కొత్త శతాబ్దంలో ఓ దశాబ్దం
జనవరి 1, 2011.....ఈ రోజు కొత్త సంవత్సరమే కాదు..ఈ రోజుకి మరొక ప్రత్యేకత కూడా ఉంది.
ఇలా వంద సంవత్సరాలకి ఒకసారే వస్తుంది.
నవంబరు 11, 1911 న ఇలా వచ్చింది..మరలా వంద సంవత్సరాలకి ఈ సంవత్సరం వస్తుంది.
కొత్త శతాబ్దంలో ఓ దశాబ్దం గడిచిపోయింది. మరో దశాబ్దం మొదలయ్యింది. 2001 మొదలయినప్పుడు ఎంత హడావిడీ! రోజు రోజూ మారే రోజే...ఎప్పుడూ వచ్చే డిసెంబరు 31....ఎప్పుడూ వచ్చే రాత్రి పన్నెండు గంటలే.. అన్ని సంవత్సరాలలాగే అదీ ఓ సంవత్సరమే.. కానీ అదేదో కొత్తదన్నట్టు..ఇంతకు ముందు ఎప్పుడూ రానిదయినట్టు...ఇక ముందు రాదేమో అన్నట్లు...మనం ఇక మరో సంవత్సరాన్ని చూడమేమో అన్నట్లు ఎంత హడావిడీ చేసాం. ఎంత ఘనంగా ఈ శతాబ్దపు మొదటి రోజుకు స్వాగతం పలికాం. మరి మన ఆశల్ని ఆకాంక్షల్ని ఈ దశాబ్దం నెరవేర్చిందా? ఏమో సామాన్యుడి బ్రతుకు బండి వెనకటికంటే ఇంకా నిస్సారంగా నడుస్తుందేమో అనిపిస్తుంది. పెరిగిపోతున్న ఉగ్రవాదం...వేర్పాటు వాదం...ఆసిడ్ దాడులు...కక్షలు...కార్పణ్యాలు. ..కుంభకోణాలు.....అభం శుభం తెలియని చిన్నపిల్లల అపహరణలు..హత్యలు...దోపిడీలు.... ఏంటో జానెడు పొట్టకోసం ఎన్నెన్ని అకృత్యాలు!!
ఈ పది సంవత్సరాలల్లో ఎన్నెన్ని మార్పులు, ఎన్నెన్ని కొత్త ఆవిష్కరణలు..ఆ ఆవిష్కరణల పుణ్యమా అని మన జీవితాల్లో ఎంత హడావిడీ! సరిగా తినటానికి, నిద్రపోవటానికి, ఆత్మీయులతో మాట్లడటానికి తీరికలేనంత హడావిడీ. చేతినుండా డబ్బయితే ఉంటుంది కాని చేతిలో సమయమే ఉండటం లేదు.
ప్రతి ఇంటినుండి కనీసం ఓ ఎన్నారై....ఒక్కో ఇంటికి కనీసం ఓ రెండు సెల్లు ఫోనులు (భారతదేశంలో బాత్‍రూములు లేకపోయినా సెల్లు ఫోనులు మాత్రం ప్రతి ఇంట్లో ఉన్నాయంట).... చదువు అయ్యీ అవగానే అందమయిన ఐదు నక్షత్రాల హోటళ్ల లాంటి ఆఫీసుల్లో కొలువులు...అంతర్జాల పుణ్యమా అని ప్రపంచంలో ఏ మూల ఏం జరిగినా మన కళ్లముందు ప్రత్యక్షం...ఆర్కుట్లు , బ్లాగులు, ఫేసుబుక్కులు,ట్విట్టర్లలో కొత్త కొత్త స్నేహాలు, చాటులు....ఇవి లేకుండా రోజు గడవని పరిస్థితి. ఎదురుగా ఉండే మనుషులతో మాట్లాడాటానికి మాత్రం మనకు సమయం ఉండదు.
