ఆడ బ్లాగుల్లో సోదే ఉంటుందా--రెండవ భాగం
ఇది నా ముందు టపా "ఆడ బ్లాగుల్లో సోదే ఉంటుందా" కి పొడిగింత. ఇంతకు ముందు ఎక్కువమంది కళ్ళపడని మరియు సరికొత్తగా కొంగొత్తగా మన ముందుకి వచ్చిన మరి కొన్ని మహిళా బ్లాగుల్ని కూడా చూద్దామా! ఇవి కూడా వేటికవే విభిన్నమైనవే.
కాస్కో నా వాస్కోడిగామా....అమ్మో ఇదేంటి అనుకుంటున్నాలా, అదే మలి మీలే చూడండి. ఈ పిల్లకి ర పలకదంట మలి.
అందరిలాగానే మమూలు మనిషిని, కొంచం అల్లరి, కొంచం కోపం, కొంచం అలోచన, ఇంక నాకే తెలియని ఎన్నో కోణాలతో-- అంటూ మన ముందుకు వచ్చిన మరో బ్లాగరి నేను-లక్ష్మి.
ఓనమాలు లలిత గారిని గుర్తుకు తెస్తూ లలిత లలితంగా మొదలైన ఇంకొక బ్లాగు నా స్పందన.
దేవుడికి అరటిపండు ఎందుకు సమర్పిస్తారు? భక్తుడు గొప్పా, భగవంతుడు గొప్పా? ఇలాంటి గొప్ప గొప్ప లాజిక్కులు ఉండే బ్లాగు మీకు ఎక్కడైనా ఎదురయ్యిందా? మనమరాలిని ముందు పెట్టుకుని ఒక అమ్మమ్మ పొడుస్తున్న పొడిస్తే నవ్వులు విడిస్తే నవ్వులు చూడండి.
2006 నుండి బ్లాగు రాస్తున్నా నేను అనామికను అంటున్న ఝాన్సీ బ్లాగు కూడా ఒకసారి చూడండి.
మన మహిళా బ్లాగర్లలో చాలామంది రచయిత్రులు, జర్నలిస్టులు కూడా ఉన్నారండోయ్.
మహార్ణవం పేరుతో కథలు కవితలు రాస్తున్న శ్రీవల్లీ రాధిక గారు బ్లాగరుగా కొత్తే కాని వీరి రచనలు వివిధ తెలుగు పత్రికలలో, ఆకాశవాణిలో, ఈమాట లాంటి అంతర్జాల పత్రికలో వచ్చాయి. ..తన కథలు కొన్ని హిందీ, తమిళ్, కన్నడ భాషలలోకి అనువదించబడ్డాయి.
ఆంధ్రజ్యోతిలో ఫీచర్సు రాసే అరుణ గారికి కూడా ఒక బ్లాగు ఉంది, మరి ఆ అరుణంని కూడా ఒకసారి చూడండి.
ఏం చేయాలో అర్థం కావటం లేదంటూ ఒక జర్నలిస్టు రాస్తున్న బ్లాగు కొత్తగా మొదలయింది చూడండి.
తెలుగు సాహిత్యంతో ఏ మాత్రం పరిచయం ఉన్న వారికైనా మంచి కథల రచయితగా చిరపరిచితుడయిన సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి. --ఆయన కథల్ని,కవితల్నిఅనువదిస్తున్న స్వాతి శ్రీపాద గారి గురించి మీకు తెలుసా! తను ఒకటి కాదు రెండు కాదు మూడు బ్లాగులు రాస్తున్నారు. స్వయంగా రచయిత్రి అయిన స్వాతి గారి కవితలు,కథలు ఈమాట,పొద్దు లాంటి అంతర్జాల పత్రికలలోనూ,విపుల లాంటి కథల పుస్తకాలలోనూ వచ్చాయి. అంతర్జాతీయ వేదికలపై కవితాపఠనం చేసిన అనుభవం కూడా స్వాతి గారికి ఉంది.
ఇంకా నాకు తెలియని మహిళా బ్లాగర్లు ఎవరైనా ఉంటే వారి గురించి కూడ తెలియచేస్తే ఇందులో పొందుపరుస్తాను.
14 వ్యాఖ్యలు:
sili sili muvva gaalu tanku tanku meee jaabitaa lo naaa blog koooda chelchinanduku :):):):)
mee sppolthi tho nenu inkaa postlu laastaanem
ee loje oka bhaalee nilnayam teechechukunnaa ee loju elaa gayyina oka post laaseyyyalani
sale mali kaasko naa vaasko digaamaa aneddama
మిగతా ఆడ బ్లాగర్ల సంగతేమో కానీ మీ పోస్టు మాత్రం నిజంగా సోదే.
