జీవితంలో మొదటి ఆనందాలు!
జీవితంలో మొదటిది ఏదయినా అత్యంత అద్భుతంగా ఉంటుంది...
చిన్నప్పుడు..
మొదటగా వెళ్ళిన స్కూలు...
మొదటగా కొనుక్కున్న కలం..
మొదటగా కొనుక్కున్న గడియారం...
మొదటగా వేసిన చిత్రం..
మొదటగా చదివిన కథ..
మొదటిసారి రైలు ఎక్కటం..
మొదటిసారి స్నేహితులతో కలిసి చూసిన సినిమా...
మొదటగా వెళ్ళిన కాలేజి..
కుర్రకారుకి అయితే మొదటి ప్రేమ..
మొదటి ప్రేమలేఖ..
ఆ ప్రేమ సఫలమైనా...విఫలమైనా
చచ్చేదాకా గుండెల్లో గుడికట్టుకుని దాచుకుంటారు..
ఏదయినా మొదటిది అపురూపమే!
ఈ మొదటికి ఉన్న విలువ ఎనలేనిది!!
వాటిని తలుచుకోగానే
ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతాం..
వాటితో అల్లుకుని వేవేల జ్ఞాపకాలు..
ఇక మొదటి ఇంటర్యూ...
మొదటి ఉద్యోగం..
మొదటి జీతం..
ఇవి ఎవరికయినా మరీ అపురూపం..
నా మొదటి ఉద్యోగం
ఓ కాలేజీలో
నా మొదటి జీతం అక్షరాలా 3500...
ఓ పది రోజులు పాఠాలు చెప్పినందుకు కాలేజీ వాళ్ళు ఇచ్చిన జీతం..
ఆ మొదటి జీతం తీసుకున్న రోజు ఎంత ఆనందం వేసిందో..
ఇప్పటి పిల్లలకి అది చిన్న మొత్తమేనేమో!
కానీ నాకు అది వెల కట్టలేని మొత్తం..
ఇక ఇప్పుడు మా అమ్మాయి వంతు...
సరిగ్గా తన పుట్టిన రోజు నాడే (ఇంగ్లీషు తేదీల ప్రకారం)
తనకి మొదటి ఉద్యోగం ఇంటర్యూ..
కాంపస్ ఇంటర్యూలో ఎంపికయ్యింది..
ఉద్యోగం చేసే ఉద్దేశ్యం లేకపోయినా
మొదటి ఉద్యోగం తన పుట్టినరోజు నాడే రావటం...
తనకి ఇంకా మహదానందం కదా!!
8 వ్యాఖ్యలు:
అవునండీ మొదటి విషయాలు ఎప్పుడూ మరచిపోలేము. మీ అమ్మాయికి నా తరపున శుభాభినందనలు తెలుపండి.
Wow ! Congrats !
I wish her all the success !
:))
Congrats chepanDi!
మీ అమ్మాయికి కంగ్రాట్స్.
Congrats to her!!
చూస్తుండగానే పిల్లలు ఎదిగి పోవడం భలేగా ఉంటుందండీ.. నిజం, మీర్రాసినవి చాలా వరకూ అనుభవమే :-) :-)
:))..congrats తెలియచేయండి ..:)
Post a Comment