పరుగాపక పయనించవె తలపుల నావ.... కెరటాలకు తలవంచితె తరగదు త్రోవ

January 12, 2009

వక్కపలుకులు-4

రైతులకి పెద్ద పండగ అయిన సంక్రాంతి రాబోతుంది. పల్లెల్లో ఇంతకన్నా పెద్ద పండగ ఇంకొకటి వుండదు. ఒకప్పుడు సంక్రాంతి అంటే ధనుర్మాసం చలిగాలులు, బంతులు, చామంతులు, చిలకముక్కు పూలతో కళకళలాడుతుండే లోగిళ్లు, ఇంటినిండా కొత్త ధాన్యం, వాకిటినిండా ముగ్గులు, ముగ్గుల నిండా గొబ్బెమ్మలు, గొబ్బెమ్మలు ముందు హరిదాసులు, గంగిరెద్దువాళ్లు,  భోగిమంటలు, కోడిపందాలు, .....ఇప్పుడు ఏదీ పల్లె నుదిటిన ఆ పండగ కళ?  ఎక్కడో కొన్నిచోట్లే కనపడుతుంది.

పల్లెల్లో పండగ ఎలా జరుపుకున్నా ఆ ఆనందమే వేరు. అమ్మ నేలని, అమ్మ భాసని మించినవి ఉండవు కదా! ఈ పండగకి మన ఊర్లు కళకళలాడుతుంటే హైదరాబాదు బోసిపోతుంది.  హైదరాబాదు రోడ్లన్నీ ఖాళీ ఖాళీ!  ఊరికెళ్లేవాళ్లతో రైల్వే స్టేషను, బస్టాండు కిటకిటలాడుతున్నాయి.  వెళ్లేవాళ్లకి ఆనందమయితే వెళ్లలేకపోతున్న వాళ్లకి ఏదో కోల్పోతున్నామన్న బాధ.

నిన్న హైదరాబాదులో పండిట్ రవిశంకర్ ఆయన కుమార్తె అనౌష్కతో కలిసి ఓ కార్యక్రమం చేసారు.  వెళదామంటే పాసులు దొరకలేదు:).  20 ఏళ్ల తరువాత ఆయన హైదరాబాదు రావటం, అంతే కాక తన కుమార్తెతో కలిసి హైదరాబాదులో మొదటిసారిగా ప్రదర్శన ఇచ్చారు.  ఇక జీవితంలో ఆయన ప్రదర్శన ప్రత్యక్షంగా చూసే అవకాశం రాదేమో!

ప్రముఖ సంగీత దర్శకుడు రెహమాన్‌ సినీ సంగీత ప్రపంచంలో అత్యున్నతంగా భావించే గోల్డెన్‌ గ్లోబ్‌ పురస్కారానికి ఎంపికయ్యారు.  రెహమాన్‌ ఈ ఘనత సాధించిన తొలి భారతీయుడిగా రికార్డులకెక్కాడు.

2007 సంవత్సరానికి గాను ఈ రోజు నంది అవార్డులు ప్రకటించారు. ఉత్తమ నటుడిగా వెంకటేష్‌ (ఆడవారి మాటలకు అర్థాలే వేరులే), ఉత్తమ నటిగా చార్మి (మంత్ర) ఎంపికయ్యారు. ఉత్తమ చిత్రంగా మీ శ్రేయోభిలాషి, ఉత్తమ ద్వితీయ చిత్రంగా హ్యాపీడేస్‌, ఉత్తమ తృతీయ చిత్రంగా లక్ష్యం ఎంపికయ్యాయి.

మొన్నో రోజు అంతర్జాలంలో ఏదో వెదుకుతుంటే ఇది కనపడింది.  ఉన్నవి ఓ 15 కథలే అయినా బాగున్నాయి, చూడండి.

మనదేశంలో మొట్టమొదటిసారిగా ఓ పార్టీ అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికలలో లోకసత్తా అధ్యక్షునిగా జయప్రకాశ్‌నారాయణ ఎన్నికయ్యారు.

పిల్లలకి స్కూళ్లకి అన్నం, టిఫిన్ పెట్టే లంచు బాక్సులు వీలయినంతవరకు ప్లాస్టిక్కువి కాకుండా చూడండి, లేదా అల్యూమినియం ఫాయిల్‌లో చుట్టి పెట్టండి. ప్లాస్టిక్కు (PVC) బాక్సుల్లో లెడ్ పరిమాణం ఉండాల్సిన దానికంటే చాలా ఎక్కువగా వుంటుందట, జాగ్రత్త మరి.  అల్యూమినియం ఫాయిల్‌ మూలాన పర్యావరణానికి ప్రమాదం అంటారా, ఏం చేస్తాం మరి గుడ్డి  కన్నా మెల్ల నయం కదా!

