పరుగాపక పయనించవె తలపుల నావ.... కెరటాలకు తలవంచితె తరగదు త్రోవ

September 5, 2011

శ్రావ్స్! ఓ మంచి వ్యాఖ్యాత! తెలుగు బ్లాగుల్లో వ్యాఖ్యల ద్వారా ప్రసిద్ధి చెందిన వాళ్లు కొందరున్నారు.  ఇక్కడ నేను అజ్ఞాతల గురించి చెప్పటం లేదు!  అప్పట్లో తెలుగు బ్లాగుల్లో నేస్తమా రాధిక గారి వ్యాఖ్య లేని బ్లాగు ఉండేది కాదంటే అతిశయోక్తి కాదు..కానీ ఆవిడ కూడా ముందు బ్లాగు ద్వారానే పరిచయం అయ్యారు..తర్వాత వ్యాఖ్యల ద్వారా అందరికీ దగ్గరయ్యారు.

 అసలు బ్లాగు లేకుండా వ్యాఖ్యల ద్వారానే ప్రసిద్ధికెక్కిన వారు మరి కొందరున్నారు.  వాళ్ళల్లో కుమార్ గారు ఒకరు. ఆయనకి ఇప్పటికీ బ్లాగు లేదనుకుంటాను.

ముందు వ్యాఖ్యల ద్వారానే పరిచయం అయ్యి ప్రసిద్ధికెక్కి ఆ తరువాత బ్లాగు మొదలుపెట్టి,  అడప తడపా టపాలు వ్రాస్తూ..కొన్నాళ్లకు మరో బ్లాగు మొదలుపెట్టినా..బ్లాగరుగా కన్నా వ్యాఖ్యాత గానే ఎక్కువ ఖ్యాతి గడించిన ఓ అమ్మాయి గురించి ఈ టపా!

ఈ అమ్మాయి చాలా సాదా సీదా తెలుగు అమ్మాయి!

ఆ అమ్మాయి వ్రాసే వ్యాఖ్యలు చూస్తే కొంతమందికి ముచ్చట అయితే మరి కొంతమందికి భయం..దడ..వణుకు అన్నీ ఏకకాలంలో!

పొద్దుట పొద్దుటే మంచి కాఫీ లాంటి వ్యాఖ్యలు అన్నమాట!

ఏ విషయం మీదయినా సాధికారకంగా మాట్లాడే తనని చూస్తే నాకు మహా ముచ్చటగా ఉంటుంది.

తను చెప్పాలనుకుంది నిర్భీతితో చెప్పగలదు.

నచ్చితే మెచ్చుకోవటం..నచ్చకపోతే ఖండించటం

ఎదుటి వాళ్ళు ఎవరైనా ఒకటే పంధా!

మొహమాటాల మెచ్చుకోళ్ళు...స్కోతర్షలు ఉండవు.

ఊరికే మెచ్చుకోవటం కోసం మెచ్చుకోవటం

ఖండించటం కోసం ఖండించటంలా కాకుండా

అర్థవంతమైన వ్యాఖ్యలు వ్రాసే వాళ్లలో తను ఒకరు!

మొదట్లో ఈ అమ్మాయి వ్యాఖ్యలు నేను అప్పడప్పుడు కొన్ని బ్లాగుల్లో చూసినా అంతగా పట్టించుకోలేదు.  ఓ రోజు నా బ్లాగులోనే ఇదా పరిష్కారం టపాకి నాతో విభేదిస్తూ ఓ వ్యాఖ్య పెట్టింది. కొండొకచో అపార్థమూ చేసుకుంది. అమ్మో ఫైర్ బ్రాండు అనుకున్నా!

ఈ విషయం మీదే చదువరి గారు వ్రాసిన బ్లాగులో కూడా తను వ్యాఖ్య పెట్టింది. ఆ పిల్ల క్యూరియాసిటికి ముచ్చటేసింది.

