పరుగాపక పయనించవె తలపుల నావ.... కెరటాలకు తలవంచితె తరగదు త్రోవ

January 27, 2009

వక్కపలుకులు-6

"ప్రళయకావేరి కథలు" గురించి నేను వ్రాసిన పరిచయం పుస్తకంలో.

స్లండాగ్ మిలియనీర్ సినిమాకి పురస్కారాల మీద పురస్కారాలు లభిస్తున్నాయి. కానీ మానేజ్‌మెంట్ గురు అరిందం చౌదరి ఈ సినిమా గురించి ఏమంటున్నాడో చూసారా? టపాతో పాటు వ్యాఖ్యలు కూడా చదవండి.

మొన్నొక రోజు నాకు చంద్రబాబు నుండి ఓ చిన్న సందేశం వచ్చింది. మీరు సరిగ్గానే చదివారు తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు దగ్గరనుండే! చంద్రబాబు నాకు SMS పంపటం ఏంటి-ఎవడో తుంటరి పంపించి వుంటాడు అనుకున్నా. తరువాత తెలిసింది ఈ మధ్య మన రాజకీయ పార్టీలు సెల్ ఫోను వినియగదారులకి ఇలా SMS లు పంపటం మొదలుపెట్టాయని. ఎయిర్‌టెల్ ఖాతాదారులకి TDP వాళ్లు, ఐడియా ఖాతాదారులకి BJP, ప్రజారాజ్యం పార్టీ వాళ్లు సందేశాలు పంపుతున్నారట. ఎన్నికల టైమా మజాకానా!

60వ గణతంత్ర దినోత్సవ వేడుకలు దేశమంతటా ఘనంగా జరిగాయి.

నిన్న (జనవరి 26) సూర్యగ్రహణం. ఇండియాలో పాక్షికంగానే కనిపించింది. హైదరాబాదులో అతి స్వల్పంగా కనిపించింది. మా ఏరియాలో అయితే ఏం కనిపించలేదు. ఇండోనేషియాలో ఎంత బాగా కనిపించిందో  చూడండి.

నిన్న చైనా వాళ్ల  కొత్త సంవత్సరం కూడా మొదలయ్యింది. వాళ్లకి ఈ సంవత్సరం వృషభ (ఎద్దు) నామ సంవత్సరం అట.

భారత మాజీ రాష్ట్రపతి వెంకటరామన్ గారు ఈ రోజు కన్నుమూసారు. ఆయన వయస్సు 98 సంవత్సరాలు. భారత దేశానికి ఎనిమిదవ రాష్ట్రపతిగా ఆయన 1987 నుండి 1992 వరకు పనిచేసారు. అంతకుముందు ఉపరాష్ట్రపతిగా కూడా చేసారు. నేను గౌరవించే రాష్ట్రపతులలో ఆయన ఒకరు.

ఫైనాన్షియల్ టైమ్సు సంస్థ ప్రతి ఏడాది ప్రకటించే ప్రపంచంలోని అత్యున్నత ప్రమాణాలు కలిగిన విద్యాసంస్థల జాబితాలో  హైదరాబాదులోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ఈ సంవత్సరం 15వ స్థానం దక్కించుకుంది

వరంగల్‌లో ఇద్దరు విద్యార్థినులపై యాసిడ్ దాడి ఆపై నిందితుల ఎన్‌కౌంటరు ఉదంతం మర్చిపోకముందే తన సహవిద్యార్థిని గొంతు కోసాడు మరో ప్రేమోన్మాది.

10 వ్యాఖ్యలు:

నేస్తం January 28, 2009 at 7:24 AM  

hmm baagunnayi sms lu .. ee premonmaadula gurinchi vintene bhayamestundi

సుజాత వేల్పూరి January 28, 2009 at 11:41 AM  

వరూధిని గారు,
చంద్ర బాబు తర్వాత వాడెవడో శ్రీశైలం గౌడంట, కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికేదో అవుతాడంట....ఆయన కూడా పంపాడు.

నాకసలు ఎయిర్ టెల్ వాడి బిల్లు తాలూకు మెసేజ్ లు చూసుకోవాలంటేనే చిరాకు. మధ్యలొ సత్రకాయల్లాగా వీళ్ల గోల!

Rajendra Devarapalli January 28, 2009 at 1:36 PM  

నేను చాలా కాలంక్రితమే ఇలాంటి వాణిజ్యపరమైన ప్రకటనలు రాకుండా http://ndncregistry.gov.in/ndncregistry/aboutRegister.jsp
ఇక్కడ నా మొబైల్నంబరు నమోదుచేసా.అప్పటి నుంచీ దాదాపుగా నాకా తలనొప్పిలేదు. ఆ మధ్యఆవకాయ్-బిర్యాని సినిమావాళ్ళు,తర్వాత చంద్రబాబునాయుడి నుంచీమాత్రం ఈ యస్ యమ్ యస్ లు వచ్చాయిచూడాలి మరలా ఏమి చెయ్యగలమో,

Ramani Rao January 28, 2009 at 3:50 PM  

ఇప్పుడే చదివాను ప్రళయకావేరి సమీక్ష. మంచి పుస్తకాన్ని పరిచయం చేసారు.

చంద్రబాబు నాకు కూడా పంపాడు. బోల్డు పొంగిపోయి రాజకీయ రంగ ప్రవేశం గురించి ఆలోచిస్తున్నా! :-)

సుజాత వేల్పూరి January 28, 2009 at 5:15 PM  

రమణి గారు,
మీరు ఏ నియోజక వర్గం నుంచి పోటీ చేసినా సరే, నేను అక్కడికొచ్చి నా వోటు మీకే వేస్తాను!

చైతన్య.ఎస్ January 28, 2009 at 7:55 PM  

రమణి గారు మీరు కేవలం అధికార దాహంతో పదవి కోసం రాజకీయరంగ ప్రవేశం చేస్తున్నారు. దీన్ని మేము తీవ్రంగాఖండిస్తున్నాము.

సుజాత గారు ఈ విధంగా మేచ్ ఫిక్సింగ్ చేసుకోవడం ఏం బాలేదు అని నేను బ్లాగు ముఖంగా తెలియచేస్తున్నను. :)

మాలతి January 31, 2009 at 7:07 PM  

ప్రళయకావేరి కథలమీద మంచి విశ్లోషణ చేశారండీ మీరు. మనసాహిత్యంలో చదువులేని వారు కూడా చాలా చక్కని వర్ణనలు హృదయానికి హత్తుకునేలా చేయగలరు. ఆవిషయం ఈకథలు చదివితే తెలుస్తుందని మీ సమీక్ష చూస్తే నాకు తెలిసింది. అక్కడ ఇచ్చిన లింకు తెలుగుపీపుల్.కాం కూడా చూసాను. త్వరలోనే చదువుతాను.మీకు ధన్యవాదాలు.

సిరిసిరిమువ్వ January 31, 2009 at 10:03 PM  

మాలతి గారు, రమేశ్ గారు ఆంత్రోపాలజీలో M.A. చేసారు. ఆయన గురించి కొత్తపాళీ గారు వ్రాసిన టపా చూడండి.http://kottapali.blogspot.com/2009/01/blog-post_29.html

oremuna February 2, 2009 at 9:37 AM  

KP,

Agree!

మీపైన డిఫెమేషన్ కేస్ వెయ్యవచ్చు.

Post a Comment

statcounter

  © Blogger template Coozie by Ourblogtemplates.com 2008

Back to TOP