పరుగాపక పయనించవె తలపుల నావ.... కెరటాలకు తలవంచితె తరగదు త్రోవ

August 16, 2011

పాలగుమ్మి... మా ఊరు ఒక్కసారి పోయి రావాలి

అప్పుడెప్పుడో మా ఊరి గురించి వ్రాసుకుంటూ పాలగుమ్మి విశ్వనాథం గారు పాడిన.. మా ఊరు ఒక్కసారి పోయి రావాలి ....పాట గుర్తుచేసుకున్నా. ఎప్పుడో నలభై సంవత్సరాల క్రితం వ్రాసిన పాట..అప్పటికి ..ఇప్పటికీ ..ఎప్పటికీ నిత్యనూతనం ఈ పాట.

ఈ మధ్య అదే పాట పదాలు కాస్త మార్చి కొత్త.చరణాలు కలిపి మల్లేష్ అనే అతను పాడింది విన్నా.  శ్రీ నిలయం అనే ఆల్బంలో ఉంది ఈ పాట (ఆల్బం మీద అయితే వ్రాసింది పాలగుమ్మి గారనే ఉంది).

ఈ పాటకి.... పాలగుమ్మి గారు పాడిన పాటకి భావంలో తేడా లేకపోయినా పాలగుమ్మి గారి గొంతులోని ఆర్తి ఇందులో నాకు కనపడలేదు. పాటలో  హైలెస్సో..గౌరమ్మ .... బతుకమ్మ....మరి కొన్ని తెలంగాణా పదాలు  చేర్చి తెలంగాణైజేషన్ చేసారు.  ఇప్పటి అభిరుచులకు తగ్గట్టు నేపద్య సంగీతం పెట్టారు..అయినా ఏదో లోటు.

పాట మంచి హుషారుగా బాగుంది కానీ పాలగుమ్మి గారి పాట వింటుంటే మన ఊరు మన కళ్ల ముందు మెదులుతుంది.  ఊర్లో కోవెల...పంట చేలు..పైర గాలి...దూరమైన మన నేస్తాలు గుర్తుకొచ్చి.....జ్ఞాపకాల బరువుతో  కళ్లు చెమ్మగిల్లుతాయి. మల్లేష్ గారి పాట ఇంతగా గుండెల్ని తట్టదు.  ఓ హుషారయిన పాట వింటున్నట్టుంటుంది.. లేచి చిందేయ్యాలనిపిస్తుంది... కానీ  జ్ఞాపకాల  అనుభూతుల్ని తడమదు.

దాదాపు అవే పదాలు..అదే భావం...కానీ ఎందుకని పాలగుమ్మి గారి పాటకి స్పందించినంతగా మల్లేష్ పాటకి స్పందించలేకపోతున్నాం ..పాలగుమ్మి గారి గొంతులోని ఆర్తి..మనల్ని కదిలిస్తుంది.  ముఖ్యంగా "ఆగలేక నా కన్నులు.. చెమ్మగిల్లాలి"...  పాడేటప్పుడు ఆ గొంతులో ఎంత భావం పలికిస్తాడో!

ముందుగా పాలగుమ్మి గారి పాట వినకుండా మల్లేష్ గారి పాట వింటే బాగానే ఆనందించగలమేమో.

ఘజల్ శ్రీనివాస్ గారు కూడా  ఇదే భావంతో ఇంచుమించు ఇలాంటి మాటలతోనే ఒక పాట వ్రాసారు..ఒక్కసారి ఊరు పోయిరా ...అంటూ.  అది కూడా బాగుంటుంది. ఘజల్ కదా భావుకత పాలు కాస్త ఎక్కువగా ఉంటుంది.

మూడిటిలోనూ నాకు పాలగుమ్మి గారిదే ఇష్టం.

మూడిటి సాహిత్యం ఇస్తున్నాను..మీరే చూడండి.

మొదటిది పాలగుమ్మి గారు వ్రాసి ..స్వరపరచి... పాడినది.



పంట చేల గట్ల మీద నడవాలి..
ఊహలేమొ రెక్కలొచ్చి ఎగరాలి..
పంట చేల గట్ల మీద నడవాలి..
ఊహలేమొ రెక్కలొచ్చి ఎగరాలి..

