పరుగాపక పయనించవె తలపుల నావ.... కెరటాలకు తలవంచితె తరగదు త్రోవ

November 20, 2011

బాపూ గీసిన దృశ్యకావ్యం--శ్రీ రామరాజ్యం




లవకుశ....

ఈ సినిమా నేను చిన్నప్పుడు ఎప్పుడో చూసాను..తర్వాత టివి లో అడపా తడపా చూసినా నాకు ప్రతి సీనూ అయితే గుర్తు లేదు. పాటలు..పద్యాలు  మాత్రం ఇప్పటికీ చెవిలో మోగుతుంటాయి.

శ్రీరామరాజ్యం...

బాపు. రమణ..బాలకృష్ణ..నయనతారలతో శ్రీరామరాజ్యం సినిమా తీస్తున్నారన్న దగ్గరనుండి..ఈ సినిమా గురించి ఓ ఆసక్తి.

బాపు....రమణల నుండి రాముడి కథ అనగానే సంపూర్ణరామాయణం గుర్తుకొస్తుంది. మరి వారి స్థాయిలోనే ఈ సినిమా కూడా తీయగలరా..చూద్దాం అనుకున్నా.

అంతే కాని లవకుశల స్థాయిలో తీయగలరా..ఈ కథకి న్యాయం చేయగలరా...పాటలు అదే రీతిలో అలరిస్తాయా అని నేనసలు ఆలోచించలేదు. 

అది అప్పటి సినిమా..ఇది ఇప్పటి సినిమా.

ఇది బాపు సినిమా అంతే!

ఇంకో సినిమాతో కానీ..ఆ నటులతో కానీ అస్సలు పోల్చకూడదన్నది నా అభిప్రాయం.

బాపూ లవకుశ సినిమా స్ఫూర్తితోటే ఈ సినిమా తీసినా దాంతో పోల్చటం సరికాదు.

ఎప్పటి సినిమా అప్పటిదే. అప్పట్లో లాగా పద్యాలు..భారీ డైలాగులతో సినిమా తీస్తే ఇప్పటి వాళ్లకి ఎక్కుతుందా?

అప్పటి లవకుశలో కూడా కొన్ని లోపాలు లేకపోలేదు..ఆ సినిమా నాలుగు సంవత్సరాలు తీసారంట.. దాంతో లవకుశలు ముందు సీనులలో పెద్దగా కనిపించారంటారు. వాళ్లు నటించిన సీనులు కలపటం కూడా ఇబ్బంది అయిందట (వికీ సౌజన్యంతో).

నయనతార సీతేంటి..బాలకృష్ణ రాముడేంటి అని నొసలు ముడిచారు..ముడుస్తూనే ఉన్నారు.

ఆ ముడిచిన నొసలు విప్పారుకునేలా..కన్నులు విచ్చుకునేలా  ఓ అద్భుత చిత్రం గీసి మనకి అందించారు బాపు. 

బాపు అంటే నటులు కనపడరు..పాత్రలే మన కళ్ళముందు మెదులుతాయి అన్న నిజాన్ని మరోసారి నిరూపించారు బాపు.

మూల కథకి భంగం కలగకుండా గ్రాఫిక్సు మొదలైన ఆధునిక సాంకేతికతని జోడించి బాపూ కుంచె నుండి జాలువారిన ఓ దృశ్య కావ్యం శ్రీరామరాజ్యం.

మూడుగంటల సినిమా మూడు నిమిషాలుగా అనిపించదనటంలో అతిశయోక్తి లేదు.

రమణ నుడికారానికి బాపూ అందంగా నగిషీలు చెక్కి రూపొందిన చిత్రం ఈ శ్రీరామరాజ్యం!

తన చివరి చిత్రం ఇంత అద్భుత చిత్రం అవుతుందని ఆ మహానుభావుడు ఊహించారో లేదో మరి.

ఈ చిత్రం చూసిన ప్రతివారికి రమణ గారు గుర్తుకొచ్చి..అయ్యో ఈ విజయాన్ని పంచుకోను బాపు గారికి పక్కన ఆయన లేరే అని మనస్సు కలుక్కుమనకపోదు.

