పరుగాపక పయనించవె తలపుల నావ.... కెరటాలకు తలవంచితె తరగదు త్రోవ

February 4, 2009

వక్కపలుకులు-7

హాస్య నటుడు నవ్వుల రేడు నగేశ్ ఇక లేరు. ఆయన గురించిన వ్యాసం నవతరంగంలో.

ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్‌లో ఈ సారి భారత హవా బాగానే వుంది. మొదటిసారిగా జూనియర్సు విభాగంలో మన దేశానికి చెందిన యుకీ భాంబ్రి మరియు మిక్సుడు డబల్సులో భూపతి, సానియాల జోడి టైటిలు సాధించారు.

మరోసారి నాదల్ vs ఫెదరర్‌ల పోరాటంలో నాదల్‌దే పైచేయి అయింది. మొదట్లోనే తెలిసిపోయింది గెలుపెవరిదో కానీ ఎక్కడో కోరిక ఫెదరర్ గెలవాలని.

ఫిబ్రవరి నెలకి పుస్తకంలో ఓ విశిష్టత వుంది. అదేంటో అక్కడే చూడండి.

ఈమాటలో పెసరట్టు మీద ఈ వ్యాసం నాకు బాగా నచ్చింది. మరి ఆంధ్రమాత మీద ఎప్పుడు వ్రాస్తారో?

ఇప్పుడు మనం ఇంట్లోనే కూర్చుని ప్రపంచంలోని ఏ సముద్ర గర్భంలో అయినా  విహరించవచ్చు. గూగుల్ నవీకరించిన గూగుల్ ఎర్తులో ఈ టూలు పెట్టారు. సముద్రాలలోని జంతుజాలాన్ని, పగడపు దీవులని, మునిగిపోయిన ఓడలని ఎంచక్కా  త్రీడీలో చూడవచ్చు.

గూగుల్ వాళ్లే తమిళనాడులో ఓ ఇంటర్నెట్ బస్సుని ప్రారంభించారు. ఈ బస్సు తమిళనాడులోని ఓ 15 చిన్న చిన్న పట్టణాలలో ఆరు వారాల బాటు తిరిగి విద్యార్థులకి, ఉపాధ్యాయులకి, వ్యాపారస్తులకి, ఇంకా ఆసక్తి వున్నవారికి  ఇంటర్నెట్టుని ఎలా వాడాలో ఎలా ఉపయోగించుకోవాలో చెపుతారట. హిందీ తరువాత మన దేశంలో ఇంటర్నెట్టులో ఎక్కువగా వాడే భాష తమిళమేనట. మరి మన తెలుగు ఏ స్థానంలో వుందో!

ఫోర్బ్స్ వారి ప్రపంచ మొదటి పదిమంది సంపన్నుల జాబితాలో అంబానీ సోదరులు (3, 6 స్థానాలు) ముందుకు దూకగా విప్రో అధిపతి అజీం ప్రేంజీ వెనక్కి దూకి జాబితాలోనుండి బయటపడ్డారు, ఆయన స్థానంలో సునీల్ మిట్టల్ చేరారు. ఎలా అయితేనేం జాబితాలో మనవాళ్ల సంఖ్య తగ్గకుండా నాలుగు దగ్గరే వుంది.

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ భవనం మీద MRPS కార్యకర్తల దండోరా చూశారా?

ప్రముఖ చిత్రకారుడు బాలితో కబుర్లు ఇక్కడ వినండి.

జల్లెడలో ఇప్పుడు మరిన్ని హంగులట!

2 వ్యాఖ్యలు:

నేస్తం February 5, 2009 at 1:36 PM  

pesarattu... వ్యాసం నాకు బాగా నచ్చింది
nice post

ప్రపుల్ల చంద్ర February 5, 2009 at 3:06 PM  

బాగున్నాయి వక్క పలుకులు...
గూగుల్ ఎర్త్ లో సముద్రగర్భం కూడా చూడవచ్చా!! భలే... అయితే తప్పని సరిగా చూడాలి..

Post a Comment

statcounter

  © Blogger template Coozie by Ourblogtemplates.com 2008

Back to TOP