మా ఊరు ఒక్కసారి పోయి రావాలి..
జ్ఞాపకాల బరువుతో తిరిగి రావాలి..

మా ఊరు ఒక్కసారి పోయి రావాలి..
జ్ఞాపకాల బరువుతో తిరిగి రావాలి..

ఒయ్యారి నడకలతో ఆ ఏరు..
ఆ ఏరు దాటితే మా ఊరు..
ఒయ్యారి నడకలతో ఆ ఏరు..
ఆ ఏరు దాటితే మా ఊరు..

ఊరి మధ్య కోవెలా.. కోనేరు..
ఒకసారి చూస్తిరా తిరిగి పోలేరు..
ఊరి మధ్య కోవెలా.. కోనేరు..
ఒకసారి చూస్తిరా వదిలి పోలేరు..

పంట చేల గట్ల మీద తిరగాలి..
ఊహలేమొ రెక్కలొచ్చి ఎగరాలి..
మా ఊరు ఒక్కసారి పోయి రావాలి..
జ్ఞాపకాల బరువుతో తిరిగి రావాలి..

పచ్చని పచ్చిక పైన మేను వాల్చాలి...
పైరగాలి వచ్చి నన్ను కౌగిలించాలి...
పచ్చని పచ్చిక పైన మేను వాల్చాలి...
పైరగాలి వచ్చి నన్ను కౌగిలించాలి...

ఏరు దాటి తోట.. తోపు తిరగాలి...
ఎవరెవరో వచ్చి నన్ను పలకరించాలి...
ఏరు దాటి తోట ..తోపు తిరగాలి...
ఎవరెవరో వచ్చి నన్ను పలకరించాలి...

మా ఊరు ఒక్కసారి పోయి రావాలి..
మా ఊరు ఒక్కసారి పోయి రావాలి..

చిన్ననాటి నేస్తాలు చుట్టూ చేరాలి...
మనసువిప్పి మాట్లాడే మనుషుల కలవాలి...
చిన్ననాటి నేస్తాలు చుట్టూ చేరాలి...
మనసువిప్పి మాట్లాడే మనుషుల కలవాలి...

ఒకరొకరు ఆప్యాయతలొలకబొయ్యాలి...
ఆగలేక నా కన్నులు.. చెమ్మగిల్లాలి...
ఒకరొకరు ఆప్యాయతలొలకబొయ్యాలి...
ఆగలేక నా కన్నులు.. చెమ్మగిల్లాలి...

పంట చేల గట్ల మీద నడవాలి..
ఊహలేమొ రెక్కలొచ్చి ఎగరాలి..
మా ఊరు ఒక్కసారి పోయి రావాలి..
జ్ఞాపకాల బరువు తో తిరిగి రావాలి..
మా ఊరు ఒక్కసారి పోయి రావాలి.
జ్ఞాపకాల బరువు తో తిరిగి రావాలి..

*******************************************************************

ఇక రెండవది..శ్రీనిలయం ఆల్బం లో మల్లేష్ గారు పాడింది. దీని ఆడియో సరిగ్గా లేదు...మధ్య మధ్యలో కట్ అవుతుంది.



పంట సేల గట్ల మీద నడవాలి
ఊహలకు రెక్కలొచ్చి ఎగరాలి
మా ఊరు ఒక్కసారి పోయి రావాలి
జ్ఞాపకాల బరువుతో తిరిగి రావాలి

మా ఊరు ఒక్కసారి పోయి రావాలి
జ్ఞాపకాల బరువుతో తిరిగి రావాలి

ఒహో..ఒహో...

ఒయ్యారి నడకలతో సెలఏరు,
ఆ ఏరు దాటితేనే మా ఊరు!
ఒయ్యారి నడకలతో సెలఏరు,
ఆ ఏరు దాటితేనే మా ఊరు!

