పరుగాపక పయనించవె తలపుల నావ.... కెరటాలకు తలవంచితె తరగదు త్రోవ

July 6, 2010

సికింద్రాబాదు రైల్వేస్టేషనులో వృద్దులకు వికలాంగులకు ఉచిత వీల్‍చెయిరు సదుపాయం

సికింద్రాబాదు రైల్వేస్టేషనులో ఎయిర్‍టెల్ వాళ్లు మరియు బ్యాంకు ఆఫ్ బరోడా వాళ్లు వృద్దులకు.. వికలాంగులకు ఉచిత వీల్‍చెయిరు సదుపాయం కల్పించారు.  ఇది మామూలు వీల్‍చెయిరు కాదు...బాటరీ ఆపరేటెడ్ ఆటో..చాలా సౌకర్యంగా ఉంది.  రైలు స్టేషను చేరుకునేముందే వీరికి ఫోను చేసి ఫలానా రైలు ఫలానా బోగీకి వస్తున్నాం  అని చెపితే వాళ్లు రైలు వచ్చే సమయానికి ఆ బోగీ దగ్గరకు వస్తారు.  అలానే రైలు ఎక్కటానికి వెళ్లేటప్పుడు కూడా వాళ్లకి ఫోను చేసి చెప్తే  మొదటి ఫ్లాటుఫారం మీదనుండి ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకెళతారు.  ఈ సదుపాయాన్ని  పోయిన డిసెంబరునుండి ఎయిర్‍టెల్ వాళ్లు మరియు బ్యాంకు ఆఫ్ బరోడా వాళ్లు కల్పించారు.  ఇద్దరూ చెరొక ఆటో తిప్పుతున్నారు.  దీనితో రైల్వే వాళ్లకు ఎలాంటి సంబంధమూ లేదు.  మనం డైరెక్టుగా ఆ ఆటోల డ్రైవర్లకి ఫోను చెయ్యటమే! కాకపోతే దీని గురించి ఒక్క మొదటి ఫ్లాటుఫారం మీద మాత్రమే ఫోను నంబర్ల వివరాలు కల నోటీసు అంటించారు..ఈ నోటీసు అన్ని ఫ్లాటుఫారాల మీద అంటిస్తే ప్రయాణీకులకు బాగా ఉపయోగపడుతుంది.  మొన్న ఒకసారి నేను వైజాగు నుండి వస్తూ పెద్దదయిన మా ఆమ్మ కోసం తొమ్మిదవ నంబరు ఫ్లాటుఫారం నుండి ఈ ఫోను నంబర్ల కోసం ఒకటో నంబరు ఫ్లాటుఫారానికి రావల్సి వచ్చింది.  అక్కడ టి.సి.ని...పోర్టర్లని..మామూలు వీలుచెయిరు వాళ్లని ఎవర్ని అడిగినా ఫోను నంబర్లు మాకు తెలియదు అన్నారు.  చాలా మంది ప్రయాణీకులకు కూడా ఈ సదుపాయం గురించి తెలియదు. ముఖ్యమయిన ఎక్సుప్రెస్సు రైళ్లల్లో కూడా ఈ సమాచారం పెడితే ఇంకా బాగుంటుంది.

ఫోను చెయ్యవలసిన నంబర్లు
ఎయిర్ టెల్:--9676707007
బ్యాంకు ఆఫ్ బరోడా:--9652210067 

6 వ్యాఖ్యలు:

పరిమళం July 6, 2010 at 3:17 PM  

మంచి సమాచారం! మా అమ్మగారు కాలు ఆపరేషన్ తర్వాత ఇక్కడికి వచ్చినప్పుడు రైల్వే వాళ్ళదే తీసుకున్నాం ఐతే అది బాటరీది కాదు కూలీ తోసుకుంటూ టాక్సీ వరకూ తీసుకొచ్చాడు.మీరన్నట్టు ఈ సమాచారం ప్రతి ప్లాట్ ఫాం మీదా అంటిస్తే అందరికీ తెలుస్తుంది .

Kesari July 6, 2010 at 5:27 PM  

yeah , this is really a wonderful facility being provided.

The benefit the old and needy passengers get with this is just priceless.!

We should concentrate on more such simple ideas which add an infinite value to human kind.

హను July 6, 2010 at 6:12 PM  

aa vishayaanni ila prachaaram lo ki tisukostu chala manchi pani chestunnaru

భావన July 7, 2010 at 8:33 AM  

మంచి సమాచారం. :-)

nagendra July 21, 2010 at 8:39 PM  

idi chala manchi idea. congrates to AIRTEL @ BOB.
knkumar

Weekend Politician (వీకెండ్ పొలిటీషియన్) September 23, 2010 at 8:35 PM  

Good Post with very useful information. :-)

railways themselves need to think of providing such facilities. I totally agree with kesari's comment above.

Post a Comment

statcounter

  © Blogger template Coozie by Ourblogtemplates.com 2008

Back to TOP