ఈ సినిమాలో నటులందరూ వాళ్ల వాళ్ళ పాత్రలకి సంపూర్ణ న్యాయం చేసారు.

అందరికన్నా ఎక్కువ ఆకట్టుకుంది బాలరాజు (హనుమంతుడు).

లవకుశలుగా చేసిన బాల నటులు కూడా బాగా చేసారు.

పసి లవకుశలకు చెట్లకి వేసిన తీగలతో అల్లిన ఉయ్యాల నాకు మా బాగా నచ్చింది.

వాల్మీకి గా  నాగేశ్వరరావు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు..నటన.. వాచకం..అన్నిటిలో మంచి మార్కులు వేయవచ్చు.

సీనియర్ నటుడు  బాలయ్య వయస్సు మీద పడ్దా బాగానే చేసారనిపించింది.  వాచకంలో మాత్రం తేడా బాగా తెలిసింది.

ఇక రాముడిగా ఓ ఇమేజ్ ఉన్న బాలకృష్ణతో ఇలాంటి పాత్ర చేయించటం ఓ సాహసమే.

అక్కడక్కడా బాలకృష్ణ మేకప్ (ఇది కూడా క్లోస్ అప్ ల్లోనే....మిగతా దగ్గర బాగానే ఉంది) లోపాలు పక్కన పెడితే నటుడిగా ఆ పాత్రలోకి ఒదిగిపోయాడు  బాలకృష్ణ..బాపూ అలా ఒదిగించారంటే ఇంకా సముచితమేమో!

చివర చివర సీనుల్లో అయితే నాకు బాలకృష్ణ బాగా నచ్చేసాడు. ఈ సినిమా బాలకృష్ణ నటజీవితంలో ఓ మైలురాయి అవుతుంది.

 సీతని పరిత్యజంచవలసివచ్చినప్పుడు..సీతా వియోగం అప్పుడు..లవకుశలను కలిసినప్పుడు చాలా బాగా చేసాడు.

ఓ మంచి దర్శకుడి చేతిలో పడితే ఓ నటుడిలోని  మరో పార్శ్వం ఎలా వెలుగులోకి వస్తుందో కళ్లారా చూస్తాం  ఈ చిత్రంలోని  బాలకృష్ణ నటనతో!

 బాలకృష్ణ ఓ పదేళ్లు ముందు ఈ పాత్ర చేసుంటే ఇంకా  బాగుండేది అంటున్నారు కానీ....అసలు ఇప్పటికయినా ఇలాంటి పాత్ర దొరకటం తన అదృష్టం అని నేననుకుంటున్నాను. 

అందరికన్నా నటనలో ఎక్కువ మార్కులు కొట్టేసింది నయనతార.

సీత పాత్రకి తగ్గ సాత్వికత ..సౌకుమార్యం..అణువణువునా ప్రతిబింబించాయి ఈ అమ్మాయిలో. ఇంకెవరయినా ఈ పాత్రకి న్యాయం చేయలేకపోయేవాళ్ళు అనిపించేంత చక్కగా చేసింది.

ఇంకెవరైనా అయినా కూడా  బాపూ ఇలాగే మలిచి ఉండేవాళ్ళు...అందులో సందేహం లేదు.

తన ఆహార్యం కానీ...అభినయనం కానీ....మాటల్లో చెప్పలేనంత బాగున్నాయి.

సీత పాత్రకి గాత్రం అందించిన సునీతకి సగం క్రెడిట్ ఇవ్వాలి.

చాలా తక్కువ మాటల్లో సీత పాత్రని బాగా మలిచారు. ముఖ్యంగా వాల్మీకి..సీతల మధ్య ఎక్కువగా కళ్లతోనే సంభాషణ జరుగుతుంది..సీత ఆత్మ రాజమందిరానికి వెళ్ళి రాముడ్ని చూసి వచ్చాక..వాల్మీకి అడిగిన దానికి సమాధానం కళ్ళతోటే చెప్తుంది సీత..నాకయితే్ ఆ సన్నివేశం ఎంతగా నచ్చేసిందో.. అదీ బాపూ ప్రతిభ...నభూతోః న భవిష్యతిః.