అయినా, మీకు ఆ "ఆడ బ్లాగుల్లో సోది ఉంటుంది" అన్న ఆయనకు తేడా ఏముంది??
ఆయన biased గ రాసారు అంటే మీరు ఆయనకు రెండింతలు biased గా రాస్తున్నారు.
"ఆడ బ్లాగుల్లో సోది ఉంటుంది" అని రాయటం ఎంత తప్పో "ఆడ బ్లాగులు అన్నీ చాలా బాగుంటాయి" అని అనటం కూడా అంతే తప్పు!
మీరు mention చేసిన బ్లాగులు అన్నీ మీరు నిజంగా చదివారా?? చదివుంటే..నిజం చెప్పండి - అన్నీ బాగున్నాయ్య?? అందరూ అద్భుతంగా రాస్తున్నారా?? ఆడ బ్లాగర్లయినా, మగ బ్లాగర్లయినా..బాగా రాసేవాళ్ళూ ఉన్నారు..బాగా రాయని వాళ్ళూ ఉన్నారు...
"ఆడబ్లాగర్లనందరిని generalise చేసి రాయటం తప్పు" అని మీరు కొంతమంది బాగ రాసేవాళ్ళ లింకులు ఇచ్చుంటే ఆ రాసినాయన్ని నోరు మూయించినట్టుండేది...అంతేకాని, మీకు దొరికిన లేడీ బ్లాగర్ల లింకులన్నీ ఇచ్చి - "ఈ బ్లాగు అద్భుతం, ఆ బ్లాగు అద్భూతం" అని రాయటం వల్ల మీరు ఎంత biased గా మాట్లాడుతున్నారో తెలిసిపోతోంది...
దయచేసి ఈ comment ను కూడా "ఒక మగ వెధవ ఆడ బ్లాగర్ల ను కించపరుస్తూ రాసిన comment" అని కొట్టెయ్యకుండా జవాబు ఇవ్వండి..
ఇంకొక విషయం - నా ఈ comment కు "మగ బ్లాగర్లందరూ బాగా రాస్తారు" అనే అర్థం తీయకండి..దయచేసి!
- Ravi
మీవల్ల కొన్ని తెలియని మంచి బ్లాగులను చూడగలిగాను, అందుకు మీకు కృతజ్ఞతలు.
సిరి మువ్వగారు, బావుందండి కొత్తబ్లాగులు పరిచయం చేశారు,నేను ఈమధ్య చూడడం తగ్గింది, బ్లాగులూ ఎక్కువయ్యాయి కదా ఇలా మెరిసి అలా మాయమవుతున్నాయి అందుకే మిస్సవుతున్నా చాలావాటిని :)
అప్పట్లో వసుంధర గారు చక్కగా రాసేవారు ఎందుకోమరి ఇప్పుడు రాయడం మానేసారు.
పనిలో పనిగా చక్కటి పాత బ్లాగులు ఇప్పుడు మూతబడి పోయిన వాటిని వెతికి ఓ టపా కొట్టండి,అవ్వన్నీ కొత్తవాళ్ళూ చదువుతారు,అలాగే ఆ రచయితలూ మళ్ళీ రాయడం కొనసాగించడం (కొందరైనా) మొదలెడతారు.
ed Ravi గారూ,
ఆడావారు రాసే బ్లాగులన్నీ సూపరో సూపరు అని తన అభిప్రాయంగా కాకూండా .. స్త్రీలు రాస్తున్న బ్లాగులివీ, ఏవి సూపరో, ఏవి సోదో ..పాఠకులారా మీరే తేల్చుకోండి.. అని చెప్తున్నట్టుగా, ఒక పరిచయంలాగా సిరిసిరిమువ్వగారి ఈ ప్రయత్నాన్ని .. చూడాలని నాకనిపిస్తోంది.
పలానా బ్లాగులు, లేక పలానా టపాలు సోదిగా ఉన్నాయి అని మీకనిపిస్తే, మీరు ఆ అభిప్రాయాన్ని ఆ సదరు బ్లాగులో వెలిబుచ్చ వచ్చు. లేదంటే మీరే ఒహ బ్లాగు మొదలెట్టేసి మరీ ఢంకా బజాయించి చెప్పొచ్చు.
lacchmi - Your baby language is irritating, to read in english script. please learn to type in telugu or make your comments in english language. Thanks!
