విరామం తరువాత-తల్లులూ మీకు జోహార్లు!
నా బ్లాగు ముఖం చూసి ఎన్ని రోజులయ్యిందో! ఈ మధ్య వ్యక్తిగత కారణాలవల్ల బ్లాగుల్లోకి రావటం లేదు, గత పదిరోజులుగా అడపాతడపా కొన్ని బ్లాగులు చూస్తున్నా నా బ్లాగుని మాత్రం పలకరించలేదు. ఎప్పుడైనా నేను వ్రాయటం తక్కువే..ఇప్పుడు అది మరీ అరుదయిపోయింది. ఇంతకు ముందు వ్రాయటం తక్కువయినా అన్ని బ్లాగులు చదివేదాన్ని..ఇప్పుడు చదవటం కూడా అంత ఆసక్తిగా ఉండటం లేదు. నా ఖాళీ సమయమంతా ఈ బ్లాగులు మింగేస్తున్నాయి అనిపించేది...ఇప్పుడు మనస్సుకి హాయిగా ఉంది.
మనిషికి మరపు అనేది నిజంగా ఓ వరం..లేకపోతే మన జీవితాలల్లో సంభవించే ఆకస్మిక అనూహ్య సంఘటనలకు ఈ పిడికెడు గుండె ఎప్పుడో ఆగిపోయేది..ఏమో నా గుండె కాస్త కఠినమేమో!...
తల్లులూ మీకు జోహార్లు!
ఇక అసలు విషయానికి వస్తే నిన్న ఓ టి.వి చానల్లో పసిపిల్లలచేత చేయించే అసభ్య ఆటల గురించి ఓ చర్చా కార్యక్రమం వచ్చింది. దానిలో తల్లిదండ్రులు..ఆ కార్యక్రమ మెంటల్ మెంటార్సు చేసిన వ్యాఖ్యలు చూసి జుగుప్ప కలిగింది. పిల్లలతో అసభ్యకర డాన్సులు చేయించటంలో ఎంతమాత్రం తప్పులేదంట..పిల్లలు ఇష్టంగా చేస్తుంటే మీకేంటి బాధ అంటున్నారు ఆ తల్లులు. ఓ మహాతల్లి అయితే మీరు ఇలాంటి కార్యక్రమాల పట్ల అభ్యంతరం చెప్తున్నారు కాని స్త్రీల మీద జరిగే లైంగిక వేధింపుల గురించి మాట్లడరే అని సంధ్య గారిని ఫోనులో నిలదీస్తుంది....దానికి తల్లుల చప్పట్లు. ఓ ఐదు నిమిషాలు చూసేటప్పటికి చీ వీళ్లకి చెప్పటం కన్నా అడవిలో మృగాలకి చెప్పవచ్చు అనిపించింది.
అభం శుభం తెలియని పిల్లల చేత వెకిలి నృత్యాలు చేయిస్తుంది కాక దానికి సమర్థింపులు....మా పిల్లలకి ఇష్టమయింది చేస్తున్నారు...ఏం చదువు ఒక్కటే ఉంటే సరిపోతుందా..మిగతావి అక్కర్లేదా అని ఎదురుదాడులు...పాపం ఆ పసిమొగ్గలు...ఏది సభ్యత ఏది అసభ్యతో తెలియని వయస్సు...ఆ వయస్సులో పెద్దవాళ్లని అనుకరిస్తూ పాటలు పాడటం డాన్సులు చేయటం సహజం...ఆ ఉత్సాహాన్ని..అభిరుచిని సరయిన దారిలో పెట్టాల్సిన తల్లులే ఇలా మాట్లాడుతుంటే! ఏ డాన్సు కార్యక్రమం అన్నా చూడండి...ఓ పదిమంది న్యాయనిర్ణేతలు....వాళ్ళ వెకిలి చేష్టలు.....అసభ్య వ్యాఖ్యలు.....తిట్లు....ఏడుపులు...ఓడిపోయిన వారి అక్కసు.....నానారకాల భావోద్వేగాలు...ఆ వయస్సులో పిల్లలకి నేర్పించాల్సింది అవేనా!
దీనికంతటికి కారణం....ఎలాగోలా తమ పిల్లలు టి.విల్లో కనపడాలి అనే వెర్రి.. ఒక్క షోతో రాత్రికి రాత్రే పేరు... డబ్బులు వచ్చేయాలన్న దురాశ. ఈ పోకడలు ఈ డాన్సు షోలలోనే కాదు పాటల కార్యక్రమాల్లో కూడా మొదలయ్యాయి. బాలసుబ్రమణ్యం చేసే పాడుతా తీయగా కార్యక్రమం ఎంత హుందాగా ఉంటుంది..మిగతా కార్యక్రమాలు ఎలా ఉంటున్నాయి? ఓ అతిధి..అతనితో కలిసి బాలు పంచుకునే అలనాటి ముచ్చట్లు (అసలు కన్నా ఈ కొసరే ఎంతో బాగుంటుంది).....పాడిన వారికి ఆమూల్యమయిన సలహాలు...వెరసి అందరికి అదొక అందమయిన అనుభూతి.
అమ్మా తల్లుల్లారా మీ పిల్లల వ్యక్తిత్వాలతో ఆటలాడే హక్కు....అధికారం మీకు లేవని తెలుసుకోండి. వాళ్లని స్వేచ్చగా ఎదగనివ్వండి..వాళ్ల బాల్యాన్ని ఫణంగా పెట్టి మీరు పబ్బం గడుపుకోవాలని చూడకండి!