ఆధార్ కార్డు నాకు నచ్చలేదు!
ఎన్నాళ్లనుండో ఎదురు చూస్తున్న ఆధార్ కార్డు మొన్ననే వచ్చింది. ఈ కార్డు
రావటానికి మేము ఫోటోలు తీయించుకున్నాక ఖచ్చితంగా మూడు నెలలు పట్టింది.
ఇప్పుడు కూడా మా ఇంట్లో మా నలుగురిలోనూ ఇద్దరివే వచ్చాయి..మిగత
ఇద్దరివి..నెట్టులో చూస్తే ఇంకా వివరాలు అందలేదు అని వస్తుంది. సరే
ఎప్పటికో అప్పటికి అవి కూడా వస్తాయి కానీ అసలు నాకు ముందు కార్డు రూపురే్ఖలు
నచ్చలేదు.
కాప్షన్ బాగుంది కానీ...ఇకపై ఉప్పు కావాలన్నా..పప్పు కావాలన్నా..గాస్ కావాలన్నా..బ్యాంక్ అకౌంటు తెరవాలన్నా... అన్ని నిత్యావసరాలకి ...దేనికయినా ఆధారం ఇదే...మీరు మీరే అనటానికి ఇకనుండి ఋజు పత్రం (identity proof) ఇదే అంటున్న ఈ కార్డు రూపురేఖలు ఎలా ఉన్నాయో ఒక్కసారి చూడండి. ఏదో కరపత్రం లాగా ఉంది కానీ కార్డు లాగా లేదు.
నందన్ నీలేకని ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రాజెక్టు కనుక దీని గురించి నేను కాస్త ఎక్కువే ఊహించుకున్నా..కానీ కార్డు చూడగానే నాకు చాలా నిరుత్సాహం కలిగింది.
ఇకపై భారత పౌరుల జీవితాలకి ఆధారం ఇదే అని ప్రభుత్వాలు ఎలుగెత్తి చెప్తున్న ఈ కార్డు చాలా పొడవుగా ఉంది...నాణ్యత కూడా అంతంత మాత్రమే. కాస్త మందపాటి గ్లేజ్‍డు పేపరు వాడారు. కనీసం లామినేషన్ కూడా లేదు.
కింద పేరు.. ఆధార్ నంబరు వరకు మాత్రమే కార్డుగా ఉన్నట్లయితే బాగుండేది...మరి అక్కడ వరకు కత్తిరించి వాడుకోవచ్చేమో తెలియదు. మిగతా వివరాలన్నీ కార్డు మీద అవసరం లేదు కూడాను.
ఏది ఏమయినా జీవితాంతం మనతో ఉండాల్సిన ఈ కార్డు ఇలా ఉండటం నాకు అసలు నచ్చలేదు. ఈ కార్డు డిజైను చేసింది ఎవరో కానీ ఈ మాత్రం ఆలోచించలేదా అనిపించింది. దీనిని డిజైను చేసిన వాళ్లు, దానికి అనుమతి ఇచ్చిన వాళ్లు..దాన్ని అమలులోకి తీసుకొస్తున్న వాళ్లు..ఇంతమందిలో ఏ ఒక్కరూ కార్డు పోర్టబిలిటి గురించి కానీ దాని మన్నిక గురించి కానీ ఆలోచించినట్లు కనిపించటం లేదు. ATM కార్డు లానో, క్రెడిట్ కార్డులానో... ఓటరు కార్డులానో ..రేషను కార్డులానో ఇది కూడా ఎక్కడికంటే అక్కడికి తీసుకెళ్లటానికి అనువుగా నాణ్యంగా ఉంటే బాగుండేది.