అప్పుడే తన గురించి మొదటిసారి కొంచం ఆసక్తిగా  గమనించాను. అప్పటినుండి బ్లాగుల్లో తన వ్యాఖ్యలు గమనిస్తుండేదాన్ని. చదువరి, తెలుగోడు..ఇలా కొన్ని బ్లాగుల్లో తన వ్యాఖ్యలు ఎక్కువగా కనపడుతుండేవి. తన బ్లాగుల ద్వారా ..వ్యాఖ్యల ద్వారా ..తను చాలా చిన్న అమ్మాయని ..ఇంకా పెళ్ళి కాలేదని తెలిసి మరింత ఆశ్చర్యపోయా! వయస్సుకి మించిన పరిపక్వత కనిపిస్తుంది తన వ్యాఖ్యల్లో!

తను ఎప్పుడు బ్లాగు మొదలుపెట్టిందో కూడా నేను గమనించలేదు.  నేను మొదటగా చదివిన తన టపా.. ఇందులో తన మల్టీ టాస్కింగ్ మీద తనే చెణుకులు విసురుకుంది. ఓహో టపాలు కూడా బాగానే వ్రాస్తుందే అనుకున్నా!

ఆ టపాలోనే తమరింకొంచెం తరచుగా రాయొచ్చు...అన్నదానికి తన సమాధానం

"నాకు వ్రాయటం కన్నా చదవటం ఇష్టం అందుకని ఇలా సేవ్ చేసిన టైములో ఏ బ్లాగు విడిచిపెట్టకుండా కామెంట్లతో సహా చదివేస్తున్నా :) "

ఇప్పటికీ అదే సూత్రం పాటిస్తున్నట్లుంది..అందుకే అప్పుడొకటి..ఇప్పుడొకటి తప్ప తన బ్లాగులో టపాలు జల జలా రాలవు.  అందులోనూ ఇప్పుడు బజ్జు వచ్చాక మామూలుగా తరుచుగా వ్రాసే జనాలు కూడా బజ్జుల్లో కూర్చుని బ్లాగు టపాలని నిర్లక్ష్యం చేస్తున్నారాయే!

వివాహం విద్యా నాశాయ అన్నట్టు
బజ్జు  బ్లాగు నాశాయా!

కాకపోతే బజ్జు ద్వారానే తనతో కొంచం పరిచయం పెరిగింది.  ఇలాంటి విషయాలల్లో మాత్రం బజ్జుని మెచ్చుకోవాలండోయ్!

వ్రాసిన టపాలు తక్కువే అయినా అన్నీ మంచి విషయం ఉన్న టపాలే.

స్నేహమంటే అని అమాయకంగా ప్రశ్నించినా..
కామెన్వెల్త్ క్రీడల  గురించి వ్రాసినా
నాకు లక్కుందా అంటూ అడిగినా
ఇలా జరిగింది అని చెప్పినా ..
శ్రమైకజీవన సౌందర్యం అంటూ రాంబాబు డైరీ మనకు చదివి వినిపించినా
...

కొంచం హాస్యం రంగరించి తను వ్రాసే టపాలు ఆలోచింపచేసివిగా ఉంటాయి.

మీరు అర్జంటుగా గొప్ప వాళ్ళం అయిపోదామనుకుంటున్నారా..అయితే ఈ టపా తప్పక చదవాల్సిందే..ఆ పై మీరు గొప్పవాళ్ళు కాకపోతే ఆ అమ్మాయినే అడిగేద్దాం..ఆపై కడిగేద్దాం.

తనని ఊరికే ఎవరైనా ఏమైనా అంటే ఊరుకోని తన తత్వం కూడా నాకు బాగా నచ్చింది. అందులో మన తెలుగు బ్లాగుల్లో ఆడవారిలో ఆ ధైర్యం  ఉన్న వాళ్లు బహు తక్కువ..ఎందుకొచ్చిన తలనెప్పి మనకి అని బ్లాగులు మూసుకున్న వాళ్లూ ఉన్నారు. ఇలా ఫేసు టు ఫేసు జవాబులు చెప్పే ఈ అమ్మాయంటే ఇదిగో ఈ టపా చదివాక మరి కొంత అభిమానం పెరిగింది.  అమ్మో గట్సు ఉన్న పిల్లే అనుకున్నా! ఆ గొడవ పూర్వాపరాలు నాకు తెలియదు కానీ ఆ అమ్మాయి ధైర్యానికి మెచ్చుకోకుండా ఉండలేకపోయాను.

తను వ్రాసిన టపాలల్లో నాకు బాగా నచ్చిన టపా..అన్నీ వృత్తులు సమానం కాదా ? ఎందుకు ?. మంచి చర్చ కూడా జరిగింది ఈ టపాలో.

