పరుగాపక పయనించవె తలపుల నావ.... కెరటాలకు తలవంచితె తరగదు త్రోవ

February 23, 2009

మనసు ఉప్పొంగిన వేళ-జయహో రెహమాన్!

ఆనందం అర్ణవమైతే....నిజంగా మాటలు రావటం లేదు......

కోట్లాది భారతీయుల ఆశలను నిలబెడుతూ రెహమాన్ రెండు ఆస్కార్ అవార్డులని సాధించి ఈ సారి భారతదేశాన్ని ఆస్కార్ పీఠంపై అత్యున్నత స్థానంలో నిలబెట్టాడు, అంతే కాదు రెండు ఆస్కార్ అవార్డులని పొందిన మొదటి భారతీయుడిగా రికార్డులకెక్కాడు.

ఈ రోజు ఆస్కార్ అవార్డుల ఉత్సవం చూసి మనస్సు ఉప్పొంగని భారతీయులు ఉండరేమో! ఖచ్చితంగా ఈసారి ఈ ఉత్సవాన్ని ఇంతకుముందు కంటే ఎక్కువమంది భారతీయులు టెలివిజన్‌లలో వీక్షించి ఉంటారు. కొంతమంది ఆనందతాండవం చేసి వుంటారు.

నామినేషన్ పొందిన 9 కాటగిరీలకి గాను 8 కాటగిరీలలో అవార్డుల పంట పండించుకున్న స్లం‍డాగ్ మిలయనీరుది  మొత్తం భారతీయ నేపధ్యమే. లఘు చిత్రాల విభాగంలో "స్మైల్  పింకీ"కి ఆస్కార్ రావటం కూడా మనకి గర్వకారణమే. ముఖ్యంగా రెహమాన్‌కి రెండు అవార్డులు రావటం మనందరం గర్వించదగ్గ విషయం. నిజానికి తను ఇంతకన్నా మంచి పాటలు ఇంతకు ముందు చేసాడు, కానీ ఇప్పటి ఆనందం వేరు. ఇది ప్రపంచానికి భారత సత్తా చాటిన సందర్భం. ఈ సందర్భంగా వేదిక మీద తన మాతృమూర్తిని, మాతృభాషని స్మరించుకున్న రెహమాన్‌కి అభినందనలు.

స్లండాగ్ మిలయనీర్‌కి అవార్డులు రాకుండా హాలీవుడ్లో తెరవెనుక ప్రయత్నాలు జరిగాయని ఓ కథనం, అది ఎంతవరకు నిజమో తెలియదు. ఈ సినిమా గురించిన వాదనలు ఎలా ఉన్నా ఈ సినిమా ఇంత విజయవంతం అవటానికి కారణమైన ఈ చిత్రం యూనిట్ సభ్యులందరికి మన అభినందనలు తెలియచేద్దాం.


స్లండాగ్ ఆస్కార్‌కి నామినేట్ అయిన కాటగిరీలు:
  1. Best picture
  2. Best director
  3. Best writing (Adopted)
  4. Music(song) (రెండు నామినేషన్లు)
  5. Music(score)
  6. Film Editing
  7. Sound mixing
  8. Sound editing
  9. Cinematography


అవార్డులు లభించిన కాటగిరీలు:
  1. Best picture
  2. Best director-Danny Boyle
  3. Best writing(Adopted)-Screenplay by Simon Beaufoy
  4. Music(song)-"Jai Ho"Music by A.R. Rahman; Lyric by Gulzar
  5. Music(score)-A.R. Rahman
  6. Film Editing-Chris Dickens
  7. Sound mixing-Ian Tapp, Richard Pryke and Resul Pookutty
  8. Cinematography-Anthony Dod Mantle
జయహో రెహమాన్ ........జయహో భారత్......

8 వ్యాఖ్యలు:

మాలతి February 23, 2009 at 4:44 PM  

మీ ఆనందంలో పాలు పంచుకుంటున్నాను.