అందరికి మకర సంక్రాంతి శుభాకాంక్షలు.

13 వ్యాఖ్యలు:

వేణూశ్రీకాంత్ January 12, 2009 at 8:10 PM  

భాగున్నాయండీ.. చాలా విషయాలు కవర్ చేశారు. మీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు.

Siri January 12, 2009 at 8:58 PM  

వరూధిని గారు, అల్యూమినియం ఫాయిలు వాడి పర్యావరణానికి హాని కలిగించేబదులు మనం ఎప్పటినుండో వాడుతున్న స్టీల్ క్యారియర్లు వాడడం ఇంకా మంచిది కదా. ఏమంటారు??

సిరిసిరిమువ్వ January 12, 2009 at 9:06 PM  

స్నేహ గారు, నా ఉద్దేశ్యంలో కూడా స్టీల్ క్యారియర్లు వాడటమే మంచిది అందుకే "లంచు బాక్సులు వీలయినంతవరకు ప్లాస్టిక్కువి కాకుండా చూడండి" అని అన్నది:)

అయినా ఇప్పటి పిల్లలకి స్టీలు క్యారియర్లు వాడటం నామోషీ అయిపోయిందండి, ఏం చేస్తాం.

Anonymous,  January 12, 2009 at 10:29 PM  

సంక్రాంతి - :( నిజమేనండీ. నాలుగేళ్లకిందట నేను సంక్రాంతి సమయంలో వచ్చాను. చాలా నిరుత్సాహం అనిపించింది. ఇక్కడ తెలుగుపండగలగురించి నాతెలుగు క్లాసులో చెప్పడం హాస్యాస్పదం అని కూడా తోచింది.
సంగీతానికి తొలిభారతీయుడు రెహమాన్. పేరు సరిగ్గానే పలికేరు కానీ, పలకలేదని రూమాన్ సరిఅయిన పలుకు అనీ ప్రకటించేరు.
ఆతరవాత నేను నిద్రపోయేను.
మీ వక్కపలుకులు అచ్చతెలుగు పలుకులు :)

నేస్తం January 13, 2009 at 7:39 AM  

సంక్రాంతి శుభాకాంక్షలు మీకు ..మీ వక్కపలుకులు భాగున్నాయండీ :)

Ramani Rao January 13, 2009 at 2:04 PM  

బాగున్నాయండీ.. చాలా విషయాలు కవర్ చేశారు. మీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు.

పరిమళం January 13, 2009 at 5:40 PM  

వరూధిని గారూ !మీక్కూడా సంక్రాంతి శుభాకాంక్షలు .

మున్నీ January 13, 2009 at 10:56 PM  

మీ వక్కపలుకులు శీర్షిక చాలా చాలా బాగుందండి. మీరు సూచించిన హంసావళి 15 కథలు కూడ బాగున్నాయండీ.. మీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు.

మధురవాణి January 14, 2009 at 12:08 AM  

వక్క పలుకులు, హంసావళి కథలు బావున్నాయి.
మీకూ మీ కుటుంబానికీ.. సంక్రాంతి శుభాకాంక్షలు..!!

Dr.Tekumalla Venkatappaiah January 21, 2009 at 10:22 AM  

సిరి సిరి మువ్వ గారూ మీ వూరు స్లయిడ్ షో ఎలా పెట్టారో కొంచెం చెప్పి పుణ్యం కట్టుకోండి.

సిరిసిరిమువ్వ January 21, 2009 at 10:52 AM  

@వెంకటప్పయ్య గారు,
మీరు ఒకసారి తాడేపల్లి గారి బ్లాగు చూడండి అందులో స్లైడు షో ఎలా చేయాలో వివరంగా ఇచ్చారు. ఆ టపా లింకు ఇది
http://www.tadepally.com/2009/01/blog-post_14.html

అది చూస్తే ఎలా చేయాలో మీకు చాలా తేలికగా ఆర్థం అవుతుంది. అది చూసాక కూడా ఇంకేమైనా సందేహాలు వుంటే అడగండి.

sriram velamuri January 23, 2009 at 11:12 PM  

మీ వక్కపలుకులు బాగున్నాయి.అభినందనలు

sriram velamuri January 23, 2009 at 11:20 PM  

మీ వక్కపలుకులు బాగున్నాయి,అభినందనలు

Post a Comment

statcounter

  © Blogger template Coozie by Ourblogtemplates.com 2008

Back to TOP