికి..

42 సంవత్సరాలుగా మూలన మూలుగుతున్న
జన లోకపాల్ బిల్లుకి తన సత్యాగ్రహంతో కదలిక తీసుకు వచ్చాడు
అదరక బెదరక సర్కారుని లొంగదీసాడు
యువతీయువకులని మేల్కొలిపాడు!!

చెదరక పోదుగా చిక్కని చీకటి
మిణుగురు రెక్క చాటు చిన్ని కాంతికి
దానికి లెక్క లేదు కాళరాతిరి.....

ఆయన మొదలుపెట్టిన పోరాటానికి
మేము సైతం అంటూ
అఖండ భారతావని అండగా నిలిచింది
కోట్లాది కంఠాలు ముక్త కంఠమై
ఆయనతో గొంతుకలిపాయి

యుగములు సాగినా నింగిని తాకక
ఎగసిన అలల ఆశ అలిసిపోదుగా
ఓటమి ఒప్పుకుంటు ఆగిపోదుగా......

ఈ పోరాటం ఇలానే సాగాలి..ఇది తాత్కాలికం కాకూడదు
ఆయన మొదలుపెట్టిన పోరాటాన్ని
అందరూ కలిసికట్టుగా కొనసాగించాలి
జన లోక్‍పాల్ బిల్లు అమలులోకి రావాలి
అంతే కాదు బిల్లు రాగానే సరికాదు
అది సరిగ్గా అమలయేట్టు చూడాల్సిన బాధ్యత కూడా మనదే
అవినీతి నిర్మూలనలో మనవంతు ప్రయత్నం మనం చేద్దాం!

ఎవరో ఒకరు ఎపుడో అపుడు
నడవరా ముందుగా అటో ఇటో ఎటో వైపు
అటో ఇటో ఎటో వైపు అటో ఇటో ఎటో వైపు.....

************************************************************************************
************************************************************************************
నిన్న ఇందిరాపార్కు దగ్గర యూత్ ఫర్ బెటర్ ఇండియా ఆధ్వర్యంలో జరిగిన దీక్షా శిబిరానికి ఊరికే ఒకసారి చూసివద్దామని మా అమ్మాయి గొడవ చెయ్యటంతో  వెళ్ళిన వాళ్ళం ఓ ఐదు గంటలు అక్కడే గడిపి కొవ్వొత్తుల రాలీలో కూడా పాల్గొన్నాం.

అక్కడ ఉన్న యువతీ యువకుల ఉత్సాహాన్ని ఆవేశాన్ని చూస్తే  ఒళ్ళు పులకరించింది.
మనకు కూడా ఏదో తెలియని ఆవేశం..
కొంతమంది  తూటాలలాంటి మాటలతొ  ఆ ఆవేశాన్ని ఇంకా రగిలించారు. 
కుర్రాళ్ళు  ఎంత చక్కగా మాట్లాడారంటే ...
ఇలాంటి వాళ్ళు ఊరికి ఓ నలుగురున్నా చాలు...
వాళ్ళు చెప్పిన మాటల మీద వాళ్లు నిలబడగలిగితే....
భారతదేశానికి ఇక దిగులు లేదు అనిపించింది!
అన్నా హజారే రగిలించిన ఈ స్ఫూర్తి .....ఈ చైతన్యం.... యువ భారతీయులల్లో ఇలానే కొనసాగాలని కోరుకుందాం!!

జయహో భారత్!!

8 వ్యాఖ్యలు:

తృష్ణ April 9, 2011 at 3:53 PM  

మళ్ళీ same thoughts...అండి..:)

http://trishnaventa.blogspot.com/2011/04/standing-ovation-and-three-cheers-to.html

సిరిసిరిమువ్వ April 9, 2011 at 4:03 PM  

గిరీష్ గారు ధన్యవాదాలు.
తృష్ణ గారు :) ఇలాంటి విషయాలల్లో మన ఆలోచనలు ఒకే వేవులెంతులో ఉంటాయేమో!

lalithag April 9, 2011 at 6:29 PM  

ఇన్నాళ్ళకు ఒక ప్రయోజనకరమైన పోరాటం మొదలైనట్టుంది.
ఇది ఆవేశం కాకుండా ఉత్సాహమై ఊపందుకోవాలనీ, పక్క వాడిని కాకుండా ప్రతి ఒక్కరూ తమని తాము నిలదీసుకుని నిజాయితీ వ్యవహరించాలనే అవగాహన పెరగాలనీ ఆశిద్దాం.
ఇందులో పాలుపంచుకుంటున్న మీకూ అభినందనలు.

మరువం ఉష April 9, 2011 at 8:06 PM  

Yes, the Govt has bowed.
This is a resurgent Bharat. The power of the voice of people is mightier than the Govt.

This turning point will take our nation miles ahead, in the course of time.

Padmarpita April 9, 2011 at 8:43 PM  

ఆ అడుగు నిర్థకం కాకుండా ముందడుగైతే బాగుంటుంది!

సిరిసిరిమువ్వ April 9, 2011 at 8:48 PM  

లలిత గారు, ఇది మొదటి అడుగు మాత్రమే. చేయవలసింది చాలా ఉంది. మీరన్నట్టు ఎవరికి వారికి మనం నిజాయితిగా ఉందాం అన్న ఆలోచన రావాలి..అప్పుడే మనం కోరుకుంటున్న మార్పు సాధ్యం. ధన్యవాదాలు.

ఉషా గారు, నిజమే జనం అంతా ఒక్కటిగా నినదిస్తే ఈ ప్రభుత్వాలు దిగి రావలసిందే! ఈ చైతన్యం..ఈ స్ఫూర్తి ఇలానే కొనసాగాలి అని కోరుకుందాం.

సిరిసిరిమువ్వ April 9, 2011 at 8:50 PM  

పద్మార్పిత గారు, అదే అందరి ఆకాంక్ష..అది నెరవేరాలని కోరుకుందాం. ధన్యవాదాలు.

Post a Comment

statcounter

  © Blogger template Coozie by Ourblogtemplates.com 2008

Back to TOP