దీపాలు ఆర్పెయ్యండి---ఇదెక్కడి గొడవండి బాబు
జూన్ 15, 2008 సమయం రాత్రి 7:29:57
మూడు, రెండు, ఒకటి.......ఇక ఒక గంట పాటు మీ ఇంట్లో దీపాలు ఆర్పెయ్యండి. ఆరుబయటో డాబా మీదో కూర్చుని మీ పిల్లా పాపలతో కబుర్లు చెప్పుకోండి.
ఈ మద్య ఎక్కడ చూసినా ఈ దీపాలు ఆర్పే గోలే, దానితో పాటు చక్కటి విశ్లేషణలు. దీనికి ఇంతటి ప్రాచుర్యాన్ని కల్పించిన కొత్తపాళీ గారికి అభినందనలు.
ఈ బత్తి బందులు, ఈ విశ్లేషణలు, ఒక రోజుకో, ఒక గంటకో పరిమితం కాకూడదు. మనది గుంపు మనస్తత్వం. ఏదో ఎదుటి వాళ్ళు చెప్పారనో, వాళ్ళు చేస్తున్నారు కాబట్టి మనం కూడా చేద్దామనో ఆ ఒక్క రోజుకి దీపాలు ఆర్పే వాళ్ళే ఎక్కువ. ఒక గంట పాటు దీపాలు ఆర్పటం మూలాన సమస్య పరిష్కారం అయిపోదు. ముందు కావల్సింది ప్రజలలో ఈ సమస్య గురించిన అవగాహన, అది లేని నాడు ఎన్ని బత్తి బందులు చేసినా ఉపయోగం శూన్యం. జూన్ 15 తరువాత ఎంతమంది ఈ విషయాన్ని గుర్తుంచుకుంటారు అన్నది కోటి రూపాయల ప్రశ్న. ఈ global warming (భూతాపం) మూలాన ఇప్పటికిప్పుడు మనకు వచ్చిపడే నష్టం ఏమి లేదు, వందల ఏళ్ళ తరువాత కాని దాని ప్రభావం కనపడదు, కానీ అది తగ్గించాలంటే ఇప్పటినుండే ప్రయత్నాలు చేయాలి కదా అని మన వాళ్ళ భావన. ఆశయం మంచిదే కాని అది ఎంతవరకు ఫలితాల్ని ఇస్తుందో వేచి చూడాలి. అసలంటూ ముందు అడుగు పడితే కదా పరుగు మొదలయ్యేది.
హైదరాబాద్ వాతావరణం ఈ అయిదారు సంవత్సరాలలో ఎంత మారి పోయిందో , బయటకు అడుగు పెట్టాలంటేనే భయం వేస్తుంది. ఇది ఇలానే కొనసాగితే? మొన్న మే లో కూడా ఒకసారి హైదరాబాద్ అన్‌ప్లగ్ అంటూ ఒక కార్యక్రమం జరిగింది. దానికి ముఖ్య అతిథులు ఇలియానా, కారుణ్య, శేఖర్ కమ్ముల, దినాజ్, పుల్లెల గోపిచంద్ లాంటి స్టార్స్. ఇలాంటి కార్యక్రమాలకి అలాంటి వాళ్ళు అవసరమా?? పైగా కార్యక్రమం జరిగింది శిల్పారామంలో. వాళ్ళు అక్కడికి రావటానికి ఎన్ని కార్లు వాడి ఉంటారు? అక్కడ ఏర్పాట్లకి ఎంత విద్యుత్తు వృథా చేసి ఉంటారు? పైగా కారుణ్య లైవ్ షో, దానికి ఎంత విద్యుత్తు ఖర్చు అయ్యి ఉంటుంది??ఇక హైదరాబాద్ జనాలు ఒక గంట అన్‌ప్లగ్ చేసి ఏంటి ఉపయోగం?? ?ఇలాంటి కార్యక్రమాలు మీడియాలో ప్రచారానికే కాని వాటివల్ల ఈసుమంత అయినా ఉపయోగం ఉంటుందా?
