పరుగాపక పయనించవె తలపుల నావ.... కెరటాలకు తలవంచితె తరగదు త్రోవ

August 20, 2007

స్వగతం---చాలా రోజుల తరువాత

చాలా రోజులయ్యింది బ్లాగులోకంలోకి అడుగుపెట్టి. ఈ మధ్య నా ఆరోగ్యరీత్యా బ్లాగులకు పూర్తిగా దూరంగా ఉంటున్నాను. రాయటానికి అశక్తత, చదవటానికి ఉదాసీనత, వెరసి అసలు కంప్యూటరు ముందుకే రావటం మానేసాను. ఇంకొక మూడు నెలలు పూర్తి విశ్రాంతి, ఆ తరువాత మరలా మామూలు. ఈ మధ్యే మరలా అప్పుడప్పుడు కాస్త బ్లాగులు చదువుతున్నాను. కొత్త బ్లాగులు చాలా వచ్చేసినట్లునాయి, కానీ రాసి పెరిగినంతగా వాసి పెరిగినట్లుగా అనిపించటంలేదు. పాత వాటిని చదవటానికి వుండే ఆతృత వీటిని చదవటానికి ఉండటంలేదు. కొన్ని బ్లాగులు ఉన్నాయి, అవి చదవకపోతె ఏదో మిస్సు అయిన ఫీలింగు కలుగుతుంది.
అవే వీవెనుడు అడిగిన అత్యుత్తమ బ్లాగులకి నా సమాధానం.
అంతరంగం
విహారి
కొత్తపాళీ
సాలభంజికలు (గురువు గారు ఈ మధ్య ఏమి రాస్తున్నట్లు లేరు)
సత్యశోధన
శోధన
రాకేశ్వరరావు
శ్రీరాం-సంగతులూ సందర్భాలూ
రానారే
సౌమ్య
తెలుగునేల
గుండె చప్పుడు
కలగూరగంప
రెండు రెళ్ళు ఆరు
అవీ-ఇవీ
వీవెనుడి టెక్కునిక్కులు
చదువరి
రమ-మనలో మన మాట
శ్రీకృష్ణదేవరాయలు(ఈ మధ్య అసలు కనపడటంలేదు మరి)
తెలుగు జాతీయవాది
వైజా సత్య
ఒరెమూనా
రెండు రెళ్ళు ఆరు
నా మదిలో
ఓనమాలు
పడమటి గోదావరి రాగం.

నాకు బాగా నచ్చినవి ఇక్కడ ఇస్తున్నాను. ఇంకా నచ్చినవి కొన్ని ఉన్నాయి, కానీ సత్యసాయి గారు చెప్పినట్లు పరిమితి లేకపోతే కష్టం.

10 వ్యాఖ్యలు:

రాధిక August 21, 2007 at 12:09 AM  

పూర్తి ఆరోగ్యవంతులై త్వరగా బ్లాగ్లోకానికి తిరిగి రావాలని ఆశిస్తున్నాను.

lalithag August 21, 2007 at 12:43 AM  

Best wishes for your speedy and full recovery from me too. Take care.

కొత్త పాళీ August 21, 2007 at 12:58 AM  

మీ ఆరోగ్యం సత్వరమే చక్కబడాలని, మీ బ్లాగుగళం మళ్ళీ బ్లాగ్లోకంలో సరిగమలు నించాలనీ కోరుకుంటూ

Anonymous,  August 21, 2007 at 1:37 AM  

తొందరగా కోలుకొండి. బ్లాగడానికి బోలెడన్ని రోజులు ముందున్నాయి. అంతవరకు ప్రశాంతంగా వుండండి.

త్రివిక్రమ్ Trivikram August 21, 2007 at 8:24 AM  

మీ ఆరోగ్యం సత్వరమే చక్కబడాలని కోరుకుంటున్నాను.

జ్యోతి August 21, 2007 at 6:06 PM  

మీరు త్వరగా కోలుకోవాలని ఆ భగవంతుని ప్రార్ధిస్తు...

మిస్సింగ్ యూ..............

spandana August 22, 2007 at 2:25 AM  

మీ సత్వర ఆరోగ్యాన్ని కోరుకుంటూ...

--ప్రసాద్
http://blog.charasala.com

రవి వైజాసత్య August 22, 2007 at 2:30 AM  

మీ గురించి బ్లాగ్లోకంలో విన్నాను కానీ ఎప్పుడూ మీ బ్లాగు చూడలేదు (బహుశా మీరు బ్లాగు లోకంలో అడుగిడిన కాలంలో నేను వనవాసం వెళ్ళినట్టున్నాను). ఇప్పుడే విహారి గారి సిద్ధ, బుద్ధా నుండి ఇక్కడ దిగాను.

త్వరగా కోలుకొని మళ్లీ టపాలు రాయాలని కోరుకుంటున్నా

సిరిసిరిమువ్వ August 22, 2007 at 5:24 PM  

అందరికి ధన్యవాదములు.

Ramani Rao August 30, 2007 at 5:30 PM  

థాక్స్ అండీ!! వరూధినిగారు.... వాళ్ళని అడిగి అవసరమయితే తప్పకుండా మీ సహాయం తీసుకొంటాను...

మీకు మా అందరి తరుపున పుట్టినరోజు శుభాకాంక్షలు...

Post a Comment

statcounter

  © Blogger template Coozie by Ourblogtemplates.com 2008

Back to TOP