ఇక చివరగా తను వ్రాసిన సింగపూరు గురించిన టపాలల్లో అయితే సింగపూరు గురించి అక్కడి టూరిజం గురించి ఆ దేశం వాళ్ళు  కూడా చెప్పలేనంత బాగా చెప్పింది.

అన్నట్టు ఈ అమ్మాయికి పాటలన్నా..కాఫీ అన్నా మహా ఇష్టం.  పాటల కోసమే ఓ బ్లాగు మొదలుపెట్టింది. 

ఈ రోజు తన పుట్టిన రోజని ఇప్పుడే తెలిసింది నాకు..ఎప్పుడో ఓ రెండు మూడు వారాల క్రితం వ్రాసి ప్రచురించకుండా అట్టి పెట్టిన ఈ టపాని తన జన్మదినం సందర్భంగా ప్రచురిస్తే సమయోచితంగా ఉంటుందని ప్రచురిస్తున్నా.

తను జీవితంలో ఇలానే స్థిర చిత్తంతో పైకెదగాలని ..తన ఆశలు..ఆకాంక్షలు అన్నీ నెరవేరాలని..

అభినందనలతో..ఆశీస్సులతో..

40 వ్యాఖ్యలు:

Sravya V September 5, 2011 at 1:54 PM  

మీకు ధన్యవాదాలు అని చెప్పటం ఇక్కడ చిన్న మాటే , కాని దానికన్నా ఏమి చెప్పాలా అని బుర్ర చించుకుంటున్నా నాకు ఏమి తోచటం లేదు .వరూధిని గారు నేను ఒక మంచి వాఖ్యాత ని అని చెప్పారు కాని , ఇప్పుడు ఈ పోస్టు కి నిజం గా ఏమి వాఖ్య రాయాలో తెలియం లేదు !

ఇక నేను చెప్పినట్లు నిజం గానే నాకు చదవటం ante మహా ఇష్టం , రాయటం కన్నా అందుకే ఏ ఒక్క పోస్టు వదలకుండా చదివేసేదాని మొదట్లో , ఇప్పుడు కొంచెం తగ్గింది కాని :))

అలాగే మీ బ్లాగులో వాఖ్య రాసిన పోస్టు నాకు ఇంకా గుర్తుంది :))

మీ బ్లాగులో నేను కామెంట్ రాస్తున్నా కాని బ్లాగర్ గా ఇక్కడ కూడా మొహమాటం లేకుండా చెప్పేస్తున్నా మొత్తం తెలుగు బ్లాగుల్లో చదువరి గారి బ్లాగు తరవాతే ఇంకే బ్లాగయినా నాకు నచ్చేది ! బహుసా ఆ బ్లాగులో, ఇంకా మంచుపల్లకి గారు బ్లాగులో నేను చదవని పోస్టు లేదేమో :)))

మీ అభిమానానికి మరోసారి ధన్యవాదాలు .
నాకు నచ్చిన పాట పెట్టినందుకు మరోసారి ధన్యవాదాలు !

sunita September 5, 2011 at 1:56 PM  

శ్రావ్య గారికి జన్మదిన శుభాకాంక్షలు!

తృష్ణ September 5, 2011 at 1:58 PM  

sravya gaariki, happy happy birthday !! మీరు నాకన్నా ఒక రోజే చిన్నన్నమాట..:))

Anonymous,  September 5, 2011 at 1:58 PM  

శ్రావ్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు

శ్రీనివాస్ పప్పు September 5, 2011 at 2:01 PM  

శ్రావ్స్ అందుకో నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు,నువ్విలాగే ఎన్నో మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని ఆశిస్తూ కోరుకుంటూ

వేణూశ్రీకాంత్ September 5, 2011 at 2:42 PM  

చాలా బాగారాశారు వరూధిని గారు.. శ్రావ్య గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.

Pranav Ainavolu September 5, 2011 at 3:03 PM  

చాలా బాగా రాశారు వరూధిని గారు. ఒక్క పోస్ట్ లో శ్రావ్య గారి గురించి చాలా బాగా చెప్పారు.

