నిగ్గదీసి అడుగు......
సత్యంలో అంతా అసత్యమేనట. మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు అసలే కష్టాలలో వున్న సాఫ్టువేర్ పరిశ్రమకి మరో దెబ్బ. ఇక్కడ నాకు అర్థం కాని విషయం--ఇలాంటివి బయటపడ్డప్పుడే మన పత్రికల వాళ్లు అంతకుముందు వున్న లోట్లు, లొసుగులు, జరిగిన మోసాలు, ఇత్యాది గురించి పేజీలకి పేజీలు కథనాలు ప్రచురిస్తుంటారు ఎందుకని?(investigative journalism అంటే ఇదే అంటారా!) ఇవన్నీ ముందే బయటపెడితే సామాన్య మానవుడు కాస్త జాగ్రత్తపడతాడుగా. అయినా ఇక్కడ సామన్యుడిని పట్టించుకునేది ఎవరంటారా? అదీ నిజమే.
ఆటోవాడు మీటరు వేయను నేను అడిగినంత ఇవ్వాల్సిందే అన్నప్పుడూ, తప్పుడు మీటరుతో ఎక్కువ డబ్బులు తీసుకున్నప్పుడూ, అరటిపళ్ల బండి వాడు డజను కాయలకి 10 కాయలే వేసి నన్ను మోసం చేయాలని చూసినప్పుడూ, పేపరు వాడు సరిగ్గా పేపరు వేయకుండానే పేపరు బిల్లుకి వచ్చినప్పుడూ, పాలవాడు నిలవ వున్న (ముందు రోజువి) పాల పాకెట్లు వేసినప్పుడూ---చ లోకంలో అంతా మనల్ని మోసం చేయాలని చూసేవాళ్లే అని బాధపడిపోతుంటాను, వాళ్లని ఏదో చేయాలన్ని కసి, ఏమీ చేయలేని ఉక్రోషం, అస్సహాయత-కానీ ఇప్పుడు జరిగిన మోసం చూస్తుంటే ఇవన్నీ అసలు మోసాలే కాదు అనిపిస్తుంది. వాళ్లు బ్రతకటానికి చేస్తుంటే వీళ్లు బ్రతక నేర్చి చేస్తున్న మోసం.
ఒకటి కాదు రెండు కాదు అక్షరాలా ఏడువేల కోట్ల రూపాయలకి దొంగ లెక్కలు. మరి ఇలాంటి మోసగాళ్లని ఏం చేయాలో! నే చేసింది తప్పే, అంతా నేనే చేసాను అని తప్పు ఒప్పేసుకుంటే సరిపోతుందా? అసలు ఇంత జరుగుతున్నా మూడోకంటికి తెలియకపోవటం ఏమిటి? మనింట్లో జమాఖర్చుల్లో ఓ పది రూపాయలు తేడా వస్తేనే మనకి నిద్ర పట్టదు మరి అలాంటిది ఇన్ని కోట్లకి దొంగ లెక్కలు వేస్తుంటే అంత పెద్ద కంపెనీలో ఎవరికీ తెలియలేదా? మళ్లీ ఓ ప్రసిద్ధ విదేశీ కంపెనీ దాని లెక్కలు చూసేది. వాళ్ల లెక్కలు వాళ్లే రాసుకునేప్పుడు దానికి ఇంకో కంపెనీ ఎందుకో? ఏంటో మనలాంటి వాళ్లకి అన్నీ ప్రశ్నలే! ఏది సత్యమో ఏది అసత్యమో అంతా అయోమయమే! అయినా మన ప్రశ్నలకి జవాబిచ్చేదెవరు?
సత్యం వాళ్లకున్న ఆస్తులు అన్నీ అమ్మితే ఈ కష్టాలనుండి బయటపడరంటారా? కానీ అమ్మరు! వాళ్ల కోట్లు వాళ్ల కోట్లలోనే వుండాలిగా మరి!! ఇవాళ సత్యం షేరు ధర ప్రారంభంలో ఆరు రూపాయలకు పడిపోయిందట! నిన్న మొన్నటి దాకా ఎవరైనా కలగన్నారా ఆ షేరు ఆ ధరలో లభిస్తుందని. అదేంటో జనాలేమో రాజు గారు సత్యాన్ని గట్టెక్కించటానికి తన షేర్లు కూడా అమ్ముకున్నారు అని బాధపడిపోతున్నారు ! అప్పుడు కొనుక్కొన్న వాళ్ల గతి ఇప్పుడేంటి? ఇందులో లాభపడిందెవరు?నష్టపడిందెవరు? ఎంతమంది మదుపుదార్ల గుండెలు పగిలి వుంటాయి? మన ప్రశ్నలకి జవాబిచ్చేదెవరు?
సత్యం CFO వడ్లమాని శ్రీనివాస్ ఆత్మహత్యా ప్రయత్నం చేసారని మీడియా ప్రచారం చేస్తుంది, మరి అది ఎంతవరకు నిజమో తెలియదు. ఇది కూడా ఇంకో నాటకమా? మన ప్రశ్నలకి జవాబిచ్చేదెవరు?
ఇక్కడ నాకు గాయం సినిమాలో సిరివెన్నెల పాట ఒకటి గుర్తుకొస్తుంది....
Read more...

నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని
అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవచ్చవాన్ని
మారదు లోకం..మారదు కాలం
దేవుడు దిగిరానీ ఎవ్వరు ఏమై పోనీ
మారదు లోకం..మారదు కాలం..||నిగ్గదీసి||
గాలివాటు గమనానికి కాలిబాట దేనికి
గొర్రెదాటు మందకి నీ జ్ఞానబోధ దేనికి
ఏ చరిత్ర నేర్చుకుంది పచ్చని పాఠం
ఏ క్షణాన మార్చుకుంది చిచ్చుల మార్గం
రామబాణమార్పిందా రావణ కాష్టం
కృష్ణ గీత ఆపిందా నిత్య కురుక్షేత్రం ..||నిగ్గదీసి||
పాత రాతి గుహలు పాల రాతి గృహాలైనా
అడవి నీతి మారిందా ఎన్ని యుగాలైనా
వేట అదే వేటు అదే నాటి కథే అంతా
నట్టడవులు నడివీధికి నడిచొస్తే వింతా
బలవంతులే బ్రతకాలని సూక్తి మరవకుండా
శతాబ్దాలు చదవలేదా ఈ అరణ్య కాండ..||నిగ్గదీసి ||