పదిసంవత్సరాల క్రితం హైదరాబాదులో ఒక్క మాలు కాని మల్టిఫ్లెక్సు కానీ లేదు..అలాంటిది ఇప్పుడు అడుగడుక్కి మాల్సు..మల్టిఫ్లెక్సులు....ఎక్కడ చూసినా కుప్పలు తెప్పలుగా జనాలు...మన కొనుగోలు శక్తి ఇంతలా పెరిగిపోయిందా అని అబ్బురపడేంత!!
ఇదివరకు ఏదో మన చదువుకి తగ్గ ఉద్యోగం..కుటుంబం నడిచిపోయేంత జీతం..అమ్మ నాన్నల్ని చూసుకుంటూ పిల్లల్ని చదివించుకుంటూ ప్రశాంతంగా జీవితం గడిచిపోతే చాలనిపించేది. మరి ఇప్పుడో మొదలు మొదలే వేలల్లో జీతాలు..పోటాపోటీ ఆడంబరమయిన జీవన విధానాలు...కారు, ఇల్లు, స్థలం, ఇంట్ర్నేషనల్ స్కూల్లో పిల్లల చదువులు...అంతా వేలల్లో ఖర్చులు...పొద్దుట బ్రేకుఫాస్టు నుండి రాత్రి డిన్నరు వరకు అన్నిట్లో పోటీనే! అన్నిట్లో వేగమే...ప్రశాంతత లేని వేగం.
గతంలో కన్నా ఈ పదేళ్లలోనే మన జీవితాలల్లో మార్పు చాలా వేగంగా ఉందేమో అని నాకు అనిపిస్తుంది. ఈ వేగంలో పడి చిన్ని చిన్ని ఆనందాలు..అనుభూతులు..అన్నీ దూరం దూరం. ఇంధ్రధనుస్సుని చూసి ఎన్ని రోజులయ్యింది. ఓ పక్క ఎండ మరో పక్క సన్నటి చినకులు పడుతుంటే గబగబా బయటికి పరుగులు పెట్టేవాళ్లం ఇంధ్రధనుస్సు కనిపిస్తుందేమో అని..ఎన్ని సార్లు చూసినా తనివితీరని అందం..ఒకసారి కనీకనిపించకుండా కనువిందు చేస్తే మరోసారి ఆకాశం ఆ దరిని ఈ దరిని కలుపుతూ ఓ పెద్ద విల్లు..ఎవరో చిత్రకారుడు పైకి వెళ్లి శ్రద్దగా గీసి కుంచెతో రంగులద్దినట్టు. ఒక్కోసారి ఒకదాని కింద మరోటి..రెండు కూడా వచ్చేవి..ఇప్పటి పిల్లలకి అసలు ఇంధ్రధనుస్సు అంటే ఏంటో అది ఎప్పుడు వస్తుందో తెలుసో లేదో..అసలు మనమే మర్చిపోయాం దాని గురించి. అసలు చూడటానికి ఈ ఆకాశహర్మ్యాల్లో అసలు ఆకాశం కనపడితేగా!! మొన్నొక రోజు ఏదో పని మీద డాబా మీదకి వెళితే ఓ పెద్ద ఇంధ్రధనుస్సు...అబ్బ ఎన్ని రోజులకి అని నన్ను నేను మర్చిపోయి చూసాను. వరద గుడంటే..ఏ దేవుడి గుడి అని అడిగే వాళ్లే ఎక్కువ!
కాలం ఇలా కదిలిపోతూనే ఉంటుంది. మరో సంవత్సరం..మరో దశాబ్దం..మరో శతాబ్దం.....దానికి అలుపు ఉండదు...దానికి ఏ కొత్త సంవత్సరపు తీర్మానాలూ ఉండవు..ఓ క్రమశిక్షణ కల సైనికుడిలా దాని పని అది చేసుకుంటూ పోతుంది. నిన్నే ఏదో బ్లాగులో అనుకుంటాను చదివాను...."గతం మంచులాంటిది...మళ్లీ కనిపించదు..వెనక్కి తిరిగి చూడకు"..అని. కాలం మంచులాంటిదే అయినా అది మిగిల్చే జ్ఞాపకాలు కాంక్రీటు కన్నా గట్టి...చెదరవు మరి. ఆ జ్ఞాపకాలే లేకపోతే మనిషికి మానుకి తేడా ఏముంది??