అసలే ఇక్కడ రోజుకి గంటనుండి ఏడు గంటల వరకు కరెంటు కోత అది చాలక ఇంకా ఈ దీపాలు ఆర్పటం కూడానా అనే వాళ్ళు కూడా ఉన్నారు. దీపాలు ఆర్పటం ఒక్కటే కాదు, మనకు వీలైనంతలో, మనకు చాతనయన రీతిలో పర్యావరణ పరిరక్షణకు నడుం కట్టాలి, అది మన జీవితంలో ఒక అంతర్భాగంగా ఉండాలి. నిజానికి ఇది ఒక inter linked process, ఏదో ఒక రోజు ఒక గంట దీపాలు ఆర్పినంత మాత్రాన తీరే సమస్య కాదు. ముందు మన ఇంటి నుండే మనం సంస్కరణలు మొదలుపెట్టాలి. సంస్కరణలంటే మనమేం బరువులు మొయ్యక్కరలేదు, త్యాగాలు చేసేయ్యక్కరలేదు, కొంచం అవగాహన, కాస్త జాగ్రత్త ఉంటే చాలు. కొన్ని నీటి బిందువులు చేరి సముద్రం అయినట్లు మనం తీసుకునే కొన్ని చిన్ని చిన్ని జాగ్రత్తలే మనకు మన పుడమి తల్లికి శ్రీరామ రక్ష. ఒక యూనిట్ విద్యుత్ ఆదా చేస్తే నాలుగు యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేసినట్లే.
గ్రామాలలో కన్నా పట్టణాలలో, చదువు రాని వారి కన్నా చదువుకున్న వాళ్ళతోనే భూమాతకి ఎక్కువ సమస్యలు. ఈ భూతాపానికి మూల కారణం సంపన్న దేశాలు. ప్రాశ్చాత్య సంస్కృతిని సాంప్రదాయాలని అనుకరించటం మొదలుపెట్టి తెలిసి తెలిసి మనమే మన పర్యావరణాన్ని కలుషితం చేస్తున్నాం. ప్లాస్టిక్ అన్నది మన జీవితాలలో ఒక భాగం అయిపోయింది. ఎక్కడ చూసినా ప్లాస్టిక్ వాడకమే. అదివరకు కొట్టు నుండి సరుకులు తెచ్చుకుంటే కాగితం సంచుల్లో ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అన్నిటికి ప్లాస్టిక్ సంచులే. పల్లెటూళ్ళలో కూడా వీటి వాడకం ఎక్కువయి పోయింది. ఊరు వెళితే ఊరి పొలిమేర్లలో ఇప్పుడు మనకు కనిపించేది పచ్చటి చెట్లు కాదు, నలుపు తెలుపు రంగుల ప్లాస్టిక్కు కవర్లు (మున్సిపాలిటీ వాళ్ళు ఊరి బయట పోసే చెత్తలో సింహభాగం ఈ ప్లాస్టిక్ కవర్‌లే). ఇంకొకటి ప్రతి దానికి డిస్పోజబుల్ వస్తువులు వాడటం. ఆరోగ్య రక్షణకు అవసరమయిన సిరంజిల దగ్గరనుండి తినే స్పూన్ల వరకు అన్ని డిస్పోజబుల్ . వెనకటి రోజులలో వంటకు మట్టి పాత్రలు, వడ్డించటానికి ఆకులు, తినటానికి చేతులు వాడేవాళ్ళు. ఇప్పుడు ఇంటికి ఎవరైనా నలుగురు అతిథులు వచ్చారంటే డిస్పోజబుల్ ప్లేట్లు, డిస్పోజబుల్ గ్లాసులు, డిస్పోజబుల్ స్పూన్లు, ఒక్కటేంటి సమస్తం డిస్పోజబులే, అతిధులు వెళ్ళాక మన చేతికి పని లేకుండా అన్ని చెత్తబుట్టలోకి నెట్టివేయడమే. పిల్లలకి స్కూల్‌కి లంచ్ బాక్సుల్లో ఆహార పదార్థాలు అల్యూమినియం ఫాయిల్లో చుట్టి పెట్టటం ఇప్పుడు ఒక ఫాషన్ అయిపోయింది. అదేమంటే శుభ్రత. శుభ్రత పేరుతో మనకి మనం ఎంత హాని చేసుకుంటున్నామో మనకి అర్థం కావటం లేదు. అది వరకు మాకు ఇంటినుండి ఉప్పులు, పప్పులు గుడ్డ సంచుల్లో పోసి పంపేవాళ్ళు, నేను ఆ సంచుల్ని జాగ్రత్త చేసి మరలా వెనక్కి పంపేదాన్ని. ఇప్పుడు అమెరికా నుండి దిగుమతి అయిన జిప్‌లాక్ కవర్లు వాడటం మొదలుపెట్టారు. అదేమంటే వాళ్ళు పంపుతున్నారు మేము వాడుతున్నాం అంటున్నారు.
