వక్కపలుకులు-6
"ప్రళయకావేరి కథలు" గురించి నేను వ్రాసిన పరిచయం పుస్తకంలో.
స్లండాగ్ మిలియనీర్ సినిమాకి పురస్కారాల మీద పురస్కారాలు లభిస్తున్నాయి. కానీ మానేజ్‌మెంట్ గురు అరిందం చౌదరి ఈ సినిమా గురించి ఏమంటున్నాడో చూసారా? టపాతో పాటు వ్యాఖ్యలు కూడా చదవండి.
మొన్నొక రోజు నాకు చంద్రబాబు నుండి ఓ చిన్న సందేశం వచ్చింది. మీరు సరిగ్గానే చదివారు తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు దగ్గరనుండే! చంద్రబాబు నాకు SMS పంపటం ఏంటి-ఎవడో తుంటరి పంపించి వుంటాడు అనుకున్నా. తరువాత తెలిసింది ఈ మధ్య మన రాజకీయ పార్టీలు సెల్ ఫోను వినియగదారులకి ఇలా SMS లు పంపటం మొదలుపెట్టాయని. ఎయిర్‌టెల్ ఖాతాదారులకి TDP వాళ్లు, ఐడియా ఖాతాదారులకి BJP, ప్రజారాజ్యం పార్టీ వాళ్లు సందేశాలు పంపుతున్నారట. ఎన్నికల టైమా మజాకానా!
60వ గణతంత్ర దినోత్సవ వేడుకలు దేశమంతటా ఘనంగా జరిగాయి.
నిన్న (జనవరి 26) సూర్యగ్రహణం. ఇండియాలో పాక్షికంగానే కనిపించింది. హైదరాబాదులో అతి స్వల్పంగా కనిపించింది. మా ఏరియాలో అయితే ఏం కనిపించలేదు. ఇండోనేషియాలో ఎంత బాగా కనిపించిందో చూడండి.
నిన్న చైనా వాళ్ల కొత్త సంవత్సరం కూడా మొదలయ్యింది. వాళ్లకి ఈ సంవత్సరం వృషభ (ఎద్దు) నామ సంవత్సరం అట.
భారత మాజీ రాష్ట్రపతి వెంకటరామన్ గారు ఈ రోజు కన్నుమూసారు. ఆయన వయస్సు 98 సంవత్సరాలు. భారత దేశానికి ఎనిమిదవ రాష్ట్రపతిగా ఆయన 1987 నుండి 1992 వరకు పనిచేసారు. అంతకుముందు ఉపరాష్ట్రపతిగా కూడా చేసారు. నేను గౌరవించే రాష్ట్రపతులలో ఆయన ఒకరు.
ఫైనాన్షియల్ టైమ్సు సంస్థ ప్రతి ఏడాది ప్రకటించే ప్రపంచంలోని అత్యున్నత ప్రమాణాలు కలిగిన విద్యాసంస్థల జాబితాలో హైదరాబాదులోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ఈ సంవత్సరం 15వ స్థానం దక్కించుకుంది
వరంగల్‌లో ఇద్దరు విద్యార్థినులపై యాసిడ్ దాడి ఆపై నిందితుల ఎన్‌కౌంటరు ఉదంతం మర్చిపోకముందే తన సహవిద్యార్థిని గొంతు కోసాడు మరో ప్రేమోన్మాది.