పరుగాపక పయనించవె తలపుల నావ.... కెరటాలకు తలవంచితె తరగదు త్రోవ

May 14, 2007

స్త్రీ-స్వేచ్చ-స్వాతంత్రం

స్త్రీ-స్వేచ్చ-స్వాతంత్రం గురించి మాట్లాడినట్లు పురుషుడు-స్వేచ్చ-స్వాతంత్రం గురించి మాట్లాడరెందుకని???

స్త్రీ వాద సాహిత్యం వుంది కాని పురుషవాద సాహిత్యం లేదెందుకని???

స్త్రీ వాద రచయిత్రులున్నారే కాని పురుషవాద రచయితలు లేరెందుకని???

స్త్రీల హక్కుల పరిరక్షణ గురించే కాని పురుషుల హక్కులు గురించి మాట్లాడరెందుకని???

ఎక్కడా చూసినా మహిళా సంఘాలే కాని పురుష సంఘాలు ఉండవెందుకని???

అంటే పురుషుడికి సంపూర్ణ స్వాతంత్రం ఉన్నట్లా? అతనికి ఎలుగెత్తి చాటుకోతగ్గ బాధలు కష్టాలు ఏమీ లేనట్లా? ఉన్నాకాని ఎలుగెత్తి చాటుకుంటే ఎక్కడ అలుసైపోతామో అన్న భయమా? లేక చెప్పుకోవటానికి అడ్డొచ్చే అభిజాత్యమా?

ఇవన్నీ నా దగ్గర జవాబు లేని ప్రశ్నలు.

ఇది నేను రాయబోయే విషయానికి ఓ చిన్న ముందు మాట లాంటిది. మీ మీ జవాబులు విన్నాక (చూసాక) అది మొదలుపెడతాను.

గమనిక: ఇక్కడ జవాబులు రాయటానికి స్త్రీ పురుష భేదం లేదు. ఎవరైనా రాయవచ్చు.

9 వ్యాఖ్యలు:

కొత్త పాళీ May 14, 2007 at 4:18 PM  

మంచి ప్రశ్నలు అడిగారు.

జ్యోతి May 14, 2007 at 7:07 PM  

నిజమేనండి ...వాళ్ళకు ఉంటాయి కష్టాలు. కాని చెప్పుకుంటే అలుసైపోతామని అనుకుంటారో లేక వాటిని అంత లెక్క చేయకుండా ధైర్యంగా ఉంటారేమో?????

Sudhakar May 14, 2007 at 7:43 PM  

http://en.wikipedia.org/wiki/Masculism
చదవండి

lalithag May 14, 2007 at 7:58 PM  

మీ ప్రశ్నలు బావున్నాయి. (మొత్తం జవాబు చదవండి. నన్ను నేనే contraDict చేసుకున్నాను).

మగవారితో సమానంగా ఉండాలి అని వారేనా పొగ త్రాగ గలిగేది, మేము తాగ గలం అని అక్కడ సమానత్వం చూపించుకుని పైకెదుగుతున్నామంటూ కిందిగి దిగజారడం లాగా ఉంటుంది పురుష వాదం మొదలు పెడితే. అసలు స్త్రీవాదం ఉండాల్సిన అవసరం లేకుండా ఉండడం అనేది ఆశయంగా ఉండాలి సమాజానికి.

వంతులు వేసుకుని మాకూ కష్టాలు ఉన్నాయి అని మగ వారూ ముందుకు వస్తే చర్చ ఆసక్తి కరంగా ఉంటుంది. కానీ ఇది అంత కొత్తదేమీ కాదు. "ఆడ వాళ్ళూ, స్వేచ్ఛ" అని నేను రసిన టపాకు బదులుగా కొందరు మగవారు ఇలాంటి ప్రశ్నలే వేశారు. పెండ్లి కావలిసిన అబ్బాయిలు కొంత మంది పాపం వారి కష్టాలు ఏకరువు పెట్టుకుంటున్నారు కూడా బ్లాగుల్లో. అమ్మాయిల సమస్యలు వినీ వినీ ఇవన్నీ కొత్త రకంగా కొంత వినోదం అందించడం నిజం. కాని మగవారికి ఉండే ఇటువంటి సమస్యలు ఆడవారి సమస్యలతో పోల్చ దగినవి కానే కాదు సంఖ్యలో కాని, పరిమాణంలో కాని.