ఇక వ్యక్తిగతంగా నాకు గడిచిన దశాబ్దం.....ముఖ్యంగా 2010 సంవత్సరం...ఆనందాలకంటే విషాదాలనే ఎక్కువగా మిగిల్చింది. నేను చాలా అభిమానంచే మా నాయనమ్మ ఈ దశాబ్దంలోనే మరణించటం...అనుకోని రీతిలో మా నాన్న గారు ఈ సంవత్సరం మాకు దూరం కావటం మేమింకా జీర్ణించుకోలేని సత్యాలే!
రైతు సుభిక్షంగా ఉంటేనే దేశం సుభిక్షంగా ఉంటుంది. అలాంటి రైతుకి 2010 ఎప్పుడూ ఎరుగనన్ని చేదు జ్ఞాపకాలని... ఆవేదనని మిగిల్చింది. గాదెలనిండా ధాన్యరాసులతో కళళలాడాల్సిన రైతుల ఇళ్ళు ఈ సారి కళ తప్పి బోసిపోతున్నాయి. ముక్కిపోయిన మసక బారిన ధాన్యాని చూసుకుని ఏం చెయ్యాలో తెలియక ఆరుకాలం కష్టించి పండించిన పంటకి నిప్పు పెట్టుకుంటున్నాడు. ఈ సంవత్సరమన్నా రైతుకి శుభప్రదం కలగాలని ..ప్రకృతి రైతుకి సహకరిస్తుందని ఆశిస్తూ ....
ఈ రోజు మా ఇంటిముందు వేసిన ముగ్గులు.
సర్వేజనా సుఖినోభవంతు
1-1-11 ఇలా నాలుగు ఒకట్లు వెయ్యి సంవత్సరాలకి ఒకసారే వస్తుంది.
అలాగే 11-11-11 ......నవంబరు 11, 2011ఇలా వంద సంవత్సరాలకి ఒకసారే వస్తుంది.
నవంబరు 11, 1911 న ఇలా వచ్చింది..మరలా వంద సంవత్సరాలకి ఈ సంవత్సరం వస్తుంది.
కొత్త శతాబ్దంలో ఓ దశాబ్దం గడిచిపోయింది. మరో దశాబ్దం మొదలయ్యింది. 2001 మొదలయినప్పుడు ఎంత హడావిడీ! రోజు రోజూ మారే రోజే...ఎప్పుడూ వచ్చే డిసెంబరు 31....ఎప్పుడూ వచ్చే రాత్రి పన్నెండు గంటలే.. అన్ని సంవత్సరాలలాగే అదీ ఓ సంవత్సరమే.. కానీ అదేదో కొత్తదన్నట్టు..ఇంతకు ముందు ఎప్పుడూ రానిదయినట్టు...ఇక ముందు రాదేమో అన్నట్లు...మనం ఇక మరో సంవత్సరాన్ని చూడమేమో అన్నట్లు ఎంత హడావిడీ చేసాం. ఎంత ఘనంగా ఈ శతాబ్దపు మొదటి రోజుకు స్వాగతం పలికాం. మరి మన ఆశల్ని ఆకాంక్షల్ని ఈ దశాబ్దం నెరవేర్చిందా? ఏమో సామాన్యుడి బ్రతుకు బండి వెనకటికంటే ఇంకా నిస్సారంగా నడుస్తుందేమో అనిపిస్తుంది. పెరిగిపోతున్న ఉగ్రవాదం...వేర్పాటు వాదం...ఆసిడ్ దాడులు...కక్షలు...కార్పణ్యాలు.
ఈ పది సంవత్సరాలల్లో ఎన్నెన్ని మార్పులు, ఎన్నెన్ని కొత్త ఆవిష్కరణలు..ఆ ఆవిష్కరణల పుణ్యమా అని మన జీవితాల్లో ఎంత హడావిడీ! సరిగా తినటానికి, నిద్రపోవటానికి, ఆత్మీయులతో మాట్లడటానికి తీరికలేనంత హడావిడీ. చేతినుండా డబ్బయితే ఉంటుంది కాని చేతిలో సమయమే ఉండటం లేదు.