ఊరి మధ్య కోవెలా....కోనేరూ
ఒక్కసారి చూస్తిరా ...తిరిగి రాలేరు

మా ఊరు ఒక్కసారి పోయి రావాలి
జ్ఞాపకాల బరువుతో తిరిగి రావాలి

ఓ..ఓ..ఓహో..ఒహో..
హైలెస్స..ఓ..ఓ..హైలెస్సా..
ఓహో..ఓహో...హైలెస్స...ఓ ..ఓఓఓఓ

చిన్ననాటి స్నేహాలు చుట్టూ చేరాలి
మనసువిప్పి మాట్లాడే మనుషుల కలవాలి
చిన్ననాటి స్నేహాలు చుట్టూ చేరాలి
మనసువిప్పి మాట్లాడే మనుషుల కలవాలి
ఒకరికొకరు ఆప్యాయతలొలకబొయ్యాలి
ఆగలేక నా కన్నులు చెమ్మగిల్లాలి

మా ఊరు ఒక్కసారి పోయి రావాలి
జ్ఞాపకాల బరువుతో తిరిగి రావాలి

బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాల
బంగారు బ్రతుకమ్మ ఉయ్యాల
మన గౌరి గౌరమ్మ ఉయ్యాల
మా ఊరి వెలుగంట ఉయ్యాలో

మా ఊరి పక్కనే చెరువుంది
ఆ చెరువు గట్టు మీద రెండు చెట్లున్నాయి
మా ఊరి పక్కనే చెరువుంది
ఆ చెరువు గట్టు మీద రెండు చెట్లున్నాయి
చెట్లకింద బ్రతుకమ్మలాట చూడాలి
పక్కనున్న పైరు చూసి పరవశించాలి

మా ఊరు ఒక్కసారి పోయి రావాలి
జ్ఞాపకాల బరువుతో తిరిగి రావాలి

గోవుల్ని కాసేటి గోవిళ్లు అందంబు
ఆ గోవిళ్లు పాడేటి పాటలందంబు
సందెవేళ చప్పట్ల కోలాటాలందంబు
ఆడుతూ ఊగే వంగుటుయ్యాల అందంబు

మా ఊరు ఒక్కసారి పోయి రావాలి
జ్ఞాపకాల బరువుతో తిరిగి రావాలి
ఆ జ్ఞాపకాల బరువుతో తిరిగి రావాలి

పాట అంతా దాదాపుగా ఒక్కటిగానే ఉన్నా చివరి రెండు చరణాలు చూడండి..అవి పాలగుమ్మి గారు పాడిన దాంట్లో ఉండవు.

************************************************************************

ఇక మూడవది ఘజల్ శ్రీనివాస్ గారిది.


Get this widget | Track details | eSnips Social DNA


ఏరా రాముడూ ఊడుపులైపోయినియేంట్రా
లేదురా రేపో మాపో మొదలెడతాను
సరే సాయంత్రం సావిడికాడికొచ్చెయ్
అక్కడ కబుర్లు సెప్పుకుందాం
అలాగే  తుర్ర్.. హై హై హై

ఒక్కసారి ఊరు పోయిరా
ఒక్కసారి ఊరు పోయిరా
బతికిన పల్లెలకోసం
ఒక్కసారి ఊరు పోయిరా
అనుభూతుల మల్లెల కోసం
ఒక్కసారి ఊరు పోయిరా
బతికిన పల్లెలకోసం
ఒక్కసారి ఊరు పోయిరా
అనుభూతుల మల్లెల కోసం

సంక్రాంతి ముగ్గుల్లు.... గొబ్బిళ్ళో
మాలక్ష్మి దీవించు గొబ్బిళ్ళో
మాలక్ష్మి దీవించు గొబ్బిళ్ళో
మా ఊరికివ్వాలి పంటల్లు

ముద్దొచ్చే అమ్మాయిలు దిద్దే ముగ్గుల గీతలు
ముద్దొచ్చే అమ్మాయిలు.. హాయ్.. దిద్దే ముగ్గుల గీతలు
 ఒక్కసారి ఊరు పోయిరా
ఒక్కసారి ఊరు పోయిరా
పడుచుల జడ గంటలకోసం
ఒక్కసారి ఊరు పోయిరా..

