పరుగాపక పయనించవె తలపుల నావ.... కెరటాలకు తలవంచితె తరగదు త్రోవ

October 2, 2008

భోగ శ్రీనివాసుని వైభోగం

"ఆనంద నిలయం అనంత స్వర్ణమయం".. ఇది తితిదే కొత్తగా ప్రవేశపెట్టిన పథకం పేరు. ఆనందనిలయం మొత్తాన్ని బంగారంతో తీర్చి దిద్దబోతున్నారు. లోపలి గోడలతో సహా అడుగడుగునా బంగారమే. అబ్బా ఎంతటి మహత్తర కార్యం అనుకుంటున్నారా!! ఈ పథకానికి ఎంత ఖర్చు పెట్టాలనుకుంటున్నారో తెలుసా!!! 600 కోట్ల నుండి 1000 కోట్ల వరకు (ఆరువందల కిలోల పైగా బంగారం వాడతారట). అసలు ఇండియా వెనుకపడ్ద దేశం అనేదెవరు??

అమృతసర్‌లో ఉన్న గోల్డెన్ టెంపుల్, తమిళనాడులోని శ్రీపురంలో ఉన్న మహాలక్ష్మి గుడి (ఇక్కడ ఓ టన్ను పైగా బంగారం వాడారట) కంటే తిరుమల గుడిని ఇంకా ప్రసిద్ది చేయటానికి ఈ పథకాన్ని ప్రారంభించారట. అంతే కాదు ఒక కిలో అంతకంటే ఎక్కువ బంగారాన్ని దానమిచ్చిన వారికి ప్రత్యేక వసతులు, రాయితీలు కలిపించబడతాయట. ఇప్పటికే ఉన్న VIP దర్శనాలతో సామాన్య మానవుడికి దర్శనం దొరకటం ఎంత దుర్లభమవుతుందో చూస్తూనే ఉన్నాం, ఇక ఇవి కూడా మొదలయితే ఇక్కడినుండే ఆ భోగ శ్రీనివాసుడికి ఓ దండం పెట్టేసుకోవటం ఉత్తమం.

అసలు నాకు ఒక సందేహం, ఇంత ఖర్చు పెట్టి చేసే ఆ వైభోగం చూడటానికి మనల్ని అక్కడ ఉండనిచ్చే ఐదారు సెకండ్లలో మనవల్ల అవుతుందా! ఆ శ్రీపురంలో వంద మీటర్ల దూరంనుండే అమ్మవారిని దర్శనం చేసుకోవాలట, మరి ఇక నుండి మనం మన ఏడుకొండలవాడిని ఎన్ని మీటర్ల దూరంనుండి దర్శనం చేసుకోవాలో!

ఏడుకొండలపైన ఏల వెలిశావో......తెలుపర స్వామీ!!!

17 వ్యాఖ్యలు:

చిన్నమయ్య October 2, 2008 at 12:57 PM  

ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి, వెంకన్నబాబు ముందున్న ఆ కాసేపూ కళ్లు మూసుకుంటాము. లోపలి కంటితో చూడ ప్రయత్నిస్తాము. ఈ మెరుగులన్నీ, పై కంటికి గేలాలే!

ఏవైనా, కోనేటిరాయడే కొంగు బంగారం.

జ్యోతి October 2, 2008 at 1:13 PM  

ఆ స్వామివారిని అలా ఊహించుకొని ఇక్కడినుండే దండం పెట్టుకోవడం మేలు. లేదా మన ఇంటికి దగ్గరలో ఉన్న వేంకటేశ్వరుని గుడికెళ్తే సరి. ఇక టివి చానెల్ ఎలాగూ ఉంది.హాయిగా ఇంట్లోనే కూర్చుని అన్ని ఉత్సవాలు చూడొచ్చు.. అంత హైరానా పడి. నోట్ల కట్టలు మూటకట్టుకుని తిరుమల వెళ్లే పని లేదనుకుంటా..

teresa October 2, 2008 at 1:47 PM  

హు,స్వామి వారు కాదు, జయ విజయుల దర్శనమైతే గొప్ప ఇహ :(

teresa October 2, 2008 at 1:47 PM  

హు,స్వామి వారు కాదు, జయ విజయుల దర్శనమైతే గొప్ప ఇహ :(

teresa October 2, 2008 at 1:47 PM  

హు,స్వామి వారు కాదు, జయ విజయుల దర్శనమైతే గొప్ప ఇహ :(

oremuna October 2, 2008 at 4:18 PM  

I do support this.

