పరుగాపక పయనించవె తలపుల నావ.... కెరటాలకు తలవంచితె తరగదు త్రోవ

September 13, 2011

అవుటర్ రింగు రోడ్డు..మృత్యు రాదారి!

అవుటర్ రింగు రోడ్డు..ఆ రోడ్డు చూస్తే అసలు మనం హైదరాబాదు దగ్గరే ఉన్నామా అనిపిస్తుంది.  అంత పెద్ద రోడ్డు ఎవరి కోసం...ఏ ప్రయోజనాలు ఆశించి కట్టారో కాని..జనోపయోగం కోసమయితే ముమ్మాటికీ కాదు అనిపిస్తుంది.


ఆ రోడ్డు తిరిగే  ఒంపులు చూస్తే ఆ ఒంపుసొంపుల  కింద ఎన్ని జీవితాలు శిధిలమయ్యాయో....ఎంతమంది భూములు కోల్పోయిన వాళ్ళ  ఆక్రోశం అక్కడి గాలిలో వినిపిస్తుందో అనిపిస్తుంది. ఆ రోడ్డు మూలాన సర్వం కోల్పోయిన వాళ్ళు కొందరయితే..ఆ రోడ్డు మూలానే రాత్రికి రాత్రి కోట్లకి పడగలెత్తిన వాళ్ళు మరి కొందరు.

కొన్ని జంక్షన్ల దగ్గర మయసభ లాగానే ఉంటుంది..సరిగ్గా చూసుకోకపోతే దారి తప్పేస్తాం. మళ్ళా సరైన దారిలోకి రావాలంటే ఎంత ఇబ్బందో..సరైన అప్రోచ్ రోడ్లు..లింకు రోడ్లు లేవు.

ఈ రోడ్డు వేసిన అసలు ముఖ్యోద్దేశం..సిటీలో ట్రాఫిక్కు తగ్గించటం..మరి అది నెరవేరిందా అంటే లేదనే చెప్పవచ్చు.లారీలు ట్రక్కులు..సిటిలోకి రాకుండా అవుటర్ రింగు రోడ్డు ద్వారా వెళ్ళాలని..కానీ ఆ రోడ్డ మీద ప్రస్తుతానికయితే అంతగా లారీల..ట్రక్కుల ట్రాఫిక్కు కనిపించదు.  ఎక్కవగా ఎయిర్ పోర్టుకి వెళ్ళే వాహనాలే కనపడతాయి. సిటీలో ట్రాఫిక్కు సమస్య అలానే ఉంది.  సమయం కాని సమయంలో సిటీలో లారీలు విచ్చలవిడిగా తిరుగుతానే ఉన్నాయి.



ఈ అవుటర్ రింగు రోడ్డు మీద ఎక్కడా ఎలాంటి చెకింగు ఉండదు. ట్రాహిక్కు రూల్సు ఉండవు..రోడ్డు ఖాళీగా ఉండటాన శని ఆదివారాల్లో సంపన్నుల పిల్లలకి ఈ రోడ్డు పెద్ద రేసింగ్ పాయింటు అయిపోయింది.  ఇప్పటికి ఈ రేసుల్లో ఎంత మంది ప్రాణాలు పోయాయో..ఎంత మంది గాయాల పాల పడ్డారో..అయినా ఇప్పటికీ అక్కడ సరైన నియంత్రణ లేదు.

బాబూ మోహన్ కొడుకు..కోట శ్రీనివాస రావు కొడుకు..ఇప్పుడు అజారుద్దీన్ మేనల్లుడు ప్రాణాలు కోల్పోతే అతని కొడుకు ఇంకా ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. ఇక మనకు తెలీని వాళ్ళు ఎందరో!

పిల్లల సరదాలు ప్రాణాలు తీసేవిగా  ఉండకూడదు. అజారుద్దీన్ కొడుకు వేసుకెళ్ళిన బైకుకి ఇంక రిజిస్ట్రేషన్ కూడా లేదట..కొత్తదయి ఉంటుంది. ముక్కుపచ్చలారని పిల్లలు ఇలా ప్రాణాలు కోల్పోవటం..గాయాల బారిన పడటం..వింటుంటేనే బాధగా ఉంటుంది. తల్లిదండ్రులకి ఎంత కడుపు కోత!

6 వ్యాఖ్యలు:

MURALI September 13, 2011 at 1:29 PM  

అజార్ కొడుకు కొత్త బైకు టెస్టింగ్‌కే వెళ్ళాడంట కదండీ. అయినా రేసింగ్ సరదాలు ఉన్నప్పుడు అదే స్థాయిలో రక్షణ ఏర్పాట్లు చేసుకోనేలా తల్లిదండ్రులు చూడాలి. అన్ని లక్షలు పెట్టి కొనేయగానే సరా. అబ్బాయి హెల్మెట్, నీ క్యాఫ్స్ అవి వాడుతున్నాడో లేదో చూసుకోవలి కదండీ.

అయినా అతి వేగంలో ఏం మజా ఉంటుందో నాకు ఎప్పుడూ అర్ధం కాదు. నావరకూ బైకు మీద హాయిగా పాటలు పాడుకుంటూనో, వెనుక స్నేహితులుంటే వారితో మాట్లాడుకుంటూనో నిదానంగా వెళ్ళటమే నచ్చుతుంది.

Praveen Mandangi September 13, 2011 at 1:50 PM  

ఎంత ఖాళీ స్థలం దొరక్కపోతే మాత్రం రోడ్ మీద రేసింగ్ పెడతారా? ఏ లారీ కిందో పడతామనే జ్ఞానం ఉండదా?

Praveen Mandangi September 13, 2011 at 1:54 PM  

రోడ్ ఖాళీగానే ఉండొచ్చు కానీ ఒకటి రెండు లారీలు తిరిగినా రేసింగ్ చేసేవాళ్ళకి డేంజరే.

శ్రీ September 13, 2011 at 7:00 PM  

రోడ్ మీద రేసింగ్ చట్టబద్ధం కాదు. ప్రాణాలతో చెలగాటమే, బైకు డ్రైవ్ చేసేటపుడు హెల్మెట్ కంపల్సరీ. ఈ దుర్ఘటనలో హెల్మెట్ ఎగిరి పడినట్టుంది, అంటే అది సరిగ్గా తగిలించుకోలేదనమాట.

Praveen Mandangi September 13, 2011 at 8:54 PM  

లారీ కింద పడే అవకాశం ఉన్నప్పుడు హెల్మెట్ పెట్టుకుంటే ఎంత, పెట్టుకోకపోతే ఎంత?

Post a Comment

statcounter

  © Blogger template Coozie by Ourblogtemplates.com 2008

Back to TOP