కట్నం ఎందుకిస్తారు, కట్నం ఇవ్వని వాడినే పెళ్ళి చేసుకుంటామని పట్టుదలగా ఉండండి అని సలహాలిస్తూ ఉంటారు. అది ఆచరణలో ఎంత మంది అమ్మాయిలకు సాధ్యం? మీ కంటే ఎక్కువ చదువుకున్న వారు, పెద్ద ఉద్యోగం చేసే వారు ఎందుకు కావాలంటారు, తక్కువ స్థాయిలో ఉన్న వాడిని పెళ్ళి చేసుకోవచ్చు కదా అని ఉచిత సలహాలు పడేసే వాళ్ళూ కొల్లలు. పెళ్ళి తరవాత సమస్యలున్నా, పెళ్ళి కాకుంటే ఉండే సమస్యలతో పోల్చుకుని "lesser evil" ని ఎన్నుకుంటారు చాలా మంది అమ్మాయిలూ, వారి తల్లిదండ్రులూను . మరి అబ్బాయిలు వారి so called కష్టాలకి కారణం వెతుక్కుంటే సమాధానం వారికి అతి దగ్గరలోనే దొరుకుతుంది.

మళ్ళీ అనిపిస్తోంది, ఒక రకంగా పురుష వాదం మంచి ఆలోచనేనేమో అని. అప్పుడూ focus మగవాళ్ళు అవుతారు. వారికి మనం పాఠాలు చెప్పొచ్చు, భార్య చెయ్యట్లేదని బాధ పడొద్దు, ఇంట్లో పని నేర్చుకుంటే నీకే మంచిది. పిల్లలను కనేసి తను గొప్పదని అనుకుంటోందా? నువ్వు వారిని సమర్థ వంతంగా పెంచి నీ మగతనం చూపించుకో. ఇలా వారిని కష్టాలనుండి ఉద్ధరించే బోధలు చెయ్యొచ్చు. అవును, పురుష వాదం ఎందుకు లేదు?

spandana May 15, 2007 at 12:17 AM  

ఎందుకంటే ఈ సమాజంలో పురుషుల కంటే పైతరగతిలో ఎవ్వరూ లేరు గనుక. మంచీ, చెడు, చిన్నా, పెద్దా, స్వేఛ్ఛ, నిర్భందం అన్నీకూడా relative terms. ఇక్కడ వున్న ఆడామగాలో మగదే అధిపత్యం (మగకూ కొన్ని సమస్యలున్నా) కనుక ఆడవారికి సంఘాలూ, వాదాలు వున్నాయి మగవారికి లేవు.

--ప్రసాద్
http://blog.charasala.com

cbrao May 15, 2007 at 12:02 PM  

నేను April లో దీప్తిధారలో feminism గురించి రాశాను.