If Venkanna is a product we need to pack it well and give very good publicity.

If competitors are doing it well we need to improve ourselves. Isn't it?

aMtaa peddaayana choosukuMTaaDulE ! laxmI bhartaki mIru kottagaa icchE saMpada EmuMdi?

మాలతి October 2, 2008 at 4:53 PM  

అదేనండి. భోగాలున్నవారికే వైభోగాలు. నేను ఎనిమిదేళ్లకిందట తిరుపతి వెళ్లినప్పుడు గట్టిగా చెప్పేశాను మళ్లీ రానని :)

నిషిగంధ October 2, 2008 at 6:33 PM  

"మానవ సేవే మాధ సేవ " కానీ సేవ చేయడంలో ఎందుకు పోటీపడరో!?!? ఇలాంటి ఆడంబరాల్లో మాత్రం ఎక్కడా వెనక్కి తగ్గరు :((

నిశాంత్ October 2, 2008 at 7:53 PM  

థాంక్స్... మీ విసిటింగ్ అండ్ కాంప్లిమెంట్స్‌కి
ఈ పోస్ట్ బాగుంది..
శ్రీనివాసుడి వైభోగం... చూతము రారండీ... :-)

నిశాంత్ October 2, 2008 at 7:53 PM  

i have deleted number verification for the complements..

సత్యసాయి కొవ్వలి Satyasai October 2, 2008 at 8:19 PM  

పోటీ ప్రపంచం కదా. అయినా మన గుళ్ళు చాలా బెటరు. 100 మీ దూరంనించైనా దేఁవుడిని కొద్దిగా పద్ధతిగా చూడచ్చు. మొన్న కలకత్తాకాళీ దగ్గరికెళ్లాం. అదేంటి, కుస్తీ పోటీకెళ్ళినట్లయింది - ఆ ఒడుపులూ, పట్లూ గని.

Ramani Rao October 2, 2008 at 8:51 PM  

ఏడేడు శిఖరాల మే నడువలేము(బస్సుల్లో/ట్రైన్లో కూడా రాలేము) వెంకన్న పాదాలు దర్శించలేము. మేము వివరించి మా బాధ వినిపించలేము (ఈ బంగారు భోగ శ్రీనివాసుడి దర్శనం దొరకడం కష్టమని)
నడిరేయి ఏ ఝాములో ..స్వామీ నిను చేర దిగి వత్తునో ...తిరుమల శిఖరాలు దిగివత్తునో.. అని తిరుపతిలో అమ్మవారిని దర్శించుకొని, ఆవిడ గడ్డం పట్టుకొని బతిమాలల్సిందే ఇహ.

నిశాంత్ October 2, 2008 at 9:26 PM  

అవునండీ.. ఇంజినీరింగ్ చదువుతున్నా.. 3rd year..

తెలుగు'వాడి'ని October 3, 2008 at 1:12 AM  

అంత దగ్గరగా మరియు ఈకువ సేపు చూస్తే ... అసలు బంగారం ఎంత వాడారో తెలిసిపోతుందని భయం (తెలిస్తే మనమేదో చేసేస్తామని కాదనుకోండి) :-)

నాదీ అభిప్రాయమే చాలావరకు .. ఇవ్వాళ ఆధ్యాత్మిక వ్యాపారం విలువ సంవత్సరానికి అక్షరాలా 15,000 కోట్లు అంటే భక్తి అనేది ఒక ప్రోడక్ట్ గా మారిపోయింది (తప్పేమీ లేదు).. నడిపే వారు కార్పొరేట్ లాగా ఫీల్ అవుతారు గానీ నడపటానికి ఇష్టపడరు అదీ సమస్య .. అంటే అలా నడిపితే అందులో షేర్ హోల్డర్స్ లాంటి వారైన సామాన్య ప్రజానీకానికి (లేదా కనీసం భక్తులకి) ఆ ఫలాలు అందేలా చూడాలి....