@లచ్చిమి తెరెసా గారు చెప్పినట్లు తెలుగులో అన్నా రాయి ఇంగ్లీషులో అన్నా రాయి. ఇంతకీ టపా రాసావా?
@రమ్య గారు, ధన్యవాదాలు.
@ed రవి గారు, నా సోది టపాలు రెండూ ఓపికగా చదివి ఓపికగా వ్యాఖ్యానించినందుకు మరియు మీ అమూల్యమైన అభిప్రాయానికి నా ధన్యవాదాలు. నా టపాలు మీకు సోది అనిపించవచ్చు అందులో తప్పేమి లేదులేండి.
ఆయన biased గ రాసారు--నేనెక్కడా ఈ మాట అనలేదు, ఆయన అభిప్రాయాన్ని ఖండించనూ లేదు.
ఎవరి నోరో మూయించటానికో ప్రతి విమర్శగానో నేను ఈ టపాలు రాయలేదు.
నేను ఈ టపాలు రాసిన ముఖ్య ఉద్దేశ్యం ఈ మద్య కొత్తగా మొదలైన తెలుగు మహిళా బ్లాగుల గురించి అందరికి తెలియచేయటమే. నేనెక్కడా ఆడ బ్లాగులు అన్నీ చాలా బాగుంటాయి, అందరూ అద్భుతంగా రాస్తున్నారు అని అనలేదు. వైవిధ్యంగా ఉంటాయి అంటే అర్థం బాగుంటాయి అని కాదు కదండి.
ఇక పోతే నేను నా టపాలో ఉదహరించిన బ్లాగులన్నీ నేను చదివే రాసాను. ప్రతి బ్లాగులో ప్రతి టపా చదివి రాసాను.
"ఆడ బ్లాగర్లయినా, మగ బ్లాగర్లయినా..బాగా రాసేవాళ్ళూ ఉన్నారు..బాగా రాయని వాళ్ళూ ఉన్నారు"...నేను చెప్పేదీ అదే.
నా టపాలు మరొకసారి చదవండి.
ప్రతి బ్లాగు గురించి పరిచయంలాగానే చెప్పాను తప్ప ఆడవారు రాసే బ్లాగులన్ని సూపరు అని ఎక్కడా చెప్పలేదు. అయినా నేను అద్భుతం అని చెప్పినంత మాత్రాన ఏదీ అద్భుతం అయిపోదు, ఎవరి అభిప్రాయాలు వాళ్ళకి ఉంటాయి. ఆ బ్లాగులు చూసిన వాళ్ళకి తెలుస్తుంది కదా ఎవరు ఎలా రాస్తున్నారో.
"దయచేసి ఈ comment ను కూడా "ఒక మగ వెధవ ఆడ బ్లాగర్ల ను కించపరుస్తూ రాసిన comment" అని కొట్టెయ్యకుండా జవాబు ఇవ్వండి".........ఇందులో కించపరచటం ఏముందిలేండి, మీ అభిప్రాయం మీరు చెప్పారు. ప్రజాస్వామ్యంలో అది మన హక్కు కదా!
"ఇంకొక విషయం - నా ఈ comment కు "మగ బ్లాగర్లందరూ బాగా రాస్తారు" అనే అర్థం తీయకండి..దయచేసి"!----- వ్యాఖ్య చూసి అర్థాలు తీసేటంత ప్రావీణ్యత నాకు లేదులేండి.
బ్లాగు ఎవరు వ్రాసారు అని కాకుండా, అందులొవున్న విషయము ఎలావుంది అని చూస్తె మంచిది. బ్లాగు వ్రాసినవారు నిష్పాక్షికంగా వ్రాసారా లెదా అనెది ముక్యము. బ్లాగు లొ వున్న విషయము ఎలావున్నది, మరియు కాలాణుగునగా వుందా అని చుడాలి.
ఈ టపా మరీ బాగుందండి.కొత్త లేడీ బ్లాగర్లకు ప్రోత్సాహం ఇచ్చేదిగా వుంది.వెతికి,చదివి టపాగా కూర్చడం చాలా కష్టమైన పని.మీకు అభినందనలు మరియు నెనర్లు.