ప్రతి ఇంటినుండి కనీసం ఓ ఎన్నారై....ఒక్కో ఇంటికి కనీసం ఓ రెండు సెల్లు ఫోనులు (భారతదేశంలో బాత్‍రూములు లేకపోయినా సెల్లు ఫోనులు మాత్రం ప్రతి ఇంట్లో ఉన్నాయంట).... చదువు అయ్యీ అవగానే అందమయిన ఐదు నక్షత్రాల హోటళ్ల లాంటి ఆఫీసుల్లో కొలువులు...అంతర్జాల పుణ్యమా అని ప్రపంచంలో ఏ మూల ఏం జరిగినా మన కళ్లముందు ప్రత్యక్షం...ఆర్కుట్లు , బ్లాగులు, ఫేసుబుక్కులు,ట్విట్టర్లలో కొత్త కొత్త స్నేహాలు, చాటులు....ఇవి లేకుండా రోజు గడవని పరిస్థితి. ఎదురుగా ఉండే మనుషులతో మాట్లాడాటానికి మాత్రం మనకు సమయం ఉండదు.
పదిసంవత్సరాల క్రితం హైదరాబాదులో ఒక్క మాలు కాని మల్టిఫ్లెక్సు కానీ లేదు..అలాంటిది ఇప్పుడు అడుగడుక్కి మాల్సు..మల్టిఫ్లెక్సులు....ఎక్కడ చూసినా కుప్పలు తెప్పలుగా జనాలు...మన కొనుగోలు శక్తి ఇంతలా పెరిగిపోయిందా అని అబ్బురపడేంత!!
ఇదివరకు ఏదో మన చదువుకి తగ్గ ఉద్యోగం..కుటుంబం నడిచిపోయేంత జీతం..అమ్మ నాన్నల్ని చూసుకుంటూ పిల్లల్ని చదివించుకుంటూ ప్రశాంతంగా జీవితం గడిచిపోతే చాలనిపించేది. మరి ఇప్పుడో మొదలు మొదలే వేలల్లో జీతాలు..పోటాపోటీ ఆడంబరమయిన జీవన విధానాలు...కారు, ఇల్లు, స్థలం, ఇంట్ర్నేషనల్ స్కూల్లో పిల్లల చదువులు...అంతా వేలల్లో ఖర్చులు...పొద్దుట బ్రేకుఫాస్టు నుండి రాత్రి డిన్నరు వరకు అన్నిట్లో పోటీనే! అన్నిట్లో వేగమే...ప్రశాంతత లేని వేగం.
గతంలో కన్నా ఈ పదేళ్లలోనే మన జీవితాలల్లో మార్పు చాలా వేగంగా ఉందేమో అని నాకు అనిపిస్తుంది. ఈ వేగంలో పడి చిన్ని చిన్ని ఆనందాలు..అనుభూతులు..అన్నీ దూరం దూరం. ఇంధ్రధనుస్సుని చూసి ఎన్ని రోజులయ్యింది. ఓ పక్క ఎండ మరో పక్క సన్నటి చినకులు పడుతుంటే గబగబా బయటికి పరుగులు పెట్టేవాళ్లం ఇంధ్రధనుస్సు కనిపిస్తుందేమో అని..ఎన్ని సార్లు చూసినా తనివితీరని అందం..ఒకసారి కనీకనిపించకుండా కనువిందు చేస్తే మరోసారి ఆకాశం ఆ దరిని ఈ దరిని కలుపుతూ ఓ పెద్ద విల్లు..ఎవరో చిత్రకారుడు పైకి వెళ్లి శ్రద్దగా గీసి కుంచెతో రంగులద్దినట్టు. ఒక్కోసారి ఒకదాని కింద మరోటి..రెండు కూడా వచ్చేవి..ఇప్పటి పిల్లలకి అసలు ఇంధ్రధనుస్సు అంటే ఏంటో అది ఎప్పుడు వస్తుందో తెలుసో లేదో..అసలు మనమే మర్చిపోయాం దాని గురించి. అసలు చూడటానికి ఈ ఆకాశహర్మ్యాల్లో అసలు ఆకాశం కనపడితేగా!! మొన్నొక రోజు ఏదో పని మీద డాబా మీదకి వెళితే ఓ పెద్ద ఇంధ్రధనుస్సు...అబ్బ ఎన్ని రోజులకి అని నన్ను నేను మర్చిపోయి చూసాను. వరద గుడంటే..ఏ దేవుడి గుడి అని అడిగే వాళ్లే ఎక్కువ!