ఇక అమెరికా నుండి మనం దిగుమతి చేసుకున్న ఇంకొక వస్తువు ఉంది---డిస్పోజబుల్ డైపర్స్. డైపర్స్ అక్కడి వాళ్ళకి అవసరం అయితే ఇక్కడి వాళ్ళకి అదొక ఫాషన్ సింబల్ అయింది. పర్యావరణానికి హాని అటుంచి మన వేడి వాతావరణంలో పిల్లలికి వాటి వల్ల ఎంత అసౌకర్యంగా ఉంటుందో చెప్పలేం. వెనకటి రోజులలో తాతయ్య నాయనమ్మల మెత్తటి పంచలు చింపి లంగోటాల్లా కుడితే పిల్లలకి ఎంత సౌకర్యంగా ఉండేదో.
ఇక కంప్యూటర్లు, కార్లు, ఎ.సిలు, ఫ్రిజ్‌లు, టి.విలు, సెల్ ఫోన్ల వాడకం గురించి చెప్పక్కరలేదు. ఇవన్ని వాడకుండా ఉండటం అసాధ్యమే కాని వీలయినంత వరకు తగ్గించుకుందాం (నేనీ మధ్య బ్లాగులు చాలా తక్కువగా రాస్తుంది ఇందుకేనండోయ్ ).
ఇందుమూలంగా ఇక్కడ వీవెన్ గారికి ఓ విన్నపం --నెలకి ఒక శనివారం, ఒక ఆదివారం కూడలి తలుపులు మూసి వేయండి. ఈ మధ్య కూడలి కబుర్ల గదులు ఎక్కువయి పోయాయి :)).
ఈ విషయం మీద ప్రతి ఒక్కరు ఇంకొకరికి అవగాహన కలిగించండి.
-జై హింద్-
13 వ్యాఖ్యలు:
ఆలోచింపజేసేలా ఉంది మీ పోస్టు! ముఖ్యంగా శిల్పారామం కార్యక్రమం గురించి బాగా రాశారు.పబ్లిక్ ఫిగర్లు వస్తే జనాలు చూడ్డానికి వస్తారు కదా, మా కార్యక్రమం హిట్టయిందని చెప్పుకోవడానికి ఈ హంగూ, ఆర్భాటమూనూ!
ముఖ్యంగా నిషేధించవలసినవి ప్లాస్టిక్ కారీబాగులు! ఇదివర్లో కూరలూ తేవాలంటే బుట్ట ఒకటి తీసుకుని వెళ్ళే ఆచారం ఒకటుండేది! ఇప్పుడు బండి మీద కూరలమ్మే వాడితో సహా రెలయన్స్ ఫ్రెష్ వరకూ వాళ్ళే ప్లాస్టిక్ బ్యాగులు అందిస్తుంటే చేతులూపుకుంటూ వెళ్ళడంలో కంఫర్టే కాని రిస్కేముంది? అనుకుంటున్నారంతా...అసలు రిస్క్ తెలీక, తెలిసినా అలసత్వంతో! ఈ ప్లాస్టిక్ బ్యాగులు తిని కొన్ని వందల ఆవులు, మేకలు వంటి వీధిలో తిరిగే జంతువులు కాన్సర్ బారినపడుతున్నాయి!
