పరుగాపక పయనించవె తలపుల నావ.... కెరటాలకు తలవంచితె తరగదు త్రోవ

January 5, 2009

వక్కపలుకులు-3................గుఱ్ఱం ఎగరావచ్చు!

మరో సంవత్సరం వచ్చేసింది.  విజయవాడలో  పుస్తక ప్రదర్శన మొదలయ్యింది.  e-తెలుగు సభ్యులు నిన్న, అంటే జనవరి 4వ తేదీ, అక్కడ కూడా ఓ ప్రదర్శన ఇచ్చారు, మంచి ప్రతిస్పందన వచ్చింది.

 టైం మాగజైన్ "మాన్ ఆప్ ది ఇయర్" గా ఒబామ వచ్చాడట. అంతా ఒబామా మయం జగమంతా ఒబామా మయం లాగా ఉంది ఇప్పుడు. ఒబామా పదవీస్వీకరణ ఉత్సవానికి హైదరాబాదు నుండి చైతన్య అన్న ఇంజినీరింగు చదివే అమ్మాయి వెళుతుంది.

మన రానారెకి పెళ్లంట.  అయ్యా రానారె, మీ బ్లాగు ముఖంగా ఒక్కసారి అమ్మాయి బొమ్మ మాకు చూపించకూడదూ? మీ బ్లాగులో అమ్మాయితో ముఖాముఖీ కూడా పెట్టొచ్చు వెరైటీగా, మేము కూడా కొన్ని ప్రశ్నలు అడుగుతాం (సరదాకే సుమా).  మా రామయ్య పెళ్లికొడుకాయెనే అని మనమంతా ఇప్పుడు పాడాలన్నమాట. ఇంతకీ పెళ్లెప్పుడు రామనాథా! ఇంత శుభవార్త అందించిన మన వేగులకి ధన్యవాదాలు.

రాజకీయాల్లో మార్పు అవసరమని నినదిస్తున్న లోక్‌సత్తా పార్టీ దాన్ని ఆచరించి చూపిస్తుంది.  పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నికలు జరుగుతున్నాయి. అధ్యక్ష పదవికి ముగ్గురు పోటీ పడుతున్నారు.  మన మిగతా పార్టీలు ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకోవటంలో పోటీ పడుతున్నాయి. అందుకే రాబోయే ఎన్నికలలో ఆలోచించి ఓటు వేద్దాం, ఓటు హక్కుకున్న బలమేమిటో నిరూపిద్దాం.

పుస్తకల ప్రియులకి మరో మంచి నేస్తం దొరికింది చూసారా? ఇక ఎంచక్కా అక్కడ పుస్తక పరిచయాలు, సమీక్షలు, అభిప్రాయాలు చదివి మనం పుస్తకాలు కొనుక్కోవచ్చు. ఇది ఇంకా పసిమొగ్గే మరి దానికి మనకు చేతనైన ప్రోత్సాహం ఇద్దాం .

లండనులో ఓ పుస్తకాల కొట్టు ఉంది.  పుస్తకాల కొట్టు ప్రతి చోటా ఉంటుంది కదా అదో విశేషమా అంటారా! విశేషమే మరి ! అక్కడ అన్ని వంటల పుస్తకాలే ఉంటాయి  అ కొట్టు పేరే "Books for cooks" . అక్కడ ఉన్న పుస్తకాల నుండి రోజుకొక మూడు పుస్తకాలు ఎంచుకుని ఒక్కొక పుస్తకం నుండి ఒక్కో వంటకం వండి వడ్డిస్తారట. అక్కడ వంటలు కూడా నేర్పిస్తారట. అదేంటో చూడాలని ఉందా మరెందుకు ఆలస్యం లండను విమానం ఎక్కేసేయండి.

వంటలు, విమానం అంటే గుర్తుకొచ్చింది.  జనవరి ఒకటిన మా చెల్లెలు అమెరికా నుండి ఫోను చేసింది.  మా ఇద్దరి సంభాషణ ఇలా జరిగింది.

చెల్లి: ఏం చేస్తున్నావు?....

నేను: కాశ్మీరీ పలావు చేస్తున్నా......

చెల్లి: అబ్బ! ఇప్పటికిప్పుడు అక్కడికొచ్చేయాలనిపిస్తుంది నాకు....

నేను: వచ్చేసేయి మరి.....

చెల్లి: ఓ విమానం కొనేసుకుంటా ఎప్పుడంటే అప్పుడు రావచ్చు.....

నేను: అవును  ఆ పని చెయ్యి, నెలకొక సారన్నా రావచ్చు.....

చెల్లి: నెలకొకసారేంటి, వారానికి ఒకసారి వచ్చేస్తా....