కాలం ఇలా కదిలిపోతూనే ఉంటుంది. మరో సంవత్సరం..మరో దశాబ్దం..మరో శతాబ్దం.....దానికి అలుపు ఉండదు...దానికి ఏ కొత్త సంవత్సరపు తీర్మానాలూ ఉండవు..ఓ క్రమశిక్షణ కల సైనికుడిలా దాని పని అది చేసుకుంటూ పోతుంది. నిన్నే ఏదో బ్లాగులో అనుకుంటాను చదివాను...."గతం మంచులాంటిది...మళ్లీ కనిపించదు..వెనక్కి తిరిగి చూడకు"..అని. కాలం మంచులాంటిదే అయినా అది మిగిల్చే జ్ఞాపకాలు కాంక్రీటు కన్నా గట్టి...చెదరవు మరి. ఆ జ్ఞాపకాలే లేకపోతే మనిషికి మానుకి తేడా ఏముంది??
ఇక వ్యక్తిగతంగా నాకు గడిచిన దశాబ్దం.....ముఖ్యంగా 2010 సంవత్సరం...ఆనందాలకంటే విషాదాలనే ఎక్కువగా మిగిల్చింది. నేను చాలా అభిమానంచే మా నాయనమ్మ ఈ దశాబ్దంలోనే మరణించటం...అనుకోని రీతిలో మా నాన్న గారు ఈ సంవత్సరం మాకు దూరం కావటం మేమింకా జీర్ణించుకోలేని సత్యాలే!
రైతు సుభిక్షంగా ఉంటేనే దేశం సుభిక్షంగా ఉంటుంది. అలాంటి రైతుకి 2010 ఎప్పుడూ ఎరుగనన్ని చేదు జ్ఞాపకాలని... ఆవేదనని మిగిల్చింది. గాదెలనిండా ధాన్యరాసులతో కళళలాడాల్సిన రైతుల ఇళ్ళు ఈ సారి కళ తప్పి బోసిపోతున్నాయి. ముక్కిపోయిన మసక బారిన ధాన్యాని చూసుకుని ఏం చెయ్యాలో తెలియక ఆరుకాలం కష్టించి పండించిన పంటకి నిప్పు పెట్టుకుంటున్నాడు. ఈ సంవత్సరమన్నా రైతుకి శుభప్రదం కలగాలని ..ప్రకృతి రైతుకి సహకరిస్తుందని ఆశిస్తూ ....
ఈ రోజు మా ఇంటిముందు వేసిన ముగ్గులు.
7 వ్యాఖ్యలు:
సింహావలోకనం బాగుందండి.. ముగ్గులు చాలా కలర్ ఫుల్ గా బ్రహ్మాండంగా ఉన్నాయ్. మీకూ మీ కుటుంబానికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.
మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు
SRRao
శిరాకదంబం
మీకు, నూతనసంవత్సర శుభాకాంక్షలు.
బాగుంది బాగా సింహవలోకనం చేసేరు. నిజమే చాలా మార్పులు. బాగున్నాయి మీ ముగ్గులు. మీకు కూడా నూతన సవత్సర శుభాకాంక్షలు.
అబ్బా, చాలా విషయాలు చెప్పేసారు. ముగ్గులు కూడా ఎంతబాగున్నాయో. మీకు నా హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు.

happy new year
Post a Comment