పరుగాపక పయనించవె తలపుల నావ.... కెరటాలకు తలవంచితె తరగదు త్రోవ

January 20, 2009

వక్కపలుకులు-5

అమెరికా....ఒబామా....అమెరికా... ఒబామా....అమెరికా....ఇవాళ ప్రపంచం చూపంతా అమెరికా వైపే.  ఈ రోజే (జనవరి 20) అమెరికా అధ్యక్షునిగా ఒబామా పదవీస్వీకారమహోత్సవం.  అమెరికా వాళ్ల ఆశలన్నీ ఆయనమీదే!  చూద్దాం ఎంతవరకు అమెరికాని తద్వారా ప్రపంచాన్ని ఆర్థిక మాంద్యం నుండి బయటపడేస్తాడో! ఎంతవరకు వాళ్ల ఆశల్ని సఫలం చేయటంలో సఫలం అవుతాడో!!

ఈ సారి మన దేశ రాజధానిలో జరిగే గణతంత్ర వేడుకలలో మొదటిసారిగా కవిత అబరాలా అనే మహిళా పైలట్  రాష్ట్రపతికి వందనం సమర్పించబోతున్నారు.

జనవరి 16 వ తేదీ US Airways వారి  విమానం ఒకటి న్యూయార్క్ హడ్సన్ నది మీద దిగిన వైనం చూసారా.   పక్షులు డీకొన్న విమానాన్ని పైలట్ సమయస్ఫూర్తితో హడ్సన్ నది మీద దింపి అందులో ఉన్న మొత్తం 155 మంది ప్రయాణీకుల ప్రాణాలని కాపాడాడు. ఇలాంటి అనుకోకుండా జరిగే సంఘటనలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకునేంత సమయం వుండదు.  లిప్తపాటులో నిర్ణయం తీసుకోవటం, అమలు చేయటం అన్నీ జరిగి పోవాలి.  Hats off to pilot and other crew members. విమానం రెక్కల మీద ప్రయాణీకులని చూస్తుంటే మాత్రం ఎంత ముచ్చటేసిందో.

విమానాల్ని ఇలా పక్షులు ఢీకొనటం విమానాల ఆవిర్భావ కాలం నుండీ ఉన్న సమస్యేనట.  విమానాన్ని కనిపెట్టిన రైట్ బ్రదర్స్‌కి కూడా వీటి బాధ తప్పలేదట.

గెలీలియో టెలిస్కోప్ ని ఆవిష్కరించి 400 సంవత్సరాలు అయిన సందర్భంగా ఐక్యరాజ్యసమితి 2009 సంవత్సరాన్ని అంతర్జాతీయ ఖగోళ సంవత్సరంగా ప్రకటించింది

కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం 800 సంవత్సరాలు పూర్తి చేసుకుంది.  ఈ యూనివర్సిటీ 1209 లో స్థాపించబడిందట. మన ప్రధాన మంత్రి మన్మోహన్ సింగు ఈ విశ్వవిద్యాలయం విద్యార్థే.  ఈ సందర్భంగా ఈ సంవత్సరం మన్మోహన్ సింగు పేరు మీద కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం వాళ్లు ఓ స్కాలర్‌షిప్ కూడా ప్రవేశపెట్టారు. అమర్త్య సేన్, న్యూటన్, డార్విన్, స్టీఫెన్ హాకింగు కూడా ఈ విశ్వవిద్యాలయం విద్యార్థులే. ఈ విశ్వవిద్యాలయం నుండి వచ్చిన వారిలో 60 మందికి పైగా నోబుల్ బహుమతి విజేతలు ఉన్నారట.

రైలు పెట్టెలో నాటకం చూడాలని వుందా అయితే పదండి ముంబయ్.1993 ముంబయి కాల్పుల తరువాత  రాజన్ వర్మ అనే వ్యక్తికి వచ్చిన ఆలోచనే ఈ థియేటర్. ఇది గిన్నెస్ బుక్‌లోకి కూడా ఎక్కింది. ప్రతి ఆదివారం మధ్యాహ్నం ఇద్దరు ముగ్గురు ఓ జట్టుగా ఓ 10 జట్టులు లోకల్ ట్రెయిన్సులోకి ఎక్కి తరువాతి స్టేషను వచ్చే లోపు ప్రస్తుత సామాజిక సమస్యల మీద 2-3 నిమిషాలు లేక 7-8 నిమిషాల నిడివి కలిగిన చిన్న చిన్న నాటికలని ప్రదర్శించి దిగిపోతుంటారు.  అలా ఓ నాలుగు గంటలలో 75,000 నుండి 1,00,000 మంది ప్రేక్షకులకి తమ ప్రదర్శనలు చూపిస్తారు.

