పరుగాపక పయనించవె తలపుల నావ.... కెరటాలకు తలవంచితె తరగదు త్రోవ

March 5, 2009

వక్కపలుకులు-8 మంచి తరుణం....

మండే ఎండలు, పిల్లల పరీక్షలు కలిసి వాతావరణం చాలా వేడి వేడిగా వుంది. ఈ మండే ఎండలలో పుస్తక ప్రియులకి ఓ చల్లటి వార్త. విశాలాంధ్ర వారి వార్షిక క్లియరెన్సు అమ్మకం సందర్భంగా కొన్ని పుస్తకాల మీద 10 నుండి 50 శాతం వరకు తగ్గింపు ఇస్తున్నారు. విశాలాంధ్ర బ్యాంక్ స్ట్రీట్ బ్రాంచి మరియు యూసఫ్‌గూడా చౌరస్తాలో ఈ తగ్గింపు అమ్మకం ఈ నెల 25 వరకు వుంటుంది. పుస్తకాలు కొనాలనుకునేవారికి ఇదే మరి మంచి తరుణం వదులుకోకండి.

జాషువా, ఆరుద్ర, దాశరథి, వాసిరెడ్ది సీతాదేవి, గొల్లపూడి, బాపురెడ్డి మొదలయిన రచయితల పుస్తకాలపై 50 శాతం తగ్గింపు మరియు ఇతర పుస్తకాలపై 10 నుండి 25 శాతం వరకు తగ్గింపు ఇస్తున్నారు.

మొత్తానికి గాంధీ వాడిన వస్తువుల వేలం రద్దు చేస్తున్నట్తు జేమ్స్ ఓటిస్ ప్రకటించాడు.

దేశంలో తొలిసారిగా అంధుల కొరకు Score Foundation అనే సంస్థ ఓ ప్రత్యేక వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. ఇందులో అంధులు, కంటిచూపు తక్కువగా ఉన్నవారి కోసం సమస్త సమాచారాన్ని అందుబాటులో వుంచుతారు. http://www.eyeway.org లో అంధుల సమస్యలకు సలహాలు, సూచనలు పొందవచ్చు.

తెలుగుదేశం పార్టీ కలర్ టి.వి. వాగ్ధానంతో సామాన్య ఓటర్ల మీదకి ఓ రంగుల వల విసిరింది, చూద్దాం ప్రజలు ఈ వలలో ఎంతవరకు పడతారో! అంతే కాదు నిరుపేద, పేద, మధ్య తరగతి కుటుంబాలకు ప్రతి నెలా ఠంచనుగా పించను అట! స్త్రీలు కుటుంబ పెద్దలుగా వుంటే వారికి నెలకు 1500 ఇస్తారట!

ఇక పోతే ప్రజారాజ్యం పార్టీ వాళ్లు మేమేనా తక్కువ తినేది అని వాళ్లు అధికారంలోకి వస్తే ప్రతి కుటుంబానికి రెండున్నరెకరాల మాగాణి లేదా ఐదు ఎకరాల మెట్ట భూమి ఇస్తామని హామీ ఇచ్చేసారు.

కాంగ్రెస్సు వారు ఇంకెలాంటి హామీలు గుప్పిస్తారో వేచి చూద్దాం....

వచ్చే ఎన్నికలలో పోలింగు బూతుల వద్ద పోలింగు స్లిప్పులను ఇచ్చేందుకు ఎన్నికల సంఘమే ప్రతి కేంద్రం వద్ద ప్రింటర్లను ఏర్పాటు చేస్తుందట. ఇంతకుముందులాగా రాజకీయ పార్టీలు స్లిప్పులు ఇవ్వటానికి అనుమతి లేదు.

అమెరికా వెళ్లాలనుకునే ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు ఇకనుండి హైదరాబాదులోనే వీసాలు పొందవచ్చు. మార్చి 5 నుండి హైదరాబాద్‌లోని అమెరికన్ కాన్సులేట్‌ పూర్తి స్థాయి సేవలు అందిస్తుంది. ప్రస్తుతం రోజుకు 100 వీసాలు ఏప్రిల్‌ అనంతరం రోజుకు 400 వీసాలు జారీ చేస్తారు....

4 వ్యాఖ్యలు:

లక్ష్మీదేవి / लक्ष्मीदेवी March 6, 2009 at 2:41 PM  

సిరిసిరిమువ్వ గారూ!
మంచి విషయం. హైదరబాదులో ఉన్నవాళ్ళూ! వెంటనే వెళ్ళి మంచి పుస్తకాలు కొనేయండి మరి.

మురళి March 6, 2009 at 4:58 PM  

చిన్న సవరణ.. విశాలాంధ్ర డిస్కౌంట్లు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వారి అన్ని స్టోర్ల లోనూ లభ్యం.. షాపింగ్ చేశాకా తెలిసిన విషయం ఇది..

సిరిసిరిమువ్వ March 6, 2009 at 5:06 PM  

మురళి గారు, మీ సవరణకి ధన్యవాదాలు. అయితే పుస్తకాలు కొనేసారన్నమాట. 50 శాతం తగ్గింపు కూడా రాష్ట్రవ్యాప్తంగా అన్ని బ్రాంచీలలో ఉందా?

మురళి March 10, 2009 at 5:36 PM  

నేను క్రమం తప్పకుండా వెళ్ళే చోటుల్లో అదీ ఒకటండి.. రాష్ట్ర వ్యాప్తంగా అని వాళ్ళే చెప్పారు.

Post a Comment

statcounter

  © Blogger template Coozie by Ourblogtemplates.com 2008

Back to TOP