"సుధాకర్ మాట్లాడుతూ ఇందులో కూడా మితవాదులు, అతివాదులు వున్నారన్నారు. స్త్రీకి సమాన హక్కులు నుంచి స్త్రీలను దోపిడీ (exploitation) చెయ్యటాన్ని వ్యతిరేకించటం దాకా feminism ఉంది. స్త్రీవాదం లో నాకు తెలియని, అర్థం కాని విషయాలు కొన్ని ఉన్నాయి. నాకు తెలిసినవి. స్త్రీలను పురుషులతో సమానంగా చూడటము. మూఢ నమ్మకాలనుంచి, క్రూరమైన మతాచారాలనుంచి రక్షణ కలిపించడం. స్త్రీ విద్యను ప్రోత్సహించటం. తనకు నచ్చిన విధంగా చదువుకునే స్వేచ్చ ఇవ్వటము. వివాహం విషయంలో స్త్రీని సంప్రదించి భాగస్వామిని ఎంపిక చెయ్యడము. నాకు అర్థం కానివి: స్త్రీలు మగవారికి ఆకర్షణ వస్తువులు కాదు అని కొందరు స్త్రీలు నిరశిస్తూ, కొన్ని సంవత్సరాల కిందట టాంక్ బండ్ పై నుంచి bra లను హుస్సేన్ సాగర్ లో విసిరి వేయటం. స్త్రీలు మగవారితో సమానమన్న వాదనతో మంగళ సూత్రాలు తీసివేయటం."
Clubs లో పేకాట ఆడటం, smoking చెయ్యటం ఇప్పుడు ఫాషన్ అయ్యింది. ఆడవారు గృహ నిర్వహణ, మొగవాడు ఉద్యోగం చేసి సంపాదించటం ఆడవారూ హర్షిస్తారు. దీనికి విరుద్ధంగా స్త్రీ ఉద్యోగం చేస్తూ మొగవాడు వంట పని చేస్తే దాన్ని ఆడవారు సమర్ధిస్తారా? అట్లాంటి మొగవాడిని ఫెమినిస్ట్లు వివాహమాడతారా?

పురుషవాదం మూర్ఖత్వం అని పురుషులకు తెలుసు. అందుకే ఇట్లాంటి ప్రశ్నలు వారికి ఉదయించవు.

Sudhakar May 15, 2007 at 6:47 PM  

ఫెమినిష్టులలో ఇరవై ఎనిమిది రకాలన్నారండీ బాబు. అందువలన నేను ఫెమినిష్టు అని మగ, ఆడ లలో ఎవరన్నా "ఏ రకం?" అని మీరు అడిగి వారితో సంవాదంలోనికి దిగటం మంచిది. :-)

కొన్ని ఫెమినిజాలు ఆడవారికే చిరాగ్గా వుంటాయి.

Japes May 15, 2007 at 10:53 PM  

ప్రసాద్ గారు, మీరు జవాబు క్లుప్తంగ చాన మంచిగ చెప్పినరు.

"Clubs లో పేకాట ఆడటం, smoking చెయ్యటం" ఇట్ల చేసేటోల్ల సంఖ్య ఆడవాల్లలో ఎంత శాతం., అది class తో వచ్చేది sex తో కాదని నా ఉద్దేశం. మీరు ఉంటున్న వాడలో ఎంత మంది ఆడవాల్లని చూసింరు అట్ల smoking చెయ్యటం.

"టాంక్ బండ్ పై నుంచి bra లను హుస్సేన్ సాగర్ లో విసిరి వేయటం" ఈ విషయం గురించి తెలువది కాబట్టి స్పందించలేను.

"స్త్రీలు మగవారితో సమానమన్న వాదనతో మంగళ సూత్రాలు తీసివేయటం" (feministల వాదన వినిపించటం కాదుగని) సంతల తమ పశువులను గుర్తించనీకి వాటిమీద గుర్తులు (numbers) వేసినట్టు, మంగళ సూత్రాలు మట్టెలు చూడగానే అయ్యొ ఈమెకి పెల్లైపోయింది అని demarcate చెయ్యడానికా? సంస్కృతి సంప్రదాయలు అన్న మాటలు గుర్తుకు వస్తె, మరి అలాంటిదే ఒకటి ఆడవారి చేత మగవాల్లకి కట్టించే సంప్రదాయమెక్కడ కనిపించదే? ఎందుకంటే అవన్నీటికి సూత్రధారులు అగ్రవర్ణాలకు చెందిన మగవారేగనుక.