పాటలు కూడా సన్నివేశానికి తగ్గట్టు ..అలతి అలతి పదాలతో వినసొంపుగా ఉన్నాయి.

కొన్ని పాటల్లో సమయాభావం వల్లేమో కొన్ని చరణాలు తీసేసారు. 

ఇళయ రాజా సంగీతం....ఆయన స్థాయిలో లేదంటున్నారు కానీ నాకయితే ఈ సినిమాకి తగ్గ స్థాయిలోనే ఉంది..బాగుంది అనిపించింది.

కంటికి ఇంపైన దర్బార్ సెట్లు..ముని కుటీరాలు.. ఆహ్లాదంగా ఉన్నాయి.

అడవి దృశ్యాలన్నీ ఎక్కువ గ్రాఫిక్సే..మా అమ్మాయికి ఇది కాస్త నచ్చలేదు.

సినిమా మొదట్లోనే ఓ డిస్క్లైమర్ పెట్టారు..ఈ సినిమా గురించి జంతువులకు కానీ పక్షులకు కానీ ఎలాంటి ఇబ్బంది కలిగించలేదు అని..మరి జీవకారుణ్య సంఘాల వాళ్లతో ఇబ్బందవుతుందనేమో అన్నీ గ్రాఫిక్సుతో లాగించేసారు.

పౌరాణిక చిత్రాలు నిర్మించటానికి భయపడే ఈ రోజుల్లో ..

పౌరాణిక పాత్రలు వేయటానికి వెతుక్కున్నా నటులు దొరకని ఈ రోజుల్లో...

పౌరాణాకాల్ని మర్చిపోతున్న మనకు..

అసలు పౌరాణికాలంటే ఏంటో తెలియని ఇప్పటి తరానికి.. 

ఓ మంచి చిత్రాన్ని అందించిన బాపూ..రమణలకి నమస్సులు.

ఇప్పటి పిల్లలకి తప్పక చూపించవలసిన సినిమా ఇది.

నచ్చని విషయాలు ఏమీ లేవా అంటే ఉన్నాయి..కానీ అవి పట్టించుకునేంత పెద్దవీ కావు..ఈ దృశ్య కావ్యాన్ని తక్కువ చేసి చూపేటంతటివీ కాదు...దిష్టి చుక్కలన్నమాట!

ఇంధ్రధనుస్సు అందాన్ని చూసి అనుభవించాలి కాని వర్ణించలేము..ఈ సినిమా అంతే..ఎవరికి వారు చూసి అనుభవించాలి.

8 వ్యాఖ్యలు:

Avineni Bhaskar / అవినేని భాస్కర్ / அவினேனி பாஸ்கர் November 20, 2011 at 11:22 PM  

టిక్కెట్లు దొరక్క నేనింకా ఈ సినిమా చూళ్ళేదు. అయితే మీ రివ్యూ తీరుమాత్రం ఏమాత్రమైన పక్షపాతమూలేకుండ ఉన్నట్టు అనిపిస్తోంది :-)

రెండురోజుల్లో చూస్తాను; చూశాక నా అభిప్రాయంకూడా పోస్ట్ చేస్తాను.

Raj November 20, 2011 at 11:26 PM  

ఇంధ్రధనుస్సు అందాన్ని చూసి అనుభవించాలి కాని వర్ణించలేము..ఈ సినిమా అంతే..ఎవరికి వారు చూసి అనుభవించాలి.

ఇది నిజం...

and actually మేము బాగా నవుకున్నాం ఈ సినిమా చూసి... అది బాలయ్య పూర్వపు image దృష్ట్యా అనుకోండి..

for eg. నా ప్రేమ మీకు ఉంటుంది అని బాలయ్య అన్నప్పుడు పిల్లలు.. వద్దు బాబోయ్ వద్దు అని బాలయ్యని అంటారు.. అలా... :)

, November 21, 2011 at 1:58 AM  

bapu and ramanu iddaru ramarao daggiraku velli 'memu ramudi meeda cinema teeyalani anukujtannamu, meeru perimission isthe ...'ani iddaru nandamuri taraka rama rao ni adigaaru ( swayamgaa swathi weekly lo raasukunna ramana maatallonchi).