శ్రావ్య గారు, మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు! :)

Anonymous,  September 5, 2011 at 3:29 PM  

మంచి బ్లాగుని పరిచయం చేసినందుకు ధన్యవాదాలు
శ్రావ్య గారూ,
మంచి పాటలు ఇష్టపడ్డందుకు థాంక్స్. మీ పుణ్యమా అని నేనూ విన్నాను.

Anonymous,  September 5, 2011 at 3:29 PM  

sravya garu,
happy birthday

Shiva Bandaru September 5, 2011 at 3:57 PM  

"శ్రావ్స్! ఓ మంచి వ్యాఖ్యాత!" - నా మనసులో మాటను చెప్పారండి బాబు మీరు.
అలాగే శ్రావ్య గారికి జన్మదిన శుభాకాంక్షలు!

SRRao September 5, 2011 at 4:11 PM  

శ్రావ్య గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు

Sravya V September 5, 2011 at 4:12 PM  

సునీత గారు Thank you very much for wishes :)
తృష్ణ గారు కొంచెం ఆలస్యం గా మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు ! Thank you very much for wishes :)
లలిత గారు Thank you very much !

Sravya V September 5, 2011 at 4:15 PM  

పప్పు సార్ Thank you very much wishes :)
వేణు గారు Thank you !
ప్రణవ్ గారు Thank you !
పక్కింటి అబ్బాయి గారు Thank you !
శివ గారు SR రావు గారు Thank you !

మధురవాణి September 5, 2011 at 4:17 PM  

Simply Superb వరూధిని గారూ.. పర్ఫెక్ట్ గా చెప్పారు మన శ్రావ్స్ గురించి.. :))
Once again Happy Birthday Shraavs! :)

జీడిపప్పు September 5, 2011 at 5:03 PM  

హార్థిక జన్మదిన శుభాకాంక్షలు శ్రావ్యగారు

KumarN September 5, 2011 at 6:49 PM  

Wow. పోస్టు చాలా బాగా రాసారండీ వరూథిని గారూ. అయితే మీరూ నాలానే అనుకున్నారన్నమాట:-) నేనస్సలు నమ్మలా, నాకు మొదట తెలిసినప్పుడు తనింకా చిన్నపిల్లేనని. నేనింకా ఏ ముప్పైఅయిదు టు నలభై ఉంటాయేమో అనుకునేవాణ్ణి, మొన్నమొన్నటి దాకా:-)) (తిడుతుందేమో, నేనిన్ని రోజులూ ఓల్డ్ గా కనపడ్డానా అని, ఇది పొగడ్త శ్రావ్యా గారు).

ఇహ పోతే, ఈ శ్రావ్యా, మొన్న శంకర్ ఎస్ బజ్ లో చెప్పినట్లుగా ఎవరికో దయ్యంలాగా ప్రత్యక్షమవ్వకుండా, ఇప్పటిలాగే ఏంజెల్ లాగా మిగిలిపోతుందని కోరుకుంటూ :-)),

కుమార్ ఎన్

Sravya V September 5, 2011 at 7:20 PM  

మధుర Thank you very much :)
జీడిపప్పు గారు Thank you very much :)
కుమార్ హ హ thank you very much for your wishes :)

నైమిష్ September 5, 2011 at 7:49 PM  

మా ఊరమ్మాయి శ్రావ్య కి పుట్టినరోజు శుభాకాంక్షలు..చాలా బాగా రాసారు వరూధిని గారు..

బులుసు సుబ్రహ్మణ్యం September 5, 2011 at 8:33 PM  

ముందుగా శ్రావ్య గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు.

వరూధిని గారు చాలా బాగా వ్రాసారు. శ్రావ్య గారి గురించి ఇంతకన్నా బాగా ఎవరు చెప్పలేరేమో.


తను జీవితంలో ఇలానే స్థిర చిత్తంతో పైకెదగాలని ..తన ఆశలు..ఆకాంక్షలు అన్నీ నెరవేరాలని..

మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

Sravya V September 5, 2011 at 8:57 PM  

నైమిష్ గారు :)) థాంక్ యు !

బులుసు మాస్టారు థాంక్ యు !

