మా ముగ్గురు రామూలు-1
మా చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్లింట్లో ఓ పెద్ద కుక్క ఉండేది. అది మామూలు కుక్కే కాని ఎత్తుగా భీకరంగా ఓ చిన్న సైజు సింహంలా చూట్టానికే భయం వేసేది. వీధి వాకిట్లో పడుకుని ఎవర్నీ వాళ్లింటి వైపు కన్నెత్తి కూడా చూడనిచ్చేది కాదు. దానికి పేరేం ఉండేది కాదు...పిలవాలంటే చాయ్, ఇజ్జూ అంతే :). నాకు దాన్ని చూసినప్పుడల్లా ఇంట్లో పెంచుకునే కుక్కలంటే బుల్లిగా ముద్దుగా అందంగా ఉండాలి కాని ఇదేం కుక్క దెయ్యంలా అనుకునేదాన్ని. పెంచుకుంటే అసలు బొచ్చు కుక్కల్నే పెంచుకోవాలి అనుకునేదాన్ని.
మా ఒకటో రాము
నేను ఏడో తరగతిలో ఉన్నప్పుడు అనుకుంటాను మా చుట్టాల బొచ్చు కుక్కకి (పమేరియన్) పిల్లలు పుడితే ఒకదాన్ని తెచ్చుకున్నాం. అది తెల్లటి తెలుపులో ముద్దుగా బొద్దుగా ఉండేది. దానికి మా నాయనమ్మ రాము అని పేరు పెట్టేసింది. అప్పట్లో పొట్టేలు పున్నమ్మ సినిమాలో శ్రీప్రియ ఎంత ఫేమస్సో అందులో పొట్టేలు కూడా అంతే ఫేమస్సు. మా నాయనమ్మ ఆ సినిమాకి... ఆ పొట్టేలుకి వీరాభిమాని .....అందుకే ఆ పేరన్నమాట! మా ఊరిలో మొదటి బొచ్చు కుక్క పిల్ల మాకే అన్న గర్వం కూడా ఉండేది మాకు!!ఇలాంటి మొదట్లు మాకు చాలానే ఉన్నాయి మరి!!!
మా ముగ్గురితో పాటు అది కూడా ఒక పిల్లలానే ఉండేది. మాతో పాటు ఇల్లంతా పరుగులు పెట్టేది. మా మంచాల మీదే పడుకునేది. మేము పక్కనుంటే బయటి కుక్కల మీదకి వీరావేశంతో వెళ్లేది....కయ్యానికి కాలు దువ్వేది.....మేము లేకపోతే పిల్లిలా తోక ముడుచుకుని వెనక్కి వచ్చేసేది. మా అక్కాయితో మరీ అనుబంధం ఎక్కువ దానికి. తను కాలేజినుండి వచ్చే టైముకి గేటులో కాపలా కాసేది. తరువాత తనకి పెళ్లయి బాబు పుట్టాక వాడిని ఎవరినీ అంటుకోనిచ్చేది కాదు....... మా బావ గారిని కూడా!! ఒక్క మా నాన్నంటేనే కాస్త భయపడేది. అప్పట్లో మా నాన్నకి బైకు ఉండేది. ఊరి పొలిమేరలో బైకు మోత వినగానె గప్‌చుప్‌గా తన గొలుసు దగ్గరకి వెళ్లిపోయి పడుకునేది. దానికి లైఫ్‌బాయ్ సబ్బుతో స్నానం చేయించి చక్కగా దువ్వేవాళ్లం. ఆ స్నానం చేయించిన రోజు మా ఇల్లు వళ్లు అంతా దాని జుట్టు మయంగా ఉండేది. మేము గోరింటాకు పెట్టుకుంటే దానికి కూడా నుదిటి మీద బొట్టులా పెట్టేవాళ్లం, తెల్లటి తెలుపు మీద ఆ గోరింటాకు భలే ఉండేది. చెప్పాలంటే దాని కబుర్లు చాలానే ఉన్నాయి!