@ed ravi gaaru: కొత్తపాళీ గారు, సిరిసిరి మువ్వ గారు మీ సందేహాలకి సమాధానం చెప్పేసారుగా ఇంక ఎందుకు జోక్యం చేసుకోడం అనుకొన్నా! కాని, ఎన్నోసార్లు వేరే ఇతర బ్లాగర్లతో 'టపా ' విషయంలో చిన్న అభిప్రాయ బేధాలు వచ్చినప్పుడు 'మేమున్నాము' అంటూ ఏ ఒక్కరో, ఇద్దరో చెప్పకనే చెప్తే ఎంత బాగుండును అని నేను అనుకొన్న సందర్భాలు కొత్తలో చాలా ఉన్నాయి. మనము చేసేది తప్పు కానప్పుడు టక టకా సమాధానాలు చెప్పొచ్చు అని కూడా అనిపించింది. సో, రవి గారు సి సి ము గారు టైటిల్ లోనే పాఠకులని ప్రశ్న వేసారు "సోది ఉంటుందా?" అని , అంతే కాని ఉంటుంది అని కాని ఉండదు అని కాని ఎక్కడా అనలేదు. ఎలాగు సంధర్భం వచ్చింది కాబట్టి తను ఎప్పటినుండో అనుకొంటున్న తనకు తెలిసిన మహిళా బ్లాగర్లనూ, వారి బ్లాగు అడ్రస్లను తన బ్లాగులో రకరకాల పూలమొక్కల్లా అలంకరించి మనందరికి ఒక బహుమతిలా ఇచ్చారు. మీకు నచ్చకపోతే ఇలా కాదండి, ఇంకోలా రాస్తే బాగుంటుంది అని చెప్తే బాగుండేమో, "మగ వెధవలు" లాంటి మాటలు సభా మర్యాద కాదేమో ఆలోచించండి. "రారా!" అనడానికి, "రండి!" అనడానికి తేడా ఉంటుంది కదా.
ఓ మంచి ప్రయత్నాన్ని అభినందించగలగాలి, అలా చేయలేకపోతే మౌనంగా పక్కకి తప్పుకోవాలి. అంతే కాని ప్రశాంతమైన సముద్రంలో రాయి వేసి ఆనందించకూడదని నా అభిప్రాయం.
రవిగారు! ప్రత్యక్షంగా మహిళా బ్లాగుల పరిచయాలు పరోక్షంగా ఇతర బ్లాగర్ల నిర్ణాయలు అడగడమే ఈ టపా ఉద్దేశ్యమని నాకు అర్ధమయ్యింది. మరి మీరు కూడ అలా సవ్య దిశలో ఆలోచిస్తే బాగుంటుందేమో!
అయినా సోది ఉంటేమాత్రం నష్టమేంటి? సోదికూడా జీవితంలో భాగమే..దానికీ సముచిత స్థానం ఇవ్వాల్సిందే! అందరు రాసే బ్లాగుల్లో కొన్ని ఉబుసుపోక చెప్పే కబుర్లుంటాయి. "ఎప్పుడూ బిజినెస్సేనా..కూసింత కలాపోసనుండాల" అని అప్పుడప్పుడూ అందరూ సోదిరాస్తాం, లేకపోతే లైఫ్ మరీ సీరియస్ అయిపోదూ!
సోది జిందాబాద్..సోది టపాలూ మరొ జిందాబాద్!!
సిబిరావు గారు పుల్ల పెట్టి చక్కగా అమెరికా చెక్కేశారు. ఇక్కడేమో వర్గపోరాటాల్లో రగతం పారతంది. మహిళాడ బ్లాగర్లు రెచ్చిపోయి వాళ్ల వాళ్ల బ్లాగుల గురించి టపాల మీద టపాలు కట్టేస్తున్నారు. పురుష బ్లాగర్లు కిమిన్నాస్తిగా చోద్యం చూడటమేనా పోటీగా చెయ్యదల్చుకుందేమన్నా ఉందా?
ఉడుకురక్తం మహేశా, నీదే బాధ్యత.
అబ్రకదబ్రగారు,
అదీ అలా రెచ్చిపోయి మీరు కూడా మగబ్లాగర్లు గురించి టపా రాయండి. ఎవరొద్దన్నారు?? మావంటే కొన్నే ఉన్నాయి. వరూధినిగారు రెండు టపాలలో చెప్పేసారు.మరి మీ సంగతేంటి. మీ బ్లాగులలో ఉన్న ప్రత్యేకతలేంటో చెప్పండి. మేము కూడా సంతోషిస్తాము..
మంచిప్రయత్నం. వేరే ఎవరో అన్నట్లు ఇన్ని ఆడవారి బ్లాగులున్నాయని తెలియని నాలాంటివారికి రిఫరెన్సు లా ఉంది. ఏపని చేసినా వంకలు పెట్టడం, విమర్శించడం ఈమధ్య తెలుగుబ్లాగర్లకి బాగా అలవాటయిపోయింది. ఏనుగు వెళ్తూనే ఉండాలి.
Post a Comment