పరుగాపక పయనించవె తలపుల నావ.... కెరటాలకు తలవంచితె తరగదు త్రోవ

February 20, 2009

నేను మెచ్చిన యండమూరి పుస్తకాలు

(ఈ టపా ఎప్పుడో 2007 జూనులో వ్రాసినది.  నా టపాల ఖజానాలో కనపడటం లేదు, ఎలా తప్పిపోయిందో తప్పిపోయింది.  మూసల్లో వుంది కాబట్టి మరలా పెడుతున్నాను :)

నేను తెలుగు పత్రికలు, పుస్తకాలు చాలా చిన్నప్పటినుండే చదవటం మొదలుపెట్టాను. అప్పట్లో మా నాన్నగారు పత్రికలలో వచ్చే ప్రతి సీరియలు తీసి పుస్తకంగా కుట్టేవాళ్ళు. సెలవలలో తీరిగ్గా అవి చదువుకునేవాళ్ళం. మా బంధువులు ఒకళ్ళకి పుస్తకాలు అద్దెకిచ్చే షాపు ఉండేది. అక్కడినుండి నవలలు తెచ్చుకుని చదివేవాళ్ళం. అవీ ఇవీ అని లేదు అన్నీ చదివేదాన్ని. పుస్తకాలు కొని చదవటం అంటూ ఉండేది కాదు. నేను నా చేతులతో మొదటగా కొనుకున్న పుస్తకం యండమూరి "రాక్షసుడు" (1986లో). అప్పట్లో యండమూరి అంటే విపరీతమైన అభిమానం. "వెన్నెల్లో ఆడపిల్ల" ఇప్పటికీ నాకు అత్యంత ఇష్టమైన పుస్తకం. ఆయన పుస్తకాలలో నాకు నచ్చినవి:

వెన్నెల్లో ఆడపిల్ల
ఋషి
ప్రియురాలు పిలిచె
ఆఖరి పోరాటం
ఆనందోబ్రహ్మ
అభిలాష
పర్ణశాల
డబ్బు టు ది పవర్ ఆఫ్ డబ్బు
తులసీదళం
తులసి
వెన్నెల్లో గోదావరి
యుగాంతం
నల్లంచు తెల్లచీర
దుప్పట్లో మిన్నాగు(కథలు)
మరణమృదంగం
రాక్షసుడు
నిశ్శబ్దం నీకు నాకు మధ్య
చీకట్లో సూర్యుడు
రాధ-కుంతి

ఇవన్నీ ఎప్పుడో చదివిన పుస్తకాలు. అప్పుడు నేను చదవాలనుకునీ చదవలేకపోయిన యండమూరి పుస్తకాలు కొన్ని వున్నాయి-మంచు పర్వతం, 13-14-15, ధ్యేయం.  అవి ఇప్పుడు చదువుదామంటే ఆసక్తిగా అనిపించటం లేదు. ఈ మద్య ఆయన పుస్తకాలు చదవటమే మానేసాను. వయసు పెరిగే కొద్ది అభిప్రాయాలు, ఆలోచనలు మారిపోతాయంటారు కదా అందుకనేనేమో!!

యండమూరివి కొన్ని పుస్తకాలు ఇక్కడ చదువుకోవచ్చు. ఆసక్తి ఉన్నవాళ్లు యండమూరి website చూడండి.

11 వ్యాఖ్యలు:

మురళి February 20, 2009 at 6:52 PM  

యాదృచ్చికం! నేనివాళే రమ్య (వెన్నెల్లో ఆడపిల్ల) గురించి రాశాను. ఇప్పుడు యండమూరి నవల చదవడం మొదలు పెట్టడం ఒక్కటే సమస్య..ఓ పది పేజీలు చదివామంటే లీనమైపోతాం. స్వానుభవం తో చెబుతున్నా..

బుజ్జి February 20, 2009 at 7:03 PM  

I feel the best among his novels is Prarthana.. Its the only novel which i feel like reading again and again..

