పరుగాపక పయనించవె తలపుల నావ.... కెరటాలకు తలవంచితె తరగదు త్రోవ

December 16, 2011

26వ హైదరాబాద్ పుస్తక ప్రదర్శన

పుస్తక ప్రియులు ఎంతగానో ఎదురు చూసే  పుస్తకాల పండగొచ్చేసింది.
 26 వ హైదరాబాదు పుస్తక ప్రదర్శన నిన్న అనగా డిసెంబరు 15 న మొదలయింది.

ఈ ప్రదర్శన  డిసెంబర్ 15 నుండి 25 వరకు నెక్లసు రోడ్డులోని పీపుల్స్ ప్లాజా లో జరుగుతుంది.

ప్రదర్శన వేళలు:
మామూలు రోజుల్లో:  మద్యాహ్నం 2  నుండి రాత్రి 8  గంటల వరకు
శని.. ఆది వారాలలో:  మద్యాహ్నం 12 నుండి రాత్రి  9 గంటల వరకు

ఇక ప్రతి సంవత్సరం లాగానే e-తెలుగు తరఫున ఒక స్టాలు, కినిగె తరుపున ఒక స్టాలు తెరిచారు.
e-తెలుగు స్టాల్ నంబరు: 2
కినిగె స్టాలు నంబరు:  190

ఈ సందర్భంగా ప్రతి రోజూ సాయంత్రం వేళలో పుస్తకావిష్కరణలు,  రచయితల సభలు, సమావేశాలు, చర్చలు , సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి.
మరిన్ని వివరాలకు ఇక్కడ చూడొచ్చు.

******************************************************************************

e-తెలుగు తరుపున కశ్యప్ గారు తెలుగు బ్లాగు గుంపు కి పంపిన సందేశం ఇక్కడ పెడుతున్నాను. ఆసక్తి ఉన్నవాళ్ళు కశ్యప్ గారిని సంప్రదించండి.

 వేలలో ఉన్న తెలుగు బ్లాగుల సందర్శకులని లక్షల్లోనికి  పెంచే దిశగా ఈ పుస్తక ప్రదర్శనలో మన కార్యక్రమాలు చాలా ప్రభావవంతంగా ఉంటాయని ఆశిస్తున్నాం. ఎందుకంటే, పుస్తక ప్రదర్శనకి వచ్చేవారిలో చదివే ఆసక్తి ఉన్నవాళ్ళు ఎక్కవ శాతం ఉంటారు.

పుస్తక ప్రదర్శనలో e-తెలుగు స్టాల్ లో ఉండి e-తెలుగు, కంప్యూటర్ లో తెలుగు వాడకం, మరీ ముఖ్యంగా అంతర్జాలం లోని సాంఘికజాల నెలవులలో(సోషల్ నెట్వర్కింగ్ సైట్స్) తెలుగు ఉపయోగం వంటివి ప్రదర్శనకు వచ్చే వారికి వివరించేందుకు విజయవంతంగా నడుపుటకు చాలా మంది వాలంటీర్ల అవసరం ఉంది. తెలుగు బ్లాగరులు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ సహాయ సహకారాలను అందించాలని కోరుకుంటున్నాము . మీ సూచనలు సలహాలు అహ్వానిస్తున్నాము .

క్రింది వివరాలను e-మెయిలు ద్వారా గాని..టెలిఫోను ద్వారా గాని తెలియపరచమని కోరుతున్నాము.

పేరు:
టెలిఫోను నంబరు:
e-మెయిలు చిరునామా:
ఏ తేదీలలో ఏ సమయంలో స్టాలులో ఉండగలరో ఆ వివరాలు:

మీ అందరి సహాయ సహకారాలను ఆకాంక్షిస్తూ ,అన్ని రోజులూ ఒక్కరే ఉండలేరు కాబట్టి ఒక్కో రోజూ ఒక్కొక్కరూ వంతుల వారీగా చెయాల్సిరావచ్చు. మీకు ఏయే రోజులలో వీలవుతుందో చెప్తూ ఇక్కడ స్పందించండి. (దీనికోసం ఓ పూట మీ కార్యాలయం నుండి సెలవు తీసుకునే దిశగా కూడా ఆలోచించండి.)

మీ సహాయం మరియు తోడ్పాటు మాకు ఇప్పుడు అత్యంత ఆవశ్యకం. మీ నుండి సానుకూల స్పందనని ఆశిస్తూ...

మీ శ్రేయోభిలాషి 
కశ్యప్...9396533666

2 వ్యాఖ్యలు:

Praveen Mandangi December 16, 2011 at 5:31 PM  

గత ఏడాది నేను పుస్తక ప్రదర్శనకి వచ్చాను. లినక్స్ ప్రవీణ్ స్టాల్‌లో లేనప్పుడు నేనే లాప్‌టాప్ పట్టుకుని కంప్యూటర్‌లో తెలుగు ఎలా టైప్ చెయ్యాలో చూపించాను. దురదృష్టం ఏమిటంటే లాప్‌టాప్‌ని ఇంటర్నెట్‌కి కనెక్ట్ చెయ్యడానికి ఒక్కడు కూడా USB మోడెమ్ పట్టుకురాలేదు. ఇప్పుడు నేను నా సెల్ ఫోన్‌లో తెలుగు ఇన్స్టాల్ చేశాను కానీ అక్కడ సెల్‌ఫోన్‌లో తెలుగు ఎలా ఇన్స్టాల్ చెయ్యాలో చూపించడానికి నేను ఇప్పుడు అక్కడకి రాలేను. నాకు వేరే ప్రయాణాల పనులు పడ్డాయి. వీవెన్ గారి ఫోన్‌లో ఎలాగూ తెలుగు ఉంది కదా. వీవెన్‌గారు చూపిస్తారని అనుకుంటున్నాను.

Post a Comment

statcounter

  © Blogger template Coozie by Ourblogtemplates.com 2008

Back to TOP