Uyyaala February 23, 2009 at 7:29 PM  

ఆనదం అర్ణవ మైతే ... అన్న మాటను చాలా సందర్భోచితంగా ప్రయోగించారు.
అంతకు మించిన అభివ్యక్తి లేదు.
ఎంత అద్భుతమైన క్షణాలవి!
భారతీయ సినిమాను పట్టి పీడిస్తున్న హిపోక్రసీ ఈ ఆస్కార్ దెబ్బతో ఇకనైనా వడులుతుందని ఆశిద్దాం
జయహో రెహమాన్ !
జయహో రసూల్ !
జయహో స్లమ్ డాగ్ మిలియనీర్ !

వేణూశ్రీకాంత్ February 23, 2009 at 8:18 PM  

నిజమేనండీ నిన్న లైవ్ చూస్తున్నంత సేపు ఒకో అవార్డు కి ఆనంద తాండవం చేసా కాని ఎక్కడో మనసు లో ఓ మూల భారతీయ పేదరికాన్ని అంతర్జాతీయ విపణి లో పెట్టి సొమ్ము చేసుకున్నారు అనిపించింది. గాంధీ లాగా భారతీయ నేపధ్యం ఉన్న సినిమా నే కానీ భారతీయ సినిమా కాదు అనే విషయం మరీ అంత సంతోషించాల్సిన పని లేదేమో అని గుర్తు చేసింది.
రహమాన్ మరియూ రసూల్ విషయం లో మాత్రం మస్ఫూర్తి గా ఆనందించాను.

Anonymous,  February 23, 2009 at 8:43 PM  

భారత దేశానికి మొదటి ఆస్కార్ రెహమాన్ ద్వారా రావటం నిజంగా చాలా అనందంగా వుంది .స్మైల్ పింకీ గురించి పేపర్లో చదివాను . దీనికి కూడా అవార్డ్ రావడం నిజంగా భారతీయులందరూ పండుగ చేసుకోవాల్సిన రోజు . భలే మంచి రోజూ.........

Anil Dasari February 23, 2009 at 9:26 PM  

>> "నామినేషన్ పొందిన 10 కాటగిరీలకి గాను 8 కాటగిరీలలో అవార్డుల పంట పండించుకున్న స్లం‍డాగ్ మిలయనీరుది మొత్తం భారతీయ నేపధ్యమే"

చిన్న సవరణ. నామినేషన్లు పది వచ్చాయి కానీ, విభాగాలు తొమ్మిది మాత్రమే. ఉత్తమ గీతానికిగాను ఒకే విభాగంలో రెండు నామినేషన్లొచ్చాయి.

సిరిసిరిమువ్వ February 23, 2009 at 9:38 PM  

మాలతి గారు, :)

ప్రభాకర్ గారు, ధన్యవాదాలు.

శ్రీకాంత్ గారు, ఈ సినిమా నేను చూడలేదు కాని, రివ్యూలయితే చదివా. "భారతీయ పేదరికాన్ని అంతర్జాతీయ విపణి లో పెట్టి సొమ్ము చేసుకున్నారు"-మనం ఆలోచించే విధానం సరికాదేమో! నేను చదివిన రివ్యూలనిబట్టి ఈ సినిమా పేదరికాన్ని ఎత్తిచూపటం కన్నా మనుషులలో ఆశావహ దృక్పదాన్ని ప్రోత్సహిస్తుందని నాకనిపించింది. రెహమాన్ కూడా అదే సెలవిచ్చాడు.

లలిత గారు, భలే మంచి పాటని గుర్తుకు చేసారు.

అబ్రకదబ్ర గారు :) ధన్యవాదాలు, ఆనందంలో 10 కాటగిరీలని వ్రాసేసా కాని కింద లిస్టులో తొమ్మిదే ఇచ్చా చూడండి.

మురళి February 24, 2009 at 1:09 PM  

ఆలస్యంగా అయినా అవార్డు వచ్చింది. సంతోషకరమైన విషయం..

Post a Comment

statcounter

  © Blogger template Coozie by Ourblogtemplates.com 2008

Back to TOP