చదువులమ్మ ముద్దు బిడ్దలు..వీరికి చేయూతనిద్దాం
పేదరికం వాళ్ల ఆశలమీద నీళ్లు చల్లుతున్నా వాళ్ల పట్టుదల..దీక్ష వాళ్లకి దారి చూపుతున్నాయి. ఒక్కొక్కళ్లది ఒక్కో కథ..వ్యథ. ఈ సారి EAMCET లో అతుత్తమ మార్కులు వచ్చిన వాళ్లలో ఎక్కువమంది నిరుపేద కుటుంబాలనుండి వచ్చినవాళ్లే.
తండ్రి దూరమయినా ఆయన మాటే వేదంగా మెకానిక్ మామయ్య అండతో పట్టుదలగా చదివి ఆకాశమే హద్దుగా 159 మార్కులతో ప్రథమస్థానంలో నిలిచిన పల్లవి..
పల్లవితో సమానంగా EAMCET లో మార్కులు సాధించి ఇంటరులో 600 కి 600 మార్కులు సాధించిన ఆటోడ్రైవరు కొడుకు మహ్మద్ గౌస్
తల్లిదండ్రులు నిరక్షరాస్యులయినా మూడోస్థానంలో నిలిచిన కిరణ్.....లక్ష్మీపతి
వీరందరికి ఉన్నదల్లా ఒక్కటే ధ్యేయం..బాగా చదవాలి..ఉన్నతంగా జీవించాలి. ఎన్ని అడ్డంకులు ఎదురయినా కసి.... పట్టుదల...ఉన్నతంగా జీవించాలన్న ఆశ..అవే వారిని విజయపథాన నడిపిస్తున్నాయి. ఇలాంటివారికి అవసరం ఉన్నప్పుడు చేయూత ఇవ్వటం మన బాధ్యత..కర్తవ్యం కూడా! అలాంటి ఓ చదువుల తల్లికి సహాయం చేసే అవకాశం ప్రమదావనానికి లభించింది.
హారిక అన్న అమ్మాయిది కరీంనగర్ జిల్లా ముస్తాబాద్. తండ్రి ఓ చిన్న రైతు..సంవత్సర ఆదాయం 14,000-18,000. ఆ అమ్మాయికి 10వ తరగతిలో 91% వచ్చింది. ఇంటరులో చైతన్య కాలేజి వాళ్లు మొదటిసంవత్సరం ఉచితంగా శిక్షణనిచ్చారు..రెండవ సంవత్సరం నామమాత్రం రుసుము వసూలు చేసారు. ఇంటరులో 93% వచ్చింది. EAMCET లో ర్యాంకు రావటంతో వర్థమాన్ కాలేజి, షంషాబాదులో ఇంజనీరింగు సీటు వచ్చింది. రోజూ ECIL నుండి షంషాబాదు వెళ్ళి చదువుకుంటుంది. ఎలాగో తిప్పలు పడి మొదటి రెండు సంవత్సరాలు ఫీజులు కట్టారు. ఇప్పుడు మూడవ సంవత్సరం ఫీజు కట్టాలి..వాళ్ల నాన్న చేతులెత్తేసారు. మన బ్లాగరు రవిచంద్ర ద్వారా ఈ విషయం తెలిసి ప్రమదావనం తరుపున ఈ రోజు ఆ అమ్మాయికి 5000 రూపాయలు ఆర్థిక సహాయం అందించటం జరిగింది. ఇంకొక బ్లాగరు పరిమళం గారు వ్యక్తిగతంగా 1000 రూపాయలు సహాయం అందించారు.
ఎవరయినా సహాయం చెయ్యదలిస్తే ఆ అమ్మాయిని సంప్రదించవలిసిన ఫోను నంబరు 9703299899
తన బ్యాంక్ అకౌంట్ వివరాలు.
A/C number: 30903316788
Name of A/C Holder: L. Srinu
Bank: SBI
Branch: Vinukonada
తనకి ఆంధ్రాబ్యాంకులో అకౌంటు ఉంది కాని దాని ATM కార్డు పోయింది కనుక వేరే a/c నంబరు ఇస్తుంది..త్వరలో ATM కార్డు తీసుకోవటమో ఇంకొక a/c ఓపెన్ చేయటమో చేస్తుంది.
Read more...