'meeku enduku brother aa shrama! memu teestunnamu kada raamudi gurinchi, meeru maaneyyandi!' ani rama rao gaarante, ramana 'ledu sir, memu oka year lo chinna cinema ramudi gurinchi teestunnamu, meeru teesedi inka 3 years avutundi, permission ivvandi ' ante 'OK,kaanivvandi' ani annaru.
premere show lo ramarao gaaru ' ee ramana ekkada! naatho enduku cinema teeyadu? ilaane kanneeru teppisthaada cinema teesi, veelliddaru ekkadunnaru' ani adigaaru.

that is BAPU and RAMANA...
veellaku SAATI EVARU ?

, November 21, 2011 at 1:59 AM  

bapu and ramanu iddaru ramarao daggiraku velli 'memu ramudi meeda cinema teeyalani anukujtannamu, meeru perimission isthe ...'ani iddaru nandamuri taraka rama rao ni adigaaru ( swayamgaa swathi weekly lo raasukunna ramana maatallonchi).

'meeku enduku brother aa shrama! memu teestunnamu kada raamudi gurinchi, meeru maaneyyandi!' ani rama rao gaarante, ramana 'ledu sir, memu oka year lo chinna cinema ramudi gurinchi teestunnamu, meeru teesedi inka 3 years avutundi, permission ivvandi ' ante 'OK,kaanivvandi' ani annaru.
premere show lo ramarao gaaru ' ee ramana ekkada! naatho enduku cinema teeyadu? ilaane kanneeru teppisthaada cinema teesi, veelliddaru ekkadunnaru' ani adigaaru.

that is BAPU and RAMANA...
veellaku SAATI EVARU ?

Sravya V November 21, 2011 at 4:57 AM  

బావుందండి !

శేఖర్ (Sekhar) November 21, 2011 at 10:26 AM  

కుర్రవాడినవటం వల్లనేమో సినిమా కొంచెం ఓపిగ్గా చూడాల్సి వచ్చింది.హాల్ మొత్తం మీద 15 మందికి మించి లేము..అది కోడ ఒక కారణం ఏమో...
నాకు ఐతే సినిమా నచ్చింది....ఇలాంటి కాలం లో ఇలాంటి పౌరాణిక సినిమా రావటం నిజం గ మన అదృష్టం...
బాలకృష్ణ చేత బాపు గారు బాగా చేయించారు....సీత పాత్ర గురించి చెప్పకర్లేదు..నాకి బలరుజు బాగా నచ్చాడు
రాజేంద్రప్రసాద్ సినిమా ఉంటది రాంబంటు అని బాపు గారిది...అందులో పిల్లవాడి లాగా ఇక్కడ బాలరాజు కోడ బాగా చేసాడు ...రాంబంటు ఎవరన్న చూడకపోతే ఇప్పుడు కోడ ఎంచక్కా ఎంజాయ్ చేయొచ్చు.

వేణూశ్రీకాంత్ November 21, 2011 at 10:55 AM  

>>ఇంధ్రధనుస్సు అందాన్ని చూసి అనుభవించాలి కాని వర్ణించలేము..ఈ సినిమా అంతే..ఎవరికి వారు చూసి అనుభవించాలి.<<
చాలా కరెక్ట్ గా చెప్పారండీ..

sphurita mylavarapu November 21, 2011 at 8:40 PM  

చాలా చక్కగా చెప్పారండీ...నేనుకూడా ఈ సినిమా చూసిన తర్వాత కలిగిన అనుభూతిని ఇక్కడ పంచుకున్నాను...వీలైతే చూడండి...
http://naarathalu.blogspot.com/2011/11/blog-post.html

Post a Comment

statcounter

  © Blogger template Coozie by Ourblogtemplates.com 2008

Back to TOP