పరుగాపక పయనించవె తలపుల నావ.... కెరటాలకు తలవంచితె తరగదు త్రోవ

November 16, 2009

రెక్కలు--ఓ కవితా ప్రక్రియ

వెనక్కి
తగ్గిన
బాణమే
దూసుకెళ్తుంది

వెనకడుగైనా
విజయానికి తొలిఅడుగే ......

**********************************************************

అంతులేని
అనుభవాలు
మరువలేని
అనుభూతులు

గుప్పెడంత గుండెకు
బోలెడన్ని చప్పుళ్ళు.......

********************************************************

ఎటుచూసినా
తేనె
పూసిన
కత్తులే

ప్రశ్నించేవాడెప్పుడూ
పిచ్చోడే ! ..........

*********************************************************

కోట్లు
కూడబెట్టి
కునుకులేని
బ్రతుకు

బూడిదలో
పన్నీరు ...........

********************************************************

వేలాది
సైన్యం ఓ ప్రక్క
తోడుగా
నేస్తం మరోప్రక్క

సైన్యం వెనుదిరిగినా
స్నేహం నిన్ను వీడదు...

***************************************************************

కొనుక్కున్న
సన్మానాలు
అనవసరపు
ఆర్భాటాలు

ఖాళీ డబ్బాలో
రాళ్ళమోతలు..........

**************************************************************

రెక్కలు..........ఇది ఓ కవితా ప్రక్రియ!

నేనేంటి ఈ కవిత్వం ఏంటి అనుకుంటున్నారా!!

పైన పెట్టినవి మన బ్లాగరు పద్మకళ గారు వ్రాస్తున్న "రెక్కలు" నుండి మచ్చుకి కొన్ని.
నాకు కవితలు అంతగా ఎక్కవు..అసలు చదవను కూడా. ఈ మధ్య పద్మకళగారితో మాట్లాడినప్పుడు వీటి గురించి చెప్పారు....సరే ఓ సారి చూద్దాం అని చదివాను. సరళంగా బాగున్నట్లు అనిపించాయి. వీటి గురించి విశ్లేషించేంత పరిజ్ఞానం నాకు లేదు..పాఠకులు చదివి మీ అభిప్రాయాలు పద్మకళగారి బ్లాగులో చెప్పండి.

మొదటగా వృత్తిరీత్యా టీచరు, ఇప్పుడు జర్నలిస్టు మరియు రేడియో జాకీ, ప్రవృత్తి రీత్యా కవయిత్రి అయిన పద్మకళ గారివి ఒకటి కాదు ఏడు బ్లాగులున్నాయి.

1. సాక్షిలో తను వ్రాసిన వ్యాసాల కోసం.

2. తనకు నచ్చిన ప్రముఖుల మెసేజెస్ కోసం.

3. పిల్లల స్వచ్చమైన నవ్వులు....చల్లని చూపులతో తను తీసిన చిత్రాలతో .

4. మామూలు విషయాలతో తను వ్రాసే బ్లాగు.

5. ప్రముఖ వ్యక్తులు, మార్గదర్శుల గురించి.

6. ఇంగ్లీషు పదాల ఉచ్చారణ వాటి అర్థాలతో.

7. కవితా ప్రక్రియ "రెక్కలు" కోసం.

తీరిక దొరకని ఉద్యోగాలల్లో ఉండి కూడా ఇన్ని బ్లాగులు వ్రాస్తున్నందుకు పద్మకళ గారికి అభినందనలు.

3 వ్యాఖ్యలు:

భావన November 17, 2009 at 9:44 AM  

బాగున్నాయండి తప్పక చదివి అక్కడ కూడా కామెంటేస్తాము. అందించినందుకు ధన్య వాదాలు.. మీకు సిరి సిరి మువ్వ..

వేణూశ్రీకాంత్ November 17, 2009 at 10:44 AM  

బాగున్నాయండీ పరిచయం చేసినందుకు ధన్యవాదాలు.

Anonymous,  November 18, 2009 at 7:36 PM  

నిజంగానే నోరు తెరిచా! మీరేంటి కవిత్వమేంటీ అని?
పద్మకళ గారు ఇన్ని బ్లాగులు నిర్వహిస్తున్నట్టు ఎక్కడా చెప్పనేలేదు! అన్నీ ఒకే పేరుతోనా లేక వేర్వేరు పేర్లతోనా ! రెక్కలు బావున్నాయి అందుకే అక్కడికే ఎగిరెళ్ళిపోతున్నా .....

Post a Comment

statcounter

  © Blogger template Coozie by Ourblogtemplates.com 2008

Back to TOP