బయటికి వెళ్ళినపుడు ఇబ్బంది పడకుండా ఉండడానికి మొదలు పెట్టిన డిస్పోజబుల్ డైపర్లు ఇప్పుడు పాల డబ్బాతో సమానంగా అవసరంగా మారాయి. పాత నూలు చీరలు, పంచెలు వాడటం నామోషీ! (పైగా ఉతికే పనిమనుషులు దొరకరు కూడానూ, వర్కింగ్ మదర్స్ ఏం చేస్తారు చెప్పండి) రాష్ వచ్చినా, పుండ్లు పడ్డా ...నాపీలే వాడాలి ఒక్కోటి ఇరవై(కనీసం) రూపాయలు పెట్టి!
విధ్యాధికురాలైన మహిళా దృక్కోణంతో సమస్య మూలాలను సమగ్రంగా చర్చించినందుకు మీకు నా అభినందనలు.సహజంగా మన సమాజంలో ఇటీవల ఎక్కువైన మీడియా హైప్,ఆంధ్రుల ఆరంభశూరత్వం పెనవేసుకుని అసలు విషయాన్ని మరుగున పడేస్తున్నాయి,అనతికాలంలోనే మరచిపోయేలా చేస్తున్నాయి.మీరు అన్నట్టుగా celebrity endorsement అన్నది తక్షణగుర్తింపు,నలుగురు స్పాన్సర్లను రాబట్టేందుకు తద్వారా కాస్త టీవీల్లో కనిపించటం,న్యూసుపేపర్లలో ఫోటొ తో పాటు నాలుగుముక్కల వార్త రావటానికి తప్ప నిర్దేశితలక్ష్య సాధనకు ఉపకరించదు.
మీరు దీపాలార్పటం అంటే మాఊర్లోని దీపాలప్పయ్య అన్నాయన గుర్తుకొచ్చాడు.ఆయన పని సాయంత్రం దీపాలు వెలిగించటం(మునిసిపాలిటీ లైట్లు ఆన్ చెయ్యటం అన్నమాట)తెల్లారు ఝామున ఆర్పటం,అందువల్ల దీపాలార్పే అప్పయ్య అనేవాళ్ళు అసలు ఇంటి పేరు పాములపాటో,నన్నపనేనో ఏదో ఉండేది.ఆయన ముందేమో దీపాలప్పయ్యగారూ అని,పరోక్షం లో మాత్రం దీపాలార్పే అప్పయ్య అనేవాళ్ళు.
విస్తృతంగా వినిమయవాదాన్ని ప్రోత్శహించే ఎలక్ట్ర్రానిక్ మీడియా అసలు ఇలాంటి అంశాల జోలికి వెళ్ళటం మానేస్తే దేశానికి ఎంతో సేవ చేసినవారవుతారు.
చాలా బాగా చెప్పారండి. ముఖ్యంగా శిల్పరామంలోని సినిమా సిలల లాంటి వారి గురించి. "రాజు తలుచుకొంటే దెబ్బలకి కొదవేముంది అని వాళ్ళ ప్రచారానికి దీపాలు, కార్లు గట్రా వాడేసుకొని, చివరాఖరుగా వాళ్ళు చెప్పేదమంటే మేము వాడుతున్నామని మీరు వాడకండి, భూతాపం తగ్గించాలి కాబట్టి మేమొచ్చాము" అంటూ మనకి కోపం తెప్పిస్తారు. అంతేనండి. ఇవన్నీ వింటుంటే అంతా భ్రాంతియేనా? జీవితానా వెలుగింతేనా? ఆశా నిరాశేనా, మిగిలింది భూతాపమేనా అనిపిస్తుంది.
చాలా బాగా రాశారండీ. ఇదేదో నాకు పంపిస్తే బత్తీబందు బ్లాగులోనే ప్రచురించేవాణ్ణిగా! :-)
ఇప్పుడైనా .. మించిపోయిందేం లేదు, మీరు అనుమతిస్తే .. అక్కడ ఒక లంకె తగిలిస్తాను.