ఓ సంతోషకరమైన విషయం ఏమిటంటే ఓటరు కార్డులో లాగా ఇందులో అచ్చు తప్పులు లేవు. తెలుగు అక్షరాలు తెలుగు అక్షరాలా లాగానే చక్కగా ఉన్నాయి. పేర్ల తారుమారులు..తలల తారుమారులు...లింగాల తారుమారులు లేవు. ఫోటోలు తీయించుకునేటప్పుడే పేరు... అడ్రస్సు...అన్నీ జాగ్రత్తగా ఒకటికి నాలుగు సార్లు సరిచూసుకుని అక్కడ డాటా ఎంట్రీ వాళ్ళకి తెలుగు అక్షరాలు ఎలా వ్రాయాలో క్లాసు పీకాం అనుకోండి:)
ఆధార్...సామాన్యుని హక్కు

12 వ్యాఖ్యలు:
అమెరికాలో ఎస్.ఎస్.ఎన్. ఇలానే కాస్త మందమైన కాగితం మీదనే ఉంటుంది. దానినే మనవాళ్ళు కూడా అనుసరించి ఉంటారు. కాకపోతే ఇక్కడ ఎస్.ఎస్.ఎన్. ఎవరికీ చూపించ కూడదంటారు. స్కాన్ చెయ్యటం, ఫోటో కాపీ తియ్యటం నేరమంట.
నేను ఓటర్ గుర్తింపు కార్డులో కూడా కీబోర్డు వాడి దగ్గర లాక్కుని తెలుగులో నా పేరు నేనే టైపు చేసుకున్నా.
అసలు ఆధార్ కార్డు క్రిందనున్న భాగమే. పైది మీకు పోస్టు చెయ్యడానికి వీలుగా మీ అడ్రస్ ప్రింటు చెయ్యడానికి వాడినట్లు ఉన్నారు. క్రింద డాట్లు ఇచ్చాడు గా అక్కడ కట్ చేసుకుని లామినేట్ చేయించు కోండి. ఏం చేస్తాం.
You did one more mistake by showing the Bar code, which can retrieve your information.
so erase it also for you sake
హతోస్మి. మళ్ళీ ఇంకొక కార్డా...
మురళి..ఇది కూడా ఎవరికి చూపించకూడదేమో..నంబరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుందేమో!
వేణుగోపాల్ గారూ..అడ్రస్సు కోసం అంత కార్డు అవసరమా? కనీసం కింద భాగం వరకు కట్ చేసుకుని వాడుకోవచ్చని ఓ వివరణ ఇచ్చినా బాగుండు.
ప్రసాదు గారూ..అవునా..అలా కూడా చేయవచ్చా? మార్చానండి. మీ సలహాకి ధన్యవాదాలు.
ఇండియన్ మినర్వా గారూ..అవునండి ఇదొక విశిష్ట గుర్తింపు సంఖ్య....భారత పౌరులందరికీ తప్పనిసరి.
మేమింకా నిరీక్షణలోనే ఉన్నామండీ.. వస్తుందా, రాదా అని సందేహం వస్తోంది...
వరూధిని గారూ, మేము అప్లై చేసి రెండు నెలలవుతోంది,. ఏవో చిత్త కాగితాల మీద తాత్కాలిక ప్రింట్ అవుట్ ఇచ్చరు. ఒరిజినల్ ఇలా ఉందా? ఉత్సాహం సగం చచ్చింది. పేర్ల తారు మారులు అవీ మనం దగ్గరుండి ఎంటర్ చేయించుకుంటాం కాబట్టి (మేము అలాగే చేశాం) తారు మారు కావడం తక్కువేనేమో! పైగా చిత్తు ప్రతులు ముందే ఇస్తున్నారు కదా! దాన్ని బట్టి సవరింపులు అప్పుడే చేసుకోవచ్చు.
మరి మాకెప్పుడు వస్తాయో! ఎదురు చూస్తున్నాం
మురళి గారూ, రాకపోవటం ఉండదు లేండి..కాస్త వెనకా ముందూ అంతే! మాకయితే మూడు నెలలు పట్టింది.
సుజాత గారు..మీకు ఇంకో నెల సమయం ఉందిలేండి. కొంతమందికి ఇరవై రోజుల్లోనే వచ్చేసాయి..అంతా లీల..ఏం చెప్పలేం. కార్డు చూసి నాకూ చాలా నిరుత్సాహం కలిగిందండి.
naakimka aadharkaard raneledu
eppatikostundokoodatelyyadu
naakimka aadharkaard raneledu
eppatikostundokoodatelyyadu
naakimka aadharkaard raneledu
eppatikostundokoodatelyyadu
Post a Comment