Sujata M October 3, 2008 at 8:01 PM  

పోయిన నెల తిరుమల వెళ్ళాను. ఆ రద్దీ.. ఎప్పుడూ ఉండేదే అయినా, దేవుడి మీద మనుషులకెందుకంత క్రేజ్ అని ఆశ్చర్యం కలిగింది. చిన్నప్పుడు (కొన్ని సార్లు ఇప్పుడూ.. అప్పుడప్పుడూ) తిరుమల వెంకటేశ్వరస్వామి నిజమైన దేవుడని (అసలు దేవుడు) అనుకునేదాన్ని. అందుకే ఇంతమంది జనం దేవుణ్ణి చూడడానికి వస్తారనీ.. ఒక్క క్షణం కన్నా ఎక్కువ చూడనివ్వరనీ, ఎక్కువ సేపు మనం దేవుణ్ణి చూస్తే, దేవుడు మిగతా పనులు (మనుషుల్ని సృష్టించడం, నాకు కడుపునొప్పి వస్తే తగ్గించడం, మంచి మార్కులు ఇప్పించడం..లాంటివి) ఎపుడు చేస్తాడు ? అందుకే మనల్ని అందరూ తొందరగా వెళిపోమంటారని లాజిక్కు తీసుకునేదాన్ని.

కొంచెం పెద్దయ్యాకా.. అంత వీజీగా దైవ (నిజ దైవం) దర్శనం కాదని - దానికి ఎంతో సాధన కావాలనీ, అర్ధం అయింది. అయితే, ఇపుడు తిరుమల లో శీఘ్ర లఘు దర్శనాలే.. ఎంత ఖర్చుపెట్టి టికెట్ కొన్నా..! కాకపోతే, ముఖ్యులూ, రాజకీయ నాయకులూ.. అంబానీలూ ..ముఖ్యమంత్రులూ, రాష్ట్రపతులూ, తి.తి.దే. వందిమాగధులకే స్వామిని దగ్గరగా ఎక్కువ సేపు చూసి తరించే అదృష్టం దక్కుతుంది.


స్వామి గుడిలో అడుగడుగునా రాక్షసుల్లాంటి వాలంటీర్లు మనుషుల్ని తోసి, విస్రి పారేస్తూ, రోజుకి లక్షలాది మంది (మొన్న 2 లక్షల మంది) భక్తులకు లిప్తపాటు దర్శనమైనా కలిపిస్తారు. ఆ లిప్త లో స్వామిని చూసిన ఆనందం, ఆ కసిరికొట్టడాలూ, మనుషుల్ని తొయ్యడం, కేకలూ, పొమ్మనటాలలో ఆవిరయిపోతుంది. అసలు మనం ఎందుకంత వెర్రిగా తిరుమల వెళ్ళాలి ? అని కోపం వస్తుంది.


ఈ సమస్యకు పరిష్కారం అంటూ ఏమీ లేదు. భక్తులు అసలు తిరుమల వెళ్ళటం తగ్గించాలి. భోగ శ్రీనివాసుని వైభవం మాటేమో గానీ..దేవుడు అందరికీ దూరం అయిపోయిన భావన కలుగుతుంది. ఎంత డ్రాయింగ్ రూం/TV లో తిరుమల వచ్చేసినా, దర్శనం కలిగించే అనుభూతి ఏదీ ఇవ్వదు కదా.

ఊకదంపుడు October 4, 2008 at 3:14 PM  

"...కంటే తిరుమల గుడిని ఇంకా ప్రసిద్ది చేయటానికి ఈ పథకాన్ని ప్రారంభించారట"
తిరుమల గుడిని వాళ్లు ప్రసిద్ధి చేసేదేమిటిట?
ఆ బంగారం కరిగి గోడలకి అతికేదెంతో, చూద్దాం..
మొన్న డాలర్లసంగతి విన్నారుగా

సిరిసిరిమువ్వ October 4, 2008 at 11:30 PM  

వ్యాఖ్యానించిన అందరికి ధన్యవాదాలు.
@మాలతి గారు, తిరుపతి వెళ్లిన ప్రతిసారి నేనూ అలానే చెప్పి వస్తా :)

Post a Comment

statcounter

  © Blogger template Coozie by Ourblogtemplates.com 2008

Back to TOP