నేను: అసలు ఎప్పుడంటే అప్పుడు ఎక్కడికంటే అక్కడికి ఎగురుకుంటూ వెళ్లే ఉపాయం వుంటే ఎంత బాగుండో కదా... 

చెల్లి:  అవును....

నేను: సరేలే, ప్రస్తుతానికి పలావు ఫోటో పెడతా చూసి ఆనందించు......

చెల్లి: ఆ ఫోటొ చూడగానే అందులోని పదార్థం మా కళ్లముందు ప్రత్యక్షమైతే ఎంత బాగుంటుందో కదా! మీరు రోజుకొక ఐటం చేసి పంపుతుండొచ్చు......


 నేను: అవును గుఱ్ఱం ఎగరావచ్చు, ఆ రోజూ రానూ వచ్చు.  ప్రస్తుతానికి ఇది చూసి ఆనందించు. ఎట్లా ఉందో చెప్పు!

13 వ్యాఖ్యలు:

జ్యోతి January 5, 2009 at 8:22 PM  

వరూధినిగారు,

ఈసారి వక్కపలుకులు సూపర్...

krishna rao jallipalli January 5, 2009 at 8:23 PM  

ఓ విమానం కొనేసుకుంటా ఎప్పుడంటే అప్పుడు రావచ్చు.....
మరింకేమిటి ఆలస్యం.. మార్గదర్శి లో చేరండి. బాగుంది టపా.

రానారె January 5, 2009 at 10:13 PM  

నెనరులు వరూధినిగారూ! స్మైల్‌గారట్లా ప్రకటన విడుదల చేసేశారుగానీ, పెళ్లికింకా చా..లా సమయముంది, అప్పుడు నేనే చెబుతాను. :)

రాధిక January 5, 2009 at 10:41 PM  

హైదరాబాదు నుండి అమ్మాయి వెళుతుంది అన్నారు కదా ప్రభుత్వం పంపిస్తుందా లేక తనే ఆశక్తి తో వెళుతుందా?ఫొటో బాగుంది.స్ట్రాబెర్రిలు బాగా డెకరేట్ చేసారు.

teresa January 6, 2009 at 12:01 AM  

పులావ్‌ నోరూరిస్తోంది.. అవి దానిమ్మ గింజలా?
మీకూ నూతన సంవత్సర శుభాకాంక్షలు!

కొత్త పాళీ January 6, 2009 at 4:32 AM  

పులావు పిక్చరు సూపరు. మీ వక్కపలుకులంత రుచిగానూ ఉందని ఆశిస్తున్నాం. తక్షణ రవాణాలో స్టార్ ట్రెక్ పద్ధతి బెష్టు! ఇండియా అమెరికా మధ్య ప్రయాణం సంగతి సరే గానీ ఈ వింటర్లో శిరస్త్రాణం కవచం అన్నీ ధరించి ఇంటిపక్కనున్న షాపు కెళ్ళొచ్చే లోపల పీర్లు గుండాన పడుతున్నై!

నేస్తం January 6, 2009 at 7:40 AM  

:) పలావు సూపర్

మేధ January 6, 2009 at 8:49 AM  

వక్కపలుకులు చాలా తీయగా ఉన్నాయి ఈ సారి :)
ఫొటో చాలా బావుంది.. ఇప్పుడే తినాలనిపించేలా!!

krishna January 6, 2009 at 10:53 AM  

సూపర్ వరూధిని గారు,

ఆ లండను బుక్కు స్షాపు అద్రెస్సు కాస్త చెబుదురూ.

సిరిసిరిమువ్వ January 6, 2009 at 1:05 PM  

@రాధిక గారు, ఆ అమ్మాయి ఇంతకుముందు నాసా వాళ్ల ప్రోగ్రాం ఒకదానికి ఎంపికయ్యింది, అలా వచ్చింది ఈ అవకాశం. ఆ వివరాలు ఇక్కడ చూడొచ్చు http://www.hinduonnet.com/thehindu/thscrip/print.pl?file=2008090354820400.htm&date=2008/09/03/&prd=th&

@కృష్ణుడు గారు, ఆ పుస్తకాల షాపు అడ్రస్సు
4 Blenheim Crescent, Notting Hill, London, W11 1NN
Tel 020-7221-1992
Open: Tuesday to Saturday, 10.00am to 6.00pm

మీకు ఇంకా వివరాలు కావాలంటే http://www.booksforcooks.com/ కి వెళ్లండి.

Ramani Rao January 6, 2009 at 1:59 PM  

పలావు సూపర్ :-) ఈసారి వక్కపలుకులు సూపర్

Viswanadh. BK January 6, 2009 at 6:00 PM  

టపా బావుంది. మీ సంబాషణ కూడా..

Post a Comment

statcounter

  © Blogger template Coozie by Ourblogtemplates.com 2008

Back to TOP