అందరినీ పలకరించూ...కథలెన్నో వినిపించూ
ఏరా రాముడూ ఈ మద్య కనిపించట్లేదేమిట్రా
అందరినీ పలకరించూ...కథలెన్నో వినిపించూ
ఒక్కసారి ఊరు పోయిరా
ఒక్కసారి ఊరు పోయిరా
ముసలి అవ్వలకొసం
ఒక్కసారి ఊరు పోయిరా

చెల్లియో చెల్లకో తమకు చేసిన ఎగ్గులు...
రామ నవమి పందిరిలో...నాటకాల సందడిలో
బావా ఎప్పుడు వచ్చితీవు..
రామ నవమి పందిరిలో.... నాటకాల సందడిలో
ఒక్కసారి ఊరు పోయిరా
నాన్నా..
ఒక్కసారి ఊరు పోయిరా
అల్లరి పిల్లలకోసం
ఒక్కసారి ఊరు పోయిరా

ఏటిగట్టు సరదాలు...పాటమీద పగ్గాలు
ఏరా ఎంకన్నా మేట్నీకొత్తావేంట్రా ఈరోజూ?
ఆ కుదరదురా సాయంత్రం వెంకటలక్ష్మి తోటకి రమ్మందిరా..
ఏటిగట్టు సరదాలు...పాటమీద పగ్గాలు
ఒక్కసారి ఊరు పోయిరా
మిత్రమా..ఒక్కసారి ఊరు పోయిరా
చిననాటి మనసుల కోసం
ఒక్కసారి ఊరు పోయిరా

తాననన్న తాననన్న తాననన్న హో..
తననానన తననానన

పల్లెటూరి పిల్లకదా.....పట్నం రాలేదు కదా.
ఓ హొహొ హొహొ ఓ హొహొహొహొ హొయ్
పల్లెటూరి పిల్లకదా.....పట్నం రాలేదు కదా.
ఒక్కసారి ఊరు పోయిరా
ఒక్కసారి ఊరు పోయిరా
కురిసే వెన్నెల కోసం

ఒక్కసారి ఊరు పోయిరా
బతికిన పల్లెలకోసం
ఒక్కసారి ఊరు పోయిరా
అనుభూతుల మల్లెలకోసం
ఒక్కసారి ఊరు పోయిరా
బతికిన పల్లెలకోసం
ఒక్కసారి ఊరు పోయిరా
అనుభూతుల మల్లెలకోసం
ఆ ఏరులకోసం... ఆ నవ్వులకోసం
ఆ కోవెలకోసం... ఆ పొలాల కోసం
ఆ సిగ్గులకోసం... చలిమంటలకోసం
ఆ పంటలకోసం.... ఆ వెన్నెలకోసం..

దీని వీడియో కావాలంటే ఇక్కడ చూడవచ్చు. పాట ఉన్నంత అందంగా వీడియో లేదు అనిపించింది!

ఈ టపా ప్రత్యేకంగా  వేణూ శ్రీకాంత్ కి.

**************************************************************

మీరు పాట వింటూ ఈ టపా చదవవచ్చు.  వద్దనుకుంటే  శ్రీనిలయం ఆడియో క్లిప్ ని ఆపేసెయ్యండి:)

8 వ్యాఖ్యలు:

Sujata M August 16, 2011 at 11:27 AM  

వరూధిని గారూ..

పాటలింకా వినలేదు గానీ... అన్నీ చదివాను. చాలా బావున్నాయి సరే ! మీరు ఎంత ఓపిక గా సేకరించారు, రాసారు అన్నది పాయింటు. చాలా బావున్నాయి. మాకెప్పుడూ అలాంటి జ్ఞాపకాలు లేవు గానీ.. వూర్లో ఇప్పుడెవరూ లేరు. చిన్నప్పటి ఫన్ లేదు. బీచ్ కి వెళ్తే, నీళ్ళలో కాళ్ళు కూడా తడిచేది లేదు. గవ్వలేవీ దొరకట్లేదు. అయినా ఊరంటే, అదో తుత్తి. వా.... నాకూ వెళ్ళాలనుంది.

వేణూశ్రీకాంత్ August 16, 2011 at 11:32 AM  

వరూధిని గారు అప్పుడెప్పుడో అడిగిన విషయం గుర్తుంచుకుని నాకోసం ప్రత్యేకంగా ఈ టపా అని చెప్పినందుకు బోలెడు ధన్యవాదాలండీ.. చాలా సంతోషంగా ఉంది.. You made my day..