బత్తీబందు బ్లాగు యవ్వారం రేపటి దీపాలార్పే పండగతో ముగిసేది కాదు. భూతాపం గురించీ, మనమేం చెయ్యొచ్చు అనే దాని గురించీ వినోద విజ్ఞాన పూరితమైన రచనలు కొనసాగించాలనే అనుకుంటున్నా.
కొత్తపాళీ గారు, బత్తిబంద్ లో పెట్టటానికి నాకేం అభ్యంతరం లేదు.
ఈ శిల్పారామం ప్రహసనం లాంటిదే ఒకదాని గురించి మొన్నామధ్య చూసాను.. చెన్నై నుండి ఇద్దరు - ఒక రావు, ఒక రన్నూ - తమ కారులో బయల్దేరి ప్రపంచ యాత్రకు వెళ్ళారంట గత జనవరిలో. సంవత్సరం పాటు జరిగే యాత్ర అది! ఎందుకయ్యా అంటే గ్లోబల్ వార్మింగుపై ప్రజల్లో అవగాహన కలిగించడానికంట! పైగా ఈ యాత్ర వాళ్ళు చేస్తున్న ఏడోదో, ఎనిమిదోదోనట! ఇది చూడండి
బాగా చెప్పారు వరూధినిగారు,
ఈసినిమా స్టార్లు, ప్రెస్,రాజకీయ నాయకులు అంతా హంగులు ఆర్భాటాలు తప్ప, తాము చేసే పనులు చూసి జనాలు నవ్వుకుంటున్నారో, తిట్టుకుంటున్నారో అని కూడా చూడరు. అలాంటివారిగురించి ఆలోచింఛడం మానేసి, మనవంతుగా మన ఇంటినుండి ఏం చేయగలమో అది చేస్తే మేలు కదా! బ్లాగ్లోకంలో కొద్దిపాటి కదలిక ఐనా కనిపించింది.అది సంతోషం. ఇది ఇలాగే పెరుగుతూ ఉండాని కోరుకుంటూన్నాను. పదిమంది చెప్తే కనీసం ఒక్కరిలో ఐనా చిన్నమార్పు రాకుండా ఉంటుందా??
ఈ డిజైను చూడ్డానికి ఇంపుగా ఉంది కానీ, కుడివేపున రెందు స్తంభాలు (కాలంస్ :-)) సగానికి సగం తెరని ఆక్రమించేస్తున్నాయి.
మీరున్ రూపురేఖా లావణ్యాలు మార్చినారా? బాగుంది! ఎడమవైపు, కుడివైపు ఖాళీ జాగా ఎక్కువ మిగిలిపోతుంది. అలా కాకుండా ఆ జాగాలోకి మన బ్లాగు టపా విస్తరిస్తే బాగుంటుంది.
Always look forward for such nice post & finally I got you. Really very impressive post & glad to read this. Good luck & keep writing such awesome content. Best content & valuable as well. Thanks for sharing this content.
Web Development Company in Greater Noida
Software development company In Greater noida
CMS and ED
CMSED
Homoeopathic treatment for Psoriasis in greater noida
Medical Entrance Exams Classes In Gwalior
i heard about this blog & get actually whatever i was finding. Nice post love to read this blog
GST consultant In Indore
digital marketing consultant In Indore
Emails Benefit? Well, it sounds weird but Benefit is a French brand of plastic known for its use in artificial nails. The Benefit brand originated in France and is popular all over the world, as artificial nails have Buy tinder accounts now become more affordable. So, if you have any doubts about artificial nails then it's probably best that you check out Benefit. Whether you want cheap Benefit nails to spruce up your personal style or you want to buy a full set of 8 beautiful artificial nails for yourself then you are sure to find a range of brilliant nail colors, designs, and styles online right here that will have your feet looking stunning.
This is an awesome blog post. The author has used images that show an object in the sky as clouds. When I first looked at the image it did not look like a cloud, but it looked like a cloud. So the title of this post is This is Awesome Blog Post.property for rent in abu dhabi with photos
Post a Comment