నా బ్లాగుకి పంచ వసంతాలు!
ఏంటో ఈ మధ్య నా బ్లాగు జోలికే వెళ్ళటం లేదు. ఈ రోజు ఎందుకో బ్లాగులోకి
వెళ్తే అసలు ఈ సంవత్సరం ఒక్క టపా కూడా వ్రాయలేదు! హతోస్మి! దిక్కూ మొక్కు
లేనట్టు పడున్న నా బ్లాగుని చూస్తే దిగులేసింది.
ఏం చెయ్యను! గత రెండు నెలలుగా ఊపిరి పీల్చుకోను కూడా తీరికలేనంత పని!
జనవరి 2 న మా పూర్వ విద్యార్థుల సమ్మేళనం..ఆ తరువాత మా అక్క వాళ్ళ అబ్బాయి పెళ్లి హడావిడి..ఇదిగో పోయిన వారంతో అన్నీ ముగిసి తెరిపిన పడ్డా!
పెళ్ళంటే పందిళ్ళు, సందళ్ళు, తప్పెట్లు
తాళాలు.. తలంబ్రాలు
మూడే ముళ్ళు ..ఏడే అడుగులు
మొత్తం కలిసి నూరేళ్లు....
ఎంత బాగా చెప్పాడు ఆత్రేయ!
పెళ్ళంటే ఆడపెళ్లి వారి కంటే మగ పెళ్ళి వారికే ఎక్కువ హడావిడి ఉంటుంది. వాళ్లకి ఒక్క రోజుతో అయిపోతే మగపెళ్ళి వారికి మూడు రోజుల హడావిడి!
ఇప్పటి కాలపు పెళ్లిలా షామియానాలు..బఫే భోజనాలు..ఒక్క పూట తంతులా కాకుండా... తాటాకు చలువ పందిళ్లు, మేళతాళాలు, బంతి భోజనాలు.. పదహారు రోజుల పండగ దాకా అన్నీ దివ్యంగా ..సాంప్రదాయబద్దంగా జరిపాం.
ఇంతకీ నేనివాళ గమనించిన విషయం ఏంటంటే ఫిబ్రవరి 21 కి నా బ్లాగు మొదలుపెట్టి ఐదు సంవత్సరాలు..అప్పుడే ఐదు సంవత్సరాలు అయిపోయాయా? ఇప్పటివరకు ఇది కూడా గమనించలేదు నేను!
ఈ టపాతో కలిపి ఓ 130 టపాలు వ్రాసినట్టున్నా..మరీ నత్త నడకంటారా? పోనీలేండి నా వరకు నాకది ఎక్సుప్రెస్సు నడకే! నా బ్లాగు ప్రయాణం బహు సమతుల్యతతో నడుస్తుంది..అంత వేగంగానూ నడవటం లేదూ ...మరీ మూలనా పడటం లేదు.
ఈ ఐదు సంవత్సరాల బ్లాగు ప్రయాణం లో అన్ని రుచులు ఆస్వాదించా! మంచి స్నేహితులూ దొరికారు! కొంతమంది మంచి మితృలు కనుమరుగయ్యారు! కొత్త మితృలు జత కలిసారు!
నా దృష్టిలో బ్లాగన్నది మన జీవితంలో ఓ భాగం కాదు. మన అభిప్రాయాలు, మనసులోని భావాలు పంచుకోవటానికి ఓ వేదిక అంతే! కుదిరిన రోజు వ్రాస్తాం..లేని రోజు లేదు! నచ్చిన వాటిని మెచ్చుకుంటాం..నచ్చని వాటిని వదిలేస్తాం!
నా మొదటి వార్షికోత్సవ టపా!
సర్వే బ్లాగు జనా సుఖినోభవంతుః

35 వ్యాఖ్యలు:
I still remember those days,
when people investigated and found who you really are :-)
It is already five years!
వరూధిని గారు : అభినందనలు
నూటముప్పై ' మీకంటే నేనే ముందున్నానోచ్ . మూడున్నరేళ్ళకే నూటముప్పై రాసేసాను
మువ్వ గారూ అభినందనలు,మీరు ఇంకా ఇంకా వ్రాయాలి
Congrats vardhini garu ...keep blogging
అభినందనలు మువ్వగారూ ! మరిన్ని మంచి మంచి టపాలు రాస్తూ, మీ అమూల్యమైన సలహాలు,సూచనలు మా అందరికీ అందిస్తూ ఉండాలని కోరుకుంటున్నాను.
అభినందనలు వరూదినిగారూ...
Congratulations !
Congratulations Varudhunigaaru
ఐదేళ్లకు నూట ముప్పైయా?? బజ్జు, ప్లస్సు వచ్చాక మీరు బ్లాగును పట్టించుకోవడమే మానేసారు. అస్సలు బాలేదు వరూధినిగారు..
పంచవర్ష వార్షికోత్సవ శుభాకాంక్షలు.
కిరణ్ (ఒరెమూనా):)..ఎవరూ కనిపెట్టలేదులే.. చదువరి గారే చెప్పేసారు!
లలిత గారూ..ధన్యవాదాలు..మీతో నాకు పోటీయా?
పప్పు గారూ..శేఖర్, తృష్ణ గారూ ధన్యవాదాలు.
నేనొప్పుకోను వరూధినిగారు,, మిమ్మల్ని Red handed గా సాక్ష్యాలతో పట్టుకుంది నేనే. కావాలంటే చదువరిగారిని అడగండి. :)
జ్యోతిర్మయి గారూ, శ్రావ్యా, కృష్ణవేణి గారూ థాంక్సండి!