ఇంకో మొఖ్యమైన విషయం 'స్త్రీవాదం' గురించి చర్చ వచ్చినప్పుడల్లా అది 'స్త్రీల కష్టాలు కక్కే ఒక సంస్థ' అనే గాని 'స్త్రీల స్వేచ్ఛ, సమానత్వానికై ఎత్తిన ఒక గొంతు' అని ఎన్నడు గుర్తిస్తాం మనం (మగ / ఆడవారైనా ) ? ఆడవారికి స్వేచ్చ ఎందుకు లేదు మగవాల్లకంటే fastగ ఉన్నారు ఇవ్వాల రేపు అని వాదించే ముందు, మీ ఇంట్లో/ వాడ / ఊరు / రాష్ట్రం ల ఎంత మంది ఆడవాల్లు మగవాల్ల లెక్క ఇంట్లో చెప్పకుంట, ఎవ్వరి తోడులేకుంట బయిటికి వెల్లగలరు. We cannot take freedom for granted just because we (Men) have it !

spandana May 16, 2007 at 8:00 PM  

జేప్స్ గారూ,
ఒకర్నొకరు అభినందించుకుంటే బాగుండదేమో అని సంశయిస్తున్నాగానీ మంగళసూత్రం మీద అదిరిపోయే సమాధానం చెప్పారండీ.
అసలు నాకైతే కాళ్ళకు పట్టీలు, చేతులకు గాజులు, మెడలో మంగళ సూత్రం, జారిపోయే పైట, కాళ్ళకు అడ్డం పడే చీర ... ఇవన్నీ కూడా స్త్రీని నిర్భందించేవే...కదిలినా అందరికీ తెలియడం కోసమేనేమొ ఈ పట్టీలు, గాజులు అనిపిస్తుంది. (మరీ extremeగా ఆలోచిస్తున్నానా?)

ఈ మద్యే ఒక కథ చదువుతుంటే అందులో స్కూల్ టీచరు "స్త్రీకి చదువు అవసరమా?" అన్న విశయం మీద వ్యాసాలు రాయమంటుంది. అయితే కథానాయిక ఆ విషయం మీదే అభ్యంతరం చెబుతుంది. "స్త్రీకి హాలి పీల్చడం అవసరమా?" అంటూ కొంటేగా ఆడుగుతుంది. ఇదీ అలాగే వుంది కదా అనిపిస్తోంది ఇప్పుడు.

మొన్నటిదాకా స్త్రీకి చదువెందుకన్నారు. నిన్నేమో ఉత్తరం చదవనూ, రాయనూ వస్తే చాలన్నారు. ఇప్పుడేమొ ఏదో చిన్న వుద్యోగం చేసి మొగుడికింత సహాయపడితే చాలంటున్నారు. ఇక స్వేఛ్ఛా అంతే! ఇంట్లో స్వేఛ్ఛ చాలని మొన్నా, ఊర్లో చాలని మొన్నా, ఉద్యోగం చేసేంత చాలని ఇప్పుడు అంటారే గానీ.... స్త్రీని ఒక వ్యక్తిగా, మనిషిగా చూడగలిగే మనసు సమాజానికి రావాలంటే మరింత మంది ఫెమినిస్టులు మరింత కష్టపడాలి.

మొన్నో జర్మన్ షాపులో కనపడ్డాడు. అదీ ఇదీ మాట్లాడుతూ చర్చ రాజకీయాలవైపు మళ్ళింది. ఒబామా ప్రెసిడెంటు అయినా, హిల్లరీ అయినా అది ఒక చరిత్ర సృష్టిస్తుంది అన్నా! ఒబామా అయినా ఫర్వాలేదు గానీ హిల్లరీ ప్రెసిడెంటు అయితే మాత్రం నేను జర్మనీకి వెళ్ళిపోతా అన్నాడాయన! ఒక ఆడదాన్ని దేశాద్యక్షురాలిగా చూడటం ఆయనకు సుతారామూ ఇష్టం లేదట!

--ప్రసాద్
http://blog.charasala.com

Post a Comment

statcounter

  © Blogger template Coozie by Ourblogtemplates.com 2008

Back to TOP