నేస్తం February 20, 2009 at 8:00 PM  

12 13 14 అంధ్ర భూమి లో అనుకుంటా చాలా ఇంట్రెస్ట్ గా చదివేదాన్ని కాని సగమే చదివా,మొన్న నెట్ లొ చదువుదామన్నా చదవలేకపోయాను ఎందుచేతనో

కన్నగాడు February 22, 2009 at 10:28 AM  

నేను యండమూరి అభిమానినే, నేస్తంగారు 12-13-14 కాదు 13-14-15. ఇక్కడ మాట్లాడిన చాలా పుస్థకాలు నా ఈ టపాలో ఉన్నయి కావాలనుకున్నవారు కింద లంకెను అనుసరించండి.
http://kannagadu.blogspot.com/2009/01/blog-post.html

సిరిసిరిమువ్వ February 22, 2009 at 5:16 PM  

మురళి గారు :). యాదృచ్చికం కాదులేండి. మీ టపా చూసాక నా ఈ టపా గుర్తుకొచ్చింది, వెళ్లి చూస్తే నా ఖజానాలో లేదు, సరే అని మరలా పెట్టాను. అప్పుడే మీ టపాకి వ్యాఖ్య పెట్టాను కాని అది ఎందుకనో రాలేదు.

బుజ్జి గారు, ఏమో మరి ప్రార్థన నాకంతగా నచ్చలేదు.

నేస్తం, నాకూ ఎందుకనో నెట్లో నవలలు చదవబుద్ది కాదు:)

కన్నగాడు గారు, ధన్యవాదాలు.

సత్యసాయి కొవ్వలి Satyasai February 22, 2009 at 10:08 PM  

ఒక్కసారిగా పాతస్మృతులు రేపింది మీ టపా. యండమూరే కాదు పిచ్చిగా చదివిన ఏరచయితా ఇప్పుడు చదివించలేక పోతున్నారు- వయసు మార్పేమో :))

వేణూశ్రీకాంత్ February 23, 2009 at 8:03 AM  

మళ్ళీ ఓ సారి గుర్తు చేసినందుకు నెనర్లు సిరిసిరిమువ్వ గారు.

Kathi Mahesh Kumar March 17, 2009 at 3:10 PM  

మిగతా నవలల్ని అభిమానించినా ఋషి, పర్ణశాల ఉత్తమం అనిపిస్తాయి.

Unknown December 11, 2009 at 1:30 AM  

ఇక్కడ ఎవ్వరూకూడా "అంతర్ముఖం" గురించి రాయలేదు. నేను కూడా యెండమూరి గారి వీరాభిమానిని. కొన్ని సంవత్సరాలపాటు పైన చెప్పిన అన్ని పుస్తకాలూ 4 నుంచి 10 సార్లు చదివి ఉంటాను. యెండమూరి అభిమానం యెంత తలకేక్కిందంటే ఆయెన ఏదో నవలలో కొబ్బరినూని తలకి రాసుకోవడంవల్ల ఏమి ఉపయోగం లేదు అన్నారని కొన్ని సంవత్సరాల పాటు అమ్మని ఎదిరుంచి రాసుకోలేదు. నాకు మాత్రం "అంతర్ముఖం" ఆయన రచనల్లో బెస్ట్. వీలుంటే మీరు కూడా ఒక్కసారి చదవండి సిరిసిరిమువ్వ గారు.

వేమన December 11, 2009 at 4:05 AM  

అంతర్ముఖం ఒక అద్భుతమైన నవల.

సిరిసిరిమువ్వ December 11, 2009 at 5:57 AM  

@ప్రకాష్ గారు, వేమన గారు...నిజమేనండి అంతర్ముఖం గురించి విన్నాను. చదువుదామనుకుంటూనే అలానే అయిపోతుంది..దీనికి ముఖ్య కారణం..ఈ నవల వచ్చే రోజులకి యండమూరి రచనల మీద అభిమానం తగ్గటమే..దాంతో 90ల తరువాత వచ్చిన ఆయన రచనలు పెద్దగా చదవలేదు. ఈ సారి హైదరాబాదు పుస్తక ప్రదర్శనలో ఈ పుస్తకం తప్పక కొనాలి. గుర్తు చేసినందుకు మీ ఇద్దరికి ధన్యవాదాలు.

Post a Comment

statcounter

  © Blogger template Coozie by Ourblogtemplates.com 2008

Back to TOP