అరుంధతి సినిమా బాగుందంటున్నారు మన నెటిజనులు, ఇది తప్పక  థియేటర్లోనే చూడవలిసిన సినిమా అట.

6 వ్యాఖ్యలు:

Anonymous,  January 20, 2009 at 6:08 PM  

రైలుపెట్టెలో నాటకాలా. బాగుందండీ మనవీధిబాగోతాల్లాగే వుంటుందేమో.

వేణూశ్రీకాంత్ January 21, 2009 at 8:07 AM  

బాగున్నాయండీ విశేషాలు. నిజమే ఆ పైలట్ ని నేను కూడా మనసులో అభినందించ కుండా ఉండ లేకపోయాను. మొత్తం 155 మంది సురక్షితమని విన్నాక చాల సంతోషించాను.
సామాజిక సమస్యల పై రైలు పెట్టెలో నాటకాల కాన్సెప్ట్ బాగుంది కానీ నిలబడడానికి కూడా చోటు లేని ముంబయ్ లోకల్ రైళ్ళ లో ఇవి ప్రదర్శిస్తున్నారంటే నమ్మలేనట్లు గా ఉంది.

సిరిసిరిమువ్వ January 21, 2009 at 10:30 AM  

మాలతి గారు, ఓ రకంగా అంతేనేమో కాకపోతే ఇవి చాలా తక్కువ నిడివి కలిగి వుంటాయి.

శ్రీకాంత్, అవును మనకు నమ్మలేనట్లుగానే వుంటుంది. ఈ ప్రదర్శనలు ఇచ్చేవాళ్లు ట్రెయినులో ఉన్నట్లు కుర్చీలు పెట్టుకుని రిహార్సల్సు చేసుకుంటారట. ఒక్కోసారి కంపార్ట్మెంటులో గొడవకి అందరికీ వినపడదేమోనని గొంతు చించుకుని అరవాల్సి వస్తుందట. ఇన్ని ప్రతికూలతల మధ్య ఇన్నాళ్లగా ఈ థియేటరు సాగుతుందంటే నిజంగా చాలా గొప్ప విషయం.

Ramani Rao January 21, 2009 at 4:19 PM  

ప్రయాణికులను సురక్షితంగా కాపాడిన పైలట్ కి అభినందనలు నేను కూడా మనసులోనే చెప్పేసుకొన్నాను ఈ వార్త వినగానే. రంగస్థల నాటకాలు వర్సస్ రైలు నాటకాలు అని ఓ వ్యాసం రాసేస్తారేమో ఇకముందు. :-) బాగుంది కదా.
కవితా అబరాల కి కూడా మన మహిళల శుభాభినందనలు.
నిరంతర వార్తా గుళికలు వక్కపలుకులు భలే బాగున్నాయి.

తెలుగుకళ February 18, 2009 at 4:55 PM  

పైలెట్ సమయస్ఫూర్తికి జోహార్లు.
అసలు మామూలుగా థియేటర్లలో నాటకాలకే ఆదరణ తగ్గుతున్న రోజుల్లో రైలులో నాటకాలను ప్రదర్శించటం గొప్ప ప్రయోగం. వారి కృషి అభినందనీయం.
కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం 800 సంవత్సరాలు పూర్తి చేసుకుందంటే ఆశ్చర్యంగా ఉంది.
మంచి విషయం చెప్పారు.

తెలుగుకళ February 18, 2009 at 5:12 PM  

కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయానికి 800 ఏళ్లంటే ఆశ్చర్యంగా ఉంది. పైలట్ కు జోహార్లు. రైలులో నాటకాలడటం భలే ఉంది. అభినందనీయం.

Post a Comment

statcounter

  © Blogger template Coozie by Ourblogtemplates.com 2008

Back to TOP