Sravya V September 5, 2011 at 9:16 PM  

వరూధుని గారు మళ్ళీ ఒకసారి , మీకు ధన్యవాదాలు . మీ అభిమానానికి నిజం గా నా బ్లాగు నాకు ఎప్పుడు నచ్చాడు కాని మీరు పరిచయం చేసిన తరవాతా నాకు అది కూడా చాలా అందం గా కనపడుతుంది :))మీఅభిమానం ఆశీస్సులు ఎప్పటికి ఇలానే ఉండాలి అని కోరుకుంటున్నాను . నా గురించి రాసినది చదివిన తరవాత నిజం గా నేను అలా ఉంటానో లేదో తెలియదు కాదు, అలా ఉండాలి అని మాత్రం కోరుకుంటున్నాను . ఈ బ్లాగులు వీటి గొడవ తెలియని మా అమ్మ తో ఇవాళ మీ పోస్టు చదివించాను ;). నిజం గా ఈ పుట్టిన రోజున మీరు ఇచ్చిన ఈ గిఫ్ట్ మాత్రం నేను ఎప్పటికి మర్చిపోలేను .

Thank you once again /\.

మురళి September 5, 2011 at 11:50 PM  

సిరిసిరిమువ్వ గారూ మీ శైలిలో మరో బహు చక్కని పోస్టు..
శ్రావ్య గారూ అందుకోండి శుభాకాంక్షలు..

Anonymous,  September 6, 2011 at 12:24 AM  

వరూధిని గారూ,
శ్రావ్యగారిని చక్కగా పరిచయం చేశారు. నేను బ్లాగే ఏకైక అంశం 'తెలంగాణ'. సాధారణంగా బ్లాగరులెవ్వరూ (ఆ అంశాన్ని సమర్థిస్తున్నవారో వ్యతిరేకిస్తున్నవారో తప్పించి) ఆ అంశం జోలికి త్వరగారారు. కానీ నా టపాల్లో సూటిగా వ్యాఖ్యానించారు. అప్పుడనుకున్నా అమ్మో 'ఫైర్ బ్రాండ్' అని. ఇప్పుడు మీరు దాన్ని రూఢీ చేశారు.

శ్రావ్యగారికి పుట్టినరోజు శుభాకాంక్షలతో
శెలవు

రసజ్ఞ September 6, 2011 at 5:28 AM  

కేవలం వ్యాఖ్యల ద్వారా, వ్రాసిన టపాల ద్వారా ఒక మనిషి గురించి ఇన్ని విషయాలని తెలుసుకున్నారంటే మీరు ఎంత ఆసక్తితో ఆవిడ గురించి పరిశోధించి ఉంటారో! శ్రావ్య గారు మీకు హార్దిక జన్మదిన శుభాకాంక్షలు!

Sravya V September 6, 2011 at 7:24 AM  

మురళి గారు thank you !
అచంగా గారు మీకు గుర్తుందా ఆ కామెంట్ :))) , thank you !
రసజ్న గారు thank you !
కొత్తపాళీ గారు Thank you :)))

Sujata M September 6, 2011 at 1:05 PM  

శ్రావ్య గారు

పుట్టిన రోజు శుభాకాంక్షలు.

వరూధిని గారు - మీ రీసెర్చ్ అమోఘం. మీకు ముందు థాంక్స్.

Anonymous,  September 6, 2011 at 2:28 PM  

@ శ్రావ్య వట్టికూటి: గుర్తులేకపోవటమా! మీరిచ్చిన సలహా ఆచరణలో పెట్టే కొన్నిటికి (కొందరికి) అనవసర ప్రాధాన్యత తగ్గిస్తేను!

Anonymous,  September 6, 2011 at 2:28 PM  
This comment has been removed by the author.
Sravya V September 6, 2011 at 4:22 PM  

సుజాత గారు థాంక్ యు :))
అచంగ గారు Thank you very much for considering my suggestion:)))

kiran September 6, 2011 at 7:26 PM  

శ్రావ్య గారి గురించి నాకు తెలియని కొన్ని vishayalu మీరు చెప్పారు.....
నేను తనతో చాలా తక్కువ మాట్లాడినా తనంటే ఎంతో అభిమానం...కొంత మంది ఇంతే అనుకుంటా.....వీళ్ళల్లో ఏదో స్పార్క్ ఉంటుంది..:))
శ్రావ్య గారు ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ - కిరణ్..:))

కొత్త పాళీ September 6, 2011 at 9:38 PM  

పాట ఇప్పుడే విన్నా.
శ్రావ్యగారి సంగీతాభిరుచి కూడా మిక్కిలి ఉత్తమ శ్రేణికి చెందినదన్న మాట. వీలు కుదిరితే ఇదే పాటని జేసుదాసు, వారి గురువుగారు చెంబై వైద్యనాథ భాగవతారు పాడిన వెర్షను వినండి.