జ్యోతి గారూ..అదేం లేదండి..ప్లస్సు, బజ్జుల ప్రభావం ఏమీ లేదు..ఎప్పుడయినా నేను తక్కువే కదండి వ్రాయటం..కంపారిటివ్ గా 2011 లోనే కాస్త ఎక్కువ వ్రాసా! ధన్యవాదాలు.
అభినందనలు అమ్మమ్మగారూ :))
పంచవర్ష ప్రణాళికలా ఐదేళ్ళు గడిచిపోయాయన్నమాట.. అభినందనలు.. :)
బ్లాగింగ్ గురించి మీరు చెప్పింది నాకు నచ్చింది. :)
వరూధిని గారు ,
పంచవర్ష బ్లాగ్ వార్షికోత్సవ శుభాకాంక్షలు .
అయిదు సంవత్సరాల మీ చిన్నారి సిరి సిరి మువ్వకు, ఇంకా ఎన్నో ఎన్నో మువ్వలు జతకూరి మువ్వగోపాలుని వన్నెచిన్నెలలన్నీ పొదివి పట్టుకోవాలని మనసారా కోరుకుంటున్నాను. హృదయపూర్వక శుభాభినందనలు.
congratulations!
అభినందనలు మేడమ్.
-Owner of Miscellany Blog
అభినందనలు వరూధిని గారు :)
తాటాకు చలువ పందిళ్లు, మేళతాళాలు, బంతి భోజనాలు.. పదహారు రోజుల పండగ దాకా అన్నీ దివ్యంగా ..సాంప్రదాయబద్దంగా జరిపాం. బాగుందండీ ఈ మధ్య కాలంలో ఇలా చూసి చాలా రోజులయ్యింది!
అభినందనలు! మీరిలాగే ఎన్నో ఎన్నెన్నో వ్రాస్తూ సమతుల్యతతో మున్ముందుకి నడిపించాలని మనసారా కోరుకుంటూ....
సౌమ్యా..సరే మనమరాలా :)
మధురా, మాలా గారూ ధన్యవాదాలు.
జయ గారూ, మీ ఆత్మీయ అభినందనలకి హృదయపూర్వక ధన్యవాదాలు!
తెరెసా గారూ, ధన్యవాదాలు..ఎన్నాళ్లకెన్నాళ్టికి! బాగున్నారా!
ధర్మస్థలం, బంతి, రసజ్ఞ థాంక్యూ!
అభినందనలు సిరిసిరిమువ్వ గారు..
పంచమ వార్షికోత్సవ శుభాకాంక్షలు. అభినందనలు.
అభినందనలు అండి..
వరూధినిగారు,
Hearty congratulations.
సిరి సిరి మువ్వ అనబడు వరూధిని గారికి,
ముందస్తే తెలియకుండా పోయే! తెలిసుంటే మీకు ముందు గానే ఓ ఫన్ ఆర్ట్ విత్ సిరి సిరి మువ్వ పెట్టి వుండున్ జిలేబి!
హార్దిక శుభాకాంక్షలతో
చీర్స్
వరూధిని కాని జిలేబి.
సంతోషమండి.. టిక్కెట్టు లేకుండా చిన్నప్పుడు పెరిగిన పల్లెటూరులో నన్ను దిగబెట్టే బ్లాగులలో మీ బ్లాగు మొదటిది.
ఆభినందనలు. ధన్యవాదములు.
ఐదవ వార్షిక గీటురాయి మీద సిరిసిరి మువ్వల మెరుపుకి ఆనందం. మీ ఫలానా పోస్ట్ ఇలా గుర్తు, అందువలన గుర్తు అని ఊదరగొట్టను కానీ నా చిన్నతనానికి దాదాపుగా ఒరవడి అనిపించే ఊసులు చెప్పా/ప్తారు, ఈ జీవన ప్రవాహపు ఉరవడికి మనం ఎంచుకున్న మార్గమందూ సాపత్యం ఉంది. అందుకే రాశి/వాసి కాదు ఆ వైనం/వన్నె కోసం వస్తాను. మీరన్నట్లుగానే చదవటానికి వనరులు ఇవ్వగల పరిచయాలు/ వెన్నంటి ఉండగల స్నేహాలు నాకూ ఇక్కడ దక్కాయి. మరొకసారి అభినందనలతో... (మరొక మాట:- చాలా ఏళ్ల సుదూరమే అయినా యువ పెళ్ళి ని గూర్చి దిగులుపెట్టేసారు నాదీ తాటాకు పెళ్ళి పందిరి, బంతి భోజనాల సన్నాహం కనుకనే ;) )
Congratulations muvva garu.... mee blog ilanti bdays enno jarupukovali :)
అభినందనలండి...ఎన్నో వసంతాలు జరుపుకోవాలని ఆశిస్తూ
లక్ష్మీ రాఘవ
congratulations Varu
వరూధిని గారు... అభినందనలు
సుభ గారూ, వనజా వనమాలి గారూ, తెలుగు పాటలు గారూ, చందు గారూ ధన్యవాదాలు.
జిలేబి గారూ...మీ వ్యాఖ్యకి చాలా సంతోషం..ధన్యవాదాలు.
ఊకదంపుడు గారూ..ధన్యోస్మి!
ఉషా..ధన్యవాదాలు..ప్చ్..ఏం మాట్లాడను! మీ వ్యాఖ్య ఓ పదిసార్లు చదువుకుని మురిసాను! మీ యువ పెళ్ళికి మేమంతా లేమూ! మీరేం దిగులు పడకండి..ఆ మాత్రం ఉడత సహాయం చెయ్యలేమా!
ఇందు, లక్ష్మీ రాఘవ గారూ, శశాంక గారూ..థాంక్యూ!
మైనా..:)thank you my friend1
Post a Comment