పరుగాపక పయనించవె తలపుల నావ.... కెరటాలకు తలవంచితె తరగదు త్రోవ

April 16, 2009

నేను ఓటు వేసా, మరి మీరు!

సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా తొలి విడత ఎన్నికలకు పోలింగు ఈ రోజు జరుగుతుంది. మన రాష్ట్రంలో  ఉత్తర కోస్తా, తెలంగాణా ప్రాంతాల్లోని 22 పార్లమెంట్, 154 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఈ రోజు పోలింగు జరుగుతుంది.

మనకి మరోసారి ఓటు వేసే అవకాశం వచ్చింది. అంతా సవ్యంగా ఉంటే మళ్లీ ఐదేళ్లకి కాని మనకి ఓటు వేసే అవకాశం రాదు, అందుకే ఆలసించిన ఆశాభంగం, వెళ్లి ఓటు వేసి రండి.  నేనెప్పుడో పొద్దుట ఏడు గంటలకే వెళ్లి ఓటేసొచ్చా. ఇక ఫలితాల కోసం ఓ నెల రోజులపాటు ఎదురు చూడాలి. ఈ లోపు ఎక్కడ ఎంత శాతం ఓట్లు పోలయ్యాయి, ఓటింగు సరళి ఎలా ఉంది--ఇలాంటి విశ్లేషణలతో పత్రికలు, వార్తా చానళ్లు హోరెత్తించేస్తాయి.

ఏడు గంటలకి నేను పోలింగు బూతుకి వెళ్లేటప్పటికే జనం లైనులో నిలబడి ఉన్నారు.  పోలింగు ఏడు గంటలకి మొదలు అన్నారు కాని మా బూతులో ఏడున్నరకి కాని మొదలవలేదు. అప్పటికే జనం బాగా వచ్చారు. నాకయితే ప్రతి సారి ఓటు వేసాక ఏదో గొప్ప పని చేసామన్న సంతృప్తి కలుగుతుంది. ముందు పార్లమెంటు అభ్యర్థికి ఓటేసా, లైటు బాగానే వెలిగింది, మోత కూడా బాగానే వచ్చింది.  తరువాత అసెంబ్లీ అభ్యర్థికి ఓటు వేసా, ఈ సారి లైటు సరిగ్గా వెలగలేదు కాని మోత అయితే వచ్చింది. నాకేమో అసలు ఓటు పోలయిందా లేదా అని సందేహం. ఏంటో ఈ మెషీనులు.

నాకు మా ఊరిలో ఓటెయ్యాలని ఎంత కోరికో! ప్చ్....ఏం చేస్తాం...నాకు ఓటు హక్కు వచ్చేటప్పటికి చదువు కారణంగా ఊరికి దూరంగా ఉండి ఓటు వెయ్యలేకపోయాను. అసలు మా వాళ్లు నా పేరు ఓటర్ల లిస్టులో వ్రాయించారో లేదో కూడా నాకు తెలియదు. తరువాత ఎలక్షన్ల టైముకి పెళ్లయి మా ఊరికి దూరం అయిపోయా! ఇక ఎప్పటికీ అది తీరని కోరిక అయిపోయింది. పెళ్లయ్యాక మాత్రం ఎప్పుడు ఎన్నికలు జరిగినా నా ఓటు హక్కు వినియోగించుకుంటూనే ఉన్నాను. పోయిన సంవత్సరం ఖైరతాబాదు ఉపఎన్నికలో ఓటు వేయలేకపోయినందుకు ఎంత బాధ పడ్డానో.
                                                          
                                   మంచి మార్పు కోసం ఓటేద్దాం.

9 వ్యాఖ్యలు:

చైతన్య.ఎస్ April 16, 2009 at 11:39 AM  

వచ్చే గురువారం వరకు ఆగాలి నేను :)

జ్యోతి April 16, 2009 at 12:44 PM  

నేను వేసేసాను, సకుంటుంబ సమేతంగా...

Sujata M April 16, 2009 at 3:09 PM  

Nenoo vesa. Life lo first time. And felt waaaaow !!!

సుజాత వేల్పూరి April 16, 2009 at 6:22 PM  

నేను వోటు వేయడమే కాదు పోలింగ్ ఏజెంటు గా కూడా ఉండి 3 బోగస్ వోట్లు పడకుండా ఆపాను తెలుసా?

ఒక్కటి మాత్రం నాకు ఎప్పటికీ తిరిగి రాని వసంతం! నా మొదటి వోటు! అది తల్చుకుంటే గొల్లుమనాలనిపిస్తుంది. మొదటి వోటు కదాని తీరిగ్గా ముస్తాబయి వెళ్ళేటప్పటికి వా వోటెవరో వేసారర్రో! వా........వా..........!

ఏకాంతపు దిలీప్ April 16, 2009 at 7:00 PM  

నేనొస్తున్నా వెయ్యడానికి ఢిల్లీ నుండి...

krishna rao jallipalli April 16, 2009 at 8:07 PM  

తెలుగు సుజాత గారు.. నేను మొన్ననే చెప్పాగా....

సిరిసిరిమువ్వ April 17, 2009 at 1:17 PM  

@చైతన్య గారు, మరి వచ్చే గురువారం మర్చిపోకుండా ఓటు వేయండి.

@జ్యోతి గారు, అందరూ ఓటు వేసాం అంటున్నారు మరి పోలింగు శాతం చూస్తే నానాటికి తీసికట్టు అన్నట్టుంది హైదరాబాదులో!

@సుజాత గారు, పోనీలేండి ఇప్పటికన్నా మీ హక్కు వినియోగించుకున్నారు:)

@సుజాత గారు, బోగస్ ఓట్లని అరికట్టినందుకు అభినందనలు. పోలింగు ఏజెంటుగా మీ అనుభవాలు ఓ టపాగా వ్రాయవచ్చేమో!

@దిలీపు గారు, సంతోషం. రండి...రండి..ఓటెయ్యండి..

@కృష్ణారావు గారు :(. అన్నట్టు గుంటూరు ఎన్నికల కబుర్లేంటండి?

krishna rao jallipalli April 17, 2009 at 8:48 PM  

అన్ని ప్రాంతాల మాదిరిగానే ఇక్కడ కూడా (గుంటూరు2 ) ముక్కోణపు పోటి.. హేమా హేమీలు బరిలో ఉన్నారు మరి. ఎవరికీ వారు ధీమాగా ఉన్నారు (పైకి మాత్రం). నగదు బదలీ స్కీము .. కొంచం సంచలనమే. వారం రోజుల నుండి ఎండలు మరియు ప్రచారాలు ఎక్కువయ్యాయి. గుంటూరు 1 .. ముఖాముఖీ(కాంగ్రెస్ - తెలుగు దేశం). పార్లమెంటు కూడా ముఖాముఖి (కాంగ్రెస్స్ - ప్రజారాజ్యం). చూద్దాం ... జ్యోతిషులు ఏమి చెపుతారో??

అరుణాంక్ April 30, 2009 at 10:08 PM  

నేను సూర్యప్రతాపానికి పొదవైన లైనులో నిలబడలేక రెండు సార్లు వెనక్కు వచ్చాను.ఐతే ముడోసారి వెల్లి ఓటు వేసి వచ్చాను.మన బాద్యత కదా అందుకని .

Post a Comment

statcounter

  © Blogger template Coozie by Ourblogtemplates.com 2008

Back to TOP