విరిబోణి September 6, 2011 at 11:53 PM  

Hello Sravya gaaru,
Belated Happy birthday to you :))

ఇందు September 7, 2011 at 12:16 AM  

మువ్వగారు టపా అదరగొట్టారు..అదీ మా శ్రావ్యా గారి గురించి వ్రాసి :) తను కూడా నాకు వ్యాఖ్యల ద్వారానే పరిచయం :) ఆ వ్యాఖ్యలు నచ్చే తన బ్లాగ్ని ఫాలౌ అవుతూ....నా బ్లాగ్ రోల్ లో పెట్తేసుకున్నా...ఎక్కడా మిస్ అవకుండా :) మీరనంట్టు ఫైర్ బ్రాండ్ అయినా కొంచెం సున్నితం కూడా ఉంది అనిపిస్తుంది :) కాని సింగపూర్ చరిత్ర మొత్తం రాసేసిన తీరు చూస్తే...నాకనిపించింది...నేను ఉంటున్న అమెరిక చరిత్ర నాకు తెల్సా? మనం ఉంటున్న దేశం గురించి ఆ మాత్రం తెల్సుకోవద్దు అని :) బాగుందండీ మీ పోస్టు :)

Sravya V September 7, 2011 at 7:37 AM  

కొత్తపాళీ గారు ధన్యవాదాలు , యేసుదాస్ గారు అందులోను వారి గురువు గారితో కలిపి పాడారంటే తప్పకుండా వింటాను .

విరిబోణి గారు థాంక్ యు :)))

ఇందు , కిరణ్ మీ ఇద్దరి వాఖ్యలు చూసాకా నాకు ఏమి చెప్పాలో తెలియటం లేదు , Thank you very much friends for your love !

Rao S Lakkaraju September 15, 2011 at 9:59 PM  

శ్రావ్య గారూ లేటుగా తెలుసుకున్నా.
Happy Birthday to you sravyaa Happy Birthday to you.
ఆలేస్యం గా చెబుతున్నా ఈ సంవత్సరం పుట్టినరోజుకి కానీ వచ్చే సంవత్సర (2012)పుట్టిన రోజుకి ఇప్పుడే చెప్పేసి ముందరుంటున్నా.

Sravya V September 17, 2011 at 6:22 AM  

Rao gaaru Thank you very much !

Rao S Lakkaraju September 17, 2011 at 7:06 AM  

సిరిసిరిమువ్వ గారూ చక్కటి సంగీతంతో ఆరంభమయ్యే శ్రావ్య గారి మీద మీ పోస్ట్ మంచి unique.

శశి కళ October 19, 2011 at 6:42 PM  

చాలా బాగా వ్రాశారు..శ్రావ్స్ పుట్టిన రొజు శుభాకాంక్షలు

సంతు (santu) September 11, 2012 at 6:37 PM  

ఒక సంవత్సరం+ఆరు రోజులు ఆలస్యంగా చూసినా కూడా, నాకు ఇక్కడ ఒక కామెంట్ పెట్టాలని ఉంది కావున తప్పక పెడ్తున్నాను
తెలుగు అంటే నాకు చాలా ఇష్టం, ఇలాంటి నాకు ఈరోజు తెలుగు వరదలా పారుతున్న మీ ఈ బ్లాగులు దొరికాయి, బహుశా ఈ రోజంతా చదువుతూనే ఉంటానేమో :o
శ్రావ్స్ గారికి 6 రోజులు ఆలస్యంగా జన్మ దిన శుబాకాంక్షలు , మీ బ్లాగ్ లు చాలా బాగున్నాయి...

సిరి సిరి గారికి స్పెషల్ థాంక్స్... :)

Post a Comment

statcounter

  © Blogger template Coozie by Ourblogtemplates.com 2008

Back to TOP