అలా దాంతో మా సహవాసం 11 సంవత్సరాలు సాగింది. వయస్సు మీద పడి ఓ రోజు నేను లేకుండా చూసి మరీ కన్ను మూసింది. మా నాన్న మా అక్కాయి ఎన్ని రోజులు దాని మీద బెంగెట్టేసుకున్నారో! దాంతో ఓ నాలుగయిదు సంవత్సరాలు మళ్లా ఎవరం కుక్కను పెంచే ఊసెత్తలేదు. కుక్కలని పెంచటం అలవాటయ్యాక మనస్సు ఊరుకోదనుకుంటాను....
మా రెండో రాము
మా మొదటి రాము పోయిన ఓ నాలుగయిదేళ్లకి రెండో రాము వచ్చింది మా ఇంటికి. ఇది కూడా మా మొదటి రామూ వాళ్లింటినుండే వచ్చింది ..అంటే ఇది దానికి మనవడో ముదిమనవడో అన్నమాట!! అప్పుడు మా పాప పొట్టలో ఉంది. ఈ రెండో రాము బుల్లిగా భలే ముద్దుగా ఉండేది.....నాకు బాగా కాలక్షేపంగా ఉండేది దానితో. మాకు ఇల్లు చావిడి అన్నీ కలిసే ఉంటాయి. అప్పట్లో చావిడి నిండా గొడ్లు, వాములు, పెంట పోగు....... ఆ వాములు... పెంట పోగు నిండా ఎలుకలు, ఆ ఎలుకలు అక్కడనుండి ఇంట్లోకి వచ్చి మా అమ్మని నిద్రపోనిచ్చేవి కావు. వాటిని నిర్మూలించటానికని మా అమ్మ ఏవేవో చేసేది. ఇంట్లో ఎలుకల బోనులు, కొన్నాళ్లకి ఎలుకలు తెలివి మీరి ఆ బోనుల్లో పడటం లేదని ఎలుకలాళ్లతో బోనులు పెట్టించేది......అవి కాక రాత్రిపూట వాముల్లో అక్కడక్కడా ఎలుకల మందు పెట్టించేది.
అప్పటికి మా రెండో రాముకి రెండు మూడు నెలల కన్నా వయస్సు ఉండి ఉండదు. రోజూ రాత్రి పూట పాలు తాగాక దొడ్ది మీద కాసేపు తిరిగి వచ్చేది. ఆ రోజు కూడా అలానే తిరిగి వచ్చి నా మంచం పక్కన పడుకున్నది ఇక లేవలేదు. మాకేం అర్థం కాలేదు అలా అకస్మాత్తుగా ఎలా చనిపోయిందా అని! ఆ రోజు సాయంత్రం పనబ్బాయి మా అమ్మ దగ్గరకి వచ్చి అక్కాయ్ వామిలో రెండు ఎలుకలు చచ్చిపోయి ఉన్నాయి అనగానే మా అమ్మకి అప్పుడు తట్టింది రాత్రి మా రామూ తిరుగుతూ వెళ్లి వామిలో పెట్టిన ఎలుకల మందు తిని ఉంటుంది అని.......ఇక మా అమ్మకి కాసేపు నోట మాట రాలేదు. నాకయితే కొన్నాళ్లు రాత్రి పూట నిద్ర పట్టేది కాదు...... నా మంచం పక్కన అమాయకంగా నిద్రపోతున్న మా రామూనే కళ్ల ముందు మెదిలేది. దానితో ఎక్కువ రోజులు అనుబంధం లేకపోయినా మా మొదటి రాము చనిపోయినప్పటికన్నా ఇది చనిపోయినప్పుడు ఎక్కువ బాధేసింది.
రానారె గారి టపా చదివాక మా రెండో రాము గుర్తుకొచ్చి ఎక్కడో మనస్సు పొరల్లోని గాయం రేగింది......
మా మూడో రాము గురించి మరెప్పుడైనా............