నా ఓటుకూడా పాలగుమ్మి వారికే.. ఆ పాట, ఆ స్వరం స్పృశించినంతగా మిగిలిన రెండు పాటలు గుండెను చేరడంలేదు.. రచయిత తనేగనుక రాసేటప్పుడు తన గుండెలో ఉప్పొంగిన భావాన్ని స్వరంలో కూడా పలికించగలిగారు అందుకే మనకి అంత నచ్చిందేమో. పాలగుమ్మి వారి పాట కొందరు కుర్రకారు మిత్రులకు వినిపించినపుడు భావం బాగుంది కానీ మరీ స్లోగా ఉంది అని అన్నారు.. బహుశా అలాంటివారికి మల్లేష్ పాడినది నచ్చవచ్చునేమో.. ఘజల్ శ్రీనివాస్ గారి పాటలు ఎందుకో నేను వినలేను.. ఒక్క అమ్మ పాట తప్ప...
ఇంత ఓపికగా అన్నీ సేకరించి సాహిత్యంతో సహా ఇచ్చినందుకు మరోమారు వేవేల నెనర్లు :-)

ఆ.సౌమ్య August 16, 2011 at 4:54 PM  

ఏంటండీ మీరు? అసలే నాకు మా ఊరంటే చచ్చేంత బెంగ....ఎప్పుడూ ఇజీనారం ఇజీనారం అని ఏడుస్తూ ఉంటాను. అసలే కోసుల దూరంలో ఉన్నాను. మీరిప్పుడిలా ఇంకా ఏడిపిస్తే ఎలా? ఆ మధ్య శంకర్ గారు ఇదే పాట ఇచ్చి బోల్డు ఏడిపించారు...ఇప్పుడు మీరు వా ఆ వా ఆ :(

ఈ పాట పాలగుమ్మివారు పాడినదని నాకు తెలీదు...మంచి విషయం చెప్పారు.

ఈ పాట నాకు మైల్ చెయ్యగలరా?

మురళి August 16, 2011 at 11:47 PM  

నా వోటు కూడా పాలగుమ్మి వారికే, నిస్సందేహంగా....
ఈయన తాజ్ మహల్ గురించి 'ఈ విషాద నిషాద...' అంటూ పాడారు.. సరిగ్గా జ్ఞాపకం లేదు కానీ చివర్లో 'జహాపనా' అని వస్తుంది.. ఆ చేత్తోనే కొంచం ప్రయత్నించరూ..

సిరిసిరిమువ్వ August 17, 2011 at 12:14 AM  

సుజాత గారూ :( అదృష్టం కొద్దీ నాకు మా ఊరి తీపి జ్ఞాపకాలు బాగానే ఉన్నాయి. ఊర్లో ఉండగా వాటి విలువ తెలియదు..దూరమైనాక కానీ ఊరి విలువ తెలియదు.

వేణూ..:)

సౌమ్యా, తప్పకుండా.

మురళి గారూ, మీరు చెప్పేది

"ఈ విశాల ప్రశాంత ఏకాంత సౌధంలో నిదురించు జహాపనా"...

ఇదే అయితే ఇది ఎమ్మెస్ రామారావు గారు పాడింది కదా?

తెలుగు పాటలు August 17, 2011 at 6:42 PM  

Srinivas garu ee song ravindhrabharathi loo padinappudu nenu vellanu aa anubhuthi marachipolenu,srinivas garini nenu chalasarlu kalishanu, srnivas gari papa kuda chala bagapadutundhi srinivas garitho gadipina kshanalu nenu eppudu marachipolenu

తెలుగు పాటలు August 17, 2011 at 7:03 PM  

సిరిసిరిమువ్వ గారు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్న ఈ సాంగ్ వింటూ అన్ని మరచిపోవచ్చు, అమృత లో కూడా ఒక సాంగ్ బాగుంటది --మరు మల్లెల్లో ఈ జగమంతా విరియగా,
ప్రతి ఉదయం లో శాంతి కోసమే తపనగా,
బాణాలేదో భూమికీ మెరుపుగా,
మందారాలే మత్తునూ వదలగా

మురళి August 18, 2011 at 12:59 PM  

ఇదికూడా పాలగుమ్మి వారు పాడగా దూరదర్శన్ లో చూసిన జ్ఞాపకం అండీ.. 'మా ఊరు ఒక్కసారి ' పాటతో పాటుగా..
అవును, ఎమ్మెస్ గారు కూడా పాడారు..

Post a Comment

statcounter

  © Blogger template Coozie by Ourblogtemplates.com 2008

Back to TOP